మానవేతర జాతుల్లో కొన్ని జాతులు.. శబ్దాలను అనుకరిస్తాయనడానికి చాలా ఆధారాలు ఉన్నాయి. ఏనుగులు, గబ్బిలాలు, చిలుకలు, హమ్మింగ్‌బర్డ్స్‌తో పాటు.. నీటిలోని జీవించే తిమింగలాలు, డాల్ఫిన్లు సహా.. ఇలా కొన్ని పక్షులు, జంతువులు.. నిర్దిష్ట శబ్దాలను ఇట్టే నేర్చుకోగలవని ఇప్పటికే పలుమార్లు రుజువైంది. అయితే ఆ జాబితాలో ఆస్ట్రేలియాకు చెందిన ‘రిప్పర్ డక్’ (కస్తూరి బాతు).. అచ్చం మనిషి మాదిరి మాట్లాడటమే కాదు.. మనిషి మాదిరి తిట్టగలదని నిరూపితమైంది. అందుకు 34 ఏళ్ల కిందట రికార్డ్ అయిన ఓ ఆడియో సాక్ష్యంగా నిలిచింది.
చదవండి: ఇలా మనుషుల్ని అమ్మగలరా? లేదు కదా..?
డాక్టర్ పీటర్ ఫుల్లగర్ అనే పరిశోదకుడు.. 1987లో కాన్‌బెర్రా సమీపంలోని టిడ్బిన్ బిల్లా నేచర్ రిజర్వ్‌లో కస్తూరి బాతు మాట్లాడుతుండగా ఆ వాయిస్‌ను రికార్డ్ చేశారు. దానిలో రిప్పర్ ‘యూ బ్లడీ ఫూల్’ అని అచ్చం మనిషి తిట్టినట్లే తిట్టింది. నాడు ఆయన చేసిన రికార్డింగులను ఇటీవల నెదర్లాండ్స్‌లోని లైడెన్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ కారెల్ టెన్ కేట్ తిరిగి వెలుగులోకి తెచ్చారు. పక్షులలో స్వర అభ్యాసంపై ప్రొఫెసర్ టెన్ కేట్ అధ్యయనం చేస్తున్నారు. తలుపు కొట్టుకుంటుండగా వచ్చే శబ్దాన్ని కూడా ఈ బాతు అనుకరించగలదని సరికొత్త అంశాన్ని గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment