Virat Kohli Unwanted Record With 15th Time Duck Outs In ODIs Suprass Sehwag-Raina - Sakshi
Sakshi News home page

Virat Kohli: సెంచరీ చేస్తాడనుకుంటే డకౌట్ల రికార్డుతో మెరిశాడు

Published Fri, Feb 11 2022 3:47 PM | Last Updated on Fri, Feb 11 2022 5:11 PM

Virat Kohli Unwanted Record 15th Time Duck ODIs Suprass Sehwag-Raina - Sakshi

టీమిండియా సీనియర్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి మరోసారి నిరాశపరిచాడు. వెస్టిండీస్‌తో మూడో వన్డేలో కోహ్లి రెండు బంతులు మాత్రమే ఆడి డకౌట్‌గా వెనుదిరిగాడు. కోహ్లి ఆఫ్‌స్టంప్‌ బలహీనతను అల్జారీ జోసెఫ్‌ చక్కగా వినియోగించుకున్నాడు. జోసెప్‌ వేసిన బంతిని కోహ్లి లెగ్‌సైడ్‌ దిశగా ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బంతి బ్యాట్‌ ఎడ్జ్‌ను తగిలి కీపర్‌ షెయ్‌ హోప్‌ చేతుల్లో పడింది. ఈ సిరీస్‌లో మూడు వన్డేలు కలిపి కోహ్లి చేసిన స్కోర్లు 8,18,0.. మొత్తంగా 26 పరుగులు. మూడో వన్డేలోనైనా సెంచరీ కొడతాడని భావించిన ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశపరిచిన కోహ్లి.. ఒక చెత్త రికార్డును నమోదు చేశాడు.

చదవండి:  ఏంటిది కోహ్లి.. 8, 18, 0... మరీ ఇంత చెత్తగా.. 

విషయంలోకి వెళితే.. కోహ్లి వన్డేల్లో డకౌట్‌ కావడం ఇది 15వ సారి. ఈ నేపథ్యంలో డకౌట్ల​ విషయంలో టీమిండియా తరపున వన్డేల్లో అత్యధికసార్లు డకౌట్‌ అయిన బ్యాట్స్‌మన్‌గా కోహ్లి నాలుగో స్థానంలో ఉ‍న్నాడు. కోహ్లి కంటే ముందు సచిన్‌ టెండూల్కర్‌(20 డకౌట్‌లు), యువరాజ్‌ సింగ్‌(18 డకౌట్‌లు), సౌరవ్‌ గంగూలీ(16 డకౌట్‌లు) తొలి మూడుస్థానాల్లో నిలిచారు. అంతేకాదు వన్డేల్లో డకౌట్ల విషయంలో సురేశ్‌ రైనాను అధిగమించిన కోహ్లి.. ఓవరాల్‌గా అన్ని ఫార్మాట్లు కలిపి చూసుకుంటే భారత మాజీ డాషింగ్‌ బ్యాట్స్‌మన్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ను అధిగమించాడు. కోహ్లి ఇప్పటివరకు అన్ని ఫార్మాట్లు కలిపి 32 సార్లు డకౌట్‌ అయి రెండో స్థానానికి చేరుకున్నాడు. ఇక సెహ్వాగ్‌ ఓవరాల్‌గా 31 డకౌట్లతో మూడో స్థానంలో ఉండగా.. తొలి స్థానంలో సచిన్‌ టెండూల్కర్‌(34 డకౌట్లు) ఉ‍న్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement