ఫ్యాకల్టీ, నాన్‌టీచింగ్‌ పోస్టులు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి | ICMR New Delhi, IIIT Kota, Delhi Technological University Recruitment 2021 | Sakshi
Sakshi News home page

ఫ్యాకల్టీ, నాన్‌టీచింగ్‌ పోస్టులు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి

Published Fri, Jul 23 2021 8:03 PM | Last Updated on Fri, Jul 23 2021 8:03 PM

ICMR New Delhi, IIIT Kota, Delhi Technological University Recruitment 2021 - Sakshi

ఐసీఎంఆర్, న్యూఢిల్లీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ 15 పోస్టులు
భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌(ఐసీఎంఆర్‌).. వివిధ విభాగాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌(మెడికల్‌).. పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

► మొత్తం పోస్టుల సంఖ్య: 15
► విభాగాలు: నెఫ్రాలజీ, యూరాలజీ, కార్డియాలజీ, న్యూరాలజీ, గ్యాస్ట్రో సర్జరీ, రేడియాలజీ, పాథాలజీ తదితరాలు.

► అర్హత: ఎంబీబీఎస్‌తోపాటు సంబంధిత స్పెషలైజేషన్లలో మెడికల్‌ పోస్టు గ్రాడ్యుయేట్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. »వయసు: 40ఏళ్లు మించకూడదు. 

► ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

► దరఖాస్తులకు చివరి తేది: 30.07.2021
► వెబ్‌సైట్‌: https://www.icmr.gov.in

ఢిల్లీ టెక్నలాజికల్‌ యూనివర్సిటీలో 26 ఫ్యాకల్టీ పోస్టులు
ఢిల్లీలోని ఢిల్లీ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ(డీటీయూ).. ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

► మొత్తం పోస్టుల సంఖ్య: 26

► పోస్టుల వివరాలు: అసోసియేట్‌ ప్రొఫెసర్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌.

► విభాగాలు: కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్,ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరింగ్‌.

► అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఎంఈ/ఎంటెక్, పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పరిశోధన/టీచింగ్‌ అనుభవం ఉండాలి.

► ఎంపిక విధానం: స్క్రీనింగ్‌ టెస్ట్‌/ప్రజంటేషన్‌/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును రిక్రూట్‌మెంట్‌ బ్రాంచ్, ఢిల్లీ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ, షాబాద్‌ దౌలత్‌పూర్, భావనా రోడ్, ఢిల్లీ–110042 చిరునామాకు పంపించాలి.

► ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 09.08.2021

► దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరి తేది: 18.08.2021

► వెబ్‌సైట్‌: www.dtu.ac.in

ఐఐఐటీ, కోటాలో 21 నాన్‌టీచింగ్‌ పోస్టులు
జయపురలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ(ఐఐఐటీ), కోటా.. నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

► మొత్తం పోస్టుల సంఖ్య: 21

► పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌–02, అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌–01, టెక్నికల్‌ అసిస్టెంట్‌–02, టెక్నీషియన్‌–05, సూపరింటెండెంట్‌–02, అకౌంటెంట్‌–01, జూనియర్‌ అసిస్టెంట్‌–06, ఆఫీస్‌ అటెండెంట్‌–02.

► అర్హత: పోస్టుల్ని అనుసరించి ఇంటర్మీడియట్, సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్‌ డిగ్రీ, బీఈ/బీటెక్‌/బీఆర్క్‌/ఎంసీఏ, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు కంప్యూటర్‌ నాలెడ్జ్, టైపింగ్‌ స్కిల్స్‌ ఉండాలి.

► వయసు: పోస్టుల్ని అనుసరించి 27ఏళ్ల నుంచి 35ఏళ్ల మధ్య ఉండాలి.

► ఎంపిక విధానం: ఇంటర్వ్యూ/రాతపరీక్ష/ట్రేడ్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

► ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 31.07.2021

► వెబ్‌సైట్‌: www.iiitkota.ac.in

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement