కొండపై క్రికెట్.. రోడ్డుపై ఫీల్డింగ్ - ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్ | Anand Mahindra Shares Video Of How India Takes Cricket To Another Level, Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Anand Mahindra: కొండపై క్రికెట్.. రోడ్డుపై ఫీల్డింగ్ - ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్

Published Fri, Jan 26 2024 10:31 AM | Last Updated on Fri, Jan 26 2024 1:38 PM

Anand Mahindra Shares Video India Takes Cricket To Another Level - Sakshi

భారతదేశంలో క్రికెట్‌కున్న క్రేజు అంతా ఇంతా కాదు, ఈ క్రేజుని వేరే లెవెల్‌కు తీసుకెళ్లిన కొందరు యువతులకు సంబంధించిన వీడియోను పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా తన ఎక్స్ (ట్విటర్) ఖాతా ద్వారా షేర్ చేశారు. నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ వీడియో పలువురు క్రికెట్ అభిమానుల మనసు దోచేస్తుంది.

క్రికెట్ ఆడాలంటే గ్రౌండ్ / మైదానం ఉండాలి. అది లేనప్పుడు వీధుల్లో ఉన్న చిన్న ప్రదేశాల్లోనే క్రికెట్ ఆడుకుంటారు. అయితే ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో యువతులు కొండల్లో క్రికెట్ ఆడటం చూడవచ్చు. ఈ సంఘటన ఆ యువతులకు క్రికెట్ మీద ఉన్న పిచ్చిని ఇట్టే తెలియజేస్తుంది.

కొండ మీద క్రికెట్ ఆడుతుంటే.. కింద రోడ్డు మీద ఫీల్డింగ్ చేస్తున్న దృశ్యాలను ఇక్కడ చూడవచ్చు. ఆనంద్ మహీంద్రా ఈ వీడియో షేర్ చేస్తూ.. భారత్ క్రికెట్‌ను మరో స్థాయికి తీసుకెళ్లిందంటూ ట్వీట్ చేసాడు. ప్రస్తుతం నెట్టింట్లో ఈ వీడియో వైరల్ అవుతోంది. ఇప్పటికీ ఈ వీడియోను 14 లక్షల మంది వీక్షించారు.

ఇదీ చదవండి: పానీ పూరీ అమ్మడానికి థార్.. ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే..

ఈ వీడియో చూసిన కొందరు తమదైన రీతిలో కామెంట్స్ కూడా చేస్తున్నారు. క్రికెట్ మన రక్తంలోనే ఉందని కొందరు కామెంట్ చేస్తే.. ఇలాంటి క్రికెట్ తామెక్కడా చూడలేదని వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement