non teaching
-
ఏపీ: టీచర్లు ఇక విద్యా బోధనకు మాత్రమే!
సాక్షి, విజయవాడ: విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు.. ఉపాధ్యాయులు అకడమిక్ ఆచివమెంట్ లెవెల్ పెంచేందుకు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విద్యా శాఖ పరిధి కింద పనిచేస్తున్న ఉపాధ్యాయులకు బోధనేతర బాధ్యతలను ఇవ్వకూడదని మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉపాధ్యాయులను బోధనేతర విధుల నుంచి తప్పిస్తున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఏపీ ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఇకపై ఉపాధ్యాయులు కేవలం విద్యా బోధనకు మాత్రమే పరిమితం కానున్నారు. మంగళవారం వర్చువల్‌గా భేటీ అయిన ఏపీ కేబినెట్ సమావేశం పాఠశాల విద్యా శాఖకు సంబంధించిన ఈ కీలక నిర్ణయానికి ఆమోద ముద్ర వేసింది. కేబినెట్ ఆమోదం లభించిన వెంటనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ను పాఠశాల విద్యా శాఖ వెలువరించింది. విద్యా శాఖ కార్యదర్శి రాజశేఖర్ పేరిట నోటిఫికేషన్ జారీ అయ్యింది. అనేక సందర్భాల్లో బోధనేతర బాధ్యతలు భారం తగ్గించాలని కోరుతూ వస్తున్నారు ఉపాధ్యాయులు. అంతేకాదు.. ఉపాధ్యాయులు బోధనేతర విధులకు నిషిద్ధమని విద్యా హక్కు చట్టం చెబుతున్న విషయాన్ని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తావించింది. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే టీచర్లను బోధనేతర కార్యకలాపాలకు వినియోగిస్తామని ఆ నోటిఫికేషన్ లో ప్రభుత్వం వెల్లడించింది. ఇతర ప్రభుత్వ ఉద్యోగులంతా విధులకు నియమించగా ఇంకా అవసరం ఉన్నప్పుడు మాత్రమే బోధనేతర విధులను అప్పగించాలని ఆ ఆదేశాల్లో స్పష్టం చేసింది. -
జేఎంఐ, న్యూఢిల్లీలో నాన్ టీచింగ్ పోస్టులు
న్యూఢిల్లీలోని కేంద్రీయ విశ్వవిద్యాలయమైన జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్సిటీ.. నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 119 ► పోస్టుల వివరాలు: డిప్యూటీ రిజిస్ట్రార్–02, డెవలప్మెంట్ ఆఫీసర్–01, అసిస్టెంట్ రిజిస్ట్రార్–02, సెక్షన్ ఆఫీసర్–07, ఆఫీస్ అసిస్టెంట్–04, పర్సనల్ అసిస్టెంట్–02, స్టెనోగ్రాఫర్–09, అప్పర్ డివిజన్ క్లర్క్(యూడీసీ)–07, క్లర్క్–టైపిస్ట్/ఎల్డీసీ–30, ఉర్దూ టైపిస్ట్–03, మల్టీ టాస్కింగ్ స్టాఫ్–30, ఇంటర్నల్ ఆడిట్ ఆఫీసర్–01, ప్రొఫెషనల్ అసిస్టెంట్–03, సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్–03, ల్యాండ్ రికార్డ్ సూపరింటెండెంట్–01, గ్రౌండ్స్మేన్–02, సెక్యూరిటీ అసిస్టెంట్–11, రిసెప్షనిస్ట్–01. ► అర్హత: పోస్టుల్ని అనుసరించి పదోతరగతి, ఇంటర్మీడియట్, బ్యాచిలర్స్ డిగ్రీ, పీజీ డిగ్రీ, సీఏ/సీఎంఏ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. ► ఎంపిక విధానం: రాతపరీక్ష/స్కిల్ టెస్ట్/ప్రాక్టికల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్(నాన్ టీచింగ్) సెక్షన్, రిజిస్ట్రార్స్ ఆఫీస్, జామియా మిల్లియా ఇస్లామియా, మౌలానా మొహ్మద్ అలీ జౌహర్ మార్గ్, జామియా నగర్, న్యూఢిల్లీ–110025 చిరునామకు పంపించాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 18.10.2021 ► వెబ్సైట్: https://www.jmi.ac.in ఐజీడీటీయూడబ్ల్యూలో 53 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఢిల్లీ టెక్నికల్ యూనివర్సిటీ ఫర్ ఉమెన్(ఐజీడీటీయూడబ్ల్యూ)..టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 53 ► పోస్టుల వివరాలు: టీచింగ్ పోస్టులు–48, నాన్ టీచింగ్ పోస్టులు–05. ► పోస్టుల వివరాలు: ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్, డిప్యూటీ రిజిస్ట్రార్, అసిస్టెంట్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్. ► విభాగాలు: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఇంగ్లిష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ తదితరాలు. ► అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈ/బీటెక్ /బీఎస్, ఎంఈ/ఎంటెక్/ఎంఎస్/ఇంటిగ్రేటెడ్ ఎంటెక్, మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్డీ ఉత్తీర్ణులవ్వాలి. నెట్/స్లెట్/సెట్ అర్హత ఉండాలి. ► వయసు: 35ఏళ్ల నుంచి 55ఏళ్ల మధ్య ఉండాలి. ► వేతనం: నెలకు రూ.56,100 నుంచి రూ.1,44,200 వరకు చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: పోస్టుల్ని అనుసరించి స్క్రీనింగ్/రాతపరీక్ష, సెమినార్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 04.10.2021 ► వెబ్సైట్: www.igdtuw.ac.in -
నిట్, వరంగల్‌లో 129 నాన్‌టీచింగ్ పోస్టులు
వరంగల్‌లోని భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వశాఖకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్).. నాన్‌టీచింగ్ పోస్టుల భర్తీకి దర ఖాస్తులు కోరుతోంది. (టీఎస్ఏసీఎస్లో ఉద్యోగాలు.. ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు) ► మొత్తం పోస్టుల సంఖ్య: 129 ► పోస్టుల వివరాలు: సీనియర్ మెడికల్ ఆఫీసర్–01, అసిస్టెంట్ రిజిస్ట్రార్–06, అసిస్టెంట్ ఇంజనీర్–02, సూపరింటెండెంట్–08, టెక్నికల్ అసిస్టెంట్–27, జూనియర్ ఇంజనీర్–08, ఎస్ఏఎస్ అసిస్టెంట్–03, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్–02, సీనియర్ టెక్నీషియన్–19, టెక్నీషియన్–34, జూనియర్ అసిస్టెంట్–19. ► అర్హత: పోస్టుల్ని అనుసరించి ఇంటర్మీడియట్, సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈ/బీటెక్, మాస్టర్స్ డిగ్రీ, ఎంబీబీఎస్/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. ► వయసు: పోస్టుల్ని అనుసరించి 27 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. ► ఎంపిక విధానం: పోస్టుల్ని అనుసరించి స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ/ప్రిలిమినరీ టెస్ట్, అడ్వాన్స్డ్ టెస్ట్, ట్రేడ్/స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 23.08.2021 ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 23.09.2021 ► వెబ్సైట్: www.nitw.ac.in -
ఫ్యాకల్టీ, నాన్‌టీచింగ్ పోస్టులు.. ఆన్లైన్లో అప్లై చేయండి
ఐసీఎంఆర్, న్యూఢిల్లీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ 15 పోస్టులు భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్).. వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్(మెడికల్).. పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 15 ► విభాగాలు: నెఫ్రాలజీ, యూరాలజీ, కార్డియాలజీ, న్యూరాలజీ, గ్యాస్ట్రో సర్జరీ, రేడియాలజీ, పాథాలజీ తదితరాలు. ► అర్హత: ఎంబీబీఎస్‌తోపాటు సంబంధిత స్పెషలైజేషన్లలో మెడికల్ పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. »వయసు: 40ఏళ్లు మించకూడదు. ► ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 30.07.2021 ► వెబ్సైట్: https://www.icmr.gov.in ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీలో 26 ఫ్యాకల్టీ పోస్టులు ఢిల్లీలోని ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీ(డీటీయూ).. ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 26 ► పోస్టుల వివరాలు: అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్. ► విభాగాలు: కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్,ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. ► అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఎంఈ/ఎంటెక్, పీహెచ్డీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పరిశోధన/టీచింగ్ అనుభవం ఉండాలి. ► ఎంపిక విధానం: స్క్రీనింగ్ టెస్ట్/ప్రజంటేషన్/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్/ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును రిక్రూట్మెంట్ బ్రాంచ్, ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీ, షాబాద్ దౌలత్‌పూర్, భావనా రోడ్, ఢిల్లీ–110042 చిరునామాకు పంపించాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 09.08.2021 ► దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరి తేది: 18.08.2021 ► వెబ్సైట్: www.dtu.ac.in ఐఐఐటీ, కోటాలో 21 నాన్‌టీచింగ్ పోస్టులు జయపురలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐఐఐటీ), కోటా.. నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 21 ► పోస్టుల వివరాలు: అసిస్టెంట్ రిజిస్ట్రార్–02, అసిస్టెంట్ లైబ్రేరియన్–01, టెక్నికల్ అసిస్టెంట్–02, టెక్నీషియన్–05, సూపరింటెండెంట్–02, అకౌంటెంట్–01, జూనియర్ అసిస్టెంట్–06, ఆఫీస్ అటెండెంట్–02. ► అర్హత: పోస్టుల్ని అనుసరించి ఇంటర్మీడియట్, సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్ డిగ్రీ, బీఈ/బీటెక్/బీఆర్క్/ఎంసీఏ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్, టైపింగ్ స్కిల్స్ ఉండాలి. ► వయసు: పోస్టుల్ని అనుసరించి 27ఏళ్ల నుంచి 35ఏళ్ల మధ్య ఉండాలి. ► ఎంపిక విధానం: ఇంటర్వ్యూ/రాతపరీక్ష/ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 31.07.2021 ► వెబ్సైట్: www.iiitkota.ac.in -
ఐదేళ్లు పూర్తి చేసుకున్న వారికి బదిలీ తప్పని సరి
కర్నూలు సిటీ: ఒకే చోట ఐదేళ్లు పూర్తి చేసుకున్న బోధనేతర సిబ్బందిని తప్పని సరిగా బదిలీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని డీఈఓ తాహెరాసుత్తానా బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బోధనేతర సిబ్బంది బదిలీలపై ఉన్న నిషేధాన్ని కూడా ప్రభుత్వం ఇటీవలే తొలగించిందన్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న చోట 2017 ఏప్రిల్ 1 నాటికి మూడేళ్లు పూర్తి చేసుకున్న వారు బదిలీ కోరుతే దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఐదేళ్లు ఏళ్లు పూర్తి చేసుకున్న బోధనేతర సిబ్బంది వివరాలను, ఖాళీల వివరాలను htt://deokrnl13.blogspot.in లో ఉంచామన్నారు. జీఓ నెంబరు 72 ప్రకారం గురువారం(11వ తేదీ) సాయంత్రం లోపు ఆన్లైన్ ఎంప్లాయీస్ ట్రాన్స్ఫర్స్ సిస్టమ్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు ప్రింట్ తీసుకొని ఈ నెల 12వ తేదీ సాయంత్రం లోపు డీఈఓ కార్యాలయంలో అందజేయాలన్నారు. -
మంత్రి జోక్యం చేసుకోవాలి
నాన్ టీచింగ్ ఉద్యోగుల రాష్ట్ర నాయకుడు కుమార్‌రెడ్డి 9వ రోజుకు చేరిన టైం స్కేల్ ఉద్యోగుల నిరవధిక సమ్మె గుంటూరు వెస్ట్ : ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విధులు నిర్వహిస్తున్న టైం స్కేల్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేలా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వెంటనే జోక్యం చేసుకోవాలని నాన్ టీచింగ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకుడు ఎంఎల్ కుమార్‌రెడ్డి కోరారు. ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని టైం స్కేల్ ఉద్యోగులు జీవో 119 ప్రకారం ఇంటి అద్దె, సిటీ కాంపెన్సేటరీ అలవెన్సులు, 12 క్యాజ్వల్ లీవులు, రిటైర్మెంట్ సౌకర్యాలను అమలు చేయాలని యూనివర్సిటీ ఎదుట చేస్తున్న నిరవధిక సమ్మె మంగళవారం నాటికి 9వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా కుమార్‌రెడ్డి మాట్లాడుతూ 10వ పీఆర్సీ సిఫార్సుల మేరకు టైం స్కేల్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, కాంట్రాక్టు కార్మికులకు వీడీఏతో కూడిన కనీస వేతనాలు అమలు చేయాలని ప్రభుత్వాన్నిSకోరారు. నేడు మానవహారం, 4న చలో కలెక్టరేట్.. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఆందోళలను ఉధృతం చేయాలని నిర్ణయించినట్లు కుమార్‌రెడ్డి చెప్పారు. ఇందులో భాగంగా ఈ నెల 3వ తేదీన మానవహారం, 4న కలెక్టరేట్ వద్ద ధర్నా, 5న నోటికి నల్లగుడ్డలు కట్టుకోవడం, 6న మోకాళ్లపై నడవడం వంటి నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. అలాగే, 7వ తేదీన ఆకలికేకలు, 8న భిక్షాటన, 9న కళ్లకు గంతలు, 10న రోడ్లు ఊడ్వడం, 11న వెనక్కి నడవడం తదితర కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా యూనివర్సిటీ యాజమాన్యానికి, రాష్ట్ర ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేయాలని రాష్ట్ర కమిటీ నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. -
తెయూలో నియామకాలపై విచారణ..?
తెయూ(డిచ్పల్లి), న్యూస్‌లైన్: తెలంగాణ యూనివర్సిటీలో చే పట్టిన టీచింగ్, నాన్ టీచింగ్ నియామకాలకు సంబంధించి వీసీ అక్బర్‌అలీఖాన్‌పై వెల్లువెత్తిన ఆరోపణలపై రాష్ట్ర గవర్నర్ నరసింహన్ తీవ్రంగా స్పందించారు. ఆరోపణలపై హైకోర్టు రిటైర్ట్ జడ్జి శ్రీరాములు నేతృత్వంలో కమిటీని నియమించినట్లు సమాచారం. ఈమేరకు శుక్రవారం సాయంత్రం ఉన్నత విద్యాశాఖను ఆదేశించినట్లు తెలిసింది. పాలకమండలి ఆమో దం లేకుండానే ఏకపక్షంగా అర్ధరాత్రి నియామకాలు జరపడంపై గవర్నర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఉన్నత విద్యాశాఖ నుంచి స్పష్టత తీసుకోకుండానే తెయూ వీసీ అక్బర్రాత్రికి రాత్రే చేపట్టిన నియామక ప్రక్రియ వి వాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. జరిగింది ఇదీ... డిచ్పల్లి మండల కేంద్రం శివారులో ఉన ్న తెలంగాణ యూనివర్సిటీలో 103 బోధన, 7 బోధనేతర సిబ్బంది నియామకాలకు 2012, మే 25న నోటిఫికేషన్ వెలువడింది. 2012 అక్టోబర్- నవంబర్ నెలలో హైదరాబాద్‌లోని వ్యవసాయ యూనివర్సిటీ గెస్ట్‌హౌస్‌లో అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇంటర్వ్యూలను స్థానికంగా నిర్వహించకుండా హైదరాబాద్‌లో నిర్వహించడంపై వీసీపై అప్పట్లోనే ఆరోపణలు వెల్లువెత్తాయి. నియామకాల్లో అర్హతలు లేనివారికి కాల్‌లెటర్లు పంపించారని, రోస్టర్ పాయింట్లు పాటించలేదని, పలువురు అభ్యర్థుల వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అయినా ఇవేమీ పట్టించుకోకుండా వీసీ మొండిగా నియామకాలను చేపట్టారు. ఇంటర్వ్యూల్లో అర్హత సాధించిన 54 మందికి 2013, ఫిబ్రవరి 1న నియామక పత్రాలు అందజేశారు. అప్పట్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈ విషయమై అప్పటి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ క్రిస్టినా జెడ్ చోంగ్తూ ఆగ్రహం వ్యక్తం చేయడంతో నియామకాలను నిలిపివేశారు. వీటన్నింటిపై విద్యార్థిసంఘాలు, అకడ మిక్ కన్సల్టెంట్లు రాష్ట్ర గవర్నర్ నరసింహన్, అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి మిన్నీ మాథ్యూతో పాటు ఉన్నత విద్యామండలి అధికారులకు సైతం ఫిర్యాదు చేశారు. అనంతరం కోర్టును ఆశ్రయించారు. ఫిర్యాదులపై స్పందించిన ప్రభుత్వం నియామకాలను నిలిపివేస్తూ, ఆరోపణలపై ద్విసభ్య విచారణ కమిటీని నియమించింది. ఆంధ్రా యూనివర్సిటీ మాజీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ప్రసాద్‌రావు, కాకతీయ యూనివర్సిటీ మాజీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ భాస్కర్‌రావును కమిటీ సభ్యులుగా నియమించింది. ఈ ద్విసభ్య కమిటీ విచారణ జరిపి నియామకాల్లో అక్రమాలు జరిగినట్లు నివేదిక అందజేసినట్లు సమాచారం. అదే సమయంలో కోర్టు సైతం నియామక ప్రక్రియను నిలిపివేయాలని 2013, మార్చి13న స్టే ఇచ్చింది. దీంతో ఈ ఏడాది జనవరి 3న హైకోర్టు స్టే ఎత్తివేసింది. ఈ సమాచారం సాయంత్రం వర్సిటీ అధికారులకు అందింది. స్టే తొలగింపు సమాచారం అందిన వెంటనే వీసీ అక్బర్ అలీఖాన్, రిజిస్ట్రార్ లింబాద్రిలు హుటాహుటిన అదేరోజు అర్ధరాత్రి వర్సిటీ పరిపాలనా భవనానికి చేరుకుని నియామక పత్రాలను సిద్ధం చేశారు. 54 మంది అభ్యర్థులకు సమాచారం అందజేసి వర్సిటీకి పిలిపించుకున్నారు. వీరిలో 48 మంది విధుల్లో చేరారు. ఇప్పటి వరకు ఈ నియామకాలకు వర్సిటీ పాలక మండలి అనుమతి లభించలేదు. దీంతో విధుల్లో చేరిన బోధన సిబ్బందికి జీతాలు ఇవ్వడంలో రెండు నెలల పాటు జాప్యం చేశారు. ఇప్పటికీ కొత్తగా విధుల్లో చేరిన అధ్యాపకులు ఇంకా అభద్రతా భావంతోనే పనిచేస్తున్నారు.