Rishabh Pant Accident: Dozed Off While Driving Car Crash Video Goes Viral - Sakshi
Sakshi News home page

Rishabh Pant Accident: వేగంగా దూసుకొచ్చిన కారు.. సీసీటీవీ ఫుటేజీ వైరల్‌! ప్రమాదానికి కారణం అదేనా?

Published Fri, Dec 30 2022 1:33 PM | Last Updated on Sat, Dec 31 2022 11:57 AM

Rishabh Pant Accident: Dozed Off While Driving Car Crash Video Viral - Sakshi

Rishabh Pant Accident- CCTV Footage: భారత స్టార్‌ క్రికెటర్‌ రిషభ్‌ పంత్‌ తృటిలో ప్రాణాపాయం తప్పించుకున్నాడు. రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన అతడు.. అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడు. కాగా పంత్‌ కారు ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియో ఇదేనంటూ సోషల్‌ మీడియాలో ఓ సీసీటీవీ ఫుటేజీ వైరల్‌ అవుతోంది. దీని ప్రకారం.. వేగంగా దూసుకొచ్చిన కారు.. డివైడర్‌ను ఢీకొట్టింది. 

ఇక ఆ తర్వాత కారుకు మంటలు అంటుకోగా.. అగ్నికి ఆహుతైపోయింది. పంత్‌ స్వయంగా డ్రైవ్‌ చేసుకుంటూ ఢిల్లీ నుంచి స్వస్థలం ఉత్తరాఖండ్‌కు వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.

ఒక్కడే కారులో.. కారణం అదేనా?!
కాగా ప్రమాద సమయంలో పంత్‌ ఒక్కడే కారులో ఉన్నాడు. ఉదయం సుమారు ఐదున్నర గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. నిద్రమత్తులో ఉన్న కారణంగా తన కారు డివైడర్‌ను ఢీకొన్నట్లు పంత్‌ చెప్పాడని ఉత్తరాఖండ్‌ డీజీపీ అశోక్‌ కుమార్‌ వెల్లడించారు. 

కారులో మంటలు చెలరేగగానే తాను విండో పగలగొట్టుకుని బయటకు దూకినట్లు పంత్‌ తెలిపాడన్నారు. కాగా 25 ఏళ్ల ఈ యువ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని అతడికి చికిత్స అందిస్తున్న వైద్యులు తెలిపారు.

ఇదిలా ఉంటే.. కారు ప్రమాదం బారిన నేపథ్యంలో రిషభ్‌ పంత్‌ పేరు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. ఓ వైపు అతడు కోలుకోవాలంటూ అభిమానులు ప్రార్థనలు చేస్తుండగా.. మరోవైపు ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు వైరల్‌గా మారాయి. అతివేగం కారణంగానే పంత్‌ ప్రమాదం బారినపట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు.

చదవండి: Rishabh Pant: ఉదయమే పంత్‌ గురించి ఆలోచించా.. ఇంతలో ఇలా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement