జైపూర్: మహాశివరాత్రి రోజు విషాదం చోటుచేసుకుంది. రాజస్థాన్‌లోని కోటాలో శివరాత్రి పర్వదినాన ఏర్పాటు చేసిన వేడుకల్లో కరెంట్ షాక్ తగిలి 14 మంది చిన్నారులు గాయపడ్డారు. బాధితులను సమీపంలోని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హీరాలాల్ నగర్ తెలిపారు. విద్యుదాఘాతానికి గురైన చిన్నారులు వాళ్ల కుటుంబీకులు ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డుకు తరలిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ ఘటనపై మంత్రి మాట్లాడుతూ.. చాలా బాధాకరమైన సంఘటనగా పేర్కొన్నారు. చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారని, వారిలో ఒకరికి 100శాతం శరీరంపై కాలిన గాయాలు ఉన్నట్లు తెలిపారు. ప్రత్యేక వైద్యుల బృందంతో చిన్నారులకు చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. కరెంట్ షాక్‌కు గల కారణాలపై దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
అయితే విద్యుత్ షాక్‌కు హైటెన్షన్ ఓవర్ హెడ్ విద్యుత్ లైన్ కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితుల్లో ఇద్దరు పిల్లలకు 50 నుంచి 100 శాతం కాలిన గాయాలు, మిగిలిన వారు 50 శాతం కంటే తక్కువ కాలిన గాయాలు తగిలినట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment