ఓటీటీలలో కొన్ని వెబ్ సిరీస్‌లకు భారీ క్రేజ్ ఉంటుంది. ఒక సీజన్ పూర్తి అయిన తర్వాత మరో సీజన్ ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తుంటారు. ఈ క్రమంలో చాలా రోజులుగా ఎదురుచూస్తున్న 'కోటా ఫ్యాక్టరీ' వెబ్ సిరీస్ సీజన్ 3 జూన్‌లో స్ట్రీమింగ్ అవుతుందని నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది.
దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు తమ ఉన్నత చదువులు, ఉద్యోగాల కోచింగ్ కోసం రాజస్థాన్‌లోని కోటా అనే ప్రాంతానికి వెళ్తుంటారు. ఐఐటీ కోచింగ్ కోసం ఎక్కువగా విద్యార్థులు అక్కడికి చేరుకుంటారు. సీటు సాధించే క్రమంలో వారు ఎక్కువగా ఒత్తిడికి గురికావడం జరుగుతుంది. కొందరైతే దానిని తట్టుకోలేక ఆత్మహత్య కూడా చేసుకున్నారు. అక్కడ ఉన్న విద్యార్థుల జీవితాల ఆధారంగా 2019లోనే 'కోటా ఫ్యాక్టరీ' మొదటి సీజన్ వచ్చింది.. 2021లో రెండో సీజన్ వచ్చింది.
ఆ రెండు సీజన్స్ భారీ హిట్ అందుకోవడంతో.. జూన్ 20న మూడో సీజన్ రానుంది. ఈమేరకు చిత్ర యూనిట్ అఫీషియల్‌గా ప్రకటించింది. కోటా ఫ్యాక్టరీలో అందరినీ మెప్పించే పాత్ర జీతూ భయ్యా.. అందులో జితేంద్ర కుమార్ జీవించేశాడు.
సౌరభ్ కన్నా రూపొందించిన ఈ వెబ్ సిరీస్‌కు రాఘవ్ సుబ్బు దర్శకత్వం వహించారు. అహ్సాస్ చన్నా, మయూర్ మోర్, రేవతి పిళ్లై ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. టీవీఎఫ్ సంస్థ నిర్మించిన ఈ సీరిస్ జూన్ 20న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment