
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' ఎప్పటికప్పుడు తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఆసక్తికరమైన వీడియోలు షేర్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగా తాజాగా మరో వీడియో షేర్ చేశారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ఆనంద్ మహీంద్రా షేర్ చెందిన వీడియోలో ఒక కాలువలో పడవలు.. ఒకదాని వెంట ఒకటి వెళ్తూ ఉన్నాయి. ఈ వీడియో షేర్ చేస్తూ.. ''ముంబై తరహా ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకోవడానికి మాత్రమే వెనిస్ వరకు ప్రయాణించారు. ముంబైతో పోలిస్తే ఇది కొంత తక్కువే అని నేను అంగీకరిస్తున్నాను'' అని అన్నారు. దీనికి సండే ఫీలింగ్ అంటూ ఓ హ్యస్టాగ్ కూడా ఇచ్చారు.
ఇదీ చదవండి: రాత్రిపూట వెలుగు ఆర్డర్ చేసుకోవచ్చు.. మీరు ఎక్కడంటే అక్కడ!
Traveled all the way to Venice only to run into a Mumbai-style traffic jam!
(Ok, I admit this traffic pile-up is less stressful…🙂)#SundayFeeling pic.twitter.com/n25G8Y5upk— anand mahindra (@anandmahindra) September 15, 2024