సాక్షి, ముంబై: దిగ్గజ పారిశ్రామిక వేత్త, అపర కుబేరుడు ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో మరో ఘనతను తన ఖాతాలో వేసుకుంది. టెలికాం రంగంలో సునామిలా దూసుకొచ్చి అతి తక్కువ టారిఫ్ లతో డేటా సేవలను సామాన్యులకు చేరువ చేసింది. ఫలితంగా కోట్లాది మంది వినియోగదారులను సొంతం చేసుకుంది. తాజాగా జియో భారీ పెట్టుబడులతో దేశంలోనే అతిపెద్ద నాల్గవ కంపెనీగా అవతరించింది.
అమెరికాకు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ విస్టా ఈక్విటీ పార్ట్‌నర్స్ భాగస్వామ్యంతో జియో మార్కెట్ క్యాప్ పరంగా ఈ రికార్డు సృష్టించింది. మూడు వారాల వ్యవధిలో మూడు మెగా డీల్స్ సాధించిన జియో దిగ్గజం కంపెనీల వరుసలో నాలుగో స్థానంలో నిలిచింది. తాజా పెట్టుబడులతో జియో ప్లాట్‌ఫామ్‌లను ఈక్విటీ విలువ రూ .4.91 లక్షల కోట్లు ఎంటర్ ప్రైజ్ విలువ రూ .5.16 లక్షల కోట్లకు చేరింది. ఫలితంగా మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ మొదటి స్థానంలో వుండగా, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. (జియో హాట్రిక్ : మరో మెగా డీల్)
జియో ప్లాట్‌ఫామ్స్‌లో 2.32 శాతం వాటా రూ. 11,367 కోట్లకు కొనుగోలు చేయడంతో జియో ఈ ఘనతను సాధించింది. మరోవైపు ఈ డీల్ ప్రకటించిన తరువాత శుక్రవారం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) 4 శాతానికి పైగా లాభపడింది. రిలయన్స్ జియోలో గత మూడు వారాల్లోనే మొత్తం రూ. 60,596 కోట్లను ఇన్వెస్ట్ చేసేందుకు అమెరికాకు చెందిన మూడు దిగ్గజ కంపెనీలు ముందుకురావడం గమనార్హం. (ఫేస్‌బుక్ - జియో డీల్ : జుకర్ బర్గ్ సందేశం)
Comments
Please login to add a commentAdd a comment