మంచిర్యాల: జిల్లా కేంద్రంలోని హైటెక్ సిటీ సమీపంలోని హెచ్‌పీ పెట్రోల్ బంక్‌లో పెట్రోల్‌కు బదులు నీళ్లు రావడంతో ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళ్తే... వాహనదారులు శనివారం హెచ్‌పీ పెట్రోల్ బంక్‌లో తమ వాహనాల్లో పెట్రోల్ పోసుకొని కొంత దూరం వెళ్లగానే వాహనాలు ఆగిపోయాయి.
దీంతో మెకానిక్‌లను సంప్రదించగా ఇంజన్‌లోకి పెట్రోల్‌కు బదులుగా నీళ్లు చేరాయని తెలిపారు. వాహనంలోని పెట్రోల్‌ను తీసి పరిశీలించగా నీరు ఉండడంతో కల్తీ జరిగినట్లు గుర్తించారు. పెట్రోల్‌ను బాటిల్లో తీసుకుని వాహనదారులు వందల సంఖ్యలో బంక్‌కు చేరుకుని ఆందోళనకు దిగారు. దీంతో బ్లూ కోర్ట్ సిబ్బంది జోక్యం చేసుకుని వివాదాన్ని సద్దుమనిగించారు.
పెట్రోల్ బంక్ సిబ్బంది మా తప్పిదం ఏమి లేదని ట్యాంకర్ వచ్చి బంక్‌ల్లో పెట్రోల్ పోసి వెళ్లిపోయిందని తెలుపడం గమనార్హం. మరి పెట్రోల్ కల్తీ ఎక్కడ జరిగిందనేది ప్రశ్నార్థకంగా మిగిలింది. జరిగిన పొరపాటుకు వాహనదారుల బండి నంబర్లు ఫోన్ నంబర్ రాసుకుని మళ్లీ ఎంత పెట్రోల్ పోయించుకున్నారో అంత పోసేందుకు ఒప్పందం చేసుకోవడంతో ఆందోళన సద్దుమనిగింది.
Comments
Please login to add a commentAdd a comment