
న్యూఢిల్లీ : బాలీవుడ్ దిగ్గజ నటుడు శశికపూర్ సోమవారం మృతి చెందారు. అనారోగ్య కారణాలతో ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో ఆయన తుదిశ్యాస విడిచిన విషయం తెలిసిందే. అయితే టైమ్స్ నౌ చానెల్ అత్యుత్సాహం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశిథరూర్‌ను ఇబ్బందులకు గురిచేసింది. శశికపూర్‌కు బదులు శశిథరూర్ మృతి చెందినట్లు సదరు టీవీ చానెల్ ట్విట్టర్ అకౌంట్‌లో పేర్కొంది. దీంతో శశిథరూర్ అభిమానులు ఆయన ఆఫీసుకు కాల్ చేశారు. దీంతో అసలు విషయం తెలుసుకున్న ఆయన ట్విట్టర్ లో స్పందించారు.
‘శశికపూర్ చనిపోవడం బాధాకరమైన విషయం. కొంత మంది నేను మరణించినట్లు భావించారు. నా కార్యాలయానికి సోమవారం ఉదయం నుంచి ఫోన్సు వచ్చాయి. కొంత మంది జర్నలిస్టులు కూడా ఫోన్ కాల్స్ చేసి తన ఆరోగ్య విషయం గురించి తెలుసుకున్నారు. నాకేం కాలేదు. శశికపూర్ కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా సానుభూతి తెలియజేస్తున్నాను’ అని ట్వీట్ చేశారు.
ఇక తప్పును గుర్తించిన టైమ్స్‌నౌ చానెల్ శశిథరూర్‌ను క్షమాణలు కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు.
I feel a part of me is gone. A great actor, smart, cosmopolitan, impossibly handsome & w/a name that was often confused w/mine. (My office got two calls from journalists today about my reportedly serious ill-health!) I will miss #ShashiKapoor. Condolences2his family&all his fans pic.twitter.com/fSz3jafPZJ
— Shashi Tharoor (@ShashiTharoor) 4 December 2017
Thanks. No problem. Mistakes happen. Glad to be able to crack a smile at a tragic moment. https://t.co/3VxIpZ5yED
— Shashi Tharoor (@ShashiTharoor) 4 December 2017
Comments
Please login to add a commentAdd a comment