
సాక్షి,ముంబై: వ్యాపారవేత్త, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర ఒక బ్యూటిఫుల్ వీడియోతో మరోసారి తన ఫాలోవర్స్‌ని, నెటిజనులను మెస్మరైజ్ చేశారు. అద్భుతమైన అందమైన బాతుల వీడియోను ట్విటర్‌లోషేర్ చేశారు. చాలా అందంగా ఉంది! ప్రకృతి మననుంచి ఇంకా దూరం కాలేదు అనేందుకు ఇదొక ఆశాజనక సంకేతం కావచ్చనిఆయన వ్యాఖ్యానించారు.
ఇటీవల అసోంలో కనిపించిన అరుదైన మాండరిన్ బాతుల జంట వీడియోను ఆనంద్ మహీంద్ర ట్విటర్ వేదికగా షేర్ చేశారు. వందేళ్ల తరువాత దర్శమిచ్చిన ఈ రంగు రంగుల బాతు పర్యావేరణ ప్రేమికులను మంత్రముగ్దులను చేస్తోంది. ఎరిక్ సోల్హీమ్ ఈ వీడియోను ట్విటర్ పోస్ట్ చేశారు. తూర్పు చైనా, రష్యాలో కనిపించే మాండరిన్ అసోంలో కనిపించింది. ప్రకృతి సృష్టించిన సోయగమిది అని ఆయన ట్విట్ చేశారు. దీంతో నెటిజన్లు చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఇవి చాలా అందంగా ఉంటాయి. అందుకే ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రదేశాలలో వీటిని పెంచుకుంటారంటూ కొంతమంది ట్వీట్ చేశారు.
కాగా ప్రపంచంలో పది అందమైన పక్షులలో ఒకటి మాండరిన్ బాతు. ఎరుపు రంగు ముక్కు, నలుపు రంగు తోక ..ఇలా సప్తవర్ణాల మేళవింపుతో ఆకర్షణీయంగా ఉండే ఈ బాతు ఎక్కువగా చైనాలో కనిపిస్తుంది. అంతేకాదు ఆడ బాతుతో పోలిస్తే.. మగ బాతు మరింత అందంగా ఉంటుందట. రష్యా, కొరియా, జపాన్‌తో పాటు చైనాలోని ఈశాన్య భాగాల్లో ఈ బాతులు ఎక్కువగా కనిపిస్తాయి.
Exquisitely beautiful! And perhaps its return is a hopeful sign that nature hasn’t given up on us yet? https://t.co/wKlNo6Baq2
— anand mahindra (@anandmahindra) July 26, 2021
Comments
Please login to add a commentAdd a comment