టోల్ ఫీజు కట్టమంటూ తన వాహనాన్ని ఆపేయడంతో ఆగ్రహానికి గురైన ఓ ఎమ్మెల్యే బారికేడ్‌ను విరగ్గొట్టి వీరంగం సృష్టించారు. కేరళకు చెందిన స్వతంత్ర ఎమ్మెల్యే పీసీ జార్జ్ తన ఆడీ కారులో రైల్వే స్టేషనుకు బయల్దేరారు. జార్జ్ కారుపై ఉన్న ఎమ్మెల్యే స్టిక్కర్‌ను గమనించని టోల్ ప్లాజా సిబ్బంది ఆయన కారును చాలా సేపు ఆపేశారు. దీంతో ఆగ్రహానికి గురైన జార్జ్ కారులో నుంచి దిగి ఆటోమేటిక్ బారికేడ్‌ను ధ్వంసం చేశారు. ఇందుకు ఆయన డ్రైవర్ కూడా సాయం చేశాడు. తర్వాత టోల్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఈ తతంగమంతా టోల్ ప్లాజా వద్ద ఉన్న సీసీటీవీలో రికార్డు కావడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ విషయమై టోల్ ప్లాజా సిబ్బంది నుంచి ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.