
సీసీటీవీ ఫుటేజీ దృశ్యాలు
తంజావూరు : జిల్లాలోని కోయంబేడు వద్ద గత బుధవారం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదం విషయంలో సీసీటీవీ ఫుటేజీ దృశ్యాలు కీలకంగా మారాయి. ఆ సంఘటన రోడ్డు ప్రమాదం కాదని, ఆత్మహత్యని తేలింది. కేసు వివరాల్లోకి వెళితే.. గత బుధవారం కోయంబేడు ప్రాంతంలో ఉదయం ఐదు గంటల ప్రాంతంలో ఓ 40 ఏళ్ల వ్యక్తి లారీ కిందపడి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులకు షాక్ అయ్యే విషయం తెలిసింది. సంఘటనా స్థలం వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి చూడగా జరిగింది ప్రమాదం కాదని, మృతుడు ఉద్ధేశ్యపూర్వకంగానే లారీ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని తేలింది. ( ఖమ్మం జిల్లాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఘాతుకం )
వీడియోలో.. రోడ్డు మీద ఉన్న ఆటో పక్కన ఓ వ్యక్తి నిల్చుని ఉన్నాడు. రోడ్డు దాటడానికి అన్నట్లు వచ్చిపోయే వాహనాలను చూస్తూ ఉన్నాడు. సెకన్లు, నిమిషాలు గడుస్తున్నాయి. అతడు కొంతముందుకు వెళ్లటం, వెనక్కురావటం చేస్తున్నాడు. కొద్దిసేపటి తర్వాత ముందుకు వెళ్లి అమాంతం లారీ టైర్ల కిందకు దూకాడు. టైర్లు అతడిపై నుంచి ముందుకు కదిలాయి. ఆ వ్యక్తి ప్రాణాలు వదిలాడు.
Comments
Please login to add a commentAdd a comment