ఓ బాతు ప్రయోగించిన తెలివి తేటలు సోషల్ మీడియాలో నెటిజన్ల చేత నవ్వుల పూలు పూయిస్తున్నాయి. ఆపద సమయంలో ఎదుర్కోవాల్సిన ధైర్యాన్ని, కావాల్సిన ఓపికను ప్రదర్శించిన బాతు ఆలోచన నెటిజన్లను ఆకట్టుకుంది. వివరాల్లోకి వెళితే.. ఓ కుక్క ముందు బాతు చనిపోయినట్లు నటించింది. దీంతో కాసేపు వేచిచూసిన ఆ కుక్క అక్కడి నుంచి పక్కకు పోవడంతో బాతు మెరుపు వేగంతో లేచి అక్కడి నుంచి పరుగు లంకించుకుంది. అలా కుక్క బారిన నుంచి తన ప్రాణాలను దక్కించుకుంది. చదవండి: విరాళాలతో కరోనాను తరిమి కొడుతున్న దాతలు
కాగా ఇంతకముందే దీనిని సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ప్రస్తుతం ఈ వీడియోను భారత అటవీశాఖ అధికారి సుశాంత్ నంద మళ్లీ తన ట్విటర్‌లో పోస్ట్ చేశారు. నటించడమంటే..నిజాయితీగా మోసం చేయడం. కుక్క నుంచి తప్పించుకోవడానికి బాతు చనిపోయినట్లు నటిస్తుంది అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ వీడియో వైరల్‌గా మారడంతో లక్షల మంది ఈ వీడియోను వీక్షించారు. అనేక మంది కామెంట్ చేస్తూ.. బాతు తెలివి తేటలపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. బాతు నటన అవార్డు విన్నింగ్ లెవల్లో ఉందంటూ కామెంట్ చేస్తున్నారు. చదవండి: కరోనాపై పోరుకు అమ్మ రూ.13 కోట్ల విరాళం
Acting is all about faking honestly😊
— Susanta Nanda IFS (@susantananda3) April 12, 2020
Duck acts as dead to escape the dog... pic.twitter.com/o4zc0W7eHt
Comments
Please login to add a commentAdd a comment