ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(AAP)పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతీ మలివాల్‌పై రాష్ట్ర మంత్రి అతిశీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమెపై అవినీతి కేసు ఆరోపణలు ఉన్నాయని వాటి నుంచి తప్పించుకోవడానికి స్వాతీ మలివాల్ బీజేపీతో కుమ్మక్కై దాడి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
సీఎం అరవింద్ కేజ్రీవాల్ పీఏ బిభవ్‌కుమార్ తనపై దాడి చేశాడని స్వాతి మలివాల్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కేసు కూడా నమోదైంది. అయితే తాజాగా ఆమెపై దాడి జరిగినట్లు చెబుతున్న సోమవారం రోజు.. సీఎం ఇంట్లో రికార్డు అయిన సీసీటీవీ ఫుటేజ్ వీడియోను శనివారం ఆప్ బయటపెట్టగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Footage of Swati Maliwal being escorted out of Kejriwal's residence by lady security officer.
She seems fine and cooperative. pic.twitter.com/xwnfJtBCDS— Nehr_who? (@Nher_who) May 18, 2024
ఈ వీడియోలో స్వాతీ మలివాల్ లేడీ పోలీసు భద్రత, పర్యవేక్షణలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లోకి వెళ్లి.. బయటకు రావటం స్పష్టంగా కనిపిస్తోంది. ఇంట్లో వెళ్లినప్పుడు.. మళ్లీ తిరిగి వచ్చినప్పుడు కూడా లేడీ పోలీసు వెంటనే ఉంటూ చేయ్యి పట్టుకొని ఉన్నారు. ఆమె తనను పట్టుకొవద్దంటూ వారిని విడిపించుకోవడానికి వారిస్తున్నారు. ఈ వ్యవహారంపై మంత్రి అతిశీ శనివారం మీడియాతో మాట్లాడారు.
‘స్వాతీ మలివాల్‌పై అవినీతి కేసు ఆరోపణలు ఉన్నాయి. వాటి నుంచి తప్పించుకోవడానినే ఆమె బీజేపీతో కుమ్మక్కై దాడి ఆరోపణుల చేశారు. సీసీటీవీ ఫుటేజీ ప్రకారం.. స్వాతీ మలివాల్ ఎఫ్‌ఐఆర్‌లో చేర్చిన ఆరోపణలు అన్నీ అసత్యాలే. ఇంకా.. పోలీసులనే ఆమె బెదిరించటం వీడియోలో కనిపిస్తోంది. బిభవ్ కుమార్‌ను సైతం ఆమె తీవ్రంగా దూషించారు. సీఎం కేజ్రీవాల్ నివాసం నుంచి ఆమె ఎటువంటి గాయాలు లేకుండా బయటకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది’ అని అతిశీ స్వాతీ మలివాల్‌పై మండిపడ్డారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పీఏ బిభవ్‌కుమార్ తనపై దాడి చేశారని ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ చేసిన ఆరోపణలు సంచలన సృష్టించాయి. తపై బిభవ్ కుమార్ దారుణంగా దాడి చేశాడని, గాయాలు కూడా అయినట్లు స్వాతీ మలివాల్ ఆరోణలు చేశారు. ఆమె చేసిన ఆరోపణలపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ మౌనంగా ఉండటంపై బీజేపీ తీవ్రంగా మండిపడుతోంది. ఆమెపై దాడి వెనక సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఉన్నాని బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment