కోల్‌కతా: కోల్‌కతా వీధుల్లో పుచ్కా, ఆలు చాప్, హక్కా నూడుల్స్ కంటే నోరూరించే వంట ఏదైనా ఉందంటే, అది అక్కడ దొరికే బాహుబలి చికెన్ రోల్. అంత రుచికరంగా ఉంటుంది కాబట్టే అక్కడ భోజన ప్రియులు ఈ రోల్ కోసం ఎగబడతారు. ఈ విషయాన్ని సిటీ ఆఫ్ జాయ్ నుంచి వచ్చిన వారందరూ ఖచ్చితంగా అంగీకరిస్తారు. గ్రైండ్ చేసిన చికెన్ మాంసం, వివిధ రకాల సాస్‌లు, సుగంధ ద్రవ్యాలు, దోరగా వేయించిన ఉల్లిపాయలతో వీటనన్నింటిని కలిపి చేసిన ఈ రోల్‌ను తింటుంటే మరోకటి లాగించాలనే కోరిక కలగక తప్పదు ఎవరికైనా అంటున్నారు ఆ ప్రాంత ప్రజలు.
కోల్‌కతా గారియాలో ఫుడ్ జాయింట్ లోని ఈ చికెన్ రోల్ టేస్ట్ పరంగ ఎంత బాగుంటుందో ,దీని సైజు పరంగా కూడా అంతే పెద్దగా ఉంటుంది. ఎంతంటే 'ప్రపంచంలోనే అతిపెద్ద' చికెన్ ఎగ్ రోల్ అని పిలిచేంత. మరి ధర చూస్తే కేవలం రూ. 349 మాత్రమే. ఇండియా ఈట్ మానియా అనే ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతాలో ఈ రోల్ తయారీ విధానాన్ని ఓ వ్యక్తి పోస్ట్ చేశాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారి చూసిన వాళ్ల నోరు ఊరిస్తోంది. అందులో ఒక వ్యక్తి నాలుగు పరాటాలను కలిపి 23-26 అంగుళాల పెద్ద రోల్‌ను సిద్ధం చేశాడు. మూడు గుడ్లతో బేస్‌గా చేసిన తరువాత, మిశ్రమ కూరగాయలు, మటన్ కబాబ్స్, సోయా చాప్, మటన్ షమ్మీ కబాబ్స్, పన్నీర్ టిక్కా, చికెన్ కేబాబ్స్ వంటి వివిధ రకాల పదార్థాలతో వీటిని తయారు చేస్తున్నారు. ఇక రోల్ తయారీ భాగం చివరన ముక్కలు చేసిన ఉల్లిపాయలు, టొమాటో కెచప్, గ్రీన్ చిల్లి సాస్, మసాలాస్, మయోన్నైస్, నిమ్మరసం, తురిమిన జున్నుతో అందంగా అలంకరించి కస్టమర్లకు వడ్డిస్తున్నారు.
( చదవండి: ఆకలి ఆక్రోశం: గిన్నె ఎత్తిపడేసిన శునకం )
Comments
Please login to add a commentAdd a comment