
ఎడిన్‌బర్గ్: సాధారణంగా పిల్లులతో ఆడుకుంటూ ఉంటాము. అవి నోటితో చేసే శబ్ధంతో వాటిని అనుకరిస్తూ ఆనందిస్తాం. అయితే పిల్లులు మ్యావ్.. మ్యావ్.. అనే శబ్ధాలు కాకుండా మరోలా అరవడం ఎప్పుడైనా విన్నారా.. కానీ ఆ విచిత్రం స్కాట్లాండ్ దేశంలోని ఎడిన్‌బర్గ్ నగరంలో చోటుచేసుకుంది. అక్కడ ఉండే ఓ ఎనిమల్ సెంటర్‌లోని ‘మెల్విన్’ అనే పిల్లి బాతు మాదిరిగా బక్.. బక్.. అనే శబ్ధం చేస్తూ అందర్నిఅశ్చర్యపరుస్తోంది. ఆ పిల్లి వెరైటీ కూతలను వీడియోలో బంధించిన సారా తోర్ణ్‌టన్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న ఈ వీడియో నెటిజన్లను ఆకర్షిస్తోంది. ఈ విచిత్రపు పిల్లి అరుపులకు స్పందనగా..‘ పిల్లి చేసే శబ్ధం.. బాతు, పిల్లి కలిసిన ఓ కొత్త జంతువు చేసే శబ్ధంలా ఉంది. ఏంటో ఈ విచిత్రం’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. కాగా మరో నెటిజన్ ఏకంగా ఓ అడుగు ముందుకువేసి ఆ పిల్లిని దత్తత తీసుకొన్నాడు. అది వారి మనసు దోచుకుందని.. దానికి ఓ కొత్త కుటుంబం దొరికిందని పిల్లి పట్ల ప్రేమను చాటుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment