హీరోయిన్ సోదరుడిపై కేసు | Priyanka Chopra's brother booked for serving hookah illegally at his Pune eatery | Sakshi
Sakshi News home page

హీరోయిన్ సోదరుడిపై కేసు

Published Fri, Jul 15 2016 4:04 PM | Last Updated on Mon, Sep 4 2017 4:56 AM

హీరోయిన్ సోదరుడిపై కేసు

హీరోయిన్ సోదరుడిపై కేసు

పూణె: అక్రమంగా హుక్కాను సరఫరా చేస్తున్నందుకు బాలీవుడ్ టాప్ హీరోయిన్ ప్రియాంక చోప్రా సోదరుడు సిద్ధార్ధ్ చోప్రాపై కేసు నమోదయింది. హోటల్ మేనేజ్మెంట్లో గ్రాడ్యుయేట్ అయిన సిద్ధార్ధ్ చోప్రా పూణేలోని కారేగావ్ పార్క్ సెంటర్ లో 'ద మగ్ షాట్ లాంజ్' పేరుతో ఓ రెస్టారెంట్ను నడుపుతున్నాడు. నో స్మోకింగ్ జోన్లో పొగాకు విరివిగా వాడుతున్నారనే విశ్వసనీయ సమాచారంతో బుధవారం రాత్రి సదరు రెస్టారెంట్పై పోలీసులు దాడి చేయగా.. అనుమతి లేకుండా హుక్కాను వినియోగిస్తున్నట్లు బయటపడింది.

దీనిపై డీసీపీ పీఆర్ పాటిల్ మాట్లాడుతూ.. 'ద మగ్ షాట్ లాంజ్' యజమాని అయిన సిద్ధార్ధ్ చోప్రా(26)పై, అలాగే రెస్టారెంట్ మేనేజర్గా పనిచేస్తున్న ప్రకాష్ చౌదరి(24)పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. హుక్కా పరికరాలను, పొగాకును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. కాగా ఇదే రెస్టారెంట్లో మే నెలలో ఐపీఎల్ మ్యాచ్లపై బెట్టింగ్కు పాల్పడినందుకుగాను 10మందిని పూణె పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement