మృత్యుంజయుడు ఈ బుడతడు..! | Mumbai Boy Remains Unhurt After Car Ran Over Him | Sakshi
Sakshi News home page

Published Wed, Sep 26 2018 4:35 PM | Last Updated on Wed, Sep 26 2018 7:50 PM

Mumbai Boy Remains Unhurt After Car Ran Over Him - Sakshi

ముంబై : భూమ్మీద నూకలు ఉంటే చావు అంచులదాకా వెళ్లినా సరే బతికి బయటపడొచ్చు అంటారు. ముంబైకి చెందిన ఓ పిల్లాడి విషయంలోనూ ఇదే జరిగింది. మీద నుంచి కారు దూసుకెళ్లినా సరే ప్రాణాలతో బయటపడ్డాడు ఆ బుడతడు. అసలేం జరిగిందంటే.. ముంబైలోని ఘట్‌కోపర్‌కు చెందిన ఓ బాలుడు అపార్టుమెంటులోని పార్కింగ్‌ ఏరియాలో స్నేహితులతో కలిసి ఫుట్‌బాల్‌ ఆడుతున్నాడు. ఈ క్రమంలో షూలేస్‌ కట్టుకునేందుకు అతడు కింద కూర్చుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో ఓ మహిళ తన కారు(మారుతి వాగనార్‌)ను స్టార్ట్‌ చేసింది. అయితే అక్కడ పిల్లాడు ఉన్నాడన్న సంగతి గమనించిందో లేదో గానీ అకస్మాత్తుగా అతడి మీదకి కారు ఎక్కించింది. కాగా ఈ ఘటనలో ఆ పిల్లాడికి చిన్న గాయం కూడా కాకపోవడం విశేషం. తన మీద నుంచి కారు వెళ్లిపోగానే లేచి యథావిథిగా ఆటను కొనసాగించేందుకు సిద్ధమయ్యాడు. ఇదంతా అక్కడ ఉన్న సీసీటీవీలో రికార్డు అయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement