బారు ముక్కు.. బాతు కాళ్లు
పోలీసుస్టేషన్లలో పందెపు కోడిపుంజులు దర్శనమివ్వడం మామూలే. అయితే తూర్పు గోదావరి జిల్లా రాయవరం ఠాణాకు శనివారం రాత్రి వెళ్లిన వారు ఒక్కక్షణం ‘తాము వచ్చింది పోలీసుస్టేషన్‌కేనా..’ అని సందేహించాల్సి వచ్చింది. కారణం.. అక్కడున్న వింతపక్షే. సుమారు 8 అంగుళాల పొడవైన ముక్కు, బాతుకు ఉండే మాదిరి కాళ్లు ఉన్న ఆ పక్షి.. దీనిని పట్టుకున్న వ్యక్తి అమ్మకానికి పెట్టగా రూ.4 వందలకు కొన్న సూర్యనారాయణరెడ్డి అనే వ్యకి తొలుత కూర వండించుకు తినాలనే అనుకున్నాడు. అంతలోనే వన్యప్రాణి సంరక్షణ చట్టం గుర్తుకు రావడంతో దాన్ని పోలీసుస్టేషన్‌కు తెచ్చి.. అటవీ శాఖాధికారులకు అప్పగించాలని కోరాడు. కాగా, ఇది నీటి పక్షి అయి వుంటుందని జిల్లా అటవీశాఖ అధికారి తెలిపారు.
- న్యూస్‌లైన్, రాయవరం