Cocks
-
Cockfight: ‘మకాం’ వేసిన పందెం కోళ్లు
తగరపువలస(భీమిలి): సంక్రాంతి బరిలో కయ్యానికి పందెం కోళ్లు సిద్ధంగా ఉన్నాయి. ఏడాది పాటు వీటికి శిక్షణ ఇచ్చి, ఆహారాన్ని పెట్టుబడిగా పెట్టిన వ్యాపారులు, రైతులు ప్రస్తుతం వీటి విక్రయాలపై దృష్టి సారించారు. పందెం కోళ్లను సిద్ధం చేసే ప్రాంతాలను మకాం అంటారు. ప్రస్తుతం ఇలాంటి మకాంలు ఉత్తరాంధ్రలో 250కు పైగా ఉన్నాయి. మకాంలలో లక్షలాది పందెం కోళ్లు పోరాటంలో శిక్షణ పొంది కాలు దువ్వుతున్నాయి. వీటిలో పైచేయి సాధించే కోళ్ల కోసం తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన పందెం రాయుళ్లు ఉత్తరాంధ్రకు వచ్చి మకాంలలో సరైన కోడి కోసం డేగ కళ్లతో వేట మొదలెట్టారు. చదవండి: Good Governance Index 2021: సర్వతోముఖాభివృద్ధి దిశగా ఏపీ ఇలాంటి మకాంలు ఎక్కువగా భీమిలి, పద్మనాభం, ఆనందపురం మండలాలు, తిమ్మాపురం, సాగర్‌నగర్, ఆరిలోవ, నర్సీపట్నంతో పాటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఉన్నాయి. పందెం కోళ్లలో సేతువ, కక్కెర, సవల, పాస, రసంగి, డేగ, పచ్చకాకి, అబాస్లకు గిరాకీ ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఏడాది వయసున్న కోళ్లు రూ.15 వేల నుంచి 20 వేలు, ఏడాదిన్నరవి రూ.30 వేలు, నాలుగేళ్ల వయసు వరకూ ఉన్నవి రూ.40 వేల వరకూ ధర పలుకుతున్నాయి. ఒక్క ఉత్తరాంధ్రలోనే రూ.80 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకూ వ్యాపారం జరుగుతుందంటే పందెం కోళ్లకున్న డిమాండ్‌ను అర్థం చేసుకోవచ్చు. ఒక్కో మకాంలో 50 నుంచి వందలాది కోళ్లుంటాయి. వీటికి ప్రత్యేకంగా రోజుకు నాలుగు బాదం పప్పులు, కోడిగుడ్లు, వారానికోసారి ఖైమా, చోళ్లు, గంట్లుతో పాటు రోజూ రెండు పూటలా తడిపిన ధాన్యాన్ని ఆహారంగా ఇస్తారు. మధ్యాహ్నం వేళల్లో అలసిపోయే వరకూ ఈతకు వదులుతారు. ఏడాది కాలంలో ఒక్కో కోడిపై రూ.10 వేలకు పైగా ఖర్చు చేస్తారు. వీటిని చంటిపిల్లల్లా చూసుకుంటారు. రోగాలు రాకుండా యాంటీబయోటిక్ టాబ్లెట్లు, ఇంజెక్షన్లు ఇస్తుంటారు. విదేశీ బ్రీడ్లకు భలే డిమాండ్ విశాఖకు చెందిన ఒక మకాం యజమాని రూ.18 లక్షలు వెచ్చించి విదేశాల నుంచి మైలా బ్రీడ్ పుంజును కొనుగోలు చేశారు. దానితో దేశవాళీ కోడిపెట్టలను సంకరం చేయించి.. వెయ్యి పిల్లలను పొదిగించి ఒక్కో కోడిని రూ.5 వేలకు విక్రయించడం ద్వారా ఏడాదిన్నరలో రూ.50 లక్షల ఆదాయం పొందినట్టు చెప్పాడు. ఈ కోళ్లు బరిలోకి దిగితే రూ.లక్షలాది రూపాయలు కొట్టుకొస్తాయని పందెం రాయుళ్లకు గట్టి నమ్మకం. అలాగే ఫిలిప్పీన్స్, పెరూ దేశానికి చెందిన మేలు జాతి కోడి పెట్టలు ఒక్కోటి రూ.6–7 లక్షలు పలుకుతున్నాయి. వీటిని కూడా సంకరం చేయించడం ద్వారా మంచి ఆదాయాన్నిచ్చే పందెం పుంజులను సృష్టిస్తున్నారు. ప్రత్యేక శిక్షణ పొంది పందేలకు సిద్ధంగా ఉన్న కోడిపుంజులు ప్రభుత్వ అనుమతులే కీలకం గతేడాది ప్రభుత్వం అనుమతులు లేని కారణంగా ఉత్తరాంధ్రలో పందెం కోళ్ల వ్యాపారం జరగలేదు. ఒక్క పందెం కోడి పుంజు కూడా విక్రయం కాలేదు. ఈ ఏడాది ప్రభుత్వం అనుమతిపైనే వ్యాపారం ఆధారపడి ఉంటుంది. చాలామంది వచ్చి వారికి నచ్చిన బ్రీడ్లను ఎంపిక చేసుకుంటున్నారు. హైదరాబాద్, ఏలూరు, భీమవరం, నర్సీపట్నం, మహబూబ్‌నగర్ తదితర ప్రాంతాల వారితో కొనుగోళ్లు, అమ్మకాలు చేస్తుంటాం. – ఎన్.వరాహరఘునాథరెడ్డి, తగరపువలస కోళ్లకు రోగం వస్తే.. ఇక అంతే... పందెం కోళ్ల పెంపకం రిస్క్‌తో కూడుకున్నది. పెట్టుబడికి రెట్టింపు ఆదాయం వస్తున్నప్పటికీ వాటికి సోకే రోగాలపై అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. ఒక్కోసారి రూ.లక్షలు పోసి కొనుగోలు చేసినా ఎలాంటి ఆదాయం రాకుండానే మృత్యువాత పడుతుంటాయి. నాటు కోళ్లతో పోలిస్తే పందెం కోళ్లకు తెగుళ్లు తక్కువ. ప్రస్తుతం రైతులంతా నాటుకోళ్ల పెంపకంపైనే ఆసక్తి చూపుతున్నారు. రిస్క్ కూడా ఎక్కువే. – నమ్మి ఎర్రినాయుడు, ఆనందపురం -
కోడి గుడ్డు రూ.వెయ్యి.. కోడి పిల్లల జత 10 వేలు
పందేనికి ఓ పుంజు కావాలి.. అయితే చలో కంభం! కంభంలో కోళ్లు అంత బాగుంటాయా? ఒకసారి చూస్తే కదా తెలిసేది!! అవును కంభంలో కోళ్లు ఫేమస్సే!! కోళ్లే కాదు.. పావురాలు, జాతి శునకాలు కూడా. ఇక్కడ లభించే కోడి గుడ్లు, కోడి పిల్లల కోసం ఇతర రాష్ట్రాల నుంచే కాదు విదేశాల నుంచి క్యూ కడుతున్నారు మరి. ఇంతకీ కంభంలో కోళ్లు పెంచుతోంది ఎవరు? గుడ్డు రేటెంత? పిల్లలైతే ఎంత ధర? ఆ వివరాలు తెలుసుకుందాం కథనంలోకి పదండి.. ప్రకాశం, కంభం: కంభం పట్టణానికి చెందిన చిలకచర్ల కృష్ణామాచారి ఐటీఐ చదివి ఇంటి వద్ద ఖాళీగా ఉండేవాడు. 1989లో ఇంట్లో సరదాగా రెండు కోళ్లను పెంచుకునేవాడు. అది కాస్తా అతనికి వ్యాపకంగా మారి.. చిరు వ్యాపారంగా రూపాంతరం చెందింది. అదే వృత్తిగా మలుచుకున్న కృష్ణమాచారి 1994లో తన ఇంటి వద్ద షెడ్లు వేసి కోళ్లను పెంచడం ప్రారంభించారు. అప్పటి నుంచి ఎన్నో రకాల కోళ్లను పెంచడమే కాకుండా, పలు రాష్ట్రాల్లో నిర్వహించే కోళ్ల అందాల పోటీల్లో పాల్గొంటూ బహుమతులు, పతకాలు సాధించి కంభం పేరును దేశ వ్యాప్తంగా తెలిసేలా చేశారు. కోళ్ల కోసం ప్రత్యేక దాణా.. పెట్టలకు సజ్జలు, మొక్కజొన్న, రాగులు, సోయా చిక్కుడు, శనగలు, పొద్దుతిరుగుడు, తవుడు, నూక మిశ్రమాలను ఆహారంగా అందిస్తారు. పుంజులకు ఉదయం బాదం పప్పు, ద్రాక్ష, ఖర్జూరాలు, శనగపప్పు, సాయంత్ర 5–6 గంటల సమయంలో సజ్జలు, రాగులు 4 గంటలు నానబెట్టి పెడతారు. వెటర్నరీ వైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తూ కోళ్లను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. కోళ్లకు ఆహారం తినిపిస్తూ.. గుడ్డు రూ.1,000 ఒక పెట్ట ఏడాదికి నాలుగుసార్లు గుడ్లు పెడుతుంది. ఆ గుడ్లను ఆ కోడి ద్వారానే పొదిగించి పిల్లలను విక్రయిస్తారు. పుంజులు 4 నుంచి 6.5 కిలోల బరువు, పెట్టలు 3 నుంచి 5 కేజీల బరువు పెరుగుతాయి. గుడ్డు ఒకటి రూ.1,000 కాగా, 40 రోజుల పిల్లల జత రూ.10 వేలు పలుకుతోంది. దుబాయ్, శ్రీలంకతోపాటు, మన దేశంలో ఒడిశా, తమిళనాడు నుంచి కొనుగోలుదారులు కంభం వచ్చి కోళ్లను కొనుగోలు చేస్తుంటారని కృష్ణమాచారి తెలిపారు. ఏటా పెరుగుతున్న ఆదాయం తొలుత నెలకు రూ.2 వేల నుంచి రూ.3 వేలు ఆదాయం వచ్చేది. 2000 సంవత్సరంలో రూ.7 వేల వరకు వచ్చాయి. ఆ తర్వాత అందాల పోటీల్లో పాల్గొనడం మొదలుపెట్టినప్పటి నుంచి కోళ్లు, గుడ్ల విక్రయం, అందాల పోటీల్లో నగదు బహుమతులు అన్నీ కలిపి 2015 నుంచి ఏడాదికి రూ.3 లక్షలు ఆదాయం వచ్చింది. 2017 నుంచి ఏడాదికి రూ.5 లక్షలకు పైగా ఆదాయం పొందుతున్నారు. అరుదైన ఆశీల్.. భారతదేశంలోనే అరుదైన ఆశీల్ జాతి కోళ్లను కృష్ణమాచారి పెంచుతున్నారు. అందమైన చిలుకలాంటి ముక్కు, నెమలి లాంటి తోకలు, గద్దను తలపించే దేహాదారుఢ్యం.. చూడ చక్కని ఆకృతి అస్లీ జాతి కోళ్ల ప్రత్యేకత. ప్రస్తుతం చారి వద్ద 20 పెట్టలు, 3 పుంజులు ఉన్నాయి. ఇవి నూరు శాతం నాణ్యమైనవి. వీటి జీవిత కాలం గతంలో తొమ్మిదేళ్లు కాగా ప్రస్తుతం 6 నుంచి 7 సంవత్సరాలు బతుకుతున్నాయి. వీటికి ఎటువంటి జబ్బులు సోకవు. భారతదేశంలోనే అత్యంత అరుదుగా దొరికే ఆశీల్ జాతి కోళ్లను అందాల పోటీల కోసం, ఇంట్లో సరదాగా పెంచుకోవడం కోసం కొనుగోలు చేస్తారు. పావురాలు, కుక్కలు కూడా.. కృష్ణమాచారి కోళ్లతోపాటు అమెరికన్ విత్ ఇంగ్లిష్ క్యారియర్, జర్మన్ బాటిన్, రోమన్, బడంగ్ రేసర్ వంటి అరుదైన జాతి పావురాలను పెంచుతున్నారు. వీటిని కొనుగోలు చేసేందుకు కర్నూలు, కడప, హైదరాబాద్, ఒంగోలు నుంచి వస్తుంటారు. వీటితోపాటు రెండు డాబర్‌మెన్ కుక్కలు కూడా చారి వద్ద ఉన్నాయి. ‘అరుదైన జాతులను అభివృద్ధి చేసి రాష్ట్ర, దేశ స్థాయిలో కంభం పట్టణానికి గుర్తింపు తీసుకురావలన్నదే నా ఆశయం. ప్రస్తుతానికి కోళ్ల కోసం దుబాయ్, శ్రీలంకతోపాటు ఇతర దేశాల వారు కూడా సంప్రదిస్తున్నార’ని కృష్ణమాచారి చెబుతున్నారు. అందాల పోటీల్లో కోళ్లు సాధించిన బహుమతులు, దిండిగల్‌లో జరిగిన అందాల పోటీల్లో8 గ్రాముల బంగారు చైన్ గెలుపొందిన పుంజు అందాల పోటీల్లో బహుమతుల పంట కృష్ణమాచారి తన కోళ్లను తీసుకుని పోటీలకు వెళ్లాడంటే బహుమతి సాధించే తిరిగొస్తారు.! 2015లో దిండిగల్‌లో నిర్వహించిన అందాల పోటీల్లో ఒక సారి ప్రథమ, మరోసారి తృతీయ బహుమతి సాధించారు. ఈ ఏడాది ఆలిండాయా ఆశీల్ క్లబ్, ఇండియా ఆశీల్ క్లబ్, ఓఏటీ క్లబ్‌ల ఆధ్వర్యంలో జనవరి 5, మార్చి 3, జూన్ 10వ తేదీన పోటీలు నిర్వహించగా మూడింటిలో బంగారు పతకాలు పొంది హ్యాట్రిక్ సాధించారు. వీటితోపాటు మండల, జిల్లా స్థాయి పోటీల్లో బహుమతులు అందుకున్నారు. -
పశ్చిమ బరిలో రూ. 200 కోట్లు!
సాక్షి ప్రతినిధి, ఏలూరు: కోడి పుంజులకు కత్తులు కట్టి పందేలు నిర్వహించరాదని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించినా తెర వెనుక ఏర్పాట్లు మాత్రం యథావిధిగానే సాగిపోతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ ఏడాది కూడా 50కి పైగా బరులను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. భోగి నాటి నుంచి ప్రారంభం అయ్యే పందేలు, జూదాల్లో జిల్లావ్యాప్తంగా సుమారు రూ.రెండు వందల కోట్లు చేతులు మారతాయని అంచనా. జాతరే జాతర.. కోడి పందేల బరుల వద్దే పేకాట శిబిరాలు, మద్యం దుకాణాలు, బెల్టు షాపులు వెలిసి జాతరలను తలపిస్తాయి. వీటిని నిర్వహించుకునేందుకు ఇప్పటికే వేలం పాటలు మొదలయ్యాయి. పందేల మాటున పేకాట, గుండాట, కోతాట, జూదం నిర్వహిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం వెంప, శ్రీరాంపురం గ్రామాల్లో కోడి పందేల పేరుతో జూదం, అశ్లీల నృత్యాలు, వ్యభిచారం జరగకుండా చర్యలు తీసుకునేలా అధికారులను ఆదేశించాలని కలిదిండి రామచంద్రరాజు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై విచారణను హైకోర్టు జనవరి 2వ తేదీకి వాయిదా వేసింది. దగ్గరుండి ప్రోత్సహిస్తున్న అధికార పార్టీ నేతలు రాష్ట్రంలో 2014 తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చాక సాంప్రదాయం పేరుతో అధికార పార్టీ ప్రజాప్రతినిధులే ముందుండి ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో వెంప, భీమవరం ఆశ్రమతోట, లోసరి, ఐ భీమవరం, సీసలి, మహదేవపట్నం, గుండుగొలను, జంగారెడ్డిగూడెం, కొప్పాక తదితర చోట్ల పెద్ద ఎత్తున కోడిపందేలు జరుగుతున్నాయి. భోగి పండుగ నుంచి కనుమ వరకూ రాత్రి పగలు తేడా లేకుండా ఫ్లడ్‌లైట్ల వెలుగులో పోటీలు ఏర్పాటు చేస్తున్నారు. పండగ మూడు రోజులు కోళ్లకు కత్తులు కట్టి పందేలు నిర్వహించారు. కేసులు నమోదు చేస్తామని పోలీసుల హెచ్చరిక గత ఏడాది జాయింట్ యాక్షన్ టీములను ఏర్పాటు చేసి కోడి పందేలు జరిగే ప్రాంతాల్లో 144 సెక్షన్ విధిస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించినా ఎక్కడా అమలు కాలేదు. ఈసారి కోడి పందేల బరులు ఏర్పాటు చేసేవారు, కోళ్లకు కత్తులు కట్టేవారు, పందెం కోళ్లు పెంచేవారితోపాటు పందేలను ప్రోత్సహించే వారిపై బైండోవర్ కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కోడిపందేలపై ఇటీవల జరిగిన సమీక్షలో ఎస్పీ రవిప్రకాష్ అ«ధికారులకు సీరియస్‌గా ఆదేశాలు జారీ చేశారు. కోడిపందేలు ఎక్కడ జరిగినా అక్కడి స్టేషన్ ఆఫీసర్‌ను బాధ్యుడిగా చేసి చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. -
రాత్రివేళల్లో కోళ్ల తరలింపు..!
బర్డ్‌ఫ్లూ మరింత విస్తరించే ప్రమాదం కోళ్లను చంపేస్తారన్న భయంతో వ్యాపారుల అక్రమ మార్గాలు ఇది మరింత ప్రమాదకరంఅంటున్న అధికారులు ఇప్పటివరకూ రూ.10 కోట్ల మేర వ్యాపారులకు నష్టం సాక్షి, హైదరాబాద్: బర్డ్‌ఫ్లూ మరింత విస్తరించే ప్రమాదం కనిపిస్తోంది. వేల కోళ్లను పశుసంవర్థక శాఖ అధికారులు చంపేస్తుండటంతో వ్యాపారులు అక్రమ మార్గాలను అనుసరిస్తున్నారు. బర్డ్‌ఫ్లూ వచ్చినా రాకున్నా ఆయా ప్రాంతాల్లో కోళ్లను చంపేస్తుండటంతో తమకు కోట్లలో నష్టం వస్తుందని గ్రహించిన కొందరు వ్యాపారులు రాత్రికి రాత్రి వేలాది కోళ్లను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే అనేక కోళ్లను చికెన్ కేంద్రాలకు తరలించినట్లు తెలుస్తోంది. ఇది అత్యంత ప్రమాదకరమని, దీని వల్ల బర్డ్‌ఫ్లూ మరింత విస్తరించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఉదాహరణకు బర్డ్‌ఫ్లూ గుర్తించిన ఒక ఫామ్‌లో దాని యజమాని మొదట 35 వేల కోళ్లు మాత్రమే ఉన్నాయని చెప్పాడు. తీరా వాటిని లెక్కించేసరికి అందులో 52 వేల కోళ్లు ఉన్నాయని తేలింది. తప్పుడు లెక్కలు చూపిస్తూ కొందరు వ్యాపారులు రాత్రి వేళల్లో కోళ్లను ఇతర ప్రాంతాలకు అక్రమంగా తరలించి అమ్మేస్తున్నట్లు అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు అక్రమంగా ఎన్నింటిని ఎక్కడెక్కడికి పంపారో ఆరా తీస్తున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో పోలీసు నిఘా ఏర్పాటు చేశారు. మరోవైపు బర్డ్‌ఫ్లూ భయాందోళనల నేపథ్యంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కొన్ని రోజులపాటు చికెన్ షాపులు తెరవకూడదని.. గుడ్ల అమ్మకాలు కూడా జరపకూడదని వినియోగదారుల సంఘాలు కోరుతున్నాయి. 72 వేల కోళ్ల చంపివేత రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం తొర్రూరు గ్రామంలోని కొన్ని కోళ్ల ఫారాల్లో బర్డ్‌ఫ్లూ వ్యాధికారక హెచ్5ఎన్1 వైరస్ నిర్ధారణ కావడంతో ఇది మరింత వ్యాప్తి చెందకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. మొత్తం 1.45 లక్షల కోళ్లను చంపాలని నిర్ణయించగా.. ఇప్పటివరకు 71,918 కోళ్లను చంపి పాతిపెట్టినట్లు అధికారులు వెల్లడించారు. 8,946 కోడి గుడ్లను ధ్వంసం చేశారు. ఇప్పటివరకూ కోళ్ల చంపివేత వల్ల వ్యాపారులకు సుమారు రూ.10 కోట్ల మేరకు నష్టం వాటిల్లినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. కోళ్లను చంపి పాతిపెట్టే కార్యక్రమంలో మొత్తం 62 బృందాలు.. 250 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఇందులో పశువైద్యులు, పంచాయతీ సిబ్బంది ఉన్నారు. కోళ్లను పూడ్చిపెట్టే పనుల్లో పాల్గొంటున్న సిబ్బందికి ముందస్తుగా టామీఫ్లూ మాత్రలను అందిస్తున్నారు. తొర్రూరు పరిసరాల్లోని కోళ్ల ఫారాల్లో పనిచేస్తున్న సిబ్బందికి పరీక్షలు చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఎవరిలోనూ బర్డ్‌ఫ్లూ లక్షణాలు కనిపించలేదని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. తొర్రూరుకు 10 కిలోమీటర్ల పరిధిలో ఇంటింటినీ పరీక్షించారు. రెండు శాఖల మధ్యా లోపించిన సమన్వయం.. బర్డ్‌ఫ్లూపై కేంద్ర బృందం రాష్ట్రానికి వస్తున్నట్లు.. వచ్చినట్లు రాష్ట్ర పశుసంవర్థక శాఖ అధికారులకు తెలియదట. వైద్య ఆరోగ్య శాఖ, పశుసంవర్థక శాఖల మధ్య సమన్వయం లోపించడమే దీనికి కారణమని తెలుస్తోంది. కేంద్ర బృందం రాకపై పశుసంవర్థక శాఖ డెరైక్టర్ వెంకటేశ్వర్లును ‘సాక్షి’ ప్రశ్నించగా.. ‘కేంద్ర బృందం వస్తుందా? ఎవరు చెప్పారు? నాకు సమాచారం లేదే?’ అని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేయడం గమనార్హం. కాగా, పశుసంవర్ధక శాఖ అధికారులు తమతో కలసిరావడంలేదని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్‌కు కేంద్ర బృందం రాక.. బర్డ్‌ఫ్లూ వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం నుంచి జాతీయ అంటువ్యాధుల సంస్థ (ఎన్ఐసీడీ) జాయింట్ డెరైక్టర్లు డాక్టర్ ఎస్.కె.జైన్, డాక్టర్ కర్మాకర్, 16 రకాల అంటువ్యాధులను దేశవ్యాప్తంగా పర్యవేక్షించే ప్రత్యేక నిపుణుడు డాక్టర్ ప్రణయ్‌వర్మ, కేంద్ర ఛాతీ వైద్య నిపుణుడు డాక్టర్ పవన్‌కుమార్ బుధవారం హైదరాబాద్ చేరుకున్నారు. వీరు గురువారం నుంచి తొర్రూరు పరిసర ప్రాంతాల్లో పర్యటించి కోళ్ల ఫారాలను తనిఖీ చేస్తారు. శాంపిళ్లు సేకరించి.. పరీక్షలు నిర్వహిస్తారు. వారం రోజులపాటు ఇక్కడే ఉండి పూర్తిస్థాయిలో పర్యవేక్షణ, పరిశీలన చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తారు. -
కోడికి కూడా ఒకరోజు వస్తుంది!
యజమాని పుంజుని అపురూపంగా చూసుకుంటాడు. తన మంచం కోడికి కట్టేసుకుంటాడు. విషప్రయోగాలు జరగకుండా చూసుకుంటాడు. పందేల తరుణం రావడానికి రెండు నెలల ముందు నుంచి పుంజుతో బ్రహ్మచర్యం పాటింపచేస్తాడు. ఔను. అన్నట్టే వచ్చింది. కోడి గురించి లోకం కోడైకూ సింది. కోడి పందెం హింసాత్మకమా, వినో దాత్మకమా నిగ్గు తేల్చ డానికి దేశ అత్యున్న త న్యాయస్థానాలు సిద్ధపడ్డాయి. ఆఖరికి కోడి చావకుండా, కత్తి దుయ్యకుండా తీర్పులిచ్చారు. వందల, వేల బరుల్లోకి జాతిపుంజులు దిగాయి. చంద్రన్న సం క్రాంతి కానుక పథకం మూడొందల కోట్లు అయి తే, సంక్రాంతి పందెపు కాపులు, పైకాపులు మూడొందల కోట్ల పైమాటే. నేతలకి, పందెంరాయుళ్లకి, చానల్స్‌కి, పోలీసులకి వినోదం ఎగస్ట్రా. కోడిపుంజు చాలా ప్రాచీన పక్షి. పురాణాల్లో కనిపి స్తుంది. కుమారస్వామి వాహనం నెమలికి తోడు కోడి పుంజు కూడా అక్కడక్కడ కనిపిస్తుంది. నెమలి కోడిపుం జుకి సాక్షాత్తూ మేనమామ. ఆ పోలిక వచ్చే దీనికీ రెక్క లున్నా ఎగరడం రాలేదు. పింఛం రాలేదు గాని, పౌరు షం వచ్చింది. శ్రీనాథ కవిసార్వభౌముడు కోడిపందే లను, పౌరుషాలను సీసాలకెత్తారు. కోడిపుంజుకి కావ్య గౌరవం ఇచ్చారు. ‘‘బరిలో పోరిపోరి వీరమరణం చెందే కోడిపుంజులకు స్వర్గలోకం ప్రాప్తిస్తుందా? రంభ, ఊర్వ శి మొదలైన అచ్చర కన్నెల పొందు లభిస్తుందా?’’ అని శ్రీనాథకవి సూటిగా ప్రశ్నించారు. నాకూ ఇదే డౌటు వచ్చి ఒక పెద్దాయనని అడిగా! స్వర్గంలో ప్రతిజాతి లోను అచ్చరలుంటారు. అచ్చర కోడిపుంజులుంటాయి. ఏనుగుల్లో, గుర్రాల్లో, లొట్టిపిట్టల్లో అప్సరసలుంటాయి. ఎందుకంటె యుద్ధాలలో ఈ జాతులన్నీ వీరమరణం చెంది స్వర్గానికి వెళ్తాయి కదా! దేవేంద్రుని ఐరావతం కోసం అలాయిదాగా-అంటే సెపరేట్‌గా గజదేవకన్య లుంటారు. ఇంకా వివరంగా నా డౌటు క్లియర్ చేశారు. వీటినే తెలుగులో చొప్పదంటు ప్రశ్నలంటారు. జలచరా లను, భూచరాలను, ఖేచరాలను సృష్టించిన ఆ దేవుడు స్వర్గంలో అవసరాలకు తగిన విధంగా వసతులు సమ కూర్చడా! అనగా సమకూరుస్తాడని భావము. ఇక మళ్లీ వార్తల్లోని పక్షి కోడి వ్యవహారానికి వస్తే, పుంజుల్లో బెరస, నెమలి, కాకి అంటూ బోలెడు జాతులు న్నాయి. కాళ్లకి అడ్డంగా పెరిగిన ‘కాటా’ ఉంటుంది. దానికే కత్తి కడతారు. కత్తి కట్టడం ఒక కళ. పందెపు కోడిని మేపడం ఒక కళ. బాదంపప్పులతో సహా ఖరీదైన పప్పులతో ‘దాణా’ తయారుచేస్తారు. రోషం కోసం ఉల్లి పాయలు తినిపిస్తారు. ఉత్సాహం పుట్టడానికి సీమ సారాయి తాగిస్తారు. దమ్ము పెరగడానికి చెరువులో ఈతలు కొట్టిస్తారు. కోడి యజమాని పుంజుని అపురూ పంగా చూసుకుంటాడు. తన మంచం కోడికి కట్టేసుకుం టాడు. పోటీదారుల నుంచి విషప్రయోగాలు జరగకుం డా చూసుకుంటాడు. పందేల తరుణం రావడానికి రెం డు నెలల ముందు నుంచి పుంజుతో బ్రహ్మచర్యం పాటింపచేస్తాడు. గుర్రప్పందేలలో గుర్రాల చరిత్రలని స్టడీ చేసినట్టు వీటి నేపథ్యాలు పరిశీలిస్తారు. పల్నాటి విత్తనానికి మంచి గిరాకీ ఉంటుంది. అంటే దాని మీద బెట్టిం గులు బాగా సాగుతాయి. కారెంపూడి పోతు గడ్డ మీంచి మట్టి తెచ్చి మరీ ట్రెయినింగ్ బరులు తయారు చేస్తారు. ఇంత కథా కమామిషూ ఉన్న కోడిపం దేలను నిషేధిస్తామంటే ఎలా? జూదం అంటారా- అది మన భారతీయ వారస త్వం. రాజ్య సంపదలని, సోదరులని, భార్య ని సైతం ఒడ్డిన ధర్మరాజులం. ఇందులో హింస ఉందం టారా? పందెం అన్నాక, పోటీ అన్నాక హింస తప్పదు. పోటీ పరీక్షలలో మన పిల్లలు హింసకు గురి అవడం లేదా? ప్రపంచంలో అత్యధికంగా ప్రజలు ఆరగించేది కోడి మాంసాన్నే. బెట్టింగులు లేకముందు గెలిచిన కోడితో పాటు, ఓడిన కోడిని తెచ్చుకోవడం రివాజు. పెద్దపండుగలలో ఇదొక ఆటవిడుపు. ‘రిలాక్సేషన్’ అన్నారు నాయకులు, ప్రజలు. ఇది శతాబ్దాలుగా వస్తు న్న సంప్రదాయం. కోడిపుంజు జాతికి మేల్కొలుపులు పాడుతుంది. అందుకే మోదీ సర్కారు జాగృతం చేసే కోడిని, స్వచ్ఛ భారత్‌కు కాకిని అధికారికి చిహ్నాలుగా నిర్ణయించాలని లోకుల తరఫున కోరుతున్నా! (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) - శ్రీరమణ -
పందెం కోళ్లు
ఖరీదైన ఆహారం... ప్రత్యేక శిక్షణ కోడి పుంజులకు రాజభోగం సిద్ధం చేస్తున్న నూకన్ననాయుడు ఒక్కో పుంజు ధర రూ.5 వేల నుంచి 30 వేలు నక్కపల్లి: సంక్రాంతి వస్తోందంటే చాలు పందెం కోళ్లు ఒళ్లు విరుచుకుంటాయి. ప్రత్యర్థిని ఎదుర్కోడానికి సర్వ శక్తులూ కూడగట్టుకొని పందాలకు సిద్ధమవుతాయి. ఈ పందాలకు నెల రోజుల ముందు నుంచే ఏర్పాట్లు చేస్తుంటారు. లక్షలు, కోట్లలో కూడా పందాలు కాస్తుంటారు. పందెం రాయుళ్లు మేలుజాతి కోడిపుంజుల అన్వేషణలో పడతారు. ఎంత ఖరీదైనా కొనుగోలు చేయడానికి, జాతి పుంజులపై బెట్టింగ్‌లు కట్టడానికి వెనుకాడరు. ఇటువంటి పందెం రాయుళ్ల కోసం నక్కపల్లి మండలం ఒడ్డిమెట్టకు చెందిన పైల నూకన్ననాయుడు మేలుజాతి, ఖరీదైన కోడిపుంజుల పెంపకాన్ని చేపట్టాడు. మరో 20 రోజుల్లో సంక్రాంతి సంబరాలు ఊపందుకోనున్న నేపథ్యంలో మేలు జాతిరకాల కోడిపుంజులను తయారు చేసే పనిలో తలమునకలై ఉన్నాడు. ‘పందేలు వేసుకుంటారో లేక కొత్త అల్లుళ్లకు పందెం పుంజుల మాంసంతో విందు భోజనం పెట్టడానికి కొనుక్కుంటారో నాకనవసరం. జాతిరకాలైన కోడిపుంజులను సిద్ధం చేస్తున్నానని’ నూకన్ననాయుడు చెబుతున్నాడు. గ్రామీణ ప్రాంతంలో ఇతని వద్ద ఉన్న మేలు(జాతి)రకాల కోడిపుంజులు ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కడాలేవు. ఇవి ఒక్కొక్కటి రూ.5 వేల నుంచి 30 వేల రూపాయల ధర పలుకుతున్నాయి. భీమవరం, ఏలూరు, నర్సాపురం, విజయవాడ తదితర ప్రాంతాల నుంచి బడాబాబులు వచ్చి ఇతని వద్ద ఖరీదైన పుంజులు కొని తీసుకెళ్తుంటారు. పందెం కోళ్లలో ప్రధానంగా చెప్పుకునే పచ్చ కాకి, నల్లచవల, పసింగాల డేగ, నెమలి, సేతువ, పువల, రసంగి, నెమలి డేగ, కాకి డేగ, కాకి కువల, తెల్ల నెమలి, మైలా వంటి జాతిర కాలైన కోడిపుంజులు ఉన్నాయి. జాతి రకాలయిన కోడి పెట్టలను కొని తెచ్చి గుడ్లు పెట్టించి స్వయంగా ఉత్పత్తి చేపడుతున్నాడు. ఏడేళ్ల నుంచి ఇతను జాతిరకాలైన కోడిపుంజుల పెంపకంపైనే జీవనోపాధి పొందుతున్నాడు. ప్రస్తుతం ఇతని వద్ద లక్షలాది రూపాయల విలువైన సుమారు 20 కోడిపుంజులు, పెట్టలు ఉన్నాయి. వీటికి పౌష్టికాహారాన్ని అందించడం కోసం ఒక్కొక్క కోడిపుంజుకు నెలకు రూ.3వేల రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్నాడు. ఖరీదైన పౌష్టికాహారం కోడిపుంజు పుట్టిన ఏడు నెలల వరకు చోళ్లు, గోధుమ, ధాన్యం ఆహారంగా పెడతారు. ఏడో నెలదాటిన తర్వాత కోడి కూతకు వస్తుంది. అప్పటి నుంచి 3 నెలలపాటు బలమైన ఆహారం ఇస్తారు. ప్రతి రోజు పది బాదం పిక్కలు, ఒక పచ్చి కోడిగుడ్డు, మిరియాల పొడి, అశ్వగంధి, 50 గ్రాముల మాంసం, ఆహారంగా ఇస్తారు. ఇలా రెండు నెలలపాటు మేపి పందెం పుంజులుగా తయారు చేస్తారు. పందాల్లో అలుపు తట్టుకోవడం కోసం ప్రతిరోజు 30 నిమిషాలపాటు నీటిలో ఈతకు వదుల్తారు. నాలుగు కిలోల బరువు, ఏడాది వయసు వచ్చే వరకు మంచి పౌష్టికాహారంతో ఈ కోడి పుంజులను పెంచుతామని నూకన్నాయుడు తెలిపాడు. రెండునెలలపాటు పుంజులను ఈవిధంగా పెం చినందుకు ఒక్కొక్క దానికి రూ.3 వేల నుంచి 4 వేలు ఖర్చవుతుం దంటున్నాడు. ఇలా తయారయిన పుంజును రూ.20 వేల నుంచి 30 వేలకు విక్రయిస్తామని చెబుతున్నాడు. ఈ వృత్తి ప్రారంభించి ఇప్పటివరకు సుమారు 600కు పైగా జాతి కోడిపుంజులను అమ్మానని తెలిపాడు. పుంజుల బరువు ఎక్కువై పందాల్లో ఎగురలేవనే అనుమానం వచ్చినప్పుడు కూడా బరువు తగ్గించడం కోసం పలు జాగ్రత్తలు తీసుకుంటామంటున్నాడు. ఇటువంటి బరువు పెరిగిన కోడిపుంజులకు ఆముదం పట్టించి, వేడినీళ్లతో మసాజ్ చేస్తామంటున్నాడు. ఇలా చేస్తే శరీరం గట్టిపడి పుంజు తేలికవుతుందని, సులువుగా ఎగురగలుతుందంటున్నాడు. -
బారు ముక్కు.. బాతు కాళ్లు
పోలీసుస్టేషన్లలో పందెపు కోడిపుంజులు దర్శనమివ్వడం మామూలే. అయితే తూర్పు గోదావరి జిల్లా రాయవరం ఠాణాకు శనివారం రాత్రి వెళ్లిన వారు ఒక్కక్షణం ‘తాము వచ్చింది పోలీసుస్టేషన్కేనా..’ అని సందేహించాల్సి వచ్చింది. కారణం.. అక్కడున్న వింతపక్షే. సుమారు 8 అంగుళాల పొడవైన ముక్కు, బాతుకు ఉండే మాదిరి కాళ్లు ఉన్న ఆ పక్షి.. దీనిని పట్టుకున్న వ్యక్తి అమ్మకానికి పెట్టగా రూ.4 వందలకు కొన్న సూర్యనారాయణరెడ్డి అనే వ్యకి తొలుత కూర వండించుకు తినాలనే అనుకున్నాడు. అంతలోనే వన్యప్రాణి సంరక్షణ చట్టం గుర్తుకు రావడంతో దాన్ని పోలీసుస్టేషన్‌కు తెచ్చి.. అటవీ శాఖాధికారులకు అప్పగించాలని కోరాడు. కాగా, ఇది నీటి పక్షి అయి వుంటుందని జిల్లా అటవీశాఖ అధికారి తెలిపారు. - న్యూస్‌లైన్, రాయవరం