shaved heads
-
రాజస్థాన్ సీఎంకు షాక్.. సొంత పార్టీ ఎమ్మెల్యే వినూత్న నిరసన
ఆధిపత్య పోరు, నేతల మధ్య విబేధాలు వంటి సంక్షోభ సమస్యలతో రాజస్థాన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే నిండా వివాదంలో మునిగిన విషయం తెలిసిందే. తాజాగా అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ సర్కార్‌కు మరో షాక్ తగిలింది. సొంత పార్టీ ఎమ్మెల్యే నుంచే సీఎం అశోక్ గహ్లోత్‌కు వ్యతిరేకత వ్యక్తమైంది. గహ్లోత్‌కు నిరసనగా కోటా జిల్లాలోని సంగోడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ సింగ్ మంగళవారం గుండు కొట్టించుకొని వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. తన మాటలు, సూచలను పట్టించుకోకుండా అవినీతిపరుడైన గనులశాఖమంత్రి ప్రమోద్ జైన్ భాయకు సీఎం గహ్లోత్ మద్దతిస్తున్నారని ఆరోపించారు. అతన్ని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. గుండు గీయించుకున్న తర్వాత ఆ వెంట్రుకలను సీఎంకు పంపించారు. దాంతోపాటు ఓ లేఖ కూడా పంపారు. ఖాన్ కీ జోప్రియా గ్రామాన్ని కోట జిల్లాలో చేర్చలేదని.. దీంతో సీఎం మీద ఉన్న గౌరవం, విశ్వాసం చచ్చిపోయాయని లేఖలో విమర్శించారు. ‘ఎవరైనా చనిపోతే వారి సన్నిహితులు(బంధువలు) గుండు కొట్టించుకోవడం మన సంప్రదాయం.. అందుకే నేను గుండు గీయించుకుని.. ఆ వెంట్రుకలను మీకు పంపుతున్నా. సీఎం పదవి శాశ్వతం కాదు’ అంటూ లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు కోటా జిల్లాలో జరుగుతున్న అవినీతిపై ఆయన విచారం వ్యక్తం చేశారు. కాగా రాష్ట్ర క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రి, అశోక్ చందన తన సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యుత్ సమస్యలపై ధర్నా చేసిన నాలుగు రోజులకు బుండి జిల్లా కేంద్రంలో ఈ సంఘటన జరిగింది. కోటా నగరంలోని గుమన్‌పురా ప్రాంతంలోని తన నివాసం వద్ద మద్దతుదారులతో కలిసి ఎమ్మెల్యే రావణుడి దిష్టిబొమ్మను కూడా దహనం చేశారు. చదవండి: వాళ్ల నాలుక చీరేయాలి.. కళ్లు పెరికేయాలి: కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు -
సన్యాసిలా ఆలోచించగలనా?
లాక్డౌన్లో షూటింగ్ లేకపోయినా కొత్త స్క్రిప్ట్‌లు, తదుపరి సినిమాల విషయాలతో బిజీగా ఉన్నారు చిరంజీవి. తాజాగా లుక్ టెస్ట్ కోసం ఇలా గుండు బాస్‌గా మారారు. లుక్ ఫిక్సయిందా? మరి చిరు నెక్ట్స్ సినిమాలో ఇలాంటి క్రేజీ గెటప్‌తో కనిపిస్తారా? వేచి చూడాలి. ఈ ఫోటోను చిరంజీవి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి – ‘అర్బన్ మాంక్ (సిటీ సన్యాసి). మరి సన్యాసిలా ఆలోచించగలనా?’ అని క్యాప్షన్ చేశారు. -
900మంది గుండ్లు గీయించుకొని పోరాటం
సియోల్: తమ దేశం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా దక్షిణ కొరియా ప్రజలు తీవ్ర నిరసనలు వ్యక్తం చేశారు. దాదాపు 900 మంది బహిరంగంగా గుండ్లు చేయించుకొని నిరసన తెలిపారు. తమ భద్రతకు సంబంధించిన ఎలాంటి హామీ ఇవ్వకుండానే అనుచిత నిర్ణయాన్ని తీసుకోవడం తాము ఏ మాత్రం అంగీకరించబోమంటూ వారంతా రోడ్లెక్కారు. అమెరికాతో అణు కార్యక్రమంలో భాగంగా దక్షిణ కొరియా ఆ దేశంతో థాడ్(యూఎస్ టెర్మినల్ హైట్ ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్) ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం సియాంజులో ఓ భారీ యాంటీ మిసైల్ యూనిట్ ను ఏర్పాటుచేయనుంది. దీనికి వ్యతిరేకంగా సియాంజు నగర ప్రజలు తమ దేశ స్వేచ్ఛా దినం రోజే రోడ్లెక్కి ఈ నిరసన తెలిపారు. గత జనవరిలో నాలుగోసారి ఉత్తరకొరియా అణు పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రతిసారి ఏదో ఒక అణ్వాయుధాల పరీక్షలు జరుపుతూ తాము అమెరికాలోని ఏ భాగంనైనా.. దక్షిణ కొరియా రాజధానినైనా క్షణాల్లో బుగ్గి చేయగలమంటూ ప్రకటనలు చేస్తూ ప్రతి క్షణం భయపెడుతోంది. ఈ నేపథ్యంలో దక్షిణ కొరియా అమెరికాతో యాంటి మిసైల్ ప్రోగ్రాంకు సంబంధించి ఒప్పందం చేసుకుంది. వాస్తవానికి సియాంజు వ్యవసాయానికి అనువైన భూభాగం. ఇక్కడ ఎంతోమంది రైతులు పలు రకాల పంటలు పండించి దేశంలోని పలు ప్రాంతాల అవసరాలు తీరుస్తున్నారు. ఇప్పుడు అక్కడ యాంటీ మిసైల్ యూనిట్ ఏర్పాటుచేస్తే అదంతా దెబ్బతినే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. నో థాడ్.. నో థాడ్ అంటూ వారంతా నిరసన నినాదాలు చేశారు. ఒక్క సియాంజులేకాకుండా దేశంలో ఎక్కడా అలాంటి విభాగాన్ని ప్రారంభించడానికి వీల్లేదంటూ వారు మండిపడ్డారు.