
కరీంనగర్ : పెట్రోల్ ధరలు రోజురోజుకూ అమాంతం పెరిగిపోతుండటంతో పెట్రోల్ చోరీలకు పాల్పడుతున్నారు. వివరాల ప్రకారం..కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్ లో ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ నుంచి ఓ వ్యక్తి పెట్రోల్ దొంగతనం చేస్తూ సీసీ కెమెరాకు చిక్కాడు. అర్ధరాత్రి గుట్టుచప్పుడు కాకుండా వచ్చిన వ్యక్తి బైక్ లో పెట్రోల్ ఉందో లేదో ఊపి చూసి, మరి చోరీకి పాల్పడ్డాడు. తర్వాత కొద్ది సేపటికి మరో వ్యక్తి క్యాన్ పట్టుకొచ్చి..అదే బైక్ లోని పెట్రోల్‌ను చోరీ చేసి తీసుకెళ్లాడు. అయితే ఒకే బైక్ వద్దకు ఇద్దరు వేర్వేరుగా వచ్చి పెట్రోల్ దొంగతనానికి పాల్పడటం గమనార్హం.
గత కొన్ని రోజులుగా రాత్రి పూట ఇంటిముందు పార్క్ చేసిన వాహనాల నుంచి పెట్రోల్ మాయమతుందని పలువురు పోలీసులు ఫిర్యాదు చేస్తున్నారు. గత రెండు రోజుల్లోనే ఆ ప్రాంతంలో పది వాహనాల్లో పెట్రోల్ చోరీకి గురైనట్లు స్థానికులు తెలిపారు. దీంతో ప్రస్తుతం ఆ పెట్రోల్ దొంగలను పట్టుకునే పనిలో ఉన్నారు పోలీసులు.
చదవండి : హైదరాబాద్: కారులో కిలోల కొద్ది బంగారం
వైరల్ : ఆ దొంగోడి ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది..
Comments
Please login to add a commentAdd a comment