
సాక్షి, న్యూఢిల్లీ: స్మార్ట్‌మేకర్, షావోమి మరో ఘనతను తన ఖాతాలో వేసుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఐపీవోను దాఖలు చేసిన రికార్డును సొంతం చేసుకుంది. చైనాకు చెందిన ఈ స్మార్ట్‌ఫోన్ తయారీ దిగ్గజ కంపెనీ హాంగ్ కాంగ్ మార్కెట్‌లో గురువారం ఈ అతిపెద్ద ఐపీవోను సమర్పించింది.
బ్లూమ్‌బర్గ్ అందించిన సమాచారం ప్రకారం 2014 తర్వాత ఇదే బిగ్గెస్ట్ ఐపీవోగా భావిస్తున్నారు. ఈ లిస్టింగ్‌తో కంపెనీవిలువ100 బిలియన్ డాలర్లకు చేరవచ్చని అంచనా. అలీబాబా గ్రూప్ హోల్డింగ్ లిమిటెడ్ తర్వాత చైనాలో అతిపెద్ద టెక్ ఐపీవోగా నిలవనుంది. 2014 లో అలీబాబా గ్రూప్ 21.8 బిలియన్ డాలర్లను సేకరించింది. షిప్‌మెంట్ వారీగా ప్రపంచంలోని నాల్గవ-అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ, హాంగ్ కాంగ్ ఎక్స్చేంజెస్ అండ్ క్లియరింగ్ లిమిటెడ్‌కు ఐపీవో దరఖాస్తును సమర్పించింది. 2017 నాటికి దాని ఆదాయం 114.62 బిలియన్ యువాన్లతో (18 బిలియన్ డాలర్లు) గా ఉంది. 2016 లో 67.5 శాతం పెరిగింది. 2017 లో ఆపరేటింగ్ లాభం 12.22 బిలియన్ యువాన్లుగా నమోదు చేసింది.
కాగా 2016లో అనేక సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ సేల్స్ నమూనాలను పునరుద్ధరించడం, ఇండియాలోభారీ విస్తరణ ద్వారా తిరిగి బౌన్స్ అయింది. దీంతో ఇండియాలో అతిపెద్ద విక్రయదారుడిగా ఉన్న శాంసంగ్‌కు ప్రధాన ప్ర్యతర్థిగా నిలిచింది.