ఇదేం పిచ్చి! పెదవులు పెద్దవిగా ఉండాలని ఏకంగా 26కి పైగా..! | The Bulgarian Woman Spent Rs 20 Lakh To Get The Worlds Biggest Lips | Sakshi
Sakshi News home page

తన పెదవులే అందరికంటే పెద్దవిగా ఉండాలని ఏకంగా 26కి పైగా..!

Published Thu, Dec 28 2023 12:42 PM | Last Updated on Thu, Dec 28 2023 12:42 PM

The Bulgarian Woman Spent Rs 20 Lakh To Get The Worlds Biggest Lips - Sakshi

జిహ్వకో రుచి పుర్రెకో బుద్ధి..! అన్న సామెతో ఊరికే రాలేదేమో. కొందరు చాలా విచిత్రంగా ఉంటారు. ఎంతలా అంటే? వారితో ఉండే కుటుంబ సభ్యులకు సైతం ఛీ అనిపించేలా జుగుప్సకరంగా ఉంటారు. పోనీ స్నేహితులు, శ్రేయోభిలాషులు నచ్చచెప్పి మారుద్దామన్నా వినరు. తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్లు అన్నట్లుగా మొండిగా ఉంటారు. అలాంటి కోవకు చెందిందే బల్గేరియన్‌ మహిళ. తాను ప్రత్యేకంగా ఉండాలనకోవడం ఓకే. కానీ మరింత విలక్షణంగా ఉండాలనుకోవడం భరించలేని విధంగా ఉంటుంది. ఇక్కడ ఆమె కూడా అలానే తన పెదాలే అందరికంటే పెద్దగా ఉండాలని ఏం చేసిందో వింట్‌ షాకవ్వుతారు.

అసలేం జరిగిందంటే..బల్గేరియాకు చెందిన ఆండ్రియా ఇవనోవా సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌. తాను అందరిలోనూ చాలా ప్రత్యేకంగా ఉండాలనుకుంటుంది. ఎంతలా అంటే తనను తాను పూర్తిగా మార్చుకునేంత. అంటే పూర్తిగా ఆమె ఆహార్యం సైతం మారిపోవాలనుకుంటుంది. అందుకోసం సర్జరీలు కూడా చేసుకుని మార్చేసుకుంటుంది. ఏమోందో ఏమోగానీ! ఆమె పెదాలు పెద్దగా ఉండాలనుకుంది. అదికూడా ప్రంపంచంలో అందరికంటే తన పెదాలే పెద్దగా ఉండాలనేది ఆమె కోరిక. అలా ఉంటేనే తాను అందంగా ఉంటానని ఆమె ప్రగాఢంగా నమ్ముతోంది. అందుకోసం 2018 నుంచి పలు క్లినిక్‌లను సంప్రదించి వాటిలో ది బెస్ట్‌ కాస్మెటిక్‌ క్లినిక్‌ని ఎంచుకుని మరీ సర్జరీ చేయించుకుంది.

ఈ ప్రక్రియను ఆమె 22 ఏళ్ల వయసు నుంచి ప్రారంభించింది. 2019 నాటికి పెదవులకు సంబంధించి సుమారు 15 ఇంజెక్షన్‌లు తీసుకుంది. అలా ఇప్పటి వరకు దాదాపు 26కు పైగా లిప్‌ ఇంజెక్షన్‌లు తీసుకోవడం గమనార్హం. ఈ బ్యూటీ సర్జరీ కోసం ఆమె సుమారు రూ. 20 లక్షల వరకు ఖర్చు చేసింది. అంతేగాదు ఈ పెద్ద పెదాలతో చాలా సంతోషంగా ఉన్నానని, పైగా ఇప్పుడు తాను చాలా అందంగా కనిపిస్తున్నాని చెబుతుండటం విశేషం. ఇప్పుడామె ఆమె అతి పెద్ద బుగ్గలు ఉండాలనుకుంటోందట. ఆ పనిలోనే ఉన్నానని కూడా చెబుతోంది. తాను ఏ సెలబ్రెటీలా ఉండకూడదని కోరుకుంటుందట. ఎప్పటికీ తాను చాలా ప్రత్యేకంగా విలక్షణంగా ఉండేందుకే ఆసక్తి చూపిస్తానని అంటోంది.

ఆమె ఇలా అందం కోసం తన శరీరంలో చాలా భాగాలకు ఇలానే ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకుంది కూడా. ఇవేం వింత కోరికలో గానీ శరీరం మొత్తం సర్జరీలతో కుళ్లబొడిపుంచుకుంటోంది. పైగా లక్షలు లక్షలు ఖర్చుపెట్టేస్తోంది. అయితే ఇదంతా ఆమె కుటుంబసభ్యులకు అస్సలు ఇష్టం ఉండదట. ఇలా అందం కోసం చేస్తున్న ప్రక్రియలన్నీ ప్రాణాంతకంగా మారుతాయమోనని ఆమె కుటుంబసభ్యులు తెగ ఆందోళన చెందుతున్నారని సమాచారం. కానీ ఇవనోవా మాత్రం ముఖ సౌందర్యం కోసం ఇలాంటి ప్రక్రియలు కొనసాగిస్తానని తెగేసి చెబుతోంది. అంతేగాదు ప్రతి ఏడాది ఇలాంటి బ్యూటీ సర్జరీలు చేయించుకుంటానని అంటోంది. పైగా సోషల్‌ మీడియాలో తానే ప్రపంచంలోనే అతి పెద్ద పెదవులు కలిగి ఉన్నానంటూ గొప్పలు చెప్పుకుంటోంది. 

(చదవండి: గంపెడు సంతానం దీర్ఘాయుష్షుకు గ్యారెంటీ కాదు!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement