
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: తెలంగాణలో మార్పు కావాలని, ఆ మార్పు కోసం ప్రజలు కాంగ్రెస్ పార్టీ కి ఓటేయాలని ఏఐసీసీ అగ్రనేత సోనియాగాంధీ కోరారు. ఈ మేరకు తెలంగాణ ప్రజలనుద్దేశించి మంగళవారం ఓ వీడియో సందేశం పంపారు. ‘ప్రియమైన సోదర సోదరీమణులకు నమస్కారం. నేను మీ దగ్గరకు రాలేకపోతున్నా. కానీ మీరు నా హృదయానికి చాలా దగ్గరగా ఉంటారు. మీకు ఓ విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను.
తెలంగాణ అమరవీరుల కలలు నెరవేరడం చూడాలనుకుంటున్నా. మనందరం కలసి దొరల తెలంగాణను ప్రజల తెలంగాణగా మార్చాలి. మీ కలలు సాకా రం కావాలి. ఒక మంచి ప్రభుత్వం రావాలి. సోని యమ్మ అని పిలిచి మీరు నాకు చాలా గౌరవప్రదమైన అమ్మ స్థానం ఇచ్చారు. మీ ప్రేమాభిమానాలకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. తెలంగాణ సోదరులు, అమ్మలు, బిడ్డలందరికీ నా విన్నపం. మార్పు కోసం కాంగ్రెస్ పార్టీ కి ఓటేయండి. మార్పు కావాలి. కాంగ్రెస్ రావాలి. జై తెలంగాణ. జైహింద్.’ అని ఆమె తన వీడియో సందేశంలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment