
ఇదేదో రాక్షస కోడి అనుకుంటున్నారా? అదేమీ కాదు. ఆ ఆకారంలో ఉన్న హోటల్. కోడి ఆకృతిలోని హోటళ్లలో ప్రపంచంలోకెల్లా అతి పెద్దదిగా తాజాగా గిన్నిస్ రికార్డులకెక్కింది. ఇది ఫిలిప్పీన్స్‌లో కంపుస్టోహన్‌లోని హైలాండ్ రిసార్ట్‌లో ఉంది. 115 అడుగుల ఎత్తు, 92 అడుగుల పొడవు, 40 అడుగుల వెడల్పున్న ఈ హోటల్‌లో సకల సదుపాయాలతో కూడిన 15 గదులున్నాయి. ఈ నిర్మాణం తన భార్య ఆలోచనంటూ రిసార్టు యజమాని మురిసిపోతున్నాడు. ఫిలిప్పీన్స్ తుఫాన్లకు, వరదలకు పెట్టింది పేరు. వాటన్నింటినీ తట్టుకునేలా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ ఈ నిర్మాణాన్ని కేవలం ఆర్నెల్లలో పూర్తి చేశారట!
Comments
Please login to add a commentAdd a comment