ఆధిపత్య పోరు, నేతల మధ్య విబేధాలు వంటి సంక్షోభ సమస్యలతో రాజస్థాన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే నిండా వివాదంలో మునిగిన విషయం తెలిసిందే. తాజాగా అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ సర్కార్‌కు మరో షాక్ తగిలింది. సొంత పార్టీ ఎమ్మెల్యే నుంచే సీఎం అశోక్ గహ్లోత్‌కు వ్యతిరేకత వ్యక్తమైంది.
గహ్లోత్‌కు నిరసనగా కోటా జిల్లాలోని సంగోడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ సింగ్ మంగళవారం గుండు కొట్టించుకొని వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. తన మాటలు, సూచలను పట్టించుకోకుండా అవినీతిపరుడైన గనులశాఖమంత్రి ప్రమోద్ జైన్ భాయకు సీఎం గహ్లోత్ మద్దతిస్తున్నారని ఆరోపించారు. అతన్ని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. గుండు గీయించుకున్న తర్వాత ఆ వెంట్రుకలను సీఎంకు పంపించారు. దాంతోపాటు ఓ లేఖ కూడా పంపారు.
ఖాన్ కీ జోప్రియా గ్రామాన్ని కోట జిల్లాలో చేర్చలేదని.. దీంతో సీఎం మీద ఉన్న గౌరవం, విశ్వాసం చచ్చిపోయాయని లేఖలో విమర్శించారు. ‘ఎవరైనా చనిపోతే వారి సన్నిహితులు(బంధువలు) గుండు కొట్టించుకోవడం మన సంప్రదాయం.. అందుకే నేను గుండు గీయించుకుని.. ఆ వెంట్రుకలను మీకు పంపుతున్నా. సీఎం పదవి శాశ్వతం కాదు’ అంటూ లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు కోటా జిల్లాలో జరుగుతున్న అవినీతిపై ఆయన విచారం వ్యక్తం చేశారు.
కాగా రాష్ట్ర క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రి, అశోక్ చందన తన సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యుత్ సమస్యలపై ధర్నా చేసిన నాలుగు రోజులకు బుండి జిల్లా కేంద్రంలో ఈ సంఘటన జరిగింది. కోటా నగరంలోని గుమన్‌పురా ప్రాంతంలోని తన నివాసం వద్ద మద్దతుదారులతో కలిసి ఎమ్మెల్యే రావణుడి దిష్టిబొమ్మను కూడా దహనం చేశారు.
చదవండి: వాళ్ల నాలుక చీరేయాలి.. కళ్లు పెరికేయాలి: కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment