Eatery
-
ప్రపంచంలోనే అతి పెద్ద చికెన్ ఎగ్ రోల్ ఎక్కడో తెలుసా?
కోల్‌కతా: కోల్‌కతా వీధుల్లో పుచ్కా, ఆలు చాప్, హక్కా నూడుల్స్ కంటే నోరూరించే వంట ఏదైనా ఉందంటే, అది అక్కడ దొరికే బాహుబలి చికెన్ రోల్. అంత రుచికరంగా ఉంటుంది కాబట్టే అక్కడ భోజన ప్రియులు ఈ రోల్ కోసం ఎగబడతారు. ఈ విషయాన్ని సిటీ ఆఫ్ జాయ్ నుంచి వచ్చిన వారందరూ ఖచ్చితంగా అంగీకరిస్తారు. గ్రైండ్ చేసిన చికెన్ మాంసం, వివిధ రకాల సాస్‌లు, సుగంధ ద్రవ్యాలు, దోరగా వేయించిన ఉల్లిపాయలతో వీటనన్నింటిని కలిపి చేసిన ఈ రోల్‌ను తింటుంటే మరోకటి లాగించాలనే కోరిక కలగక తప్పదు ఎవరికైనా అంటున్నారు ఆ ప్రాంత ప్రజలు. కోల్‌కతా గారియాలో ఫుడ్ జాయింట్ లోని ఈ చికెన్ రోల్ టేస్ట్ పరంగ ఎంత బాగుంటుందో ,దీని సైజు పరంగా కూడా అంతే పెద్దగా ఉంటుంది. ఎంతంటే 'ప్రపంచంలోనే అతిపెద్ద' చికెన్ ఎగ్ రోల్ అని పిలిచేంత. మరి ధర చూస్తే కేవలం రూ. 349 మాత్రమే. ఇండియా ఈట్ మానియా అనే ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతాలో ఈ రోల్ తయారీ విధానాన్ని ఓ వ్యక్తి పోస్ట్ చేశాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారి చూసిన వాళ్ల నోరు ఊరిస్తోంది. అందులో ఒక వ్యక్తి నాలుగు పరాటాలను కలిపి 23-26 అంగుళాల పెద్ద రోల్‌ను సిద్ధం చేశాడు. మూడు గుడ్లతో బేస్‌గా చేసిన తరువాత, మిశ్రమ కూరగాయలు, మటన్ కబాబ్స్, సోయా చాప్, మటన్ షమ్మీ కబాబ్స్, పన్నీర్ టిక్కా, చికెన్ కేబాబ్స్ వంటి వివిధ రకాల పదార్థాలతో వీటిని తయారు చేస్తున్నారు. ఇక రోల్ తయారీ భాగం చివరన ముక్కలు చేసిన ఉల్లిపాయలు, టొమాటో కెచప్, గ్రీన్ చిల్లి సాస్, మసాలాస్, మయోన్నైస్, నిమ్మరసం, తురిమిన జున్నుతో అందంగా అలంకరించి కస్టమర్లకు వడ్డిస్తున్నారు. View this post on Instagram A post shared by India Eat Mania (@india_eat_mania) ( చదవండి: ఆకలి ఆక్రోశం: గిన్నె ఎత్తిపడేసిన శునకం ) -
ఫుడ్ బాగా లేదన్న పాపానికి..!?
ముంబై : రోడ్‌సైడ్ హోటల్లో ఫుడ్ బాగా లేదన్న ఓ కస్టమర్‌పై సలసల కాగే నూనె పోసేందుకు ప్రయత్నించాడో యజమాని. షాకింగ్‌కు గురి చేసే ఈ ఘటన ముంబై శివారులోని ఉల్లాస్ నగర్లో జరిగింది. రోడ్ పక్కగా ఉండే ఓ హోటల్లో టిఫిన్ చేసేందుకు ఓ యువకుడు వెళ్లాడు. తింటున్న టిఫిన్ రుచిగా లేదని చెప్పాడు. అంతేకాక ఇంత చట్నీలు కూడా సరిగ్గా లేవని యువకుడు హొటల్ యజమానితో గొడవ పెట్టుకున్నాడు. అంతేకాక టిఫిన్ చేసేందుకు వస్తున్న ఇతర కస్టమర్లతో.. ఇక్కడ టిఫిన్ బాగాలేదని యువకుడు చెప్పడంతో హోటల్ యజమానికి ఆగ్రహం తెప్పించింది. గొడవ పెట్టుకున్న కస్టమర్‌పై కోపం తెచ్చుకున్న హోటల్ యజమాని అతనిమీద సలసల మరిగే నూనెను పోసేందుకు ప్రయత్నించాడు. అయితే ప్రమాదాన్ని పసిగట్టిన కస్టమర్ అక్కడనుంచి పారిపోయాడు. అయినా అతని మీద నూనె పోసేందుకు హోటల్ యజమాని తీవ్రంగా ప్రయత్నించాడు. ఈ ఘటన అంతా అక్కడ ఉండే సీసీటీవీలో రికార్డయింది. కస్టమర్ ఇచ్చిన ఫిర్యాదుతో సీసీటీవీ ఫుటేజ్‌ని పరిశీలించి.. సదరు హోటల్ యజమానిపై కేసును నమోదు చేశారు పోలీసులు ఫుడ్ బాగా లేదన్న కస్టమర్‌పై హోటల్ యజమాని గొడవ -
ఫుడ్ బాగా లేదన్న పాపానికి..!
-
హీరోయిన్ సోదరుడిపై కేసు
పూణె: అక్రమంగా హుక్కాను సరఫరా చేస్తున్నందుకు బాలీవుడ్ టాప్ హీరోయిన్ ప్రియాంక చోప్రా సోదరుడు సిద్ధార్ధ్ చోప్రాపై కేసు నమోదయింది. హోటల్ మేనేజ్మెంట్లో గ్రాడ్యుయేట్ అయిన సిద్ధార్ధ్ చోప్రా పూణేలోని కారేగావ్ పార్క్ సెంటర్ లో 'ద మగ్ షాట్ లాంజ్' పేరుతో ఓ రెస్టారెంట్‌ను నడుపుతున్నాడు. నో స్మోకింగ్ జోన్లో పొగాకు విరివిగా వాడుతున్నారనే విశ్వసనీయ సమాచారంతో బుధవారం రాత్రి సదరు రెస్టారెంట్‌పై పోలీసులు దాడి చేయగా.. అనుమతి లేకుండా హుక్కాను వినియోగిస్తున్నట్లు బయటపడింది. దీనిపై డీసీపీ పీఆర్ పాటిల్ మాట్లాడుతూ.. 'ద మగ్ షాట్ లాంజ్' యజమాని అయిన సిద్ధార్ధ్ చోప్రా(26)పై, అలాగే రెస్టారెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న ప్రకాష్ చౌదరి(24)పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. హుక్కా పరికరాలను, పొగాకును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. కాగా ఇదే రెస్టారెంట్లో మే నెలలో ఐపీఎల్ మ్యాచ్‌లపై బెట్టింగ్‌కు పాల్పడినందుకుగాను 10మందిని పూణె పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.