న్యూఢిల్లీలోని కేంద్రీయ విశ్వవిద్యాలయమైన జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్సిటీ.. నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
► మొత్తం పోస్టుల సంఖ్య: 119
► పోస్టుల వివరాలు: డిప్యూటీ రిజిస్ట్రార్–02, డెవలప్‌మెంట్ ఆఫీసర్–01, అసిస్టెంట్ రిజిస్ట్రార్–02, సెక్షన్ ఆఫీసర్–07, ఆఫీస్ అసిస్టెంట్–04, పర్సనల్ అసిస్టెంట్–02, స్టెనోగ్రాఫర్–09, అప్పర్ డివిజన్ క్లర్క్(యూడీసీ)–07, క్లర్క్–టైపిస్ట్/ఎల్‌డీసీ–30, ఉర్దూ టైపిస్ట్–03, మల్టీ టాస్కింగ్ స్టాఫ్–30, ఇంటర్నల్ ఆడిట్ ఆఫీసర్–01, ప్రొఫెషనల్ అసిస్టెంట్–03, సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్–03, ల్యాండ్ రికార్డ్ సూపరింటెండెంట్–01, గ్రౌండ్స్‌మేన్–02, సెక్యూరిటీ అసిస్టెంట్–11, రిసెప్షనిస్ట్–01.
► అర్హత: పోస్టుల్ని అనుసరించి పదోతరగతి, ఇంటర్మీడియట్, బ్యాచిలర్స్ డిగ్రీ, పీజీ డిగ్రీ, సీఏ/సీఎంఏ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
► ఎంపిక విధానం: రాతపరీక్ష/స్కిల్ టెస్ట్/ప్రాక్టికల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును రిక్రూట్‌మెంట్ అండ్ ప్రమోషన్(నాన్ టీచింగ్) సెక్షన్, రిజిస్ట్రార్స్ ఆఫీస్, జామియా మిల్లియా ఇస్లామియా, మౌలానా మొహ్మద్ అలీ జౌహర్ మార్గ్, జామియా నగర్, న్యూఢిల్లీ–110025 చిరునామకు పంపించాలి.
► దరఖాస్తులకు చివరి తేది: 18.10.2021
► వెబ్‌సైట్: https://www.jmi.ac.in
ఐజీడీటీయూడబ్ల్యూలో 53 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు
ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఢిల్లీ టెక్నికల్ యూనివర్సిటీ ఫర్ ఉమెన్(ఐజీడీటీయూడబ్ల్యూ)..టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
► మొత్తం పోస్టుల సంఖ్య: 53
► పోస్టుల వివరాలు: టీచింగ్ పోస్టులు–48, నాన్ టీచింగ్ పోస్టులు–05.
► పోస్టుల వివరాలు: ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్, డిప్యూటీ రిజిస్ట్రార్, అసిస్టెంట్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్.
► విభాగాలు: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఇంగ్లిష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ తదితరాలు.
► అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈ/బీటెక్ /బీఎస్, ఎంఈ/ఎంటెక్/ఎంఎస్/ఇంటిగ్రేటెడ్ ఎంటెక్, మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. నెట్/స్లెట్/సెట్ అర్హత ఉండాలి.
► వయసు: 35ఏళ్ల నుంచి 55ఏళ్ల మధ్య ఉండాలి.
► వేతనం: నెలకు రూ.56,100 నుంచి రూ.1,44,200 వరకు చెల్లిస్తారు.
► ఎంపిక విధానం: పోస్టుల్ని అనుసరించి స్క్రీనింగ్/రాతపరీక్ష, సెమినార్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
► ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 04.10.2021
► వెబ్‌సైట్: www.igdtuw.ac.in
Comments
Please login to add a commentAdd a comment