UK Interest Rates See Biggest Increase in 27 Years - Sakshi
Sakshi News home page

27 ఏళ్ల తరువాత యూకే కేంద్ర బ్యాంక్‌ షాకింగ్‌ నిర్ణయం

Published Thu, Aug 4 2022 4:58 PM | Last Updated on Thu, Aug 4 2022 5:17 PM

UK interest rates see biggest increase in 27 years - Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: అమెరికా ఫెడ్‌ బాటలో పయనించిన బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ వడ్డీ రేట్లను భారీగా పెంచేసింది.  ద్రవ్యోల్బణం ముప్పు,  అధిక ధరలు, ఇంధన ధరలు తదితర ఆందోళనల నేపథ్యంలో కీలక వడ్డీ రేట్లను 1.25 నుంచి 1.75 శాతానికి పెంచింది. పెరుగుతున్న ధరల కట్టడికి ఈ పెంపు నిర్ణయం తీసుకున్నట్టు  బ్యాంకు ప్రకటించింది.

పలువురు విశ్లేషకులు,పెట్టుబడిదారుల అంచనాల కనుగుణంగానే బీవోఈ గవర్నర్ ఆండ్రూ బెయిలీ 50 బీపీఎస్‌ పాయింట్ల వడ్డీరేట్ల పెంపును ప్రకటించారు. 1995 తర్వాత ఇదే  అతిపెద్ద  పెంపు.  ఆహార, ఇంధన ధరల సంక్షోభంతో యూకే ద్రవ్యోల్బణం 9.4 శాతం వద్ద జూన్‌లో 40 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరింది. తరువాత ఇది దాదాపు 11 శాతానికి చేరుతుందని అంచనా. (Suryansh Kumar: వావ్‌!13 ఏళ్లకే 56 కంపెనీలకు బాస్! మరి ఆదాయం!)

వచ్చే ఏడాది ప్రారంభం నాటికి వినియోగదారుల ధరల సూచీ ద్రవ్యోల్బణం 15 శాతానికి చేరుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. 27 ఏళ్లలో అతిపెద్ద వడ్డీ రేటు పెంపు ప్రకటించడం గమనార్హం. రుణాలు తీసుకోవడం, ఖర్చుల తగ్గింపు లాంటి  చర్యల్ని ప్రోత్సహించే చర్యల్లో భాగంగా వడ్డీరేట్లను పెంచడం వరుసగా ఇది ఆరోసారి.

(ఇదీ చదవండిHonda Dio Sports: హోండా డియో స్పోర్ట్స్  లాంచ్‌, ఆశ్చర్యంగా ధర తక్కువే!)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement