Traffic
-
ఏయ్.. నా బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలుసా?.. మంత్రి గారి మేనల్లుడు వీరంగం!
లక్నో : ఏయ్.. నాకే ఎదురు చెబుతావా? నేను ఎవరినో తెలుసా? నా బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలుసా? అంటూ ఓ మంత్రి మేనల్లుడు వీధిలో వీరంగం సృష్టించాడు. చిరువ్యాపారులపై దాడికి దిగాడు. ప్రస్తుతం ఆ ఘటన సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్‌లో మంత్రి సోమేంద్ర తోమర్ మేనల్లుడు ఓ వీధిలో తన స్కార్పియోలో వెళుతున్నాడు. రద్దీగా ఉన్న వీధిలో స్కార్పియోకి ఎదురుగా ఓ రిక్షావాలా అడ్డొచ్చాడు. దీంతో అటు స్కార్పియో, ఇటు ఆటో ముందుకు కదల్లేని పరిస్థితి.ఆ సమయంలో అక్కడే పూలవ్యాపారం చేస్తున్న ఇద్దరు దంపతులు మంత్రి మేనల్లుడి స్కార్పియోను ముందుకు పోనివ్వాలని ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న అతని సహాయకుడికి సూచించాడు. సహాయకుడు ముందు ఆటో పోనివ్వండి. ఆ తర్వాత స్కార్పియో ముందుకు కదులుతుందని వాదించాడు. దీంతో ఇరువురి మధ్య మాట మాట పెరిగింది.స్కార్పియోలో డ్రైవింగ్ సీట్లో ఉన్న మంత్రి మేనల్లుడు పూల వ్యాపారుల్ని అసభ్యంగా దూషించాడు. కారు దిగి దాడికి దిగాడు. పూల వ్యాపారిని కిందకి నెట్టి పిడిగుద్దులు గుద్దాడు.ఘర్షణపై సమాచారం అందుకు పూల వ్యాపారి బంధువులు సైతం మంత్రి మేనల్లుడిని రాడ్లతో దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఇలా ఇరు వర్గాల మధ్య జరిగిన గొడవ..చిలికి చిలికి గాలివానగా మారింది. గొడవపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఘర్షణకు దిగిన ఇరు వర్గాలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.UP BJP minister @isomendratomar’s nephew seen beating a poor flower vendor over a free bouquet. Ram Rajya! pic.twitter.com/UfWVjDtfmj— Manish RJ (@mrjethwani_) February 23, 2025 -
Mahakumbh: వెలుపల లక్ష వాహనాలు.. 60 కోట్లు దాటిన పుణ్యస్నానాలు
ప్రయాగ్‌రాజ్: యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో ఈరోజు ఆఖరి ఆదివారం. దీంతో సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించేందుకు లెక్కకుమించిన రీతిలో భక్తులు తరలివస్తున్నారు. ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్ వెలుపల ఎంట్రీపాయింట్(Entry point)ల వద్ద లక్షకుపైగా వాహనాలు నిలిచివున్నట్లు సమాచారం.శనివారం సాయంత్రం నుంచే కుంభమేళా ప్రాంతంలో అత్యంత రద్దీ నెలకొంది. ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. దీనికితోడు రాబోయే మహాశివరాత్రికి అత్యధిక సంఖ్యలో భక్తులు తరలిరానున్న దృష్ట్యా స్థానిక అధికారులు ముందస్తు ఏర్పాట్లుపై దృష్టి సారించారు. ప్రయాగ్‌రాజ్‌లోని ఏడు ఎంట్రీపాయింట్ల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. శనివారం సాయంత్రం సంగమం మెయిన్ ఎంట్రీ పాయింట్‌లోని డాక్టర్ శ్యామా ప్రసాద్ సేతు(Dr. Shyama Prasad Sethu) చౌరస్తా వద్ద ఐదు కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ నిలిచిపోయింది.మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ సరిహద్దుల్లో రీవా పరిధిలోని చాక్ఘాట్లో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాగ్‌రాజ్‌లోని ఏడు ఎంట్రీపాయింట్లను మూసివేయడంతో భక్తులు ఇక్కడి నుంచి 12 కిలోమీటర్ల దూరం నడిచి సంగమస్థలికి చేరుకుంటున్నారు. శనివారం నాటికి కుంభమేళాలో పవిత్రస్నానాలు చేసినవారి సంఖ్య 60 కోట్లు దాటింది. మహాకుంభమేళాకు ముందు సీఎం యోగి ఆదిత్యనాథ్ కుంభమేళాకు 45 కోట్లమంది వస్తారని అంచనా వేశారు. అయితే ఆ అంచనా ఇప్పటికే దాటిపోయింది. 73 దేశాల ప్రతినిధులు ప్రయాగ్‌రాజ్‌కు తరలివచ్చి పుణ్యస్నానాలు చేయడాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఇది కూడా చదవండి: Mahakumbh: ముఖ్యమంత్రి యోగి మరో రికార్డు -
పారాగ్లైడింగ్తో పరీక్ష కేంద్రానికి
సతారా: ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించకపోవడంతో కన్నీటిపర్యంతమైన అభ్యర్థులను ఎంతోమందిని చూశాం. తనకలా అవ్వొద్దనుకున్నాడు మహారాష్ట్రకు చెందిన ఓ యువకుడు. ట్రాఫిక్ కష్టాలు తప్పించుకుని సకాలంలో ఎగ్జామ్ సెంటర్‌కు చేరేందుకు వినూత్న ఆలోచన చేశాడు. సతారా జిల్లా పసరణి గ్రామానికి చెందిన సమర్థ్ మహంగాడేకు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. పని నిమిత్తం పంచగని వెళ్లాడు. అక్కడ అనుకోకుండా ఆలస్యమై పరీక్షకు వెళ్లడానికి కొద్ది నిమిషాలే మిగిలింది. రోడ్డు మార్గాన భారీ ట్రాఫిక్ లో చిక్కి ఎటూ సమయానికి చేరలేనని గ్రహించి అసాధారణ ఆలోచన చేశాడు. పంచగని జీపీ అడ్వెంచర్‌కు వెళ్లి సమస్య చెప్పాడు. సకాలంలో చేర్చాలని కోరాడు. సాహస క్రీడల నిపుణుడు గోవింద్ యెవాలే బృందం పారాగ్లైడింగ్ ద్వారా మనవాడిని నేరుగా పరీక్ష కేంద్రం సమీపంలో సురక్షితంగా ల్యాండింగ్ చేశారు. ఈ వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేశారు. దాంతో సమర్్థపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సుందరమైన ప్రకృతి దృశ్యాలతో పాటు పారాగ్లైడింగ్కు కూడా సతారా పెట్టింది పేరు. -
మేం మారాం..!
సాక్షి, హైదరాబాద్: ట్రాన్స్జెండర్లకు సమాజంలో సముచిత స్థానం, గుర్తింపు ఇవ్వాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ట్రాఫిక్ విభాగంలో హోంగార్డుల మాదిరి ట్రాఫిక్ అసిస్టెంట్లు గా ఎంపిక చేయడం ద్వారా ఉపాధి కల్పించాలని ఆదేశించింది. దీంతో హైదరాబాద్ ట్రాఫిక్ విభాగంలో పైలెట్ ప్రాజెక్టుగా దీన్ని అమలు చేశారు. ఏదో ఆషామాషీగా కాకుండా ఎంపిక, శిక్షణలో కట్టుదిట్టంగా వ్యవహరించారు. గత ఏడాది డిసెంబర్ 4న గోషామహల్‌లోని పోలీసు స్టేడియంలో ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. మహిళా శిశుసంక్షేమ శాఖ కూడా ఇందులో పాలుపంచుకుంది.సాంఘిక సంక్షేమ శాఖ నుంచి అర్హులైన ట్రాన్స్జెండర్ల వివరాలను పోలీసులు సేకరించారు. కనీసం పదో తరగతి ఉత్తీర్ణులై 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు్కలు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. 165 సెంటీమీటర్ల ఎత్తు, (ఎస్టీలు 160 సెం.మీ) కలిగి ఉండాలనే నిబంధన విధించారు. శరీర దారుఢ్య పరీక్షల్లో భాగంగా 800 మీటర్ల పరుగు, లాంగ్ జంప్, షాట్ పుట్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు మొత్తం 58 మంది హాజరు కాగా 44 మంది ఎంపికయ్యారు. హావభావాల నుంచి అన్నీ మార్చి.. సిటీ ట్రాఫిక్ విభాగం ఆదీనంలోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (టీటీఐ) అధికారులు గోషామహల్ స్టేడియం కేంద్రంగా ఈ శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టారు. మొత్తం 15 రోజుల ట్రైనింగ్‌లో నాలుగు రోజులు కేవలం వారి ప్రవర్తన మార్చడానికే వెచ్చించారు. ఈ ట్రాన్స్జెండర్లు ఏళ్ల తరబడి ఓ విధమైన హావభావాల ప్రదర్శన, విపరీత ప్రవర్తన, క్రమశిక్షణ లేని జీవనశైలికి అలవాటుపడ్డారు.వీరిని పోలీసు విభాగంలోకి తీసుకుంటుండడం, అదీ ప్రజలతో నేరుగా సంబంధాలు కలిగి ఉండే ట్రాఫిక్ వింగ్‌లో పని చేయించనుండటంతో అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. నడక, నడవడిక, హావభావాలు, మాట తీరే కాదు... ఆహారం తినే విధానాన్నీ చక్కదిద్దారు. వారిలో స్ఫూర్తి నింపడం కోసం వారికి హీరోయిన్లు, యాంకర్ల వీడియోలు చూపించారు. ఆపై ఐదో రోజు నుంచి ట్రాఫిక్ శిక్షణ మొదలైంది. క్షేత్రస్థాయిలో సమర్థంగా విధులు అంబర్‌పేట, బహదూర్‌పుర, బంజారాహిల్స్, బేగంపేట, బోయిన్పల్లి, చిక్కడపల్లి, చాంద్రాయణగుట్ట, చిలకలగూడ, జూబ్లీహిల్స్, కాచిగూడ, లంగర్‌హౌస్, మహంకాళి, మలక్‌పేట్, మారేడ్‌పల్లి, నల్లకుంట, పంజగుట్ట, ఎస్సార్‌నగర్, సంతోష్‌నగర్, తిరుమలగిరి, టోలిచౌకి.. ఈ 20 ట్రాఫిక్ పోలీసుస్టేషన్లలోనూ వీరు క్షేత్రస్థాయి విధుల్లోనే ఉండటం గమనార్హం. ⇒ ట్రాఫిక్ విభాగంలో ట్రాన్స్జెండర్ల సేవలు అంటూ ప్రభుత్వం ప్రకటించినప్పుడు అంతా తేలిగ్గా తీసుకున్నారు... ⇒ సిటీ పోలీసులు ట్రాఫిక్ అసిస్టెంట్లుగా 44 మందిని ఎంపిక చేసిన తర్వాత శిక్షణ అయ్యే – వరకు వీళ్లు ఉంటారా? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. ⇒ శిక్షణ పూర్తి చేసుకున్న 39 మంది విధుల్లో చేరనున్నారని తెలిశాక, వీళ్లు పట్టుమని పది రోజులు కూడా పని చేయరని, వివాదాలు తప్పవని భావించారు. ⇒ కానీ నెల రోజులుగా 38 మంది ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పని చేస్తుంటే అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ⇒ ఒకరిద్దరు ట్రాన్స్జెండర్లు భవిష్యత్తులో జరగబోయే కానిస్టేబుల్, ఎస్సై పరీక్షల్లోనూ పోటీపడేలా కోచింగ్ తీసుకునే ప్రయత్నాలు ప్రారంభించడం మరింత ఆసక్తికరం.వెన్నుతట్టి ప్రోత్సహించి..ఎంపికైన 44 మందిలో 39 మంది మాత్రమే శిక్షణ పూర్తి చేసుకున్నారు. మిగిలిన ఐదుగురూ అప్పటికే ఉన్న ఉద్యోగాల కారణంగా వెళ్లిపోయారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించిన తర్వాత తుది జాబితా ఖరారు చేశారు. ‘సమాజంలో మీకు ఎదురవుతున్న అవమానాలు, మీ పట్ల వివక్షను చూసిన ప్రభుత్వం ఈ అవకాశం ఇచ్చింది.మీ పని తీరుపైనే మీలాంటి ఇతరుల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది..’అంటూ వెన్ను తట్టి హితవు పలికిన నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ డిసెంబర్ 22న వీరి శిక్షణ పూర్తి అయినట్లు ప్రకటించారు. వీరి కవాతునూ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో వీక్షించారు. అనంతరం డిసెంబర్ 26 నుంచి ట్రాన్స్జెండర్లు ట్రాఫిక్ అసిస్టెంట్లుగా తమ కొత్త జీవితం ప్రారంభించారు. ఇప్పటికి నెల గడిచింది. ఈ నెల రోజుల్లో కేవలం ఒక్కరు మాత్రమే ఈ ఉద్యోగం వదిలి వెళ్లగా...మిగిలిన వారు సమర్థంగా తమ విధులు నిర్వర్తిస్తున్నారు. -
పల్లె నుంచి నగరానికి తిరుగు పయనం
చౌటుప్పల్/ చౌటుప్పల్ రూరల్: సంక్రాంతి పండుగకు స్వగ్రామాలకు వెళ్లిన వారు తిరుగుపయనమయ్యారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ వైపు వాహనాలు బారులుతీరాయి. దీంతో గురువారం హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా వాహనాల రద్దీ నెలకొంది. హైదరాబాద్ మార్గంలో ఉదయం నుంచి వాహనాల రాక పెద్ద ఎత్తున సాగుతూనే ఉంది. జంక్షన్లు, క్రాసింగ్‌ల వద్ద వాహనాలు సాఫీగా ముందుకుసాగేందుకు, ప్రమాదాల నివారణకు పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. జాతీయ రహదారి వెంట ఉన్న గ్రామాల కూడలి ప్రాంతాల్లో అదనపు సిబ్బందిని నియమించారు. పంతంగి టోల్‌ప్లాజా వద్ద సాఫీగా.. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాలు సాఫీగా సాగాయి. టోల్‌ప్లాజాలో 16 గేట్లు ఉండగా, హైదరాబాద్ వైపు 12 గేట్ల నుంచి వాహనాలను పంపించారు. విజయవాడ వైపు నుంచి వస్తున్న వాహనాలకు ఎలాంటి ఇబ్బంది ఏర్పడకుండా జాతీయ రహదారిపై హైవే అథారిటీ అధికారులు గుర్తించిన 17 సమస్యాత్మక ప్రాంతాలతోపాటు ప్రతి గ్రామ స్టేజీ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. -
భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక బస్సులు నడుపుతున్న ఆర్టీసీ
-
కమ్మేస్తున్న ‘పొగమంచు'.. ‘డ్రైవింగ్'లో ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
సాక్షి,తెలంగాణ : మీరు రాత్రి సమయాల్లో వాహనం నడుపుతున్నారా? ప్రయాణ సమయంలో ఎదురుగా వస్తున్న వాహనాల వల్ల ఇబ్బంది పడ్డారా? అయితే ప్రయాణంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే లో బీమ్ లైట్లను వినియోగించాలని రవాణా శాఖ కోరుతుంది. ఉత్తరాది రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరగడంతో పాటు దట్టమైన పొగమంచు కమ్మేస్తోంది. దేశంలోని పలు రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాల్లో చలి తీవ్రత బాగా పెరిగింది. ఆయా రాష్ట్రాల్లో పొగమంచు కారణంగా దృశ్య నాణ్యత పడిపోయింది. దట్టమైన పొగమంచులో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక పలు చోట్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. అయితే, రాత్రి సమయాల్లో ప్రయాణికులు తమ వాహనాలలో లో బీమ్ లైట్లను వినియోగించాలని తద్వారా ప్రమాదాలను అరికట్టవచ్చని రవాణ శాఖ అధికారులు చెబుతున్నారు. అందుకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌ను ఉదహరిస్తుంది. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి కాన్వాయ్ సైతం లో బీమ్‌తో ప్రయాణించింది. తోటి వాహనదారుల శ్రేయస్సు కోసం ముఖ్యమంత్రి కాన్వాయ్‌లోని వాహనాలు లో బీమ్‌లో ప్రయాణించాయని, మీరు కూడా లో బీమ్‌ను వినియోగించాలని ఓ నెటిజన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. Hon’ble Chief Minister Shri @revanth_anumula ’s entire convoy is using low beams.The reason is, they want to understand what is behind them. Let us all learn from them and Use low beams when we are too close to vehicle in front and road is well lit!@HiHyderabad @HYDTP pic.twitter.com/FgRZpC3Gn0— Team Road Squad🚦🚴♀️ (@Team_Road_Squad) December 19, 2024‘లో బీమ్ లైట్ల’ డ్రైవింగ్‌తో ఉపయోగాలు అవాంతరాలు లేని ప్రయాణం: నగరాలు, ఇతర రహదారుల్లో లో బీమ్ లైట్లను వినియోగించడం వల్ల ఎదురుగా ఉన్న ఇతర వాహనాలు నడిపై డ్రైవర్ కళ్లకు అంతరాయం ఉండదు. మార్గ మధ్యలో ఎలాంటి అడ్డంకులున్నా సులభంగా గుర్తించవచ్చారు. భద్రత: హై బీమ్ లైట్లను వినియోగించడం వల్ల ఎదురు వస్తున్న వాహనదారులకు అసౌకర్యం కలుగుతుంది. ప్రమాదానికి కారణమవుతాయి. లో బీమ్ లైట్లతో ప్రమాదాల్ని నివారించవచ్చు. తోటి వాహనదారుల సంక్షేమం: లో బీమ్ లైటన్లను ఉపయోగించడం ఎదురుగా వాహనాల్లో వస్తున్న వాహనదారుల సంక్షేమాన్ని కోరిన వారిమవుతాం. ప్రతి ఒక్కరికీ సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణం కొనసాగేందుకు ఉపయోగపడుతుంది. నిబంధనలు: అనేక నగరాల్లో జరిగే ప్రమానాన్ని నివారించేలా, లేదంటే ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు లో బీమ్ లైట్లు ఉపయోగించుకోవచ్చనే నిబంధనలు ఉన్నాయి. -
రైతుల ఆందోళన.. ఉద్రిక్తత.. ట్రాఫిక్ జామ్
న్యూఢిల్లీ: రైతుల ఆందోళనతో ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ప్రభుత్వం సరిహద్దుల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించింది. రైతుల పాదయాత్రతో చిల్లా సరిహద్దులో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. #WATCH | Noida, Uttar Pradesh: Traffic congestion seen at Chilla Border as farmers from Uttar Pradesh are on a march towards Delhi starting today. pic.twitter.com/A5G9JuT1KM— ANI UP/Uttarakhand (@ANINewsUP) December 2, 2024భారతీయ కిసాన్ పరిషత్ (బికేపీ)నేత సుఖ్బీర్ ఖలీఫా మీడియాతో మాట్లాడుతూ కొత్త వ్యవసాయ చట్టాల ప్రకారం న్యాయమైన పరిహారం, మెరుగైన ప్రయోజనాలను డిమాండ్ చేస్తూ రైతులు పాదయాత్ర చేపట్టారన్నారు. తూర్పు ఢిల్లీ పోలీసుల అధికారి అపూర్వ గుప్తా మాట్లాడుతూ ఢిల్లీలో రైతుల ఆందోళనపై తమకు ముందస్గు సమాచారం అందిందని తెలిపారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున, రైతుల పాదయాత్రకు అనుమతి ఇవ్వలేదన్నారు. శాంతిభద్రతల పరిస్థితికి విఘాతం తలెత్తకుండా, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చూస్తున్నామన్నారు.#WATCH | Uttar Pradesh: Security heightened in Noida as farmers from Uttar Pradesh are on a march towards Delhi starting today. pic.twitter.com/X67KeeUDba— ANI (@ANI) December 2, 2024డిసెంబరు 6వ తేదీ నుంచి తమ సభ్యులు ఢిల్లీ వైపు పాదయాత్రను ప్రారంభిస్తారని, కేరళ, ఉత్తరాఖండ్, తమిళనాడు రాష్ట్రాల రైతు సంఘాలు కూడా అదే రోజు ఆయా అసెంబ్లీల వైపు పాదయాత్రలు చేసేందుకు సిద్ధమవుతున్నారని కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ సమితి ప్రధాన కార్యదర్శి సర్వన్ సింగ్ పంధేర్ మార్చ్ తెలిపారు.ఇది కూడా చదవండి: నేడు రైతుల ఆందోళన.. ప్రభుత్వం అప్రమత్తం -
సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాలో.. సిగ్నల్ దాటాలంటే చుక్కలే
సాక్షి బెంగళూరు: ఐటీ ఇండస్ట్రీలో దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తూ సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా గుర్తింపు పొందిన బెంగళూరు నగరం ప్రస్తుతం ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకుని విలవిల్లాడుతోంది. నగర వాసులకు ట్రాఫిక్ అనేది నేడు అతిపెద్ద సమస్యల్లో ఒకటిగా మారింది. రద్దీ సమయాల్లో ఒక్కో ట్రాఫిక్ సిగ్నల్ దాటాలంటే రెండు మూడు సార్లు ఆగి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ప్రశాంత వాతావరణం, నిండైన పచ్చదనంతో ఒకప్పుడు ఉద్యాననగరంగా గుర్తింపు పొందిన బెంగళూరులో ప్రస్తుతం జనాభా సంఖ్య కంటే వాహనాల సంఖ్య ఎక్కువగా ఉంది. ఏటా వాహనాల సంఖ్య భారీగా పెరుగుతూ రావడంతో ప్రస్తుతం నగరంలో రోడ్ల సమర్థ్యానికి మించి వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రస్తుతం నగరంలో 1.40 కోట్లకు పైగా వాహనాలు ఉన్నాయి. దీంతో రోడ్ల విస్తరణకు బీబీఎంపీ (బృహత్ బెంగళూరు మహానగర పాలికె) అడుగులు వేస్తోంది. దశాబ్ద కాలంలో మారిన నగరం..శరవేగంగా విస్తరిస్తున్న మహానగరం కావడం, కాంక్రీటీకరణ, అభివృద్ధి, మౌలిక వసతుల విస్తరణ తదితర కారణాల వల్ల బెంగళూరు గడిచిన దశాబ్ద కాలంలో ఎంతో మారిపోయింది. విస్తరిస్తున్న నగరానికి అనుగుణంగా మెట్రో, ఫ్లయ్వోవర్లు, అండర్‌పాస్‌లు నిర్మించినప్పటికీ ట్రాఫిక్ రద్దీకి పరిష్కారం దొరకడంలేదు. రోడ్ల విస్తరణ అభివృద్ధికి కావాల్సిన స్థలాన్ని స్వాదీనం చేసుకునేందుకు అవసరమైన ఆరి్థక వనరులు బీబీఎంపీ వద్ద లేకపోవడంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. బెంగళూరు ట్రాఫిక్ రద్దీపై ఒక మహిళ ఇటీవల ఎక్స్‌లో చేసిన చిన్న పోస్టు ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రష్యాలో ఒక మూల నుంచి ఇంకో మూలకు కారులో ప్రయాణించాలంటే 149 గంటలు పడుతుందని, అంత సేపు ప్రయాణించినా ఇంకా రష్యాలోనే ఉంటారని, బెంగళూరు పరిస్థితి కూడా సరిగ్గా ఇలాగే ఉందంటూ ఇక్కడి ట్రాఫిక్ని ఎద్దేవా చేస్తూ అనఘ అనే మహిళ ఎక్స్‌లో పోస్టు చేసింది. ఈ ట్వీట్‌పై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి.ప్రస్తుతం ఈ ట్వీట్‌కు పది లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఆమె చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం ఇంటర్నెట్లో భారీ చర్చకు తెరతీసింది. అయితే బెంగళూరు ట్రాఫిక్ రద్దీకి ఆమె ట్వీట్ ఒక చిన్న ఉదాహరణ మాత్రమేనని, నగరవాసులను ఎవ్వరిని కదిలించినా ఇలాంటి ట్రాఫిక్ వ్యథలు వందల కొద్దీ చెబుతారని నెటిజన్లు అంటున్నారు.బీబీఎంపీ పరిధిలో రహదారుల పొడవు: 12,878 కి.మీఇందులో ఆర్టిరియల్, సబ్ ఆర్టిరియల్ (అధిక సామర్థ్యంగల) రోడ్లు: 1344.84 కి.మీ నగరంలో రిజిష్టర్ అయిన వాహనాల సంఖ్య: 1.40 కోట్లుటామ్టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ ప్రకారందేశంలో అత్యధిక ట్రాఫిక్ ఉండే నగరాల్లో బెంగళూరు స్థానం: 1ప్రపంచంలో అత్యధిక ట్రాఫిక్ ఉండే నగరాల్లో బెంగళూరు స్థానం: 6నగరంలో సగటున 10 కి.మీ ప్రయాణించేందుకు పట్టే సమయం: 28 నిమిషాలు -
Meetho Sakshi: మేడ్చల్ రోడ్లపై నరకం..
-
OTT Review: ఊహకందని థ్రిల్లింగ్ వెకేషన్
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హాలీవుడ్ చిత్రం ‘ట్రాఫిక్’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.వెకేషన్ అంటే ఆనందంగా... సరదాగా అందరితో గడిపే కాన్సెప్ట్. కానీ అదే వెకేషన్ ఊహకందని, ఊహించలేని నైట్ మేర్ అయితే... ఈ లైన్‌ను ఆధారంగా చేసుకునే హాలీవుడ్ దర్శకుడు డీన్ టేలర్ ‘ట్రాఫిక్’ చిత్రాన్ని రూపొందించారు. సినిమా మొత్తం గ్రిప్పింగ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో నిండి ఉంటుంది. ఇది పెద్దల సినిమా. ΄ûలా పాట్టన్, ఒమర్ ఆప్స్ వంటి ప్రముఖ హాలీవుడ్ నటులు లీడ్ రోల్స్‌లో నటించారు.ఇక సినిమా కథ ప్రకారం... బ్రీ కాలిఫోర్నియాలోని ఓ దినపత్రికలో పని చేసే జర్నలిస్ట్. తాను రాసే కథనాలు సరిగ్గా పత్రికలో రావడం లేదని తపన పడుతూ ఉంటుంది. ఈ దశలో బ్రీ తన ప్రియుడు జాన్‌తో కలిసి అతని స్నేహితుడి డారెన్ గెస్ట్ హౌస్‌కి వెకేషన్‌కి వెళతారు. ఈ వెకేషన్ లొకేషన్ శాక్రిమెంటోలోని కొండ లోయల ప్రాంతంలో దూరంగా ఉంటుంది. ఈ వెకేషన్‌కి వెళ్లే సమయంలో బ్రీ, జాన్‌కు ఓ గ్యాస్ స్టేషన్లో కాలిఫోర్నియా బైకర్స్‌తో చిన్నపాటి ఘర్షణ జరుగుతుంది.ఇదే కథకు మలుపు. ఆ ఘర్షణతో బైకర్స్ వీళ్ళ కారును వెంబడిస్తారు. బ్రీ వాళ్ళు గెస్ట్ హౌస్‌కి వెళ్లిన తరువాత బైకర్స్ ఏం చేశారు? వాళ్లను బ్రీ ఎలా ఎదుర్కొంది? ఆ సంఘటన తర్వాత తన జర్నలిస్ట్ కెరీర్లో బ్రీ సాధించిన గొప్ప అంశమేంటి? అన్న విషయాలన్నీ లయన్స్ గేట్ వేదికగా స్ట్రీమ్ అవుతున్న ‘ట్రాఫిక్’లో చూడాల్సిందే. రోజు వారీ ట్రాఫిక్ కష్టాలతో సతమతమయ్యేవారు ఈ వీకెండ్ ‘ట్రాఫిక్’ సినిమాతో థ్రిల్లింగ్ వెకేషన్ అనుభూతి పొందుతారనేది నిజం. సో... ఎంజాయ్ ది ‘ట్రాఫిక్’. – ఇంటూరు హరికృష్ణ -
మొబైల్ డేటా ట్రాఫిక్.. అగ్రగామిగా జియో
న్యూఢిల్లీ: మొబైల్ డేటా ట్రాఫిక్‌లో వరుసగా మూడవ త్రైమాసికంలో ప్రపంచ అగ్రగామిగా రిలయన్స్ జియో కొనసాగుతోందని కన్సల్టింగ్, రిసర్చ్ కంపెనీ టెఫిషంట్ తెలిపింది. ప్రపంచ ప్రత్యర్థులను జియో మించిపోయిందంటూ ఎక్స్ వేదికగా వ్యాఖ్యానించింది.జియో, చైనా మొబైల్, ఎయిర్టెల్, చైనా యునికామ్తోపాటు వొడాఫోన్ ఐడియా తదితర ఆపరేటర్ల మొబైల్ డేటా ట్రాఫిక్‌ను పోలుస్తూ ఒక పత్రాన్ని పంచుకుంది. ‘చైనా మొబైల్ కేవలం 2 శాతం వార్షిక వృద్ధి సాధించింది.జియో, చైనా టెలికాం 24 శాతం, ఎయిర్టెల్ 23 శాతం వృద్ధి నమోదు చేశాయి. చైనా మొబైల్లో ఏం జరుగుతోంది? అంటూ టెఫిషంట్ ప్రశ్నించింది. సెప్టెంబర్ చివరినాటికి జియో మొత్తం మొబైల్ చందాదార్ల సంఖ్య 47.88 కోట్లుంది. -
నిమజ్జనం.. గంటల కొద్దీ ట్రాఫిక్ ఇబ్బందుల్లో జనం
దాదర్: నిమజ్జనోత్సవాలు ముగియడంతో స్వగ్రామాలకు తరలిపోయిన వేలాది మంది భక్తులు ముంబై దిశగా తిరగు పయన మయ్యారు. ఒక్కసారిగా వేలాది వాహనాలు బయటపడటంతో ముంబై–గోవా జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ సమస్య మరింత తీవ్రమైంది. ఇప్పటికే అనేక మంది గౌరీ గణపతులను గురువారం నిమజ్జనం చేసి శుక్రవారం నుంచి తిరుగు పయనమయ్యారు. దీంతో ట్రాఫిక్ జామ్ సమస్య ఏర్పడింది. ఇదిలా ఉండగా బుధవారం మళ్లీ ముంబై–గోవా జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించిపోయింది. పెద్ద సంఖ్యలో వాహనాలు బయటపడటం ఒక కారణమైతే, రోడ్లపై ఏర్పడిన గుంతలు మరో కారణమని తెలుస్తోంది. సాధారణంగా ముంబై–గోవా జాతీయ రహదారి నిత్యం తేలికపాటి, ట్రక్కులు, ట్యాంకర్లు, కంటైనర్లు, ట్రాలీలు తదితర సరుకులు చేరేవేసే భారీ వాహనాల రాకపోకలతో బిజీగా ఉంటుంది. గణేశోత్సవాల సమయంలో ముంబై నుంచి కొంకణ్ దిశగా వెళ్లే భక్తుల వాహనాల సంఖ్య లక్షల్లో ఉంటుంది. వీరంతా ముంబై–గోవా జాతీయ రహదారినే ఆశ్రయిస్తారు. దీంతో గణేశోత్సవాలు ప్రారంభానికి మూడు రోజుల ముందు నుంచి ఈ రహదారిపై (నిత్యావసర సరుకులు చేరేవేసే వాహనాలు మినహా) భారీ వాహనాలకు నిషేధం ఉండింది. ఉత్సవాలు ముగిసిన రెండు రోజుల వరకు ఈ నియమాలు అమలులో ఉంటాయి. దీన్ని బట్టి ముంబై–గోవా జాతీయ రహ దారి ఏ స్థాయిలో బిజీగా ఉంటుందో ఇట్టే అర్థమైపోతుంది. సాధారణంగా నిమజ్జనోత్సవాలు సాయంత్రం ముగియగానే అదే రోజు అర్ధరాత్రి దాటగానే అనేక మంది తిరుగుపయనమవుతా రు. కానీ ఈ సారి మంగళవారం సాయంత్రం ని మజ్జనోత్సవాలు ముగిసినప్పటికీ అనేక మంది బుధవారం మధ్యాహ్నం తరువాత బయలుదేరారు. బుధవారం మిలాద్ ఉన్ నబీ పండుగ కావడంతో ప్రభుత్వం సెలవు ప్రకటించింది. దీంతో గురువారం ఉదయమే విధుల్లో చేరే ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, ఇతర రంగాల్లో పనిచేస్తున్న కారి్మకులు, కూలీలు, వ్యాపారులు బుధవారం మధ్యాహ్నం తరువాత కుటుంబ సభ్యులతో ముంబై దిశగా తిరుగు పయనమయ్యారు. ఇటీవల కరిసిన భారీ వర్షాలకు రోడ్లన్నీ పాడైపోయా యి. ఎక్కడ చూసిన గుంతలు దర్శనమిచ్చాయి. దీనికి తోడు రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు అనేక చోట్ల స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేశారు. దీంతో వాహనాల వేగానికి బ్రేక్ పడింది. (వెళ్లి రావయ్యా.. బొజ్జ గణపయ్య! 19 గంటల పాటు సాగిన శోభాయాత్ర )15–17 గంటల ప్రయాణం భక్తుల వాహనాలకు (అప్, డౌన్లో) ప్రభుత్వం టోల్ నుంచి మినహాయింపు నిచ్చినప్పటికీ గుంతల కారణంగా వేగానికి కళ్లెం పడింది. దీంతో పది గంటల్లో పూర్తికావల్సిన ప్రయాణం 15–17 గంటలు పడుతుంది. ముంబై–గోవా జాతీయ రహదారిపై ఎక్కడ చూసినా పికప్ వాహనాలు, టూర్స్ అండ్ ట్రావెల్స్ బస్సులు, ఆర్టీసీ బస్సులు, సొంత వాహనాలే దర్శనమిచ్చాయి. విపరీతమైన ట్రాఫిక్ జామ్ కారణంగా గంటల తరబడి సీట్లో కూర్చుండలేక అనేక మంది కొద్ది సేపు విశ్రాంతి తీసుకునేందుకు రోడ్డుపక్కనున్న డాబాలను ఆశ్రయించారు. దీంతో డాబా వాలాల బేరాలు జోరందుకున్నాయి. శీతలపానీయాలు, వాటర్ బాటిళ్లు, చీప్స్, తదితర చిరుతిళ్ల ప్యాకెట్లు దొరక్కుండా పోయాయి. కొన్ని చోట్ల మందకొడిగా, మరికొన్ని చోట్ల నిలిచిపోయిన వాహనాలను ట్రాఫిక్ పోలీసులు క్రమబదీ్ధకరించేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఒకపక్క గుంతలు, పాడైపోయిన రోడ్లతో వాహనాలు ఎటూ కదలలేని పరిస్థితి. దీంతో వాహనాలు ఇటు ముందుకు వెళ్లలేక అటు తిరిగి వెనక్కి వెళ్లి మరో మార్గం మీదుగా వెళ్లలేక నరకయాతన అనభవించారు. -
వెనిస్లో ముంబై స్టైల్ ట్రాఫిక్: ఆనంద్ మహీంద్రా ట్వీట్
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' ఎప్పటికప్పుడు తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఆసక్తికరమైన వీడియోలు షేర్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగా తాజాగా మరో వీడియో షేర్ చేశారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.ఆనంద్ మహీంద్రా షేర్ చెందిన వీడియోలో ఒక కాలువలో పడవలు.. ఒకదాని వెంట ఒకటి వెళ్తూ ఉన్నాయి. ఈ వీడియో షేర్ చేస్తూ.. ''ముంబై తరహా ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకోవడానికి మాత్రమే వెనిస్ వరకు ప్రయాణించారు. ముంబైతో పోలిస్తే ఇది కొంత తక్కువే అని నేను అంగీకరిస్తున్నాను'' అని అన్నారు. దీనికి సండే ఫీలింగ్ అంటూ ఓ హ్యస్టాగ్ కూడా ఇచ్చారు.ఇదీ చదవండి: రాత్రిపూట వెలుగు ఆర్డర్ చేసుకోవచ్చు.. మీరు ఎక్కడంటే అక్కడ!Traveled all the way to Venice only to run into a Mumbai-style traffic jam!(Ok, I admit this traffic pile-up is less stressful…🙂)#SundayFeeling pic.twitter.com/n25G8Y5upk— anand mahindra (@anandmahindra) September 15, 2024 -
వెంబడిస్తున్న టీఎస్ఐని కారుతో ఢీకొట్టి..
ఢిల్లీకి ఆనుకునివున్న నోయిడాలో దారుణం చోటుచేసుకుంది. అతివేగంతో వెళుతున్న కారును ఆపేందుకు ప్రయత్నించిన ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్(టీఎస్ఐ)ను కారుతో బలంగా ఢికొట్టి, తీవ్రంగా గాయపరిచిన ఉదంతం వెలుగు చూసింది.మీడియాకు అందిన వివరాల ప్రకారం ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ జై ప్రకాష్ సింగ్ నోయిడాలోని రజనీగంధా కూడలిలో విధులు నిర్వహిస్తుండగా, అతనికి అనుమానాస్పద వాహనం గురించిన సమాచారం అందింది. వెంటనే ఆయన ఆ వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించగా, అందులోని డ్రైవర్ కారును అత్యంత వేగంగా పోనిచ్చాడు.వెంటనే జై ప్రకాష్ సింగ్ ఒక స్కూటీ లిఫ్ట్ తీసుకొని కారును వెంబడించి, అట్టా రెడ్ లైట్ దగ్గర ఓవర్టేక్ చేసి కారును ఆపడానికి ప్రయత్నించారు. అయితే ఇంతలో ఆ కారు డ్రైవర్ స్కూటీని ఢీకొట్టి, జై ప్రకాష్ సింగ్‌ను తీవ్రంగా గాయపరిచి, కారును అక్కడే వదిలేసి పరారయ్యాడు. టీఎస్ఐ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆ వాహనాన్ని సీజ్ చేశారు. నిందితుని కోసం గాలింపు చేపట్టారు. -
హైదరాబాద్‌లో భారీ వర్షం
సాక్షి,హైదరాబాద్ : హైదరాబాద్‌లో వర్షం దంచి కొట్టింది.. సోమవారం మధ్యాహ్నం కుండ పోతగా వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాలు జలమయ్యాయి. ముఖ్యంగా, రాజేంద్ర నగర్, మణికొండ, గండిపేట, జూబ్లీహిల్స్, బంజరాహిల్స్, సికింద్రాబాద్, నాంపల్లి, మెహిదిపట్నం, టోలీచౌకి ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. దీంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అవ్వడంతో వాహనదారులు తీవ్రం ఇబ్బందులు పడ్డారు. పలు చోట్ల రోడ్లపై నడుములోతు నీళ్లు నిలిచిపోవడంతో ద్విచక్ర వాహనాలు మొరాయించాయి.హైదరాబాద్‌లో వర్షం పడడంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మధ్యాహ్నం వరకు తీవ్రంగా ఎండ కాసింది. ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరయ్యారు. అంతలోనే భారీ వర్షం కమ్ముకొచ్చింది. తొలుత చిరుజల్లులు మొదలయ్యాయి. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా భారీ వర్షం కురిసింది. రోడ్లపైన ఉన్నవాళ్లు ఎక్కడైనా తలదాచుకుందామా అనుకునేలోపు పూర్తిగా తడిచిపోయారు. దీనికి తోడు ఓ వైపు ట్రాఫిక్ జామ్, రోడ్లపై భారీగా నిలిచిపోయిన నీళ్లతో ప్రత్యక్షంగా నరకం చూసినంత పనైంది. మరోవైపు నగరంలో మరో రెండు మూడు గంటల్లో భారీగా వర్షం పడే అవకాశం ఉందని జారీ చేసిన హెచ్చరికలతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. -
K Padmaja: సవాళ్లే పట్టాలెక్కించేది
దక్షిణ మధ్య రైల్వేలో ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ (పిసిసిఎమ్) గా భారతీయ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ సీనియర్ అధికారి కె.పద్మజ హైదరాబాద్ రైల్ నిలయంలో ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. 1991 ఐఆర్టిఎస్ బ్యాచ్‌కు చెందిన పద్మజ ఎస్‌సిఆర్‌లో మొట్టమొదటి మహిళా పిసిసిఎమ్. ‘ఇప్పుడంటే మహిళా అధికారులను అందరూ అంగీకరిస్తున్నారు కానీ, 30 ఏళ్ల క్రితం పురుష ఉద్యోగులు నా నుంచి ఆర్డర్స్ తీసుకోవడానికే ఇబ్బంది పడేవారు..’ అంటూ నాటి విషయాలను చెబుతూనే, ఉద్యోగ జీవనంలో సవాళ్లను ఎదుర్కొన్న తీరు తెన్నులను ‘సాక్షి’తో పంచుకున్నారు.‘‘సౌత్ సెంట్రల్ రైల్వేలో మొట్టమొదటి మహిళా ఆఫీసర్‌గా ఈ పోస్ట్‌లోకి రావడం చాలా సంతోషం అనిపించింది. ఇప్పుడంటే వర్క్‌ఫోర్స్‌లో చాలామంది అమ్మాయిలు వస్తున్నారు. కానీ, నేను జాయిన్ అయినప్పుడు ఒక్కదాన్నే ఉండేదాన్ని. కొత్తగా వర్క్‌లో చేరినప్పుడు ఒక తరహా స్ట్రెస్ ఉండేది. నన్ను నేను చాలా సమాధానపరుచుకునేదాన్ని. ‘ఒక్కదాన్నే ఉన్నాను అని ఎందుకు అనుకోవాలి.. ఎవరో ఒకరు రూట్ వేస్తేనే ఆ తర్వాత వచ్చే మహిళలకు మార్గం సులువు అవుతుంది కదా’ అనుకునేదాన్ని.ఎదుర్కొన్న సవాళ్లుమొదట్లో డివిజనల్ ఆఫీస్ మేనేజర్‌గా జాయిన్ అయినప్పుడు ఒక మహిళను అధికారిగా అంగీకరించడానికి సహోద్యోగులకే కష్టంగా ఉండేది. నేను మొదటిసారి ఇన్స్పెక్షన్కి వెళ్లినప్పుడు స్టేషన్ మాస్టర్‌కి నన్ను నేను పరిచయం చేసుకున్నాను. మొదట వాళ్లు నమ్మలేదు. ఆఫీసుకు ఫోన్ చేసి ‘ఇక్కడెవరో లేడీ వచ్చారు. ఆవిడేమో నేను డివిజనల్ ఆఫీస్ మేనేజర్ని అంటోంది, ఏమిటిది?’ అని అడిగారు. మా కొలీగ్ ‘ఆవిడ కూడా నాలాగే ఆఫీసర్’ అంటే అప్పుడు వాళ్లు అంగీకరించక తప్పలేదు. ఆ స్టేజ్ నుంచి ఇక్కడకు రావడానికి చాలా సవాళ్లు ఉన్నాయి. మొదట్లో గుర్తించిన మరో విషయం ఏంటంటే తోటి ఉద్యోగులు చాలామంది నా నుంచి ఆర్డర్స్ తీసుకోవడానికే ఇబ్బంది పడేవారు. దీంతో ‘నేను ఎక్స్పర్ట్ అయితేనే ఈ అసమానతను తొలగించగలను’ అనుకున్నాను. అందుకు, నా పనిని ఎప్పుడూ ముందు చేసినదానికన్నా బెటర్‌గా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చాను. పనిచేసే చోట రూల్స్ పరంగా అన్నీ క్లియర్‌గా ఉంటాయి. అయితే, మనతో ఉండే కొలీగ్స్, సీనియర్స్ విషయంలో వారి ప్రవర్తనలో తేడాలు కనిపిస్తుంటాయి. ‘ఇంత సమర్థంగా చేస్తున్నా కూడా ఇంకా వివక్షతోనే చూస్తున్నారే..’ అని అనిపించేది. ఇంటì నుంచి బయటకు వచ్చినప్పుడు వీటన్నింటినీ ఎదుర్కోకతప్పదు అన్నట్టుగా ఉండేవి ఆ రోజులు. ఇప్పటి తరంలో ఈ ఆలోచన పూర్తిగా మారిపోయింది. అయితే, ఏదీ అంత సులువైనది కాదు, కష్టమైన జర్నీయే. కానీ, నిన్నటి కన్నా ఈ రోజు బెటర్‌గా మార్చుకుంటూ రావడమే నన్ను ఇలా ఒక ఉన్నత స్థానంలో మీ ముందుంచ గలిగింది. ముఖ్యమైనవి వదులుకోవద్దుపిల్లల చిన్నప్పుడు మాత్రం తీరిక దొరికేది కాదు. ఉద్యోగం, ఇల్లు, వేడుకలు.. వీటన్నింటిలో కొన్ని త్యాగాలు చేయక తప్పలేదు. వాటిని మనం అంగీకరించాల్సిందే. అయితే, ముఖ్యమైన వాటిని వదిలేదాన్ని కాదు. నాకు ఇద్దరు కూతుళ్లు. ఇప్పుడు వాళ్లు వర్కింగ్ ఉమెన్. డ్యూటీ చూసుకుంటూనే పిల్లల పేరెంట్ టీచర్ మీట్, స్పోర్ట్స్ మీట్, స్కూల్ ఈవెంట్స్.. తప్పనిసరి అనుకున్నవి ఏవీ మిస్ అయ్యేదాన్ని కాదు. ఆఫీస్ పని వల్ల ఇంట్లో ముఖ్యమైన వాటిని వదులుకున్నాను ... అనుకునే సందర్భాలు రాకూడదు అనుకునేదాన్ని. ఉద్యోగంలో చేరిన కొత్తలో ఊపిరి సలుపుకోనివ్వనంత గా పనులు చేస్తున్నాను అనే ఫీలింగ్ ఉండేది. అయితే, వర్క్‌ను ఎంజాయ్ చేయడం మొదలుపెట్టినతర్వాత అన్నీ సులువుగా బ్యాలన్స్ చేసుకో గలిగాను. మా నాన్నగారు ఐఎఎస్ ఆఫీసర్ కావడంతో తరచు బదిలీలు ఉండేవి. మా అమ్మానాన్నలు ఎంతో బిజీగా ఉండి కూడా మాతో ఎలా ఉండేవారో తెలుసు కాబట్టి, నేనే సరైన టైమ్ ప్లానింగ్ చేసుకోవాలి అనుకున్నాను. ఏదైనా పనికి గంట సమయం కుదరకపోతే అరగంటలోనైనా పూర్తి చేయాలి. ప్లానింగ్ మన చేతుల్లో ఉన్నప్పుడు దేనినీ వదులుకోవాల్సిన అవసరం లేదు. నాకు బుక్స్ చదవడం చాలా ఇష్టం. ఇప్పటికీ రోజూ కొంతసమయం బుక్స్‌కి కేటాయిస్తాను. అలాగే, మొక్కల పెంపకం పట్ల శ్రద్ధ తీసుకుంటాను. పాజిటివ్ ఆలోచనలు మేలు..ముందుగా మహిళ ఇతరుల మెదళ్ల నుంచి ఆలోచించడం మానేయాలి. వాళ్లేం అనుకుంటారో, వీళ్లేం అంటారో... అనే ఆలోచన మన జీవితాన్ని నరక మయం చేస్తుంది. కెరియర్ మొదట్లోనే మన కల పట్ల స్పష్టత ఉండాలి. ఎన్ని సమస్యలు వస్తున్నా మనకంటూ ఒక స్పష్టమైన దారిని ఎంచుకోవాలి. సగం జీవితం అయిపోయాకనో, పిల్లలు పెద్దయ్యాక చూద్దాంలే అనో అనుకోవద్దు. ముందుగా అన్ని రకాలుగా స్థిరత్వం ఉండేలా జాగ్రత్తపడాలి. ముఖ్యంగా శారీరకంగా, మానసికంగా ఫిట్‌గా ఉండేలా చూసుకోవాలి. సమస్యలు వచ్చేదే మనల్ని ధైర్యంగా ఉంచడానికి అనుకోవాలి. మనకు ఏం కావాలో స్పష్టత ఉంటే బ్యాలెన్స్ చేసుకోవడం సులువు అవుతుంది’’ అంటూ సొంతంగా వేసుకున్న దారుల గురించి వివరించారు ఈ ఆఫీసర్. కుటుంబ మద్దతుట్రెయిన్స్కు సంబంధించిన సమస్యలు ఎప్పుడూ ఉంటాయి. ప్రకృతి వైపరీత్యాలు, మానవ తప్పిదాలు, ప్రమాదాలు.. వంటి సమయాల్లో నైట్ డ్యూటీస్ కూడా తప్పనిసరి. నిరంతరాయంగా పని చేస్తూనే ఉండాలి. మా పని ఈ కొద్ది గంటలు మాత్రమే అన్నట్టు ఏమీ ఉండదు. 24/7 ఏ సమయంలోనైనా డ్యూటీలో ఉండాల్సిందే. మా పేరెంట్స్, కుటుంబ సభ్యులందరూ నా బాధ్యతలను, పని ఒత్తిడిని అర్థం చేసుకొని, పూర్తి మద్దతుని, సహకారాన్ని ఇవ్వడం వల్ల నేను నిశ్చింతగా నా పనులు చేçసుకోగలిగాను.– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధిఫొటో: నోముల రాజేష్‌రెడ్డి -
అర్ధరాత్రి పోలీసులపై టీడీపీ గుండాల దాడి..
-
పూజా ఖేడ్కర్ ఉక్కిరిబిక్కిరి.. మరో వివాదంలో ట్రైనీ ఐఏఎస్
పూణే: ట్రైనీ ఐఎఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్ మరో వివాదంలో చిక్కుకున్నారు. వరుస ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేశారు. ఇటీవల మహరాష్ట్ర పూణే జిల్లాలో ట్రైనీ ఐఏఎస్ అధికారికగా పనిచేస్తున్న పూజా ఖేడ్కర్ తాను వినియోగించే ఆడికారుకు అనధికారికంగా రెడ్ బీకాన్ లైట్ల వినియోగం,గవర్నమెంట్ ఆఫ్ మహరాష్ట్ర అని స్కిక్కర్లు అంటించడంతో పాటు పై అధికారులు లేని సమయంలో వారి ఛాంబర్లను అనుమతి లేకుండా ఉపయోగించుకోవడంపై వివాదం తలెత్తింది. అందుకు సంబంధించి కలెక్టర్ కార్యాలయంలో ఉన్నతాధికారులు జరుపుకున్న వాట్సప్ చాటింగ్ వెలుగులోకి వచ్చింది. నాటి నుంచి పూజా ఖేడ్కర్ వివాదాలతో కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తూ వస్తున్నారు. తాజాగా ఖేడ్కర్ వినియోగిస్తున్న ఆడికారు 21 సార్లు ట్రాఫిక్స్ నిబంధనల్ని ఉల్లంఘించినట్లు ట్రాఫిక్ పోలీసులు నోటీసులు ఆమె ఇంటికి నోటీసులు పంపించడం చర్చనీయాంశంగా మారింది. ఆ నోటీసుల్లో ఆడికారును నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించలేదని ఆరోపించారు. వాటిపై రూ.27వేలు జరిమానా చెల్లించాలని పూజా ఖేడ్కర్‌కు అధికారులు నోటీసు జారీ చేశారు .నిబంధనల్ని ఉల్లంఘించి ‘మీ ప్రైవేట్ వాహనం ముందు,వెనుక భాగంలో ‘మహారాష్ట్ర గవర్నమెంట్’ స్కిక్కర్లు అంటించడం,రెడ్ బీకన్ లైట్‌ను కూడా ఫిక్స్ చేశారు. . అందుకు నోటీసులు ఇచ్చేందుకు ట్రాఫిక్ అధికారులు ఆమె ఇంటికి వెళ్లారు. ఆసమయంలో ఎవరూ లేరని అధికారులు అన్నట్లు తెలుస్తోంది. అనేక ట్రాఫిక్ ఉల్లంఘనలు జరిగినా పూణే పోలీసులు ముందస్తుగా ఎందుకు చర్యలు తీసుకోలేదనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. మరి దీనిపై ఖేడ్కర్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది. కాగా, వరుసగా వస్తున్న ఆరోపణలపై విలేకరులు ఆమె స్పందన కోరగా..‘ఈ అంశంపై మాట్లాడే అధికారం నాకు లేదు. ప్రభుత్వ నియమాలు నాకు దీనిపై మాట్లాడేందుకు అనుమతించవు’అని అన్నారు. -
‘అనంత్-రాధికల పెళ్లికి ప్రభుత్వం సెలవు ప్రకటించాలి’
అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ల పెళ్లి వేడుకను పురస్కరించుకుని ముంబయిలో ట్రాఫిక్ సమస్యలు ఎదురవకుండా స్థానిక పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ముందస్తు ప్రకటన విడుదల చేశారు. జులై 12 నుంచి 15 వరకు అనంత్-రాధికల వివాహ వేడుక జరిగే బాందాకుర్లా కాంప్లెక్స్(బీకేసీ)లోని జియో కన్వెన్షన్ సెంటర్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని ‘ఎక్స్’ వేదికగా తెలిపారు. ఈ ట్వీట్‌పై స్పందించిన ఓ నెటిజన్ ‘అంబానీ పెళ్లికి ప్రభుత్వం సెలవు ప్రకటించాలి’ అని కామెంట్ చేశారు. అదికాస్తా వైరల్‌గా మారుతుంది.ఆసియాలోనే అత్యంత ధనవంతుడు ముఖేశ్ అంబానీ ఇంట్లో పెళ్లంటే మామూలుగా ఉంటుందా..! ఇప్పటికే అంగరంగ వైభవంగా రెండుసార్లు ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌ను జరుపుకున్నారు. అందుకోసం రూ.కోట్లు ఖర్చు చేశారు. ఈ సెలబ్రేషన్స్‌కు ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖులు వందల సంఖ్యలో హాజరయ్యారు. మరి పెళ్లికి ఇంకెందరు వస్తారోననే చర్చ జరుగుతోంది. అయితే అలా వస్తున్న వారికి ట్రాఫిక్ సమస్యలు ఎదురవకుండా ముంబయి ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు.ముంబయి ట్రాఫిక్ పోలీసులు ‘ఎక్స్’ ప్లాట్ఫామ్లో విడుదల చేసిన ప్రకటన ప్రకారం..2024 జులై 12-15 వరకు ముంబయిలోని బాందాకుర్లా కాంప్లెక్స్(బీకేసీ)లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో సామాజిక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీనికి పెద్ద సంఖ్యలో అతిథులు, వీఐపీలు వస్తున్నారు. దాంతో భద్రతా కారణాల వల్ల జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ వైపునకు వెళ్లే వాహనాలను వేరే మార్గానికి మళ్లిస్తున్నామని తెలిపారు.పోలీసుల ప్రకటనపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ‘అనంత్ అంబానీ పెళ్లి ఈవెంట్ పబ్లిక్ ఈవెంట్ ఎలా అవుతుంది?’ అని ఒక యూజర్ కామెంట్ చేశారు. ‘హత్రాస్ భోలేబాబా వ్యవహారం కంటే అంబానీ పెళ్లికి ప్రభుత్వం ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటోంది.. కారణం ఏంటో..’ అని ఒకరు, ‘అంబానీ పెళ్లి సందర్భంగా ప్రభుత్వం సెలవు ప్రకటించాలి’ అని మరొకరు కామెంట్లు చేస్తున్నారు.Due to a public event at the Jio World Convention Centre in Bandra Kurla Complex on July 5th & from July 12th to 15th, 2024, the following traffic arrangements will be in place for the smooth flow of traffic.#MTPTrafficUpdates pic.twitter.com/KeERCC3ikw— Mumbai Traffic Police (@MTPHereToHelp) July 5, 2024ఇదీ చదవండి: సంగీత్‌లో అదిరిపోయే స్టెప్పులేసిన అంబానీ కుటుంబంఅనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వివాహ వేడుకలు శుక్రవారం(జులై 12)న శుభ వివాహ్‌తో ప్రారంభమవుతాయి. జులై 13 శనివారం శుభ్ ఆశీర్వాద్, జులై 14న మంగళ్ ఉత్సవ్ కార్యక్రమాలతో ముగుస్తాయి. -
హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం
సాక్షి,హైదరాబాద్: భాగ్యనగరంలో పలు ప్రాంతాల్లో ఆదివారం(జూన్30) సాయంత్రం భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా రోడ్లపై వాహనాల రాకపోకలకు ఇబ్బందులెదురయ్యాయి. సికింద్రాబాద్, బేగంపేట్, బోయిన్పల్లి, తిరుమలగిరి, బొల్లారం రామంతాపూర్, ఉప్పల్, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, హయత్‌నగర్, కేపీహెచ్‌బీ, కూకట్పల్లి, హైదర్‌నగర్, నిజాంపేట్, బోరబండ, యూసుఫ్‌గూడ, జూబ్లీహిల్స్, మైత్రీవనం, అమీర్‌పేట, పంజాగుట్టల్లో భారీ వర్షం కురిసింది. వరద నీరు చేరడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.రోడ్లపై అక్కడక్కడా నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరద సమస్య ఉన్న ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. -
హైదరాబాద్‌లో భారీ వర్షం
సాక్షి,హైదరాబాద్: రాజధాని హైదరాబాద్ నగరంలో పలు చోట్ల ఆదివారం(జూన్23) సాయంత్రం భారీ వర్షం కురిసింది. అమీర్‌పేట్, ఎస్సార్‌నగర్, బోరబండ, పంజాగుట్ట, యూసఫ్‌గూడ, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, చంపాపేట్, సైదాబాద్, చాదర్‌ఘాట్, మలక్‌పేట్, సరూర్‌నగర్, అమీర్‌పేట్, ఎస్సార్‌నగర్, బోరబండపంజాగుట్ట, యూసఫ్‌గూడ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ఎల్బీనగర్, మియాపూర్, చందానగర్, లింగంపల్లి, కొండాపూర్ ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. భారీ వర్షంతో పలుచోట్ల ట్రాఫిక్‌జామ్ అయింది. వాహనదారులు ఇబ్బంది పడ్డారు. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వరదనీరు చేరింది. ఓ వైపు రహదారి విస్తరణ పనులు, మరోవైపు వరదనీటితో వాహనదారులు ఇక్కట్లకు గురయ్యారు. పలు చోట్ల వరద నీటి కారణంగా వాహనాలు స్లోగా వెళ్లాయి. -
ట్రాఫిక్‌పై డ్రోన్ కన్ను
సాక్షి, హైదరాబాద్: నిత్యం బిజీగా ఉండే రోడ్డు.. మధ్యలో ఓ కారు మొరాయించి నిలిచిపోయింది. దాంతో ట్రాఫిక్ జామ్ మొదలైంది. ఆ ప్రాంతానికి పైన గాల్లో ఎగురుతున్న ‘డ్రోన్’ద్వారా పోలీసులు ఇది చూశారు. వెంటనే ట్రాఫిక్ రిలీఫ్ వ్యాన్ వచి్చ, మొరాయించిన కారును అక్కడి నుంచి తరలించింది. వాహనాలన్నీ సాఫీగా ముందుకు సాగిపోయాయి. అంటే భారీగా ట్రాఫిక్ జామ్ కాకముందే.. సమస్య పరిష్కారమైపోయింది. ఇదేదో చాలా బాగుంది కదా. ఇకపై గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ చిక్కులకు ఇలా సింపుల్‌గా చెక్ పడిపోనుంది. తొలుత సైబరాబాద్ పరిధిలో.. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో దీనికి సంబంధించి ‘థర్డ్ ఐ ట్రాఫిక్ మానిటరింగ్ డ్రోన్’అందుబాటులోకి వచ్చేసింది. పైలట్ ప్రాజెక్టు కింద ఐకియా, దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి, హఫీజ్‌పేట, హైటెక్ సిటీ, మాదాపూర్, రాయదుర్గం తదితర ఐటీ కారిడార్ ప్రాంతాల్లో ఆదివారం ఈ డ్రోన్‌ను వినియోగించారు. రోడ్లపై ట్రాఫిక్ జామ్‌లు, వాహనాల రద్దీ ఎక్కడ ఎక్కువగా ఉంది? జంక్షన్ల వద్ద వాహనాల వేగం ఎలా ఉంది? ఎక్కడైనా నీరు నిలిచి ఉందా? అనే అంశాలతోపాటు రోడ్డు ప్రమాదాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించవచ్చు. ఏదైనా సమస్య ఏర్పడితే ట్రాఫిక్ పోలీసు బృందాలు వెంటనే స్పందించి పరిష్కరించవ చ్చు. వాహనాలు సు లభంగా, వేగంగా ప్రయాణించేందుకు వీలవుతుంది. ఎలా పనిచేస్తాయంటే..? థర్మల్ ఇమేజింగ్ టెక్నాలజీ, రేడియో ఫ్రీక్వెన్సీల సాయంతో ఈ డ్రోన్ సైబరాబాద్ కమిషనరేట్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానమై ఉంటుంది. భూమి ఉపరితలం నుంచి 150–170 మీటర్ల ఎత్తులో ఎగురుతుంది. ఈ డ్రోన్‌కు ఉండే మూడు అత్యాధునిక కెమెరాలతో, ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే ఉదయం, సాయంత్రం వేళల్లో రోడ్డు మీద ట్రాఫిక్ జామ్‌లు, వాహనాల రద్దీ, కదలికలను చిత్రీకరిస్తుంది.రియల్ టైమ్‌లో కంట్రోల్ సెంటర్‌కు పంపిస్తుంది. కంట్రోల్ సెంటర్ సిబ్బంది ట్రాఫిక్ పరిస్థితి, రద్దీని విశ్లేíÙంచి, ఏదైనా సమస్య ఉంటే గమనించి క్షేత్రస్థాయిలోని ట్రాఫిక్ పోలీసులకు సమాచారం ఇస్తారు. తద్వారా ట్రాఫిక్‌ను క్రమబదీ్ధకరిస్తారు. గాలిలో ఏకధాటిగా 45 నిమిషాల పాటు తిరగగలిగే సామర్థ్యమున్న ఈ డ్రోన్ 15 కిలోమీటర్ల దూరం వరకు హెచ్డీ క్వాలిటీ వీడియోను పంపించగలదు. ఇతర కమిషనరేట్లలో.. సైబరాబాద్ పోలీసుల ట్రాఫిక్ నిర్వహణ కోసం డ్రోన్లను వినియోగించాలని గతంలోనూ ఆలోచన చేశారు. అప్పుడప్పుడు డ్రోన్లను అద్దెకు తీసుకొచ్చి వినియోగించేవారు. తాజాగా కార్పొరేట్ సామాజిక సేవ (సీఎస్ఆర్) కింద ‘సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ)’నిధులతో సొంతంగా ఒక డ్రోన్‌ను కొనుగోలు చేశారు. దీని ఫలితాలను బట్టి మరిన్ని డ్రోన్లను సమకూర్చుకోనున్నారు.ఇప్పటికే హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో వినాయక నిమజ్జనం, హనుమాన్ జయంతి, బోనాలు, శ్రీరామనవమి, షాబ్–ఈ–బరాత్ వంటి ర్యాలీలు, జాతరల సమయంలో డ్రోన్లను వినియోగిస్తూ నిఘా పెడుతున్నారు. ఇకపై ట్రాఫిక్ పర్యవేక్షణ కోసమూ వినియోగించనున్నారు. హైదరాబాద్‌లో డ్రోన్లు, సీసీ కెమెరాల ఏర్పాటు, నిర్వహణ కోసం ప్రత్యేకంగా ‘డీ–కెమో’విభాగం ఉంది. దీనికి డీసీపీ/ఏసీపీ ర్యాంకు అధికారి హెడ్‌గా ఉంటారు.ట్రాఫిక్ పోలీసులకు శిక్షణ డ్రోన్ ఆపరేషన్ ప్రాథమిక దృష్టి ముఖ్యంగా ఐటీ కారిడార్ మీద ఉంటుంది. ఇక్కడ అధిక ట్రాఫిక్ ఉన్న ప్రాంతాలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవడంలో ట్రాఫిక్ పోలీసులకు డ్రోన్ సాయం అందిస్తుంది. ఈ మేరకు డ్రోన్ వినియోగంపై ట్రాఫిక్ పోలీసులకు శిక్షణ ఇవ్వనున్నాం. – అవినాష్ మహంతి,పోలీస్ కమిషనర్, సైబరాబాద్‘ట్రాఫిక్’కు వాడే డ్రోన్ ప్రత్యేకతలు ఇవీ:డ్రోన్ పేరు: మావిక్ 3 ప్రో ధర: రూ.5.5 లక్షలు బరువు: ఒక కిలో బ్యాటరీ: 5 వేల ఎంఏహెచ్. సుమారు 4 గంటల బ్యాకప్ గరిష్ట ఎత్తు: భూమి ఉపరితలం నుంచి 400 మీటర్లు విజిబులిటీ: 5 కిలోమీటర్ల దూరం వరకు గరిష్ట వేగం: సెకన్‌కు 8 మీటర్లు. గాలి, వర్షం లేకపోతే వరి్టకల్‌గా సెకన్‌కు 21 మీటర్ల వేగంతో ఎగరగలదు. స్టోరేజ్ 8 జీబీ నుంచి 1 సామర్థ్యం: టీబీ వరకు ఉంటుంది. -
గ్రేటర్ హైదరాబాద్‌లో వర్షాలకాలంలో ట్రాఫిక్ కష్టాలు
-
మౌంట్ ఎవరెస్ట్‌పై భారీగా ట్రాఫిక్‌జామ్!
ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరంపై పర్యాటకుల తాకిడి పెరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలను చూసిన వారంతా తెగ ఆశ్చర్యపోతున్నారు. ఇంతమంది ఈ ఉన్నత పర్వతాన్ని అధిరోహించడానికి సిద్ధమయ్యారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించే వారి సంఖ్య ప్రతి ఏటా వేగంగా పెరుగుతోంది. బేస్ క్యాంప్‌లో పర్యాటకులు క్యూ కడుతున్నారు. బీబీసీ నివేదిక ప్రకారం ఇటీవల ఇద్దరు పర్వతారోహకులు మృతి చెందారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో వందలాది మంది పర్వతారోహకుల క్యూ కనిపిస్తుంది. వీరిని చూస్తుంటే నగరంలోని రోడ్లపై ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్నారేమోనని అనిపిస్తుంది.ఈ ఫొటోను చూసిన ది నార్తర్నర్ అనే యూజర్ ఇలా రాశాడు. ‘ఎవరెస్ట్ అతి ఎత్తయిన శిఖరం. అయిత ఇప్పుడది మురికిగా మారింది. ఇక్కడ మనుషుల మృతదేహాలు కనిపిస్తున్నాయి. మంచులో కూరుకుపోతున్నవారికి సహాయం అందించేందుకు ఇక్కడ ఎవరూ లేరు. కాలుష్యం మరింతగా పెరుగుతోంది. చుట్టూ దుమ్ము, ధూళి కనిపిస్తోంది. ఇది ఎప్పటికి అదుపులోకి వస్తుంది?’ అని ప్రశ్నించాడు.భారత పర్వతారోహకుడు రాజన్ ద్వివేది మే 19 ఉదయం 6 గంటలకు ఎవరెస్టును విజయవంతంగా అధిరోహించారు. ఆయన అక్కడి పరిస్థితి చూసి విచారం వ్యక్తం చేశారు. ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో ‘ఎవరెస్ట్ పర్వతారోహణ అంత సులభం కాదు. 1953 మేలో తొలిసారిగా ఎవరెస్ట్ అధిరోహించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ మొత్తం ఏడు వేల మంది ఎవరెస్ట్‌ను అధిరోహించారు. అయితే ఇక్కడి చలి వాతావరణం, గాయాల కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలా మృతి చెందిన వారికి సంబంధించిన డేటా ఎక్కడా లేదు. దానిని ఎవరూ లెక్కించడం లేదు. గంటకు 100 నుండి 240 మైళ్ల వేగంతో వీచే బలమైన గాలులను ఎదుర్కోవడం పర్వతారోహకులకు పెద్ద సవాలు’ అని ఆయన పేర్కొన్నారు. రాజన్ ద్వివేది ఒక వీడియోను కూడా షేర్ చేశారు. ఆ వీడియోలో మంచు శిఖరాలపై లెక్కకు మించిన పర్వతారోహకులు కనిపిస్తారు. Everest; the highest, the dirtiest and the most controversial place on Earth. Humans bypassing corpses, leaving people dying, ignoring help cries, making it dirtiest place with pollution & human wastes ; all for the glory of summit. When will it stop?! #StopCommercialAlpinism pic.twitter.com/Yahobk9c5F— The Northerner (@northerner_the) May 25, 2024 -
చిలకలూరిపేట సభపై ఎల్లో మీడియా వక్రభాష్యం
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కొత్త వ్యూహంలోకి వెళుతున్నట్లుగా ఉంది. ఒకవైపు జనసేన, BJPలను బతిమలాడుకుని పొత్తు పెట్టుకున్న ఆయన, వ్యవస్థలపై దృష్టి సారించినట్లుగా ఉంది. 58 నెలలపాటు న్యాయ వ్యవస్థను అడ్డుపెట్టుకుని నిత్యం కేసులు వేస్తూ , ఏపీలోని వైఎస్ జగన్ ప్రభుత్వానికి అడుగడుగున ఆటంకాలు కల్పిస్తూ వచ్చిన చంద్రబాబు నాయుడు కీలకమైన ఈ రెండు నెలలు తన మిత్రపక్షం బిజెపి ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ఎన్నికల కమిషన్ పై ఒత్తిడి తెచ్చి వీలైనంతమేర YSR కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టడానికి ప్లాన్ చేసినట్లు కనిపిస్తుంది. ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో అన్ని రాజకీయ పార్టీలకు ఈ రెండు నెలలు కీలకం అవుతాయి. ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్న కూటమి సభ విఫలం అవడంతో , ఆ నెపం మొత్తాన్ని పోలీసులపైన తోసేసి ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నాలు ఆరంభించారు. DGPతో పాటు కొందరు IPS అధికారులను టార్గెట్ చేస్తూ తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముఖ్య అదికారి మీనాకు ఫిర్యాదు చేసింది. దానిపై జనసేన, BJP ప్రతినిధులు కూడా సంతకాలు చేసి ఆ పాపంలో పాలు పంచుకున్నారు. నిజంగా ప్రధాని మోడీ సభ అంత నాసిరకంగా జరగడానికి కారణం ఎవరు? నిర్వహణ బాధ్యతలన్నీ తెలుగుదేశం నేతలే తీసుకున్నారు కదా! అలాంటప్పుడు వైఫల్యానికి కూడా వారే బాద్యత వహించాలి కదా! దానిని కప్పిపుచ్చే ప్రయత్నం స్పష్టంగా కనబడుతోంది. (సభ ఏర్పాట్లను పూర్తిగా దగ్గరుండి పర్యవేక్షించిన లోకేష్) మిత్రపక్షంగా బిజెపి అయిందో లేదో, వెంటనే చంద్రబాబు నాయుడు తన మేనేజ్ మెంట్ స్కిల్ ఉపయోగించి ఎన్నికలను నెల రోజులు ఆలస్యంగా జరిగేలా చేశారన్నది ఎక్కువ మంది భావన. ఇక ఇప్పుడు ఎపిలో చిత్తశుద్దితో పనిచేస్తున్న పోలీసు అధికారులపై దాడి చేసి వారిని భయోత్పాతానికి గురి చేయడం ద్వారా లబ్ది పొందాలన్న కుట్రకు తెరలేపారు. అందుకే మోడీ సభకు సంబందించి టిడిపి ఫిర్యాదు చేసిందన్న భావన ఏర్పడింది. ఆ ఫిర్యాదు పత్రంలో పేర్కొన్న అంశాలు చూడండి. తాము ముందస్తుగానే పోలీసులకు భద్రత ఏర్పాట్ల గురించి లేఖ రాసినా, అధికారులు సరైన చర్యలు తీసుకోలేదని, భద్రత ఏర్పాట్లలో లోపాలకు డిజిపి బాద్యుడని ఎన్నికల ముఖ్య అధికారికి టిడిపి రాసిన లేఖలో తెలిపింది. జన సమూహాన్ని నియంత్రించడం, ట్రాఫిక్‌ను క్రమబద్దం చేయడంలో పోలీసులు విఫలం అయ్యారని టిడిపి ఆరోపణ. అందువల్లే కూటమి బహిరంగ సభలో ప్రజలు తోసుకుంటూ ముందుకు వచ్చారని, అలాగే మైక్ సౌండ్ సిస్టమ్ వైపు కూడా వచ్చారని టిడిపి పేర్కొంది. దానివల్ల మోడీ స్పీచ్ ఇస్తున్నప్పుడు పలుమార్లు మైక్ ఆగిపోయిందని ఆ పార్టీ ఫిర్యాదుగా ఉంది. విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయిందని ఆ పార్టీ ఆరోపించింది. ప్రధాని పలుమార్లు టవర్ల నుంచి దిగాలని సభకు వచ్చినవారిని కోరినా, పోలీసులు చొరవ తీసుకోలేదని పార్టీ ఆరోపించింది. మోడీని సత్కరించడానికి తెచ్చిన పుష్పగుచ్చాన్ని కాని, శాలువాని కాని పోలీసులు అనుమతించలేదని చిత్రమైన ఫిర్యాదు చేసింది. ఇదంతా YSRCPతో పోలీసులు కుమ్మక్కయి కుట్ర చేశారని టిడిపి అభియోగం. ఇక సభకు వస్తున్న వాహనాలను జాతీయ రహదారిపై కావాలని ఆపేశారని మరో ఆరోపణ చేసింది. సభకు వచ్చిన వారి అత్యుత్సాహం వల్లే మైక్ సిస్టమ్ పని చేయకుండా నిలిచిపోయిందని మాత్రం టిడిపి అంగీకరించడం విశేషం. డిజిపి రాజేంద్రనాధ్ రెడ్డి, ఐజి పాలరాజు, పల్నాడు ఎస్పి రవిశంకర్ రెడ్డిలపై ఆరోపణలు గుప్పిస్తూ టిడిపి ఈ లేఖ రాసింది. (సభలో పరిస్థితి) ఈ లేఖలోని ఆరోపణలపై జాగ్రత్తగా పరిశీలన చేసినా, విచారణ జరిపినా కొన్ని విషయాలు తేలికగా తెలిసిపోతాయి. లేఖ ఆసాంతం పరిశీలిస్తే.. తెలుగుదేశం పార్టీ డొల్లతనం బయటపడుతుంది. ప్రధాని మోడీ పాల్గొన్న సభకు భద్రత ఏర్పాట్ల నిమిత్తం నాలుగువేల మంది పోలీసులను నియమించారు. అయినా తక్కువ మందిని పెట్టారని అసత్యపు ఆరోపణను కూటమి నేతలు చేశారు. కరెంటు పోయిందన్నది అబద్దమని చెబుతున్నారు. సభా ప్రాంగణానికి ప్రత్యేకంగా విద్యుత్ లైనే లేదట. సభ అంతా జనరేటర్ పై ఆధారపడి ఏర్పాటు చేసుకున్నారట. అలాంటప్పుడు కరెంటు పోయే సమస్య ఎక్కడ నుంచి వస్తుందని కొందరు ప్రశ్నిస్తున్నారు. మైక్ సిస్టమ్ సరైనది ఎంపిక చేసుకునే బాధ్యత టిడిపి వారిదే కాని, పోలీసులకు ఏమి సంబంధం? చిలకలూరిపేట ప్రాంతంలో రికార్డింగ్ డాన్స్ లకు వాడే మైక్ సిస్టమ్‌ను తెలుగుదేశం నేతలు తీసుకురావడంతోనే ఈ సమస్య వచ్చిందన్నది స్థానికుల అభిప్రాయంగా ఉంది. ఒకసారి ప్రధాని భద్రత కోసం వచ్చే ప్రాంగణాన్ని SPG అధీనంలోకి తీసుకున్న తర్వాత స్థానిక పోలీసులకు ప్రత్యేక అధికారాలు ఉండవు. SPG అనుమతి ఇచ్చి ఉంటే ప్రధాని కోసం టిడిపి తెచ్చిన పుష్పగుచ్ఛం, శాలువాను స్థానిక పోలీసులు అనుమతించకుండా ఎలా ఉంటారు? (మోదీని సన్మానిస్తారని ప్రకటన చేయగా.. శాలువాలు, పూలబోకే లేక దిక్కులు చూస్తోన్న బాబు, పవన్) టిడిపి నేతలు చేసినవన్నీ అబద్దపు ఆరోపణలని పోలీసు అధికారుల సంఘం నేతలు చెబుతున్నారు. పోలీసులకు రాజకీయ రంగు పులమడం సరికాదని వారు వ్యాఖ్యానిస్తున్నారు. సభ ఎజెండా ఖరారు చేసుకునేటప్పుడు అన్ని సిద్ధంగా ఉన్నాయా ? లేదా? అన్నది చూసుకోవల్సిన బాధ్యత కూటమి నేతలపై ఉంటుంది. వారు వాటిని ఎందుకు చెక్ చేసుకోలేదు? ఇదే టైమ్ లో బిజెపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఒక విగ్రహ జ్ఞాపికను వేదిక మీదకు ఎలా తీసుకు వెళ్లగలిగారు? చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు చేతులూపుకుంటూ వెళ్లి కూర్చున్నారే కాని, ప్రధానిని సత్కరించడానికి అవసరమైన ఏర్పాట్ల గురించి ఎందుకు ఆరా తీయలేదో తెలియదు. రోడ్లపై ట్రాఫిక్ ను రెగ్యులేట్ చేయలేదని ఇంకో తప్పుడు ఆరోపణ చేశారు. నిజానికి ఈ సభ కోసం భారీగా ఏమీ వాహనాలు రాలేదు. ఆ విషయం గమనించిన తెలుగుదేశం వారు రోడ్డుపై కొన్ని వాహనాలను అడ్డంగా నిలిపి, చాలా వాహనాలు ఆగిపోయినట్లు కలరింగ్ ఇస్తూ దానిని డ్రోన్ ద్వారా వీడియో తీశారు. కాని ఆ విషయం బయటపడిపోవడంతో ఈ దిక్కుమాలిన ఫిర్యాదు చేశారు. ఎప్పుడూ ఏదో ఒక అబద్దపు ప్రచారంతో నెట్టుకువచ్చే తెలుగుదేశం పార్టీ ఈ రకంగా కూడా ప్రజలను మోసం చేసే యత్నం చేసింది. RTC బస్ లు తగినన్ని ఇవ్వలేదని టిడిపి మీడియా ప్రచారం చేసింది. విషయం ఏమిటంటే 2500 RTC బస్‌లను రిజర్వు చేసుకున్న టిడిపి వాటిలో 1500 బస్ లను ఎందుకు కాన్సిల్ చేసిందో కూడా వివరించాలి కదా! అసలు రాష్ట్రంలో వారివల్ల ఎక్కడ ఏ తప్పు జరిగినా, ముందుగా ఎదుటివారిపై తోసేయడం చంద్రబాబు బృందానికి అలవాటేనన్నది రాజకీయ వర్గాల విమర్శగా ఉంది. ప్రధాని మోడీ సభలో ఏదైనా అలజడి జరిగితే దానిని ప్రభుత్వంపై నెట్టి రాజకీయ లబ్ది పొందాలన్నది వారి లక్ష్యం కావచ్చని అనుమానిస్తున్నారు. సభలో ప్రజలు ఎవరూ టవర్లు ఎక్కకుండా అక్కడ పార్టీ వలంటీర్లనో, కార్యకర్తలనో పెట్టుకోవలిసిన టిడిపి ఎందుకు ఆ పని చేయలేదు? ఆయా టిడిపి సభలలో ఒక యాంకర్ మాదిరి వైర్ లెస్ కార్డు సిస్టమ్ వాడి ప్రసంగం చేసే చంద్రబాబుకు పాతపద్దతిలో మైక్ సిస్టమ్ ఎలా అనుమతించారు? గతంలో కందుకూరు వద్ద ఇరుకు రోడ్డుపై సభ పెట్టి తొక్కిసలాట జరిగి ఎనిమిది మంది మరణించిన ఏం చేశారు? గుంటూరులో చంద్రబాబు సభకు వచ్చేవారికి చీరలు ఇస్తామని ప్రకటించి,వేలాది మంది వచ్చేలా చేసి, అక్కడ సరిగా నిర్వహించకుండా తొక్కిసలాట జరిగినప్పుడు ఏం చేశారు? మనుష్యులు మరణించినప్పుడు ఆ నెపాన్ని పోలీసులపైనే నెట్టేయలేదా? గోదావరి పుష్కరాలలో చంద్రబాబు ప్రచార యావవల్ల తొక్కిసలాట జరిగి 29 మంది మరణించినప్పుడు చంద్రబాబు ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడింది గుర్తు లేదా? కుంభమేళాలలో చనిపోవడం లేదా? రోడ్డు ప్రమాదాలలో పోవడం లేదా అని ప్రశ్నించి అందరిని విస్తుపరిచారు. ఇప్పుడు తమ పార్టీ ప్రయోజనాల కోసం అలాంటి ఘటన ఏదైనా జరిగితే ప్రయోజనం అని ఏమైనా భావించారా అన్న విమర్శను కొందరు చేస్తున్నారు. కేవలం పోలీసు ఉన్నతాధికారులను భయపెట్టి , తమ పార్టీ అభ్యర్ధులు చేసే డబ్బు పంపిణీ, కానుకల పంపిణీ వంటి వాటికి అడ్డు రాకుండా చూసుకోవాలన్న ఆలోచనతో వారిపై ఈ ఆరోపణలు చేశారా అన్న సందేహం వస్తుంది. దానికి తగినట్లే ఈనాడు మీడియా ఇదంతా పోలీసుల వైఫల్యం అని, కేంద్రం నిఘా అధికారులు నివేదిక పంపించారంటూ కధనాన్ని కూడా ప్రచారం చేసింది. పైగా పల్నాడు ఎస్పిపై ఎన్నికల కమిషన్ చర్య తీసుకోవచ్చంటూ రాసేసింది. అసలు విచారణ చేసిందెప్పుడు, సంబందిత అధికారుల వివరణ కోరిందెప్పుడు? నివేదికను కేంద్రానికి పంపిందెప్పుడు? అదే నిజమైతే ఈనాడు మీడియాకే ఎందుకు ఇచ్చారు? అంటే ఇదంతా ఒక కుట్రగా కనిపించడం లేదా!ఇంతకాలం కోర్టులను అడ్డంపెట్టుకుని ఇలాంటి కధలను నడిపిన టిడిపి, ఈనాడు, ఆంద్రజ్యోతి తదితర ఎల్లో మీడియా, ఇప్పుడు కొత్త తరహా కుట్రలకు తెరలేపినట్లుగా ఉంది. అందులో భాగంగానే ఇలాంటి తప్పుడు ఆరోపణలతో ప్రచారం చేస్తున్నారనుకోవాలి.ఇక్కడ ఒక సంగతి చెప్పాలి. జనం అంతా సభ విఫలం అయిందని, మోడీకి అవమానకరంగా సభ నడిచిందని అనుకుంటుంటే, ఈనాడు మాత్రం అందుకు భిన్నంగా టీవీలో ఒక ప్రచారం చేసింది. సభ ముగిసిన వెంటనే ప్రధానిని చంద్రబాబు, పవన్ కలిశారని, ఆ సందర్భంగా మోడీ సభ గ్రాండ్ సక్సెస్ అయిందని అన్నారని టీవీలో వార్తలు ఇచ్చింది. అది నిజమే అయితే ఇప్పుడు ఆ వైఫల్యం..ఈ వైఫల్యం అంటూ కొత్తబాణి ఎందుకు అందుకున్నట్లు? - కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ జర్నలిస్టు -
Banjara Hills: ట్రాఫిక్ బూత్‌లో మృతదేహం
హైదరాబాద్: రోడ్డు నంబర్–1లోని తాజ్‌కృష్ణా హోటల్ చౌరస్తాలో ఉన్న ట్రాఫిక్ బూత్ అంబ్రిల్లాలో అనుమానాస్పద మృతదేహాన్ని బంజారాహిల్స్ పోలీసులు స్వాదీనం చేసుకుని ఉస్మానియాకు తరలించారు. తాజ్‌కృష్ణా చౌరస్తాలోని ట్రాఫిక్ బూత్‌లో గుర్తుతెలియని మృతదేహం(32) ఉన్నట్టు మంగళవారం ఉదయం విధుల్లోకి వచ్చిన ట్రాఫిక్ కానిస్టేబుల్ పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే అక్కడికి చేరుకున్న బంజారాహిల్స్ పోలీసులు మృతదేహాన్ని స్వాదీనం చేసుకుని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని బంజారాహిల్స్ సీఐ రాఘవేందర్ తెలిపారు. ఆరా తీయగా ఫుట్‌పాత్‌లపై పడుకునే నిరాశ్రయుడిగా తేలిందని ఆయన చెప్పారు. తలకు వెనకాల గాయమైందని.. రోడ్డు దాటుతున్నప్పుడు ఏదైనా వాహనం ఢీకొట్టిందా? లేక ప్రమాదవశాత్తూ కిందపడ్డాడా? అనే విషయాలు తెలియాల్సి ఉందన్నారు. -
డాన్స్‌తో ట్రాఫిక్ కంట్రోల్.. వీడియో వైరల్!
మనిషన్నాక ఏదోఒక అభిరుచి ఉంటుంది. కొందరికి సింగర్ కావాలని, మరికొందరికి యాక్టర్ కావాలనివుంటుంది. అలాగే రచయిత కావాలని, క్రీడాకారులు కావాలని కూడా కొందరు కోరుకుంటారు. అయితే కొంతమంది తమ అభిరుచిని వదిలి వేరే పని చేయాల్సి వస్తుంది. అలాంటివారు వారి అభిరుచిని వదులుకోలేరు. ఒక ట్రాఫిక్ పోలీస్ విషయంలో ఇదే కనిపించింది. అతనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ఈ వీడియోలో సదరు ట్రాఫిక్ కానిస్టేబుల్ రోడ్డుపై ట్రాఫిక్‌ను నియంత్రించడాన్ని గమనించవచ్చు. అయితే అతను డ్యాన్స్ చేస్తూ, ట్రాఫిక్‌ను కంట్రోల్ చేయడాన్ని చూడవచ్చు. ఒకసారి మూన్‌వాక్‌తో, మరోమారు స్టెప్పులు వేస్తూ.. వాహనాలకు సిగ్నల్ ఇస్తూ కనిపిస్తున్నాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో విపరీతంగా లైక్ చేస్తున్నారు. ఈ వీడియోను నాగాలాండ్ ప్రభుత్వ పర్యాటక, ఉన్నత విద్యా శాఖ మంత్రి టెమ్జిన్ ఇమ్నా అలోంగ్ మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో షేర్ చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకూ 51 వేల మందికి పైగా నెటిజన్లు వీక్షించారు. వీడియోను చూసిన ఒక యూజర్ కామెంట్ బాక్స్‌లో.. ‘మా సింగం సార్.. ఇండోర్ నుండి వచ్చారు. నేను ఆయనను చూసేందుకు హైకోర్టు స్క్వేర్‌కి వెళ్తుంటాను’ అని రాశారు. మరొక యూజర్ ‘సూపర్’అని రాశారు. अपने Moves दिखाने के लिए सही Platform का इंतजार मत करो, Platform को सही खुद बना लो! 😉 pic.twitter.com/5WE4plySsH — Temjen Imna Along (@AlongImna) February 27, 2024 -
Hyderabad: సిటీలో నేటి నుండి కొత్త ట్రాఫిక్ విధానం
-
కర్నాటక సీఎంకు ‘సుప్రీం’లో ఊరట!
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సుప్రీంకోర్టు నుంచి ఊరట లభించింది. 2022లో జరిగిన నిరసనల్లో రోడ్డును బ్లాక్ చేశారంటూ సీఎం సిద్ధరామయ్యపై నమోదైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని ఫిర్యాదుదారునికి సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. ఈ కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తదితరులపై విచారణకు సుప్రీంకోర్టు స్టే విధించింది. ఇదే కేసులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు రాష్ట్ర కేబినెట్ మంత్రులు ఎంబీ పాటిల్, రామలింగా రెడ్డి, కాంగ్రెస్ నేత రణదీప్ సింగ్ సూర్జేవాలాలకు ఈ నెల మొదట్లో కర్ణాటక హైకోర్టు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున జరిమానా విధించింది. అలాగే వారంతా ప్రజాప్రతినిధి కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించిన వివరాల్లోకి వెళతే కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ బెలగావి నివాసి. ఆయన ఉడిపిలోని ఓ హోటల్లో శవమై కనిపించాడు. తన కాంట్రాక్టు పనులలో నాటి మంత్రి ఈశ్వరప్ప కమీషన్ డిమాండ్ చేశారని సంతోష్ పాటిల్ ఆరోపించాడు. ఆ తర్వాత మంత్రి ఈశ్వరప్ప తనపై వస్తున్న ఆరోపణలను తిరస్కరించడమే కాకుండా సంతోష్ పాటిల్‌పై పరువు నష్టం కేసు వేశారు. ఆ తరువాత పాటిల్ వాట్సాప్ మెసేజ్‌లో తన మరణానికి మంత్రి మంత్రి ఈశ్వరప్ప బాధ్యుడని పేర్కొన్న విషయం వెలుగు చూసింది. ఈ నేపధ్యంలో 2022 ఏప్రిల్‌లో ఇదే కేసులో కేఎస్ ఈశ్వరప్పను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ, ప్రస్తుత సీఎం సహా కాంగ్రెస్ నేతలు నిరసనకు దిగారు. నాటి ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఇంటిని చుట్టుముట్టడంతోపాటు పలు రహదారులను బ్లాక్ చేశారు. దీంతో ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. -
గడుసు పిల్లే..! మొత్తానికి తాళి కట్టించుకుంది! వైరల్ వీడియో
పెళ్లిళ్లలో ఉండే హడావిడి అంతా ఇంతాకాదు. పెళ్లి పనులు మొదలు పెట్టినదగ్గర్నుంచి ఆ మూడు ముళ్లు పడేదాకా అదొక యజ్ఞంలా లాంటిదే. అందులోనూ అమ్మాయి తరపువారికి అయితే ఈ టెన్షన్ మరీ ఎక్కువ. ఈక్రమంలో బెంగళూరులో జరిగిన ఒక సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ట్రాఫిక్‌లో ఇరుక్కున్న ఒక పెళ్లి కూతురు ముహూర్తం దగ్గరపడుతున్న సమయంలో తెలివైన నిర్ణయం తీసుకుంది.. అసలు ఏం జరిగిందంటే.. మూడుముళ్ల వేడుక కోసం అందంగా ముస్తాబైన, బెంగళూరుకు చెందిన పెళ్లి కూతురు పెళ్లి మండపానికి బయలు దేరింది. తీరా భయంకరమైన ట్రాఫిక్‌లో చిక్కుకుంది. అసలే బెంగళూరులో ట్రాఫిక్ రద్దీ. దీనికి పెళ్లిళ్ల సీజన్. ఎటూ కదల్లేని పరిస్థితి. ఇలా అయితే.. ఇక పెళ్లి అయినట్టే అనుకుందో ఏమోగానీ, కారు దిగి తన సన్నిహితులతో మెట్రోలో ఎంచక్కా వివాహ మండపానికి చేరింది. సమయానికి తాళి కట్టించుకుంది. పెళ్లి ముస్తాబు, పట్టుచీర నగలతో వధువు నిశ్చింతగా మెట్రోలో ప్రయాణిస్తున్న వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అమ్మాయి గడుసుదే అంటే ప్రశంసలు దక్కించుకుంటోంది. అయితే ఇందులో కొసమెరపేంటి అంటే ఈ వీడియో ఇప్పటిది కాదు.. గత ఏడాది నాటిది. సోషల్ మీడియా పుణ్యమా అంటూ మళ్లీ వైరల్ అవుతోంది. Whatte STAR!! Stuck in Heavy Traffic, Smart Bengaluru Bride ditches her Car, & takes Metro to reach Wedding Hall just before her marriage muhoortha time!! @peakbengaluru moment 🔥🔥🔥 pic.twitter.com/LsZ3ROV86H — Forever Bengaluru 💛❤️ (@ForeverBLRU) January 16, 2023 -
తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న 3కోట్ల 59లక్షల చలాన్స్
-
పెట్రోల్ బంకులకు పోటెత్తిన వాహనదారులు
-
TS: పెండింగ్ చలాన్ల చెల్లింపు.. రెస్పాన్స్ మామూలుగా లేదు.. దెబ్బకి సర్వర్ డౌన్
సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ పెండింగ్ చలాన్ల చెల్లింపునకు వాహనదారుల నుంచి విశేష స్పందన వస్తోంది. మరో వైపు చెల్లింపుల తాకిడితో తరచూ సర్వర్ హ్యాంగ్ అవుతోంది. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 9.61 లక్షల చలాన్ల చెల్లింపులతో రూ.8.44 కోట్ల ఆదాయం లభించిందని రవాణా శాఖ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్ పరిధిలో 3.54 లక్షల చలాన్ల ద్వారా రూ. 2.62 కోట్లు, సైబరాబాద్ పరిధిలో 1.82 లక్షల చలాన్ల చెల్లింపు ద్వారా రూ.1.80 కోట్లు, రాచకొండ పరిధిలో 93 వేల చలాన్లకు రూ.76.79 లక్షల ఆదాయం సమకూరిందని అధికారులు వెల్లడించారు. పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల వసూలు విషయంలో తెలంగాణ పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకున్నసంగతి తెలిసిందే. చలాన్ల చెల్లింపులపై భారీ డిస్కౌంట్‌ను ప్రకటించింది. ఈ క్రమంలో ద్విచక్ర వాహనాలకు చల్లాన్లపై 80 శాతం రాయితీ ప్రకటించింది. వివరాల ప్రకారం.. ట్రాఫిక్ చలాన్ల విషయంలో తెలంగాణ పోలీసులు భారీ డిస్కౌంట్ ఇచ్చారు. గతంలో ఇచ్చిన దాని కన్నా ఎక్కువ వెసులుబాటు కల్పించారు. ఇక, ఈనెల 26వ తేదీ నుంచి పెండింగ్ చలాన్లను డిస్కౌంట్‌తో కట్టే అవకాశం ఇచ్చారు. జనవరి 10వ తేదీ వరకు చలాన్లను ఆన్‌లైన్‌తో పాటుగా మీ సేవ కేంద్రాల్లో కూడా చెల్లించవచ్చు. చలాన్లలో డిస్కౌంట్ ఇలా.. ►ఆర్టీసీ డ్రైవర్స్, తోపుడు బండ్ల వారికి 90 శాతం డిస్కౌంట్ ► ద్విచక్ర వాహనాల చలాన్లకు 80 శాతం డిస్కౌంట్ ►ఫోర్ వీలర్స్, ఆటోలకు 60 శాతం డిస్కౌంట్ ►లారీలతో పాటు ఇతర హెవీ వెహికిల్స్‌కి 50 శాతం డిస్కౌంట్. ఇదీ చదవండి: TS: బీజేపీ ముఖ్య నేతలకు అమిత్‌షా క్లాస్ -
Christmas Celebrations: హిమాచల్‌లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
సిమ్లా: క్రిస్మస్ వేడుకల సందర్భంగా హిమాచల్ ప్రదేశ్‌లోని లాహౌల్, స్పితికి భారీ సంఖ్యలో పర్యాటకులు వచ్చారు. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. మనాలి-రోహ్తంగ్ హైవేపై అటల్ టన్నెల్ వైపు వెళ్లే మార్గాలు కార్లతో నిండిపోయాయి. పెద్ద సంఖ్యలో పర్యాటకులు రావడంతో పోలీసులు డ్రోన్‌తో నిఘా పెట్టారు. సరిపడా పార్కింగ్ సౌకర్యాలు లేకపోవటం, వాహనాల రద్దీకి తగ్గట్టుగా అధికారులు ఏర్పాట్లు చేయకపోవడంతో చాలా మంది పర్యాటకులు పార్కింగ్ విషయంలో ఇబ్బంది పడుతున్నారు. అధికారులు తాత్కాలిక ఏర్పాట్లతో ట్రాఫిక్‌ను నియంత్రించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. నదిలో ప్రయాణం.. ట్రాఫిక్ జామ్ నుంచి బయటపడటానికి ఓ వ్యక్తి లాహౌల్‌లో రోడ్డు మార్గం కాకుండా నది గుండా కారులో ప్రయాణించాడు. ఇలాంటి ప్రమాదకర ప్రయాణం చేయరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. Video of tourist driving car in Chandra river in #Lahaul, Himachal goes viral, please do not expose yourself by doing such useless act. pic.twitter.com/kgLsbvnp3s — Nikhil Choudhary (@NikhilCh_) December 25, 2023 సిమ్లా నగరంలోని హోటళ్లు కిక్కిరిసిపోయాయని ట్రావెల్ ఏజెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నవీన్ పాల్ తెలిపారు. శనివారం నుండి సోమవారం వరకు సెలవులు రావడంతో ఈ ప్రాంతాల్లో పర్యాటకుల తాకిడి పెరిగింది. ధర్మశాల, సిమ్లా, నర్కండ, మనాలి, డల్హౌసీ తదితర ప్రాంతాలతో పాటు హిమాచల్‌లో క్రిస్మస్ వేడుకలు చేసుకునేందుకు అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు. సిమ్లా పోలీసులు నగరంలో వాహనాల ప్రవేశ డేటాను విడుదల చేశారు దీని ప్రకారం గత 72 గంటల్లో సిమ్లాకు 55,345 వాహనాలు వచ్చాయి. ఈ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇదీ చదవండి: యేసుక్రీస్తు బోధనలు దేశాభివృద్ధికి మార్గనిర్దేశం: ప్రధాని మోదీ -
ట్రాఫిక్‌లో పైలట్.. ఫ్లైట్ లేట్..! వీడియో వైరల్
ప్రముఖ హాస్యనటుడు కపిల్ శర్మ దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో నిర్వహణను తప్పుపట్టారు. ఇందుకు సంబంధించి శర్మ తన ఎక్స్ ఖాతాలో తాజాగా జరిగిన సంఘటన గురించి షేర్ చేశారు. అందులోని వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి. నవంబర్ 29న చెన్నై నుంచి ముంబయి వెళ్లాల్సిన 6ఈ 5149 నంబర్ ఇండిగో విమానం దాదాపు గంటకుపైగా ఆలస్యంగా బయలుదేరింది. ఇది షెడ్యూల్ ప్రకారం రాత్రి 8:00 గంటలకు చెన్నై నుంచి బయలుదేరి రాత్రి 9:55 గంటలకు ముంబై చేరుకోవాలి. అయితే గూగుల్ ఫ్లైట్స్ డేటా ప్రకారం దాదాపు నాలుగు గంటలు ఆలస్యం అవుతుందని సూచిస్తూ విమాన బయలుదేరే సమయం నవంబర్ 30 ఉదయం 12:10కు మారింది. అప్పటికే అందులో ఎక్కిన ప్రయాణికులు దాదాపు 180 మంది ఆందోళన చేపట్టారు. వెంటనే సమస్యకు చర్య తీసుకోవాలని కోరినా మేనేజ్మెంట్ సరిగా స్పందించలేదని ఆయన తెలిపారు. ఆ ప్రయాణికుల్లో వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు ఉన్నారని చెప్పారు. అయితే వారిని వేరే విమానం ఎక్కిస్తామని నమ్మించి మళ్లీ సెక్యూరిటీ వింగ్‌కు తరలించినట్లు చెప్పారు. విమానం ఆలస్యం అయినందుకు కారణం అడుగుతున్న ప్రయాణికులకు సరైన సమాధానం చెప్పకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని అసంతృప్తి వ్యక్తం చేశారు. పైలట్ ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయాడంటూ ఇండిగో సిబ్బంది సమర్థించుకునే ప్రయత్నం చేశారంటూ తెలిపారు. ఇండిగో సీనియర్ అధికారితో మాట్లాడాలని కోరుతూ ఎయిర్‌లైన్ గ్రౌండ్ సిబ్బందితో ప్రయాణికులు వాగ్వాదానికి దిగిన వీడియోలను శర్మ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. Dear @IndiGo6E first you made us wait in the bus for 50 minz, and now your team is saying pilot is stuck in traffic, what ? Really ? we supposed to take off by 8 pm n it’s 9:20, still there is no pilot in cockpit, do you think these 180 passengers will fly in indigo again ? Never… — Kapil Sharma (@KapilSharmaK9) November 29, 2023 ఇదీ చదవండి: సెల్ఫ్‌మేడ్ ఎంట్రప్రెన్యూర్స్ 2023 లిస్ట్ విడుదల.. ఆయనే టాప్.. ‘ప్రియమైన ఇండిగో, మీరు మమ్మల్ని బస్సులో 50 నిమిషాలు వేచి ఉండేలా చేశారు. ఇప్పుడు మీ సిబ్బంది.. పైలట్ ట్రాఫిక్‌లో చిక్కుకున్నాడని అంటున్నారు. మేము రాత్రి 8 గంటలకు బయలుదేరాలి. ప్రస్తుతం రాత్రి 9:20 అవుతుంది. ఇప్పటికీ కాక్‌పిట్‌లో పైలట్ లేడు. ఈ 180 మంది ప్రయాణికులు మళ్లీ ఇండిగోలో ప్రయాణిస్తారని అనుకుంటున్నారా?’ అంటూ తన పోస్ట్‌లో తెలిపారు. Now they r de boarding all the passengers n saying we will send you in another aircraft but again we have to go back to terminal for security check 👏👏👏👏👏 #indigo👎 pic.twitter.com/NdqbG0xByt — Kapil Sharma (@KapilSharmaK9) November 29, 2023 People r suffering bcoz of you @IndiGo6E lying lying n lying, there r some old passengers on wheel chairs, not in a very good health condition. Shame on you #indigo 👎 pic.twitter.com/87OZGcUlPU — Kapil Sharma (@KapilSharmaK9) November 29, 2023 -
సాయంత్రం 5 దాటితే కష్టాలే.. ఆ నగరాల్లో దారుణమైన ట్రాఫిక్!
నగరాల్లో ట్రాఫిక్ కష్టాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఎన్ని పైవంతెనలు వచ్చినా, కూడళ్లను మూసేసినా, యూటర్న్లు ఏర్పాటు చేసినా వాహనదారుల కష్టాలు మాత్రం తీరట్లేదు. ఉదయాన్నే ఆఫీసులకు బయల్దేరే ఉద్యోగులు సహా పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు సమయానికి చేరుకోలేకపోతున్నారు. బస్‌స్టేషన్, రైల్వేస్టేషన్లకు వెళ్లేవారు ప్రయాణ సమయానికి గంట ముందు, విమానాశ్రయానికి వెళ్లేవారు దాదాపు మూడు గంటల ముందే బయల్దేరాల్సి వస్తోంది. సాయంత్రం ఐదు దాటిందంటే నగరంలో ట్రాఫిక్ క్రమంగా పెరుగుతూ ఉంటుంది. రాత్రి పది తర్వాతే రోడ్లపై కొంచెం ఒత్తిడి తగ్గినట్లు కనిపిస్తోంది. ప్రధాన నగరాల్లో ఈ తిప్పలు తప్పించేందుకు ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ కష్టాలు చాలవన్నట్లు వర్షాకాలంలో డ్రైనేజీలు పొంగిపొర్లి వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. గమ్యం చేరే వరకు గంటల కొద్దీ అలా ప్రయాణం సాగించాల్సిందే. ఇదీ చదవండి: ప్రపంచంలో అక్కడే నిరుద్యోగులు ఎక్కువ..! కేంద్రం అమలు చేస్తున్న నిబంధనల ప్రకారం.. దాదాపు 15 ఏళ్లు దాటిన వాహనాలను తుక్కుగా మార్చాలి. అయినా రోజురోజుకు వాహనాల సంఖ్య పెరుగుతోంది. ఆటోమొబైల్ కంపెనీలు ప్రతి త్రైమాసికంలో వాటి సేల్స్డేటా పెరుగుతోందని ప్రకటిస్తున్నాయి. దాంతో రోజూ రోడ్లపై చేరే వాహనాల సంఖ్య పెరుగుతోంది. రోడ్ల వెడల్పు నిర్ణీత ప్రదేశం వరకే విస్తరించే అవకాశం ఉంది. దానికి ప్రత్యామ్నాయంగా ఫ్లైఓర్లు వేసి కొంత కట్టడి చేస్తున్నారు. అయినా చాలా నగరాల్లో ట్రాఫిక్ తిప్పలు తప్పడంలేదు. ఇదీ చదవండి: ఈ రోజు బంగారం ధరల కోసం క్లిక్ చేయండి ప్రపంచంలో అత్యధికంగా నైజీరియా దేశంలోని లాగోస్ నగరంలో ప్రజలు ట్రాఫిక్ వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు కొన్ని సర్వేలు తెలుపుతున్నాయి. లాగోస్ విస్తీరణం 999 చదరపు కిలోమీటర్లు. అక్కడ ఒక కిలోమీటర్‌కు దాదాపు 227 వాహనాలు ప్రయాణిస్తున్నాయి. నగరంలోని 9100 రోడ్లపై రోజు దాదాపు 50లక్షల వాహనాలు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. దేశంలో అధికంగా ట్రాఫిక్ ఉండే నగరాల్లో దిల్లీ మొదటిస్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఐదో స్థానంలో ఉంది. దిల్లీ సుమారు 1484 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంది. 2020 లెక్కల ప్రకారం దాదాపు 1.2 కోట్లు వాహనాలు దిల్లీలో ఉన్నాయి. దిల్లీ తర్వాత కోల్‌కతా, ముంబయి నగరాల్లో అధికంగా ట్రాఫిక్ ఉన్నట్లు నివేదికల ద్వారా తెలుస్తుంది. Top 10 cities with the worst traffic in the world pic.twitter.com/bn4XPT21w0 — Global Ranking (@Top1Rating) November 23, 2023 -
ట్రాఫిక్ తెచ్చిన తంటా.. రోడ్డుపై డిష్యుం డిష్యుం! వీడియో వైరల్
అత్యంత రద్దీ ఉండే మెట్రో నగరాల్లో బెంగళూరు ఒకటి. దేశ ఐటీ పరిశ్రమకు కేంద్రంగా ఉన్న ఆ నగరంలో ట్రాఫిక్ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా బెంగళూరు రోడ్డుపై ట్రాఫిక్ సిగ్నల్ వద్ద జరిగిన జగడం అంటూ ఓ వీడియో వైరల్‌గా మారింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’(ట్విటర్)లో 'ఘర్ కే కాలేష్' అనే హ్యాండిల్‌పై ఈ వీడియో అప్లోడ్ చేశారు. ఇందులో రోడ్డుపై ముగ్గురు వ్యక్తులు విచక్షణారహితంగా కొట్టుకుంటున్నట్లు కనిపిస్తోంది. రెడ్ సిగ్నల్ వద్ద ఆగిపోయిన ట్రాఫిక్ మధ్య ఇద్దరు వ్యక్తులు మరొక వ్యక్తి పిడిగుద్దులు కురిపించారు. గ్రీన్ సిగ్నల్ పడగానే వాళ్లు అలాగే కొట్టుకుంటూ పక్కకు వెళ్లిపోయారు. వీరి జగడాన్ని ఓ వ్యక్తి వీడియో తీశారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోకు పెద్ద సంఖ్యలో లైక్స్, వ్యూస్ వచ్చాయి. నగరంలో ట్రాఫిక్ సమస్యకు ఇది అద్దంపడుతోందంటూ ఈ వీడియోను చూసిన యూజర్లు కామెంట్లు పెట్టారు. Road Rage kalesh in Bengaluru pic.twitter.com/XMzM7CvURF — Ghar Ke Kalesh (@gharkekalesh) November 9, 2023 -
ఐదు రోజులు సెలవులు.. అర్ధరాత్రైనా ఇంటికి చేరుకోని ధైన్యం
బెంగళూరు: వరుసగా ఐదు రోజులు సెలవులు రావడంతో బెంగళూరులో భారీ ట్రాఫిక్ జామ్ అయింది. బుధవారం సాయంత్రం కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. గంటల తపబడి వాహనదారులు రోడ్లపైనే వేచి ఉన్నారు. పాఠశాల విద్యార్థులు సైతం అర్థరాత్రి వరకు రోడ్లపైనే గడిపారు. సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల మధ్య ట్రాఫిక్ ఒక్కసారిగా పెరిగిపోయిందని పోలీసులు తెలిపారు. ఐదు రోజులు.. ఈ వీకెండ్‌కు ఐదు రోజులు సెలవులు వస్తున్నాయి. ఈ రోజు ఈద్ మిలాద్ ఉన్ నబీకి అధికారికంగా సెలవు ఉంటుంది. కర్ణాటక-తమిళనాడు మధ్య చెలరేగుతున్న కావేరి నదీ జలాల వివాదంపై రేపు బంద్‌కు పిలుపునిచ్చారు. టెక్ కంపెనీలకు శనివారం, ఆదివారం సెలవులు ఉంటాయి. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా పబ్లిక్ హాలిడే. దీంతో నగరవాసులు తమ సొంతూళ్లకు వెళ్తున్నారు. బుధవారం సాయంత్రం ట్రాఫిక్ ఒక్కసారిగా పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. సాధారణ రోజుకు రెండింతలు ట్రాఫిక్ పెరిగిందని వెల్లడించారు. సాధారణంగా రోడ్లపై వాహనాల సంఖ్య 1.5 నుంచి 2 లక్షల వరకు ఉంటుంది. కానీ బుధవారం ఆ సంఖ్య ఏకంగా 3.5 వరకు పెరిగిందని స్పష్టం చేశారు. వర్షం కారణంగా రోడ్లపై నీరు నిలవడం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఇదీ చదవండి: అప్పులు చేసి ఆడంబర వివాహాలొద్దు -
నా పెళ్లి జరగనివ్వండి.. మహా ప్రభో
సాక్షి, వరంగల్: ట్రాఫిక్ జామ్ కావడంతో పెండ్లి ముహూర్తం దాటిపోతోందని వరుడు కారు నుండి దిగి అధికారులను ట్రాఫిక్ క్లియర్ చేయాలని వేడుకున్న ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ శివారు ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడి సహాయక చర్యలు చేపట్టిన అధికారులు మూడు భారీ క్రేన్లతో ఆయిల్ ట్యాంకర్ లారీని తీయడానికి ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై రెండు వైపులా వాహనాలను నిలిపి లారీని తీస్తుండగా వరంగల్ నుండి తొర్రూర్‌కు వెళ్తున్న పెండ్లి కొడుకు కారు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది ఉదయం 10 గంటలకు వివాహ ముహూర్తం ఉండటంతో పెండ్లి కుమారుడు ముహూర్తం దాటిపోతోందని ట్రాఫిక్ క్లియర్ చేయాలని కారు దిగి రోడ్డుపై నడిచాడు. భారీ క్రేన్ల వద్దకు చేరుకొని అధికారులను త్వరగా వాహనాలను పంపించాలని పెండ్లి ముహూర్తం దాటిపోతుందని వేడుకున్నాడు. దీంతో అధికారులు పెట్రోల్ ట్యాంకర్ ఉండటంతో ఇబ్బంది ఏర్పడిందని కాస్త సమయం కావాలని సూచించారు. ట్రాఫిక్ క్లియర్ కావడం లేదని భావించిన పెండ్లి కుమారుడు కారును మళ్లీ వెనక్కి తిప్పి కొంత దూరం ప్రయాణించాడు. ఇంతలోనే వాహనాలు కదిలి ముందుకు వెళ్లడంతో మళ్లీ వెనక్కి వచ్చి తొర్రూర్‌కు వెళ్లిపోయాడు. చదవండి: ఒంగోలు బ్యూటీపార్లర్ కేసు: మార్గదర్శి మేనేజర్ భార్య అరెస్ట్ -
Hyderabad : వర్షం దెబ్బకు హైదరాబాద్ ఏమయిందంటే.?
హైదరాబాద్ : జంట నగరాల్లో వానలు దంచికొడుతున్నాయి. సోమవారం రాత్రి నుంచి కురిస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కొన్ని పాంత్రాల్లో కరెంట్ లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక, మంగళవారం ఉదయం నుంచి కుండపోత వర్షంతో హైదరాబాద్‌లో భారీగా ట్రాఫిక్‌జామ్‌లు ఏర్పడ్డాయి. తెల్లవారుజాము నుంచే భారీ వర్షం కురవడంతో.. రోడ్లు, లోతట్టు నీట మునిగాయి. అక్కడక్కడా పిడుగులు పడటంతో ప్రజలు వణికిపోయారు. షేక్ పేటలో పరిస్థితిని ఓ సిటిజన్ ఇలా వీడియోతో రిపోర్ట్ చేశాడు. Shaikpet 😦 #HyderabadRains @Director_EVDM pic.twitter.com/TTO7wP1Quv — @Coreena Enet Suares (@CoreenaSuares2) September 5, 2023 భూపాలపల్లి జిల్లాలో పిడుగుల బీభత్సం నెలకొంది. పిడుగుపాటుకు ముగ్గురు మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. కాటారం మండలం దామెరకుంటలో పిడుగుపడి రైతు గూడూరు రాజేశ్వర్ రావు (46) మృతి చెందారు. పొలంలో కలుపు తీస్తుండగా రైతు పిడుగుపాటుకు గురయ్యారు. చిట్యాల మండలం శాంతినగర్‌లో మిరప నారు నాటుతుండగా పిడుగుపడి ఇద్దరు మహిళా కూలీలు చెలివేరు సరిత(30), నెరిపటి మమత(32) మరణించారు. మరో ఇద్దరు మహిళలు అరెపల్లి కొమురమ్మ, మైదం ఉమకు గాయాలయ్యాయి. వారిని చిట్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతిచెందిన ఇద్దరు మహిళల స్వగ్రామం చిట్యాలగా గుర్తించారు. ఇక పిడుగుల వర్షంతో గ్రామీణ ప్రజలు భయాందోళన చెందుతున్నారు. చాలా చోట్ల అడుగు తీసి అడుగు వేయలేనంతగా వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణీకులు ఇబ్బందులకు గురయ్యారు. దీంతో రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసుల ఎక్కడికక్కడ నిలిచిపోయిన ట్రాఫిక్‌ను క్లియర్ చేసే పనిలో పడ్డారు. లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకోగా...మ్యాన్‌హోల్స్, నాలాలు పొంగిపోర్లుతున్నాయి. టోలిచౌకిలో దాదాపు కాలనీ అంతా నీళ్లు చేరాయి. This is Tolichowki a regular spot for floods from years. KTR as a minister what change have you brought to control this rain water on to roads. You have been Minister from 9 years and the situation is same from last 9 years. #HyderabadRains pic.twitter.com/0cME1UuEL2 — 𝐒𝐚𝐠𝐚𝐫 𝐆𝐨𝐮𝐝 (@Sagar4BJP) September 5, 2023 ట్రాఫిక్.. నరకయాతన కుండపోత వర్షంతో నగరమంతా ట్రాఫిక్ జామ్ అయింది. గంటల కొద్దీ రాకపోకలు నిలిచిపోవడంతో వాహనదారులు నరకయాతన అనుభవించారు. ట్రాఫిక్ పోలీసులు వీలైనంత వరకు వాహనదారుల్ని అలర్ట్ చేస్తూ కనిపించారు. #HYDTPinfo Commuters are requested to drive carefully in #Rain.@HYDTP officers for your assistance at all Junctions.#Rainfall #HyderabadRains @AddlCPTrfHyd pic.twitter.com/giuKMi269d — Hyderabad Traffic Police (@HYDTP) September 5, 2023 ప్రధానంగా పంజగుట్ట నిమ్స్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, కేబీఆర్ పార్క్, జూబ్లీహిల్స్, పెద్దమ్మతల్లి రోడ్డు, అపోలో హాస్పిటల్ రోడ్, ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్, మలక్‌పేట, చాదర్‌ఘాట్, అబిడ్స్, నాంపల్లి, అసెంబ్లీ, ఖైరతాబాద్, అమీర్‌పేట తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో పోలీసులు వాహనదారులను ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించారు. ఆఫీసులకు వెళ్లే టైంలో భారీవర్షం కురవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రశాంత్ నగర్ లో రోడ్డంతా నీళ్లతో నిండిపోయింది. At prashanth nagar Going to exam Jntuh ( St Mary's College) Jntuh oka boat isthe Easy ga reach avtham center ki#HyderabadRains #Hyderabad @examupdt @balaji25_t pic.twitter.com/mPotVP3HC7 — venky (@venky46799918) September 5, 2023 క్షేత్రస్థాయిలో అధికారులు నగరంలో వర్షం కురుస్తున్నందున మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు, డీఆర్ఎఫ్ టీమ్స్‌తో పాటు జీహెచ్ఎంసీ అధికారులంతా క్షేత్రస్థాయిలో ఉండి పరిస్థితి చక్కదిద్దుతున్నారని GHMC తెలిపింది. అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 191 వద్ద పరిస్థితి ఇలా ఉంది. Heavy rainfall in several places of #Hyderabad today. Situation at the favourite place of #Waterlogging , at the pillar no.191, under PVNR Expressway at #Upperpally near Attapur area, traffic interrupts. GHMC at work.#HyderabadRains #HeavyRains pic.twitter.com/DZDOpQFlBx — Surya Reddy (@jsuryareddy) September 5, 2023 బీ అలర్ట్ భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ సూచించింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని పేర్కొంది. ప్రయాణాలు ఉంటే వాయిదా వేసుకోవాలని కోరింది. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వచ్చిన ప్రజలకు చుక్కలు కనిపించాయి. #TrafficAlert : Today's situation at the Moosapet area in Hyderabad, traffic moves at snail's pace, as roads were marooned after heavy rains. The IMD issued an #OrangeAlert warning for Hyderabad, today.#HyderabadRains #TrafficJam #Hyderabad #Moosapet pic.twitter.com/kokSpgWlm9 — Surya Reddy (@jsuryareddy) September 5, 2023 వరద నష్టం వరద ఒక్కసారిగా పోటెత్తడంతో భారీ ఆస్తినష్టం జరిగిందని పలువురు సిటిజన్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కొందరి వాహనాలు కొట్టుకుపోతే.. మరికొందరి వాహనాలు నీట మునిగాయి. ఇంకొందరి ఇళ్లలో నీళ్లు చేరాయి. #HyderabadRains vs Two-Wheelers pic.twitter.com/tX7kxjcAUr — Donita Jose (@DonitaJose) September 5, 2023 వర్షాల వల్ల తలెత్తే పరిస్థితుల్ని ఎదుర్కొనేందుకు DRF టీమ్స్ అప్రమత్తంగా ఉన్నాయని తెలిపింది. వరదలు, చెట్లు కూలడం తదితర సమస్యల నుంచి రక్షణకు ప్రజలు 040–21111111 లేదా 9000113667 నెంబర్లకు ఫోన్ చేయవచ్చునని పేర్కొంది. 👉ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో@metcentrehyd శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.#HyderabadRains #rains #Hyderabad pic.twitter.com/XRhxtD0JTL — DD News Telangana | తెలంగాణ న్యూస్ (@ddyadagirinews) September 5, 2023 -
విశాఖలో విమాన ప్రయాణికుల జోరు
సాక్షి, అమరావతి: రాష్ట్ర పరిపాలన రాజధానిగా ప్రకటించిన విశాఖపట్నంతో పాటు కడపకు విమాన ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. 2023–24 ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలలు అంటే.. ఏప్రిల్ నుంచి జూలై వరకు విమాన ప్రయాణికుల గణాంకాలను గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. విశాఖకు విమాన ప్రయాణికుల సంఖ్యలో 33.93 శాతం వృద్ధి నమోదైనట్లు ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) తాజాగా విడుదల చేసిన గణాంకాల్లో పేర్కొంది. 2022–23 ఏప్రిల్–జూలై మధ్య కాలంలో విశాఖపట్నం నుంచి 7,74,925 మంది ప్రయాణిస్తే ఈ ఏడాది అదే సమయానికి 10,37,656 మంది ప్రయాణించారు. కడప విమానాశ్రయం 36.1 శాతం వృద్ధి నమోదు చేసింది. 2022–23 ఏప్రిల్–జూలై మధ్య 20,289 మంది ప్రయాణించగా.. ఆ సంఖ్య ఈ ఏడాది 27,612కు పెరిగింది. ఇక విజయవాడ ఎయిర్‌పోర్టు 19.3 శాతం వృద్ధి నమోదు చేసింది. ప్రయాణికుల సంఖ్య 3.09 లక్షల నుంచి 3.68 లక్షలకు పెరిగింది. రాజమండ్రి ఎయిర్‌పోర్టుకు కూడా గణనీయంగా ప్రయాణికులు పెరిగారు. కాగా, ఈ సమయంలో దేశవ్యాప్తంగా ప్రయాణీకుల సంఖ్యలో 22.6 శాతం వృద్ధి నమోదైంది. తిరుపతి, కర్నూలు ఎయిర్‌పోర్టుల్లో మాత్రం ప్రయాణికుల సంఖ్యలో స్వల్ప క్షీణత నమోదైంది. రాష్ట్రంలోని మొత్తం ఆరు ఎయిర్‌పోర్టుల ద్వారా ఈ ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల్లో 18,84,926 మంది ప్రయాణించారు. దేశం మొత్తం మీద చూస్తే ఆ నాలుగు నెలల కాలంలో విమాన ప్రయాణికుల సంఖ్య 10.04 కోట్ల నుంచి 12.30 కోట్లకు చేరుకుంది. పెరిగిన విదేశీ ప్రయాణికులు రాష్ట్రంలో మూడు విమానాశ్రయాలకు అంతర్జాతీయ హోదా ఉన్నప్పటికీ ప్రస్తుతం విశాఖ, విజయవాడ విమానాశ్రయాల నుంచి మాత్రమే విదేశీ విమాన సర్వీసులు నడుస్తున్నాయి. త్వరలో తిరుపతి నుంచి గల్ఫ్ దేశాలకు సర్వీసులు ప్రారంభించే విధంగా ప్రభుత్వం కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వ శాఖతో చర్చలు జరుపుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగు నెలల కాలంలో అంతర్జాతీయ విమాన ప్రయాణికుల సంఖ్యలో గణనీయమైన వృద్ధి నమోదయ్యింది. విశాఖ నుంచి విదేశీ ప్రయాణికుల సంఖ్య 20.9 శాతం వృద్ధితో 20,097 నుంచి 24,143కు చేరితే, విజయవాడలో 14.4 శాతం వృద్ధితో 14,978 నుంచి 17,135కు చేరుకుంది. -
మడత పెట్టుకునేలా.. ఎలక్ట్రిక్ బైక్‌లు వచ్చేస్తున్నాయ్
గందరగోళం ట్రాఫిక్‌లో వాహనాలను నడపటమే ఒక పరీక్ష అయితే, వాటిని భద్రంగా పార్క్ చేయడం మరో పెద్ద పరీక్ష. తేలికగా నడపటానికి, సులువుగా పార్క్ చేసుకోవడానికి వీలుగా మడిచేసుకోవడానికి అనువైన ఈ–బైక్ అందుబాటులోకి వచ్చేసింది. సాదాసీదా సైకిల్లా కనిపించే ఈ ద్విచక్ర వాహనం రీచార్జబుల్ బ్యాటరీ సాయంతో నడుస్తుంది. బ్యాటరీ చార్జింగ్ తోవలో అయిపోయినా, దీని పెడల్స్ తొక్కుతూ ముందుకు సాగిపోవచ్చు. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ‘యాడ్మోటార్స్’ ఇటీవల ‘ఫోల్డ్టాన్ ఎం–160’ పేరుతో ఈ ఎలక్ట్రిక్ బైక్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ప్రయాణం పూర్తయ్యాక దీనికి క్షణాల్లోనే మడతపెట్టేసుకోవచ్చు. దీనిపై ఆఫీసులకు వెళ్లేవారు ఆఫీసులకు చేరుకున్నాక, దీన్ని మడిచేసుకుని తాము పనిచేసే చోట టేబుల్స్ కింద భద్రపరచుకోవచ్చు. పార్కింగ్ ఇబ్బందులు తొలగించడానికి రూపొందించిన ఈ ఎలక్ట్రిక్ బైక్ ధర 1899 డాలర్లు (రూ.1.55 లక్షలు) మాత్రమే! -
అదే బెంగళూరు కొంపముంచుతోంది.. ఏడాదికి వేల కోట్లలో నష్టం!
కర్ణాటక రాజధాని.. దేశానికి ఐటీ రాజధాని.. అదే సిలికాన్ వ్యాలీగా పేరు గాంచిన బెంగళూరు. ఇప్పుడే ఈ మెట్రోపాలిటన్ సిటీ ప్రపంచ ప్రఖ్యాత ఐటీ కంపెనీల కార్యకలాపాలతో ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించిందో ట్రాఫిక్ రద్దీతో అంతే అపఖ్యాతి పాలవుతుందంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ట్రాఫిక్ ఆలస్యం, రద్దీ, సిగ్నల్స్ ఆగిపోవడం, ట్రాఫిక్ వల్ల సమయం వృధా అవ్వడం, వాహనాల్లో ఇంధనం వృధా ఖర్చు వంటి ఇతర కారణాల వల్ల సంవత్సరానికి రూ.19,725 కోట్ల నష్టం వాటిల్లితున్నట్లు తెలుస్తోంది. ట్రాఫిక్ నిపుణుడు ఎంఎన్ శ్రీహరి అతని బృందం రోడ్ ప్లానింగ్, ఫ్లైఓవర్, ట్రాఫిక్ నిర్వహణ, మౌలిక సదుపాయాల లోటుకు సంబంధించిన సమస్యలపై సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో బెంగళూరు నగరంలో 60 పూర్తిస్థాయిలో ఫ్లైఓవర్లు ఉన్నప్పటికీ, ఆలస్యం, రద్దీ, సిగ్నల్ల వద్ద ఆగిపోవడం, వేగంగా వెళ్లే వాహనాలు, ఇంధన నష్టం, నెమ్మదిగా వెళ్లడం వంటి కారణాలతో బెంగళూరు వాహనదారులకు రూ. 19,725 కోట్ల నష్టం వాటిల్లినట్లు అధ్యయనం హైలెట్ చేసింది. వేగంగా విస్తరిస్తున్న ఐటీ రంగం బెంగళూరులో రోజు రోజుకీ ఐటీ రంగం మరింత వృద్ది సాధిస్తోంది. తద్వారా హౌసింగ్,ఎడ్యుకేషన్‌తో పాటు వివిధ రంగాల అభివృద్దిలో పాలు పంచుకుంటుంది.వెరసీ బెంగళూరులో అసాధారణ జనాభా పెరుగుదల 14.5 మిలియన్లు ఉండగా వెహికల్ పాపులేషన్ 1.5 కోట్లుగా ఉంది. మరింత విస్తరిస్తున్న బెంగళూరు అంచనా ప్రకారం.. ఈ ఏడాది బెంగళూరు నగరం మరింత విస్తరిస్తోంది. 88 స్కైర్ కిలోమీటర్ల నుంచి 985 కిలోమీటర్లకు పెరిగింది. నగరం 1,100 చదరపు కిలోమీటర్లకు విస్తరించాలని అధ్యయనం ప్రతిపాదించింది. మరోవైపు, రహదారి పొడవు పెరుగుదల వాహనాల పెరుగుదల, విస్తీర్ణం పెరుగుదలకు సమానంగా లేదు. రహదారి మొత్తం పొడవు సుమారు 11,000 కిలోమీటర్లు. రవాణా డిమాండ్, చేసే ప్రయాణికులకు ఏ మాత్రం సరిపోదని నివేదిక పేర్కొంది. ప్రభుత్వం చొరవ తీసుకోవాలి పెరిగిపోతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కొరత ఆ నగర వాసుల్ని తీవ్రంగా వేధిస్తుంది. ఆలస్యం, రద్దీ, ప్రయాణం వంటి కారణాల వల్ల సామానులపై పరోక్షంగా ఖర్చుల భారం పడుతుంది. ఆర్ధికంగా నష్టపోతున్నారని శ్రీహరి అన్నారు. అంతేకాదు, తాము జరిపిన ఈ సర్వేలో ట్రాఫిక్ కారణంగా ఏడాదికి రూ.20వేల కోట్లు నష్టం వాటిల్లిందని, ట్రాఫిక్ సమస్యల్ని తగ్గించే విధంగా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని కోరారు. -
శాంతించిన మున్నేరు.. హైదరాబాద్-విజయవాడ హైవే క్లియర్
సాక్షి, ఐతవరం : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు దంచికొట్టిన విషయం తెలిసిందే. కాగా, వరదల కారణంగా కృష్టా జిల్లాలోని ఐతవరం వద్ద జాతీయ రహదారిపైకి నీరు రావడంతో రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. దీంతో దాదాపు 24 గంటలపాటు రాకపోకలు నిలిచిపోయాయి. వేలాది వాహనాలు రోడ్డుపైనే నిలిచిపోయాయి. ఈ క్రమంలో టీఎస్ఆర్టీసీ కూడా విజయవాడ-హైదరాబాద్ మధ్య రెగ్యులర్ సర్వీసులను రద్దు చేసింది. ఇక, తాజాగా వాహనాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్-విజయవాడ హైవేపై యథావిధిగా వాహనల రాకపోకలు కొనసాగుతున్నాయి. మున్నేరు వరద తగ్గడంతో వాహనాలను పోలీసులు అనుమతించారు. కాగా, అంతకుముందు వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. వరదల్లో చిక్కుకున్న వారిని సహాయక బృందాలు రక్షించారు. ఇది కూడా చదవండి: బోరుమంటున్న మొరంచపల్లి.. సర్వం కోల్పోయిన దీనస్థితి.. -
జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్!
ఆదిలాబాద్: పెన్‌గంగలో శనివారం రాత్రి వరద ఉధృతి ఒక్కసారిగా పెరిగింది. మండలంలోని డొల్లార వద్ద గల బ్రిడ్జిని తాకుతూ ప్రవాహం ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. బ్రిడ్జి మీదుగా రాకపోకలను నిలిపివేశారు. బ్రిడ్జికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పిప్పర్వాడ టోల్‌ప్లాజా వద్దనే వాహనాలను అపేసారు. వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బ్రిడ్జికి ఇరు వైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఆదివారం ఉదయం ప్రవాహ ఉధృతి తగ్గడంతో రాకపోకలను అనుమతించారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. -
నాడు ‘చిన్న సినిమాల శ్రీదేవి’... నేడు ‘ ఇంటర్నెట్ ట్రాఫిక్ జనరేటర్’...
ఆమె ఎప్పుడూ మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లో కనిపించలేదు. అయితే సింగిల్ స్క్రీన్ సినిమా హాళ్లలో మార్నింగ్ షోలలో కనిపిస్తూ రచ్చ చేసేది. 1990, 2000 దశాబ్ధాలలో ఆమె తన హవా చాటింది. ఆమె సినిమాలను యువకులు ఎగబడి చూసేవారు. ఆ సమయంలో ఆమె ఏకంగా 250 సినిమాలు చేసింది. అందుకే ఆమెను కొందరు అభిమానులు ‘చిన్న సినిమాల శ్రీదేవి’ అంటూ అభివర్ణించేవారు. సప్నా సప్పూ.. బాలీవుడ్ నటి. పెద్ద సినిమాల్లో ఆమె ఎప్పుడూ కనిపించిందేలేదు. 1990, 2000 దశాబ్ధాలలో హిందీ, గుజారాతీ భాషలలో ఏకంగా 250 సినిమాలు చేసింది. ఆ రోజుల్లో ఆమె సినిమాలు సింగిల్ స్క్రీన్ థియేటర్లలలో మార్నింగ్ షోలలో సందడి చేసేవి. ఆమె తెరమీద కనిపించగానే అభిమానులు ఉత్సాహంతో ఊగిపోయేవారు. అయితే 2013లో సప్నా సప్పూ వివాహం చేసుకుంది. తరువాత ఆమె సినిమా ప్రపంచానికి గుడ్‌బై చెప్పేసింది. అయితే పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఆర్థికంగా చితికి పోయిన ఆమె తిరిగి సినిమాల్లో కనిపించడం ప్రారంభించింది. ఓటీటీ ప్రపంచంలో తనదైన ముద్ర వేస్తోంది. మిథున్ చక్రవర్తితో మొదలు పెట్టి.. 1998లో బాలీవుడ్ హీరో మిథున్ చక్రవర్తితో ‘గూండా’ సినిమాతో సినిమాల్లో కాలు మోపిన ఆమెకు ఇప్పుడు ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. సినీ జగత్తులో ఆమె ప్రవేశం అంత సులభంగా జరగలేదు. ఇందుకోసం ఆమె అనేక త్యాగాలు చేయాల్సివచ్చింది. వాటి గురించి చెప్పేందుకు ఆమె ఏమాత్రం సందేహించదు. ఈ విషయాల గురించి ఆమె మీడియాతో మాట్లాడుతూ ‘నేను కెరియర్ తొలినాళ్లలో ప్రొడ్యూసర్లతో పాటు ప్రేమికుల కోసం అనేక ‘త్యాగాలు’ చేశాను. పెళ్లయిన తరువాత కూడా నా భర్త నన్ను మరింత ‘శాక్రిఫైజ్’ చేసేలా బలహీనపరిచాడు. చివరికి నేను జీవితాన్ని సరైన పద్ధతిలో నడపాలని భావించి తన కుమారుని కోసం తిరిగి ‘శాక్రిఫైజ్’ చేస్తున్నానని తెలిపారు. ప్రస్తుతం ఆమె భర్తకు విడాకులిచ్చారు. ఈ కేసు కోర్టులో నడుస్తోంది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే.. భర్తనుంచి విడిపోయి ముంబై తిరిగి వచ్చిక ఆమెను ఆర్థిక సమస్యలు చుట్టిముట్టాయి. ఆమెకు ఏ పనీ దొరకలేదు. అటు సినామాల్లో, ఇటు టీవీల్లో ఆమెకు ఎటువంటి అవకాశాలు రాలేదు. దీంతో ఆమె మరింత నిస్సహాయురాలిగా మారింది. చివరికి ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకుందట. అయితే కుమారుని ముఖం చూసి ఆ ప్రయత్నాన్ని విరమించింది. తన కుమారుడు టైగర్ ఇంకా చాలా చిన్నవాడు. వాడి ఆలనాపాలనా చూడాలి. వాడిని బాగా చదివించి పెద్దవాడిని చేయాలని ఆమె తెలిపింది. వెబ్ సిరీస్‌లో బిజీ.. 2019లో పలు ఓటీటీ ప్లాట్ఫారంలతోపాటు నెట్‌ఫ్లిక్స్ వెబ్‌సిరీస్‌లలో ఆమె తిరిగి రీ ఎంట్రీ ఇచ్చింది. ప్రేక్షక జనం ఆమెను మరచిపోలేదు. వివిధ ప్లాప్ఫారాల వెబ్ సిరీస్‌లలో ఆమెను ‘ఎక్స్ట్రా సర్వర్’గా చూపించారు. నెట్‌ఫ్లిక్స్ ఏకంగా ఆమెకు ‘సర్వర్ క్రషర్’, ‘ ఇంటర్నెట్ ట్రాఫిక్ జనరేటర్’ అనే బిరుదులు ఇచ్చేసింది. 2020లో వచ్చిన ‘ఆప్ కా సప్నా భాభీ’ మెగాహిట్గా నిలిచింది. దీనిలో ఆమె కీలకపాత్ర పోషించింది. తరువాత ఆమె ‘సౌతల్లీ’ అనే వెబ్ సిరీస్‌లో నటించింది. అనంతరం ఆమె నటించిన పాపింగ్ టామ్ సీజన్ రిలీజ్ అయి, అభిమానుల ఆదరణను పొందింది. దీనికి సస్నానే ప్రొడ్యూసర్, డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఆమె నటించిన ఎల్ఎల్డీ(లవ్, లస్ట్, డ్రామా), సప్నాకే అంగూర్, సప్పూ బాయీ తదితర వెబ్ సిరీస్‌లు ప్రేక్షకాదరణ పొందాయి. ఫ్యాన్స్ కూడా ఆమె షోలను చూసేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. ఈ నేపధ్యంలో ఆమెపై ఈర్ష్య పెంచుకున్నవారు కూడా చాలా మంది ఉన్నారు. వీరి గురించి ఆమె మాట్లాడుతూ ‘ఎవరిలో నాపై ద్వేషభావం ఉందో వారే ఇబ్బంది పడతారు. నా పని నేను చేసుకుంటూ ముందుకు వెళతాను’ అని ఆమె స్పష్టం చేసింది. కాగా ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 5 లక్షలకు మించిన ఫాలోవర్స్ ఉన్నారు. యూట్యూబ్‌లో ఆమె వీడియోలు తెగ వైరల్ అవుతుంటారు. ఇది కూడా చదవండి: భర్త లేకుండా పార్టీ.. సింగర్స్ జంట విడాకులు తీసుకోనుందా? -
నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు: పుదుచ్చేరి సీఎం
సాక్షి, చైన్నె: తన కాన్వాయ్ కోసం ట్రాఫిక్‌ను ఆపొద్దని, తాను సైతం ప్రజలతో కలిసే వెళ్తానని పుదుచ్చేరి సీఎం రంగస్వామి పోలీసులను సోమవారం ఆదేశించారు. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి సీఎం రంగస్వామి ప్రజలతో మమేకమైతిరిగే నాయకుడు. ఆయన తరచూ మోటారు సైకిల్‌పై సైతం చక్కర్లు కొడుతుంటారు. అయితే గత కొద్ది రోజులుగా ఆయనకు పోలీసులు భద్రతను పెంచారు. ఆయన కాన్వాయ్ వెళ్లే మార్గాల్లో ట్రాఫిక్‌ను ఆపేస్తున్నారు. రోజూ గోరిమేడులోని ఇంటి నుంచి సచివాలయం వెళ్లే సమయంలో అనేక ప్రాంతాల కూడలిలో వాహనాలు నిలుపుదల చేస్తూ వస్తున్నారు. తన కారణంగా స్థానికులకు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో ఇబ్బందులు ఎదురు అవుతుండడాన్ని సీఎం పరిగణించారు. దీంతో తన కాన్వాయ్ వెళ్లే మార్గాల్లో ఇకపై ట్రాఫిక్ ఆపాల్సిన అవసరం లేదని పోలీసులను ఆదేశించారు. ప్రజల వాహనాలతో పాటే తన వాహనం కూడా ముందుకెళ్తుందని, ఎక్కడ ఎలాంటి ట్రాఫిక్ ఆపాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇక ప్రజల వాహనాలను కూడా ఆపొద్దని పోలీసులకు ఆయన సూచించడం విశేషం. చదవండి: వేదికపై ఫ్రెండ్స్ చేసిన పనికి.. వరుడికి షాకిచ్చిన వధువు, గదిలోకి వెళ్లి! -
దంపతులు మధ్య చిచ్చు రేపిన ట్రాఫిక్ కెమెరా పిక్స్..జైలుపాలైన భర్త
కేరళ రాష్ట్రం ట్రాఫిక్ ఉల్లంఘనలు జరగకుండా ఉండేందుకు అత్యాధునిక ట్రాఫిక్ కెమరాలను ఏర్పాటు చేసింది. ఆ ట్రాఫిక్ కెమెరాలు ప్రస్తుతం వివాదస్పదమవ్వడమే గాక ఏకంగా ఓ కుంటుంబంలో కలతలు తెచ్చిపెట్టింది. కేరళలోని ఓ వ్యక్తి ఓ మహిళా స్నేహితురాలితో బైక్‌పై ప్రయాణించాడు. అతడు ఆ సమయంలో హెల్మెట్ ధరించలేదు. దీంతో బైక్ ఎవరి పేరు మీద రిజిస్టర్ అయ్యిందో వారి మొబైల్‌కి ఫోటోతో సహా మెసేజ్ వెళ్లింది. ఐతే అతడి బైక్ భార్య పేరు మీద ఉండటంతో ఆమె మొబైల్‌కి మెసేజ్ వచ్చింది. దీంతో ఆమె బైక్‌పై ఎక్కించుకున్న మహిళ ఎవరని ప్రశ్నించింది భార్య. నిజానికి ఆ మహిళ ఎవరో తనకు తెలియదని, తాను కేవలం ఆమెకు లిఫ్ట్ ఇచ్చానని భార్యాతో చెప్పాడు. కానీ ఆమె నమ్మలేదు. దీంతో ఇరువురి మద్య ఈ విషయమై గొడవలయ్యాయి. ఆ తర్వాత ఆమె తనపట్ల, కూతురి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడంటూ భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఆ వ్యక్తిని కోర్టులో హాజరుపర్చడమే గాక జ్యుడిషియల్ కస్టడీకి తరలించామని అధికారులు తెలిపారు. కాగా, సేఫ్ కేరళలో భాగంగా రోడ్డు భద్రతా ప్రాజెక్టు రహదారులపై ఈ అత్యాధునిక ట్రాఫిక్ కెమెరాలను ఏర్పాటు చేసింది. ఈ కెమెరాల ఒప్పందాల్లో చాలా అవినీతి జరిగిందంటూ కేరళ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పుడు ఆ కెమెరాలు సామాన్య ప్రయాణికుల వ్యక్తిగత జీవితాలను ఇబ్బంది పాలు చేస్తుండటం బాధకరం. (చదవండి: కేరళలో వైద్యురాలి మృతి కలకలం..చికిత్స చేస్తుండగా పెషెంట్..) -
ఆకాశ భవనాలు.. రోడ్లపై వాహనాలు ‘ఇంపాక్ట్’..పడేదెప్పుడు?
సాక్షి, హైదరాబాద్ : ట్రాఫిక్‌లో గంటల కొద్దీ ప్రయాణం.. నివాస, వాణిజ్య సముదాయాల నుంచి ఒక్కసారిగా బయటికొచ్చే జనంతో రోడ్లు జామ్.. మూడు, నాలుగు కిలోమీటర్ల దూరానికీ అరగంటకుపైగా పట్టడం.. ఇప్పటికే హైదరాబాద్ వాసులు ఎదుర్కొంటున్న సమస్య ఇది. దీనికితోడు భవిష్యత్తులో మరింత పెరిగే ట్రాఫిక్ చిక్కులకు పరిష్కారంగా తెరపైకి వచ్చినదే ‘ట్రాఫిక్ ఇంపాక్ట్ అసెస్మెంట్ (టీఐఏ)’. కొత్తగా భారీ భవనాలు, అపార్ట్మెంట్లు, వాణిజ్య సముదాయాలు నిర్మించదలిస్తే.. ఆయా రహదారుల్లో ఇప్పటికే ఉన్న ట్రాఫిక్, అదనంగా పెరిగే ట్రాఫిక్‌ను పరిశీలించి తగిన నిబంధనలతో అనుమతులు ఇవ్వడమే ‘టీఐఏ’. హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ) నాలుగేళ్ల కిందటే ఈ మేరకు ప్రతిపాదనలు చేసింది. ఇప్పటికీ అడుగు ముందుకు పడలేదు. ఇదే సమయంలో గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా రద్దీ ప్రదేశాలు, ప్రధాన రోడ్ల పక్కన భారీ నివాస, వాణిజ్య భవనాలు వెలుస్తూనే ఉన్నాయి. ట్రాఫిక్ ఇబ్బంది పెరిగి పోతూనేఉంది. ‘ట్రాఫిక్ ఇంపాక్ట్’ అంచనా ఇలా.. ఉదాహరణకు ఒక మల్టీప్లెక్స్ భవనం నిర్మించేందుకు అనుమతి ఇవ్వాలంటే భవనం బిల్టప్ ఏరియా, అందులోని సినిమా స్క్రీన్లు, షాపులు ఇలా అన్నీ పరిగణనలోకి తీసుకుంటారు. వీటికి వచ్చిపోయే వారి సంఖ్య, ఆ ప్రాంతంలో పెరగబోయే రద్దీ, సినిమా షోల ప్రారంభ, ముగింపు సమయాల్లో ప్రభావం తదితర అంశాలు బేరీజు వేస్తారు. అక్కడ ప్రస్తుతం ఉన్న రహదారి òపెరగ నున్న రద్దీకి సరిపోతుందో లేదో అంచనా వేస్తారు. ఒకవేళ సరిపోని పక్షంలో రహదారిని విస్తరించేందుకున్న అవకాశాలు, ప్రత్యామ్నాయ మార్గాలు, సమీపంలోని జంక్షన్లు, వాటి వద్ద ఏర్పడబోయే ట్రాఫిక్ పరిస్థితి వంటి వివిధ అంశాలను పరిశీలి స్తారు. తర్వాత షరతులతో అనుమతులిస్తారు. ట్రాఫిక్ సమస్య తలెత్తే పరిస్థితి ఉంటే.. దాని పరిష్కారానికి వీలుగా బిల్డర్ ఎక్కువ సెట్బ్యాక్లు వదలాల్సి ఉంటుంది. లేదా లింక్ రోడ్ల వంటి వాటికి చాన్స్ ఉంటే వేసేందుకు అనుమతిస్తారు. ఒకవేళ జీహెచ్ఎంసీయే రోడ్లు వేస్తే అందుకయ్యే వ్యయాన్ని బట్టి ఇంపాక్ట్ ఫీజు వసూలు చేస్తారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఎలాంటిప్రత్యా మ్నాయ పరిష్కారాలు లేని పక్షంలో బహుళ అంతస్తులకు అనుమతులు ఇవ్వకుండా నిరాకరిస్తారు. ఒక్క అడుగూ పడక.. హైదరాబాద్‌లో పెరుగుతున్న ట్రాఫిక్ మ రింత జటిలం కాకుండా ఉండేందుకు‘ఇంపాక్ట్’ ఆలోచన చేశారు. కొత్తగా నిర్మించే భవ నాల వల్ల ఆ ప్రాంతంలో ఎంత రద్దీ పెరగనుంది? అప్ప టికే ఉన్న ట్రాఫిక్ ఎంత? కొత్తగా పెరగబోయే వాహనాలు ఎన్ని ఉంటాయి? ఎన్ని వాహనాలకు పార్కింగ్ సదుపాయం ఉంది? పెరిగే ట్రాఫిక్ నుంచి ఉపశమనంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అన్న అంశాలతో ‘ట్రాఫిక్ ఇంపాక్ట్ అసెస్మెంట్ (టీఐఏ)’ సర్టిఫికెట్‌ను జత పరిచేలా భవన నిర్మాణ నిబంధనల్లో పొందు పర్చేందుకు సిద్ధమయ్యారు. ఇది జరిగి నాలుగేళ్లయినా.. ఇప్పటికీ ముందడుగు పడలేదు. ప్రధాన ప్రాంతాల్లోనూ ఆకాశ హర్మ్యాలు కొన్నేళ్లుగా హైదరాబాద్‌లో ఆకాశ హర్మ్యాలు పెరుగుతున్నాయి. ఎల్బీ నగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హైటెక్‌సిటీ వంటి అత్యధిక రద్దీ ఉండే ప్రధాన ప్రాంతాల్లోనూ ఈ పరిస్థితి కనిపిస్తోంది. దీనితో ప్రభుత్వం వేల కోట్ల ఖర్చుతో ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మించినా ట్రాఫిక్ సమస్యలు తగ్గకపోగా.. పెరిగిపోతూనే ఉన్నాయి. బంజారాహిల్స్‌లో ఇదివరకు ఉన్న భవనాల గరిష్ట ఎత్తు నిబంధనలను సైతం సవరించి ఆకాశ హర్మ్యాలు అనుమతులు జారీ చేస్తున్నారు. ఇప్పటికే ట్రాఫిక్ ఇక్కట్లున్న కేబీఆర్ పార్కు చుట్టుపక్కల ప్రాంతాల్లో సమస్య మరింత పెరుగుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. గతేడాది వంద ఆకాశ హర్మ్యాలు: గతంలో జీహెచ్ఎంసీ వెలుపల మాత్రమే ఆకాశ హర్మ్యాలను ఎక్కువగా నిర్మించేవారు. ఇటీవలి కాలంలో బల్దియా పరిధిలోనూ ఇవి పెరుగుతున్నాయి. 2022–23 ఆర్థిక సంవత్సరంలో దాదాపు వంద హైరైజ్ భవనాలకు జీహెచ్ఎంసీ అనుమతులిచ్చింది. అంతకుముందు ఏడాది వాటి సంఖ్య 80కిపైనే ఉంది. వారిని తప్పనిసరి చేస్తే మంచిదే.. పెద్ద బిల్డర్లు హైరైజ్, గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులలో పార్కింగ్ స్థలం వినియోగం కోసం ట్రాఫిక్ కన్సల్టెంట్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ నిబంధన తప్పనిసరి చేస్తే ప్రతీ ఒక్కరూ పాటిస్తారు. దీనితో ప్రాజెక్టుతోపాటు సదరు ప్రాంతంపై ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు అవకాశం ఉంటుంది. డివైడర్లు, బారికేడ్లు, వీధి దీపాలు వంటి ట్రాఫిక్ వ్యయా లను సీఎస్ఆర్ కింద బిల్డర్ చేపట్టేలా చేయాలి. – నరేంద్ర కుమార్ కామరాజు, ప్రణీత్ గ్రూప్ ఎన్ఓసీ ఉంటేనే.. భవనాల నుంచి వచ్చే వాహనాలు, బయట పార్కింగ్ చేసే వాహనాలతో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ పెరుగుతుంది. అందుకే వాణిజ్య సముదాయాలతో పాటు హైరైజ్ నివాస భవనాలకు కూడా ట్రాఫిక్ పోలీసు ఎన్ఓసీ ఉంటేనే అనుమతులు జారీ చేయాలి. 25 అంతస్తులకు మించిన ప్రతి భవనానికి ఈ విధానాన్ని అమలు చేస్తే మంచిది. – కె.నారాయణ్ నాయక్, ట్రాఫిక్ జాయింట్ సీపీ, సైబరాబాద్ -
బోయిన్పల్లి టు బోరజ్.. నాగ్‌పూర్ హైవేపై దిద్దుబాటు చర్యలు
సాక్షి, కామారెడ్డి: ‘‘కామారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలో టేక్రియాల్ చౌరస్తా వద్ద 2016లో రోడ్డు దాటే క్రమంలో కారును రెండు లారీలు ఢీకొట్టాయి. ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. తరువాత కూడా పలు ప్రమాదాలు జరిగాయి. ఇక్కడ బ్రిడ్జి నిర్మించాలన్న డిమాండ్ ఎన్నో ఏళ్లుగా ఉంది. ఎట్టకేలకు ఇప్పుడక్కడ అండర్ పాస్ నిర్మాణం జరుగుతోంది. బ్రిడ్జి పూర్తయితే ప్రమాదాలు ఆగిపోతాయని భావిస్తున్నారు’’ ఇక్కడే కాదు.. హైదరాబాద్–నాగ్‌పూర్ కారిడార్‌గా పిలిచే 44వ నంబరు జాతీయ రహదారిపై పగలు, రాత్రి తేడా లేకుండా నిత్యం వేలాది వాహనాలు పరుగులు తీస్తుంటాయి. దీంతో రహదారిపై పలు పట్టణాలు, గ్రామాలు, చౌరస్తాల వద్ద నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు ఏడాదికేడాది పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించి, రోడ్డు ప్రమాదాలు నివారించడానికి భారత జాతీయ రహదారుల నిర్వహణ సంస్థ (ఎన్హెచ్ఏఐ) నడుం కట్టింది. హైదరాబాద్‌లోని బోయిన్పల్లి నుంచి తెలంగాణ రాష్ట్రం ముగిసి మహారాష్ట్రలోకి ప్రవేశించే బోరజ్ దాకా బ్లాక్ స్పాట్లను గుర్తించిన ఎన్హెచ్ఏఐ దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది. ఇప్పటికే పలు చోట్ల సర్వీస్ రోడ్ల నిర్మాణాలు, రోడ్ల మరమ్మతులు చేపట్టారు. ప్రధాన సమస్యగా ఉన్న జంక్షన్లు, కూడళ్ల వద్ద అండర్ పాస్‌లు, వంతెనల నిర్మాణ పనులు మొదలుపెట్టారు. ఏడాది, ఏడాదిన్నర కాలంలో పనులన్నీ పూర్తి చేయాలని ఎన్హెచ్ఏఐ లక్ష్యంగా పెట్టుకుంది. బోయిన్పల్లి నుంచి బోరజ్ దాకా.... బోయిన్పల్లి నుంచి మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల మీదుగా రాష్ట్ర సరిహద్దుల్లోని బోరజ్ దాకా 44వ నంబరు జాతీయ రహదారిపై ఎన్హెచ్ఏఐ పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టింది. బోయిన్పల్లి నుంచి కాళ్లకల్ దాకా 27 కిలోమీటర్ల మేర రూ.933 కోట్ల వ్యయంతో ఆరు వరుసల రహదారిని నిర్మిస్తోంది. ఇందులో ఐదు అండర్‌పాస్‌లు, నాలుగు ఫ్లై ఓవర్లున్నాయి. సుచిత్ర, డెయిరీ ఫాం, హైటెన్షన్ రోడ్డు, దూలపల్లి, కొంపల్లి, మేడ్చల్ ప్రాంతంలో ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మిస్తారు. మెదక్ జిల్లా పరిధిలోకి వచ్చే రెడ్డిపల్లి, జప్తి శివునూర్, గోల్డెన్ దాబా ప్రాంతాల్లో మూడు అండర్ పాస్‌లు నిర్మిస్తున్నారు. జాతీయ రహదారి నుంచి కామారెడ్డి పట్టణంలోకి ఎంటర్ అయ్యే నర్సన్నపల్లి చౌరస్తా, పట్టణం నుంచి బయటకు వెళ్లే టేక్రియాల్ చౌరస్తా వద్ద రెండు అండర్ పాస్‌లు నిర్మిస్తున్నారు. సదాశివనగర్ మండలంలోని పద్మాజివాడీ చౌరస్తా వద్ద కూడా అండర్ పాస్ నిర్మాణం పనులు మొదలయ్యాయి. నిర్మల్ జిల్లా కడ్తాల్ జంక్షన్, ఆదిలాబాద్ జిల్లాలోని గుడి హత్నూర్ జంక్షన్ల వద్ద అండర్ పాస్‌ల నిర్మాణాలు ప్రారంభించాల్సి ఉంది. రూ. పదకొండు వందల కోట్లతో.. రోడ్ల విస్తరణ, అండర్‌పాస్‌లు, సర్వీస్ రోడ్లు, ఫ్లై ఓవర్ బ్రిడ్జిల నిర్మాణాలకు రూ.పదకొండు వందల కోట్లకు పైగా ఖర్చు చేస్తోంది. బోయిన్పల్లి నుంచి కాళ్లకల్ దాకా వంతెనలు, ఆరువరుసల రోడ్ల నిర్మాణానికి రూ.933 కోట్లు కేటాయించారు. రెడ్డిపల్లి, జప్తి శివునూర్, గోల్డెన్ దాబా జంక్షన్, నర్సన్నపల్లి, టేక్రియాల్, పద్మా జివాడీ చౌరస్తా, కడ్తాల్, గుడి హత్నూర్ వద్ద అండర్ పాస్‌ల కోసం దాదాపు రూ.2 వందల కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేశారు. పలు అండర్ పాస్‌ల నిర్మాణ పనులు ఇప్పటికే మొదలయ్యాయి. కామారెడ్డి జిల్లాలో నర్సన్న పల్లి, టేక్రియాల్, పద్మాజివాడీ ఎక్స్రోడ్ల వద్ద పనులు వేగంగా నడుస్తున్నాయి. మెదక్ జిల్లాలోనూ పనులు కొనసాగుతున్నాయి. ఏడాదిలోపు పూర్తి చేస్తాం... ఏడాదిలోపు పూర్తి చేయాలన్న లక్ష్యంతో 44వ నంబరు జాతీయ రహదారిపై అండర్‌పాస్‌ల నిర్మాణ పనులు మొదలుపెట్టాం. చాలాచోట్ల సర్వీస్ రోడ్లను చేపట్టాం. హైదరాబాద్‌లో ఆరు వరుసల నిర్మాణం, ఫ్లై ఓవర్ల నిర్మాణాలు కూడా ఏడాదిన్నర లోపు పూర్తి చేస్తాం. ప్రమాదాల నివారణతో పాటు ట్రాఫిక్ ఇబ్బందులు తొలగి పోతాయి. -
నిరుద్యోగ మార్చ్ కి మద్దతు తెలిపిన కేయూ, ఓయూ, జేఏసీలు
-
సచివాలయానికి సరికొత్త రహదారులు
సాక్షి, హైదరాబాద్: భవనం వైశాల్యం, నిర్మాణ ప్రత్యేకతల పరంగా దేశంలోనే అతిపెద్ద సచివాలయం. దేశంలో మరే ప్రభుత్వ భవనంపై లేనట్టుగా ఐదంతస్తులకు సరిపడా వైశాల్యంతో రెండు భారీ గుమ్మటాలు.. మంత్రిత్వ శాఖలకు సంబంధించి అన్ని విభాగాలు ఒకేచోట ఉండేలా ఏర్పాటు.. పీక్ అవర్స్‌లో ఆ భవనం చుట్టూ గంటకు 20 వేల వాహనాల ప్రవాహం.. నిత్యం వేల మంది సందర్శకులు వచ్చే ప్రాంగణం.. ముఖ్యమంత్రి, మంత్రులను కలిసేందుకు వచ్చే వీఐపీలు.. అలాంటి కీలకమైన ప్రాంతంలో ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడితే ఎన్నో సమస్యలు ఉత్పన్నమవుతాయి. దీన్ని దృష్టిపెట్టుకుని ట్రాఫిక్ పరంగా ఇబ్బందులు రాకుండా రాష్ట్ర కొత్త సచివాలయం చుట్టూ విశాలమైన రహదారులను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని కొత్త రోడ్లను నిర్మించగా, మిగతా రోడ్లను విశాలం చేయటంతోపాటు మార్పుచేర్పులు చేస్తున్నారు. నలువైపులా నాలుగు రోడ్లు.. సచివాలయం చుట్టూ 4 రోడ్లు సిద్ధమయ్యాయి. ఇప్పుడు వాహనాలు ఒకవైపు నుంచి వచ్చి ఒకవైపే వెళ్లే పరిస్థితి లేకుండా ఎటునుంచి ఎటైనా వెళ్లేలా రోడ్లను సిద్ధం చేశారు. కొత్త భవనాన్ని నిర్మించే సమయంలోనే రోడ్లు, భవనాల శాఖ అధికారులు ఓ ప్రైవేటు సంస్థతో ట్రాఫిక్‌పై అధ్యయనం చేయించారు. కొన్ని రోడ్లు శాస్త్రీయంగా లేకపోవడంతో ట్రాఫిక్ అయోమయం కావడంతోపాటు ప్రమాదాలకు ఆస్కారమిస్తుందని తేలింది. దీంతో వాటన్నింటిని సరిచేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఆమేరకు అధికారులు చర్యలు చేపట్టారు. లుంబినీ వద్ద పాత రోడ్డును మూసేసి.. ♦ ఇందిరాగాంధీ విగ్రహం నుంచి లుంబినీ పార్కువైపు వెళ్లే ప్రధాన రోడ్డు ప్రమాదాలకు ఆస్కారమిచ్చేలా ఉండటంతో లుంబినీ పార్కు వద్ద రోడ్డును మూసేశారు. సచివాలయ ప్రధాన ద్వారం ముందు నుంచి 110 అడుగుల వెడల్పుతో డబుల్ రోడ్డు నిర్మించారు. లుంబినీ వద్ద పాత రోడ్డును మూసేసి ట్రాఫిక్‌ను కొత్త రోడ్డుతో అనుసంధానించారు. ♦ బీఆర్కే భవనం వైపు మళ్లే చోట ఆదర్శనగర్ రోడ్డును వెడల్పు చేస్తున్నారు. అక్కడే ఉన్న కూడలిని మూసేసి వాహనాలకు ఎల్ఐసీ కార్యాలయం వద్ద యూ టర్న్ ఆప్షన్ ఇచ్చారు. ♦ లక్డీకాపూల్ నుంచి వచ్చే రోడ్డును సచివాలయ భవనం వద్ద వెడల్పు చేశారు. ఇక్కడి పెట్రోలు బంకును కూడా తరలించి అక్కడి నుంచి నేరుగా అమరవీరుల స్మారకం వద్దకు వెళ్లేందుకు వీలుగా రోడ్డును నిర్మించారు. ♦ సచివాలయ భవనం వెనక వైపు భవనాన్ని ఆనుకుని రోడ్డును వెడల్పు చేశారు. ఇక్కడే మసీదును నిర్మిస్తున్నారు. దానికి బయటి నుంచి కూడా జనం వచ్చేలా రోడ్డును సిద్ధం చేశారు. ♦ సచివాలయం–ఎన్టీఆర్ గార్డెన్స్ మధ్య (తెలంగాణ సచివాలయం పాత గేటు) ఉన్న రోడ్డును ఖైరతాబాద్ పెద్ద వినాయకుడిని ప్రతిష్టించే ప్రాంతం రోడ్డు వరకు వెడల్పు చేయనున్నారు. ♦ రోడ్లను ఇష్టమొచ్చినట్లు మార్చారని, కూడళ్లను మూసేశారని, ఇది వాహనదారులకు ఇబ్బందిగా ఉందన్న విమర్శలూ కొంతమంది నుంచి వినిపిస్తున్నాయి. అయితే ఇది తాత్కాలికమేనని, ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు తాజా మార్పులు దోహదపడతాయని అధికారులంటున్నారు. -
ఢిల్లీ రావాలంటేనే ఇబ్బందిగా ఉంది ఇన్ఫీనారాయణమూర్తి: అసలేమైంది?
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి దేశ రాజధాని న్యూఢిల్లీ నగరంపై చలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో నిబంధనల ఉల్లంఘనలపై స్పందించిన ఆయన ఢిల్లీకి రావాలంటే ఇబ్బందిగా ఉందంటూ అసహనానికి గురయ్యారు. క్రమశిక్షణా రాహిత్యానికి ఢిల్లీ పరాకాష్ట, క్రమశిక్షణ పాటించకుండా, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వైనంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తాను ఏ వ్యక్తిని ద్వేషించనని, కానీ వారి చర్యల్ని మాత్రమే ద్వేషిస్తానని మూర్తి అన్నారు. ఎయిర్పోర్ట్ నుంచి వస్తుండగా, ఒక చౌరస్తా వద్ద రెడ్ సిగ్నల్ పడింది. కార్లు, మోటార్ బైక్‌లు, స్కూటర్ల వాహనాలదారులు ఏమాత్రం జాగ్రత్త తీసుకోకుండా రెడ్‌లైట్ ఉన్నాసరే దూసుకెళ్లిపోతున్నారంటూ ఇన్ఫీ మూర్తి చిరాకుపడ్డారు. ముందు కెళ్లడానికి రెండు నిమిషాలు ఓపిక పట్టలేకపోతే.. ఇక మనీ ఉంటేఆగుతారా? ఆఫ్కోర్స్ వేచి ఉండరని పేర్కొన్నారు. నిజానికి వ్యక్తిగత ఆస్తులకంటే సమాజ ఆస్తులను మెరుగ్గా కాపాడుకోవాల్సి ఉందన్నారు. కార్పొరేట్ ప్రపంచంలో విలువల పరిరక్షణ గురించి కూడా మాట్లాడారు. మంగళవారం ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగానారాయణమూర్తి ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే చాట్‌జీపీటీ, ఏఐ టెక్నాలజీపై తన అభిప్రాయాలను వెల్లడించారు. చాట్ జీపీటీ గురించి ఏమన్నారంటే.. చాట్‌జీపీటీ టెక్నాలజీ గురించి మాట్లాడుతూ, సైన్స్ అనేది ప్రకృతిని బహిర్గతం చేస్తుంది. టెక్నాలజీ మానవ జీవితాన్ని మరింత సౌకర్యవంతంగా చేయడానికి, ఉత్పాదకతను మెరుగుపర్చేందుకు, ఖర్చులను తగ్గించడానికి, ఇతర సమస్యల పరిష్కారానికి సైన్స్ టెక్నాలజీ, పవర్‌ను ఉపయోగిస్తుందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనిషి జీవితాన్ని సౌకర్యవంతంగా మారుస్తుంది అంతే తప్ప మానవ మేథస్సును భర్తీ చేస్తుందనుకోవడం తప్పుడు విశ్వాసమన్నారు. మనిషికి ఎందుకంటే విచక్షణా జ్ఞానం ఉంది కాబట్టి దాన్ని అధిగమిస్తున్న కృత్రిమ మేధస్సును మనిషి అనుమతించడు. ఇప్పటివరకూ ఎన్నో ప్రయోగాలు చేసినా, ఈ ప్రపంచంలో చిన్న పిల్లల మనస్సుకు సరితూగే కంప్యూటర్ ఉందా అసలు. టెక్నాలజీ పాలిట మాన్స్టర్లా మనిషి ఎపుడూ ఒక అడుగు ముందే ఉంటాడు అని నారాయణ మూర్తి వ్యాఖ్యానించారు. -
ట్రాఫిక్‌లో కారుపైకి ఎక్కి పెగ్గులేసిన మందుబాబు.. వీడియో వైరల్..
ట్రాఫిక్‌లో ఇరుక్కున్నప్పుడు ఎరరికైనా చికాకు వస్తుంది. ఒక్కోసారి బండి ముందుకు కదిలేందుకు చాలా సమయం పడుతుంది. హర్యానా గురుగ్రాంలోనూ ఓ వ్యక్తికి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అతని కారు భారీ ట్రాఫిక్‌లో ఇరుక్కుంది. దీంతో సమయం వృథా అవుతుంది అనుకున్నాడేమే క్షణం కూడా ఆలస్యం చేయకుండా మందు బాటిల్ పట్టుకొని కారుపైకి ఎక్కాడు. ఎంచక్కా పెగ్గు కలుపుకొని హాయిగా మద్యం సేవించాడు. అక్కడున్న వారంతా అతడ్ని చూసి అవాక్కయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by RTG2😃 (@20degreecelsius) ఇలాంటివి గురుగ్రామ్‌లోనే సాధ్యం అని కొందరు సరదాగా కామెంట్ చేయగా.. మరికొందరు మాత్రం ఈ మందుబాబుపై మండిపడ్డారు. రోడ్డుపై ఇలాంటి న్యూసెన్స్ ఏంటని విమర్శించారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చదవండి: అది అత్యాచారం కిందకు రాదు.. ఒరిస్సా హైకోర్టు కీలక తీర్పు.. -
జూబ్లీహిల్స్‌లో ట్రాఫిక్‌ను కంట్రోల్ చేసిన సురేష్ బాబు
ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కారుదిగి స్వయంగా ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్య గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్‌లోని ఫిల్మ్‌నగర్‌లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో అటువైపు వెళ్తున్న నిర్మాత సురేష్ బాబు స్వయంగా కారులోంచి దిగి ట్రాఫిక్‌ను కంట్రోల్ చేశారు. వాహనదారులకు సూచనలు చేస్తూ ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. బాధ్యతగల పౌరుడిలా వ్యవహరించారంటూ సురేష్ బాబుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. -
Hyderabad: తెలంగాణ భవన్ ముందు ట్రాఫిక్ నరకం
బంజారాహిల్స్ రోడ్ నెం. 14 బసవతారకం కేన్సర్ ఆస్పత్రి నుంచి రోడ్ నెం.12 వైపు వెళ్లే రోడ్డులో తెలంగాణ భవన్ ముందు పల్లంగా ఉండటంతో ఎత్తుపైకి ఎక్కలేక వాహనాలు ఆగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో తరచు ట్రాఫిక్ స్తంభించిపోతోంది. అంతేకాకుండా వంపుగా ఉన్న తెలంగాణ భవన్ వద్ద రోడ్డు నుంచి రోడ్ నెం. 12 వైపు వాహనాలు ఎక్కే క్రమంలో రెడీమిక్స్ వాహనాల నుంచి సిమెంటు, కంకర కిందపడుతూ గుట్టలుగా పేరుకుపోతోంది. ఇదొక సమస్యగా మారిపోయింది. సాక్షి, హైదరాబాద్: తెలంగాణ భవన్ వద్ద ఆర్టీసీ బస్సులు, లారీలు ఇక్కడి నుంచే ఎక్కే క్రమంలో మొరాయిస్తుండటంతో వెనుక ట్రాఫిక్ కిలోమీటర్ల మేర ఆగిపోతోంది. సీఎం తెలంగాణ భవన్‌కు వచ్చినప్పుడు వీవీఐపీలు మెయిన్ రోడ్డు మీదనే కారు ఆపి దిగే క్రమంలో కూడా వెనుక ఉన్న వాహనాలు పెద్ద ఎత్తున నిలిపోతున్నాయి. ► తెలంగాణ భవన్ ముందు ఈ ట్రాఫిక్ సమస్య గత దశాబ్ధ కాలంగా విపరీతంగా పెరిగిపోతున్నది. దీనికి పరిష్కారంగా బసవతారకం కేన్సర్ ఆస్పత్రి నుంచి తెలంగాణ భవన్ వైపు మళ్లే ప్రాంతం నుంచి అగ్రసేన్ చౌరస్తా వరకు రోడ్డును సమాంతరం చేయడం ద్వారా సమస్య కొలిక్కి వస్తుందని ట్రాఫిక్ పోలీసులు భావిస్తున్నారు. ► కేబీఆర్ పార్కు నుంచి వరద నీరు తెలంగాణ భవన్ పక్కన నిర్మించిన కాల్వలోకి చేరే క్రమంలోనే ఈ రోడ్డు వంపుగా మారింది. ఇక్కడ వరద నీటి పైప్‌లైన్ వేసి రోడ్డంతా సమాంతరం చేస్తే ట్రాఫిక్ సజావుగా ముందుకు సాగుతుందని ట్రాఫిక్ నిపుణులు పేర్కొంటున్నారు. ఇరుకుగా అగ్రసేన్ చౌరస్తా.. బంజారాహిల్స్ రోడ్ నెం. 14 నుంచి తెలంగాణ భవన్ మీదుగా వాహనాలు ముందుకు సాగడం గగనంగా మారింది. లేచిన దగ్గరి నుంచి అర్ధరాత్రి దాకా ఈ రోడ్డులో వాహనాలు మెళ్లగా ముందుకు కదులుతున్నాయి. ► ఒక వైపు తెలంగాణ భవన్ వైపు రోడ్డు లోతుగా ఉండటం, జగన్నాథ టెంపుల్ గేటు కూడా రోడ్డు వైపే ఉండటం ట్రాఫిక్‌ను మరింత జఠిలం చేస్తున్నది. దీనికి తోడు అగ్రసేన్ చౌరస్తాలో తెలంగాణ భవన్ నుంచి రోడ్ నెం. 12 వైపు మలుపు మరింత ప్రమాదకరంగా మారింది. ఇక్కడే ట్రాన్స్ఫార్మర్, కరెంటు స్తంభాలు, హైటెన్షన్ వైర్ల స్తంభాలు టర్నింగ్పై ఉన్నాయి. వీటిని తొలగిస్తే ట్రాఫిక్ కమాండ్ కంట్రోల్ వైపు తేలికగా ముందుకు కదులుతుంది. ► అగ్రసేన్ ఐల్యాండ్‌ను కూడా పెద్దగా ఉండటం, చౌరస్తా మొత్తం ఇరుకుగా ఉండటం వాహనాలు మళ్లే పరిస్థితులు జఠిలమవుతున్నాయి. ఈ చౌరస్తాను తగ్గించాల్సిన అవసరం ఉందని, సెంట్రల్ మీడియన్లను కూడా కట్ చేయాల్సిన పరిస్థితి ఉందని ట్రాఫిక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు ట్రాఫిక్ పోలీసులు కూడా అగ్రసేన్ ఐల్యాండ్‌ను, సెంట్రల్ మీడియన్‌ను తగ్గించాలని జీహెచ్ఎంసీకి లేఖ కూడా రాశారు. జీహెచ్ఎంసీ మొద్దు నిద్ర.. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ రహదారులపై ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతున్నది. ఏ రోడ్డు చూసినా ట్రాఫిక్ దిగ్బంధంలో చిక్కుకొని వాహనదారులు విలవిల్లాడుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు పలుమార్పులు, చేర్పులు చేస్తూ ఉన్నదాంట్లోనే సిబ్బందిని వినియోగించుకుంటూ ట్రాఫిక్ మళ్లింపులు చేపడుతూ వాహనదారులను ముందుకు వెళ్లే దిశలో చర్యలు తీసుకుంటున్నారు. ► ట్రాఫిక్ పోలీసులకు జీహెచ్ఎంసీ అధికారులు ఏ మాత్రం సహకరించడం లేదని ఫిర్యాదులు అందుతున్నాయి. పలుచోట్ల సెంట్రల్ మీడియన్లు తగ్గించాలని ఐల్యాండ్లను కట్ చేయాలని, అడ్డుగా ఉన్న చెట్లను తొలగించాలని, ఫుట్‌పాత్‌లపై విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల షిఫ్టింగ్‌కు తోడ్పాటు నందించాలని, అడ్డుగా ఉన్న కరెంటు స్తంభాలు, టెలిఫోన్ స్తంభాలను అనువైన చోటుకు మార్చాలని ట్రాఫిక్ పోలీసులు లేఖలు రాస్తున్నా జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. జీహెచ్ఎంసీతో ట్రాఫిక్ పోలీసులు సమన్వయం పూర్తిగా కొరవడింది. (క్లిక్ చేయండి: రసాభాసగా జీహెచ్ఎంసీ మీటింగ్.. చర్చ లేకుండానే బడ్జెట్‌కు ఆమోదం) -
ట్రాఫిక్ ట్రయల్ రన్ తో వాహనదారులకు కొత్త చిక్కులు
-
ఫార్ములా ఈ రేస్‌తో హైదరాబాద్‌లో ట్రాఫిక్ టెన్షన్
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే తొలి స్ట్రీట్ సర్క్యూట్ ఇండియన్ రేసింగ్ లీగ్ రాష్ట్ర రాజధాని నడిబొడ్డున శనివారం ప్రారంభం కాగా.. ఆ ఎఫెక్ట్ మాత్రం నగరంలోని పలు రోడ్లపైన పడింది. శనివారం ట్రయల్ రన్, క్వాలిఫైయింగ్ రేస్‌ల తరువాత మెయిన్ రేసింగ్ సాయంత్రం 4 గంటల నుంచి 4.45 గంటల వరకు సాగింది. రేసింగ్ నేపథ్యంలో ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలోని ప్రధాన రోడ్లన్నీ ట్రాఫిక్ జామ్‌తో నిండిపోయాయి. ప్రసాద్ ఐమాక్స్ నుంచి ఎన్టీఆర్ గార్డెన్ గుండా వేసిన 2.8 కిలోమీటర్ల ప్రత్యేక సర్క్యూట్లో ఈ రేస్ సాగింది. కాగా, మూడు రోజులుగా నెక్లెస్ రోడ్డు, ఎన్టీఆర్ రోడ్డులో స్వల్పంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించగా, శనివారం నుంచి నగరం నడిబొడ్డున ఉన్న ప్రధాన రోడ్లన్నీ మూసివేసి ట్రాఫిక్ డైవర్ట్ చేశారు. ఖైరతాబాద్ ఫ్లైఓవర్ బ్రిడ్జితో పాటు నెక్లెస్ రోడ్డు, ఎన్టీఆర్ గార్డెన్స్, లుంబినీ పార్కు నుంచి ట్యాంక్‌బండ్ అంబేడ్కర్ విగ్రహం వరకు రోడ్డును మూసివేశారు. మింట్ కంపౌండ్ నుంచి ప్రసాద్ ఐమాక్స్‌కు వెళ్లే రోడ్డు, తెలుగుతల్లి ఫ్లైఓవర్ కింద రోడ్డును మూసివేసి ట్రాఫిక్‌ను ఫ్లైఓవర్ పై నుంచి పంపిస్తున్నారు. దీంతో ఫ్లై ఓవర్‌పై ఉదయం నుంచి రాత్రి వరకు ట్రాఫిక్ మెల్లమెల్లగా ముందుకు సాగింది. ఖైరతాబాద్ కూడలి నుంచి ఫ్లైఓవర్ మీదుగా రాకపోకలు సాగించే వాహనాలను పీజేఆర్ విగ్రహం, షాదన్ కాలేజీ, రవీంద్ర భారతి వైపు.. బుద్ధ భవన్, నల్లగుట్ట జంక్షన్ నుంచి నెక్లెస్ రోడ్ రోటరీ వైపు వచ్చే వాహనాలను రాణిగంజ్, ట్యాంక్ బండ్ వైపు మళ్లించారు. రసూల్ పురా, మినిస్టర్ రోడ్ నుంచి నల్లగుట్ట మీదుగా నెక్లెస్ రోడ్ రోటరీ వైపు వచ్చే వాహనాలను నల్లగుట్ట జంక్షన్ వద్ద రాణిగంజ్ వైపు మళ్లించారు. ఇక్బాల్ మినార్ జంక్షన్ నుంచి తెలుగుతల్లి, ట్యాంక్ బండ్ వైపు వెళ్లే వాహనాలను కట్ట మైసమ్మ దేవాలయం వైపు మళ్లించారు. బీఆర్కే భవన్ నుంచి నెక్లెస్ రోడ్ రోటరీ వైపు వెళ్లే వాహనాలను తెలుగు తల్లి జంక్షన్ వద్ద ఇక్బాల్ మి నార్ – రవీంద్ర భారతి జంక్షన్ వైపు మళ్లించారు. నగరం నడిబొడ్డున ట్రాఫిక్ని నిలిపివేసి ప్రత్యామ్నాయ మార్గాల్లో మల్లించిన కారణంగా ఆ ఎఫెక్ట్ అన్ని చోట్ల ట్రాఫిక్ సమస్యకు దారితీసింది. మెహిదీపట్నం ఎక్స్‌ప్రెస్ హైవే పైన కూడా వాహనాలు నిలిచిపోయేంత ట్రాఫిక్ జాం కావడం గమనార్హం. మెహిదీపట్నం నుంచి మాసాబ్‌ట్యాంక్ ఫ్లై ఓవర్ మీదుగా లక్డికాపూల్ వరకు, లక్డికాపూల్ నుంచి అమీర్‌పేట వెళ్లే రోడ్డు, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1, అసెంబ్లీ నుంచి ఆబిడ్స్ వరకు ట్రాఫిక్ మెల్లమెల్లగా సాగింది. వాహనదారులు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన పరిస్థితి. శనివారం వర్కింగ్ డే కావడంతో పాటు ట్రాఫిక్ ఆంక్షల గురించి ప్రజలకు సరైన అవగాహన లేకపోవడంతో ఈ ఇబ్బంది తలెత్తిందని నగర పోలీస్ వర్గాలు చెప్పాయి. ఆదివారం ట్రాఫిక్ సమస్య అంతగా ఉండకపోవచ్చునని భావిస్తున్నారు. సోమవారం వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని పోలీస్ శాఖ పేర్కొంది. -
హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో శనివారం సాయంత్రం భారీ వర్షం ముంచెత్తింది. కుండపోతగా పడుతున్న వర్షానికి చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట్, ఎస్ఆర్నగర్, కూకట్పల్లి, హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్ ప్రాంతాల్లో రోడ్లపై వర్షపు నీరు నిలిచి.. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ముఖ్యంగా పంజాగుట్ట నుంచి సికింద్రబాద్, ఖైరతాబాద్ నుంచి ఎర్రగడ్డ వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అత్యధికంగా మదాపూర్‌లో 7.9 సెంటీమీటర్లు, జూబ్లీహిల్స్‌లో 7.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమైన క్రమంలో జీహెచ్ఎంసీ డిజాస్టర్ టీమ్స్ రంగంలోకి దిగాయి. -
నగరంలో ఆపరేషన్ రోప్ అమలు..
-
టోల్ ప్లాజాలకు ‘దసరా’ వాహనాల తాకిడి.. కిలోమీటర్ల మేర..!
చౌటుప్పల్ రూరల్, బీబీనగర్: దసరా పండుగ నేపథ్యంలో హైదరాబాద్– విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. ఇప్పటికే స్కూళ్లకు, కాలేజీలకు సెలవులు ఇవ్వడం, ఆదివారం సెలవు దినం కావడంతో, శనివారం ఉదయం నుంచే వాహనాల్లో బయలుదేరారు. దీంతో హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై, హైదరాబాద్–వరంగల్ రహదారిపై రద్దీ పెరిగింది. పంతంగి, కొర్లపహాడ్, గూడూరు టోల్ ప్లాజాలకు వాహనాల తాకిడి విపరీతమైంది. సరాసరి రోజుకు 27వేల వాహనాలకు పైగా రాకపోకలు సాగిస్తుండగా, శనివారం మరో 5వేల వాహనాలు అదనంగా వెళ్లాయి. పోలీసులు కూడా ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు. ఇదీ చదవండి: Hyderabad: సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు -
బెంజ్ సీఈవోకు తప్పని ట్రాఫిక్ కష్టాలు.. కిలోమీటర్లు నడిచి, ఆటో ఎక్కి
ప్రతి ఒక్కరూ నిత్యం ఏదో ఒక పని నిమిత్తం రోడ్డు మీదకు వస్తుంటారు. ఆటో, కారు, బైక్, బస్సు.. లేదా నడక మార్గాన తమ గమ్యాలను చేరుకుంటారు. రోడ్డుపై జర్నీ అంటే తప్పక ట్రాఫిక్ సమస్య ఉంటుంది. కామన్ మ్యాన్ నుంచి కోటిశ్వరుడి వరకు ఎవరైనా ట్రాఫిక్‌లో ఇరుక్కోవాల్సిందే. ఇందుకు ఎవరూ అతీతులు కాదు. అచ్చం ఇలాంటి అనుభవమే లగ్జరీ కార్ల తయారీ సంస్థ సీఈఓకు కూడా తప్పలేదు. మెర్సిడెస్ బెంజ్ ఇండియా సీఈఓ మార్టిన్ ష్వేంక్ గురువారం రాత్రి సమయంలో పుణెలో తన ఎస్-క్లాస్ కారులో ప్రయాణిస్తుండగా ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. ఎంతకీ ట్రాఫిక్ క్లియర్ కాకపోవడంతో ఖరీదైన ఎస్-క్లాస్ కారు నుంచి దిగి నడక బాటపట్టారు. ఇలా కిలోమీటర్లు నడిచి.. ఆటోలో తన గమ్య స్థానానికి చేరుకున్నారు. ఈ మొత్తం సంఘటనను ఆయన తన ఇన్‌స్టాగ్రామ్‌లో వివరించారు. ఆటోలో ప్రయాణిస్తుండగా తీసిన ఫోటోను షేర్ చేస్తూ.. ‘ మీ ఎస్-క్లాస్ కారు పూణె రోడ్లలో ట్రాఫిక్‌లో చిక్కుకుపోయి ఉంటే మీరు ఏమి చేస్తారు? బహుశా కారు దిగి, కొన్ని కిలోమీటర్లు నడిచి, ఆపై రిక్షా పట్టుకుంటారా’ అని క్యాప్షన్ ఇచ్చారు. దీంతో ఈ పోస్టు వైరల్‌గా మారింది. సీఈఓ సింప్లిసిటీ నెటిజన్లను ఆకర్షిస్తోంది. అంత కోటీశ్వరుడై ఉండి ఆటోలో వెళ్లడాన్ని పలువురు అభినందిస్తున్నారు. చదవండి: 16 ఏళ్ల ప్రస్థానాన్ని సెప్టెంబర్ గుర్తు చేసింది: కేటీఆర్ View this post on Instagram A post shared by Martin Schwenk (@martins_masala) -
Hyderabad Rains Photos: హైదరాబాద్‌లో కుంభవృష్టి.. వణికిపోయిన నగరవాసి (ఫొటోలు)
-
టీ 20 మ్యాచ్ దృష్ట్యా హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
-
ఆదాయంలో అదరగొట్టిన రైల్వేస్: కారణాలివే!
న్యూఢిల్లీ: భారతీయ రైల్వే ఆదాయంలో అదరగొట్టింది. ఈ ఏడాది ఆగస్ట్ చివరికి రూ.95,487 కోట్లుగా ఉంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలోని గణాంకాలతో పోలిస్తే రూ.26,271 కోట్లు (38 శాతం) అధికంగా నమోదైంది. ఈ మేరకు రైల్వేశాఖ ప్రకటన విడుదల చేసింది. ప్రయాణికుల రూపంలో వచ్చిన ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలానికి రూ.13,574 కోట్లు రాగా, 116 శాతం వృద్ధితో ఈ ఏడాది రూ.25,277 కోట్లకు చేరింది. రిజర్వ్డ్, అన్ రిజర్వ్డ్ విభాగాల్లోనూ వృద్ధి నెలకొంది. బొగ్గు రవాణాతో పాటు ఆహార ధాన్యాలు, ఎరువులు, సిమెంట్, మినరల్ ఆయిల్, కంటైనర్ ట్రాఫిక్ మరియు బ్యాలెన్స్ ఇతర వస్తువుల విభాగాలు ఈ వృద్ధికి ముఖ్యమైన దోహదపడ్డాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. సరుకు రవాణా రూపంలో ఆదాయం 20 శాతం వృద్ధితో (రూ.10,780 కోట్లు) రూ.65,505 కోట్లకు చేరింది. 2021–22 పూర్తి ఆర్థిక సంవత్సరానికి రైల్వే ఆదాయం రూ.1,91,278 కోట్లుగా ఉండడం గమనార్హం. -
భారీ వర్షంతో స్తంభించిన రాకపోకలు
రామసముద్రం : మండల పరిధి రామసముద్రంలోని చెంబకూరు ప్రాంతంలో బుధవారం భారీ వర్షం కురవడంతో రాకపోకలు స్తంభించాయి. గంట పాటు కురుసిన వర్షంతో చెరువులు, కాలువలు నిండిపోయాయి. పంట పొలాలపై వరదనీరు ప్రవహించడంతో రైతులు నష్టపోయారు. మనేవారిపల్లె గ్రామానికి వెళ్లే రోడ్డు, పంట పొలాలు పూర్తిగా దెబ్బతినడంతో రాకపోకలు స్తంభించాయి. నడింపల్లె వడ్డివానిచెరువు గండి పడడంతో ఎస్ఐ రవీంద్రబాబు సహకారంతో గ్రామస్తులు గండిని పూడ్చారు. పై గడ్డ ప్రాంతంలో శ్రీనివాసపురం–రామసముద్రం రోడ్డుపై నీరు ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మూగవాడి ఉన్న గౌనివాని కాలువ వరద నీటితో ప్రవహించింది. ఇంత పెద్ద ఎత్తున వర్షం కురవడం ఇదే మొదటి సారిని ప్రజలు తెలిపారు. అలాగే నారిగానిపల్లె పంచాయతీ పూలగుంట్ల గ్రామంలో లక్ష్మన్నకు చెందిన ఆరు గొర్రెలు కాలువ దాటే సమయంలో వరదనీటికి కొట్టుకుపోయాయి. గొర్రెల కాపరులు వరదనీటిలో కొట్టుకెళ్తుండగా గ్రామస్తులు రక్షించారు. ఈ భారీ వర్షంతో టమాట, కాలీఫ్లవర్, కొత్తిమీర తదితర పంటలు దెబ్బతిన్నాయి. వడ్డిపల్లె, నడింపల్లె చెరువులను ఇరిగేషన్ అధికారులు పరిశీలించారు. సంపతికోట ఏటిలో తప్పిన ప్రమాదం పెద్దతిప్పసముద్రం : మండలంలోని సంపతికోట ఏటిలో గురువారం మళ్లీ నీటి ప్రవాహం వరదలా ఉప్పొంగింది. సంపతికోట నుంచి గుడిపల్లికి పాల ఆటో వెళ్తూ ఏటిలో అదుపు తప్పి బోల్తా పడింది. పాలన్నీ నీటి పాలయ్యాయి. అయితే అక్కడే ఉన్న ఓ మినీ లారీ సాయంతో ఆటోను ఒడ్డు వైపు లాగడంతో పెను ప్రమాదం తప్పిందని గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. నాలుగు రోజుల క్రితం అర్ధరాత్రి సమయంలో ఇదే ఏటిలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు చిక్కుకుని ప్రాణాలతో బయట పడ్డారు. ఈ ఘటనలో ఇంజనీరింగ్ చదివే ఓ యువతి నీటిలో కొట్టుకుపోయి అర్ధాంతరంగా తనువు చాలించిన విషయం తెలిసిందే. ఎగవనున్న కర్టాటక రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు చెరువులు నిండి మిగులు వరదలా ప్రవహిస్తుండటంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు సంపతికోటకు చేరుకుని వరద ఉద్ధృతిని పరిశీలించి వాహనాల రాకపోకలను స్తంభింపజేశారు. -
క్రైమ్ వర్క్‌కూ ట్రాఫిక్ టెక్నాలజీ
సాక్షి, హైదరాబాద్: నగర ట్రాఫిక్ పోలీసు విభాగం వినియోగిస్తున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కేవలం ట్రాఫిక్ కోణంలోనే కాకుండా క్రైమ్ వర్క్‌కూ ఉపకరిస్తోంది. ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్లోని ఇంటిగ్రేటెడ్ ఈ–చలాన్ డేటాతో పాటు ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ సిస్టం (ఏఎన్పీఆర్) వల్ల అనేక కేసులు కొలిక్కి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ స్థాయి స్కోచ్ సంస్థ 2022 సంవత్సరానికి సంబంధించి పోలీసు అండ్ సేఫ్టీ అంశంలో గోల్డ్, సిల్వర్ అవార్డులను బుధవారం ప్రకటించింది. ఉల్లంఘనుల్లో క్రమశిక్షణ పెంచడం, స్వైర‘విహారం’ చేసే నేరగాళ్లకు చెక్ చెప్పడం, వాహన చోదకులు గమ్యం చేసుకునే సమయాన్ని గణనీయంగా తగ్గించడం, ట్రాఫిక్ జామ్స్‌ను దాదాపు కనుమరుగు చేయడం ఈ లక్ష్యాలతో ఏర్పాటైన అత్యాధునిక వ్యవస్థ ఇంటెలిజెంట్ అండ్ ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టం (ఐటీఎంఎస్) నగర పోలీసు విభాగానికి వెన్నెముకగా మారింది. నేరగాళ్లు, ఉల్లంఘనులు పోలీసుల్ని తప్పించుకోవడానికి అనేక ఎత్తులు వేస్తుంటారు. ఇందులో భాగంగా ఇతర వాహనాల నెంబర్లకు తమ వాహనాల నెంబర్ ప్లేట్లపై వేసుకుని సంచరిస్తుంటారు. ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రీడింగ్ సిస్టం (ఏఎన్పీఆర్) సాఫ్ట్వేర్ ఈ తరహా కేటుగాళ్లకు చెక్ చెప్తోంది. నగర వ్యాప్తంగా ఉండే కెమెరాల ద్వారా ఒకే నెంబర్‌తో రెండు వాహనాలు, కార్ల నెంబర్లతో ద్విచక్ర వాహనాలు, వేరే నెంబర్లతో తిరిగే ఆటోలను తక్షణం గుర్తిస్తుంది. ఆ విషయాన్ని ఆ వాహనం ప్రయాణించే ముందు జంక్షన్లలో ఉన్న క్షేత్రస్థాయి పోలీసులు సమాచారం ఇచ్చి అప్రమత్తం చేస్తుంది. ట్రాకింగ్ విధానం సైతం.. నగర వ్యాప్తంగా సంచరించే వాహనాల ట్రాకింగ్ విధానం సైతం ఐటీఎంఎస్ ద్వారా అందుబాటులోకి వచి్చంది. సీసీ కెమెరాలు ఆయా ప్రాంతాల్లో సంచరించే ప్రతి వాహనాన్నీ నెంబర్‌తో సహా చిత్రీకరించి సర్వర్‌లో నిక్షిప్తం చేస్తాయి. ఏదైనా నేరానికి పాల్పడిన వాహనమో, అనుమానిత వాహనమో ఏ ప్రాంతం నుంచి ఏ సమయంలో ఎక్కడికి ప్రయాణించిందో క్షణాల్లో తెలుసుకునే అవకాశం ఈ సాఫ్ట్వేర్ ద్వారా కలుగుతోంది. ప్రస్తుతం నగరంలోని కొన్ని జంక్షన్లలో వేరియబుల్ మెసేజ్ సైన్ బోర్డులుగా (వీఎంఎస్) పిలిచే డిజిటల్ బోర్డులు అందుబాటులో ఉన్నాయి. ఓ మార్గంలో ప్రయాణిస్తున్న వాహన చోదకుడికి ముందు రానున్న చౌరస్తా, రహదారిలో ట్రాఫిక్ స్థితిగతుల్ని ఎప్పికప్పుడు వీఎంఎస్‌ల్లో ప్రదర్శితమవుతాయి. ట్రాఫిక్ జామ్‌లో చిక్కకుండా ఉండేందుకు అవసరమైన ప్రత్యామ్నాయ మార్గాలూ వీటి ద్వారా ప్రదర్శితమవుతున్నాయి. వాహన చోదకుల్లో క్రమశిక్షణ పెంచడంతో పాటు ఉల్లంఘనులకు చెక్ చెప్పడానికి ఐటీఎంఎస్‌లో పెద్దపీట వేశారు. అన్ని రకాలైన ఉల్లంఘనలపై ఐటీఎంఎస్ వ్యవస్థలోని కెమెరాలు వాటంతట అవే ఆయా ఉల్లంఘనుల వాహనాలను ఫొటో తీస్తాయి. సర్వర్ ఆధారంగా ఈ–చలాన్ సైతం ఆటోమేటిక్‌గా సంబంధింత వాహనచోదకుడి చిరునామాకు చేరిపోతోంది. కొలిక్కి వచి్చన కేసుల్లో కొన్ని... రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఈ ఏడాది మార్చిలో చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన హేమంత్ కుమార్ గుప్తా 48 గంటల్లోనే శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుకున్నారు. సీసీ కెమెరాల ద్వారా స్నాచర్ వాడిన వాహనం నెంబర్ గుర్తించిన అధికారులు ఈ–చలాన్ డేటాబేస్ నుంచి యజమానికి ఫోన్ నెంబర్ సంగ్రహించారు. దీంతో ముందుకు వెళ్లిన పోలీసులు స్సైస్ జెట్ విమానం ఎక్కిన హేమంత్‌ను అందులోనే పట్టుకుని తీసుకువచ్చారు. వికారాబాద్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో 11 వాహనాలను తస్కరించిన నిందితుడు సైతం ఈ డేటాబేస్ ద్వారానే చిక్కాడు. మహంకాళి, చిలకలగూడ పోలీసుస్టేషన్ల పరిధిలో చోటు చేసుకున్న హిట్ అండ్ రన్ కేసు, ఎస్సార్‌నగర్ పరిధిలోని స్నాచింగ్ కేసు, ఇబ్రహీంపట్నానికి సంబంధించిన చోరీ కేసు తదితరాలు సైతం ఈ డేటాబేస్ ద్వారానే కొలిక్కి వచ్చాయి. లాక్డౌన్ సమయంలో ఉల్లంఘనుల గుర్తింపు, ఫలక్నుమలో నమోదైన కిడ్నాప్ కేసుల ఛేదనలో ఏఎన్పీఆర్ డేటా ఉపయుక్తంగా మారింది. (చదవండి: ట్రేడింగ్ పేరుతో హాంఫట్ ) -
ట్రాఫిక్ నిలిపేసి ‘టైగర్’కు గ్రీన్ సిగ్నల్.. నెటిజన్లు ఫిదా!
రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారులు వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ నిలిపేస్తారు అధికారులు. అయితే.. ఓ పులి రోడ్డు దాటేందుకు ట్రాఫిక్‌కు రెడ్ సిగ్నల్ ఇచ్చి.. కేవలం పులికి మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్. ఆయన చేసిన పనికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. పులి రోడ్డు దాటేందుకు ఇరువైపులా ట్రాఫిక్‌ను నిలిపేశారు. ఆ తర్వాత పులి దర్జాగా రోడ్డు దాటి అడవిలోకి వెళ్లిపోయింది. ఈ వీడియోను అటవీ శాఖ అధికారి ప్రవీన్ కశ్వాన్ శుక్రవారం ట్విట్టర్లో షేర్ చేశారు. ‘గ్రీన్ సిగ్నల్ ఓన్లీ ఫర్ టైగర్’ అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు వైరల్‌గా మారాయి. ఈ వీడియోలో ప్రధాన రహదారిపై రెండు వైపులా ట్రాఫిక్ నిలిపేసిన పోలీసు.. నిశబ్దంగా ఉండాలని సూచించారు. అప్పుడే పొదల్లోంచి ఓ పులి బయటకు వచ్చింది. దర్జాగా రోడ్డు దాటి మరోవైపు.. అడవిలోకి వెళ్లిపోయింది. దీంతో అక్కడే ఉన్న వాహనదారులు టైగర్ దృశ్యాలను తమ ఫోన్లలో చిత్రీకరించారు. వీడియో షేర్ చేసిన కొన్ని గంటల్లోనే 1.1 లక్షల మంది వీక్షించారు. వేలాది మంది లైక్ చేశారు. కొందరు నెటిజన్లు ఆశ్చర్యానికి గురికాగా.. కొందరు అద్భుతంగా పేర్కొన్నారు. ‘ఇలాంటి సంఘటనలు తరుచుగా విదేశాల్లో చూస్తుంటాం. మార్పు కనిపించటం భారత్‌కు మంచిదే.’ అని ఓ నెటిజన్ పేర్కొన్నారు. Green signal only for tiger. These beautiful people. Unknown location. pic.twitter.com/437xG9wuom — Parveen Kaswan, IFS (@ParveenKaswan) July 22, 2022 ఇదీ చూడండి: Tiger In River: వరదలో కొట్టుకువచ్చిన పులి.. బ్యారేజ్ గేట్ల వద్ద బతుకు పోరాటం -
Hyderabad Rains: మూడ్రోజులుగా ముసురుకుంది.. స్తంభించిన జనజీవనం
సాక్షి, హైదరాబాద్: ఆకాశానికి చిల్లులు పడ్డాయా.. మేఘాలు వర్ష ధారలయ్యాయా అన్నట్లు మూడ్రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వానలతో నగరం తడిసిముద్దయ్యింది. లోతట్టు ప్రాంతాల్లోకి వరదనీరు వచ్చి చేరింది. ఆదివారం ఉదయం హఫీజ్‌పేట్‌లో అత్యధికంగా 7.7 సెంటీమీటర్లు, మైలార్‌దేవ్‌పల్లి, శివరాంపల్లిలలో 6, గాజుల రామారం ఉషోదయ కాలనీలో 5.6, బాలానగర్‌లో 5.3, మియాపూర్, జూపార్కులలో 5.2 సెం.మీ చొప్పున వర్షపాతం నమోదయ్యింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) రాయదుర్గంలో కనిష్టంగా 4.5 సెంటీమీటర్ల వాన కురిసింది. రామంతాపూర్, కందికల్ గేట్, జీడిమెట్ల, రాజేంద్రనగర్, జూబ్లీహిల్స్, ఆర్సీపురం, తదితర ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురిసింది. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో నగరంలోని కాలనీలు, బస్తీలు జలమయమయ్యాయి. పలు చోట్ల రహదారులు చెరువులను తలపించాయి. మురుగునీటి కాల్వకు మరమ్మతులు కొనసాగుతున్న అనేక చోట్ల వరదనీటితో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చదవండి: ప్రాజెక్టులకు వరద పోటు ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్న మార్గాల్లో దెబ్బతిన్న రోడ్లపై గుంతల్లో వాననీరు వచ్చి చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మూడ్రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనే హెచ్చరికల నేపథ్యంలో విద్యాసంస్థలకు ప్రభుత్వం మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించింది. Its not a rivulet, #Waterlogging on roads due to continuous #HeavyRains near #Attapur area in #Hyderabad, Traffic interrupts. #Telangana govt alerted citizens, declared 3 days holidays to Educational Institutions.#HyderabadRains #heavyrain #Telanganarains #TelanganaFloods pic.twitter.com/Tn1MJblQLo — Surya Reddy (@jsuryareddy) July 10, 2022 జంట జలాశయాలకు వరద ప్రవాహం మణికొండ: గత రెండు రోజులుగా శివారు ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో గండిపేట (ఉస్మాన్‌సాగర్) చెరువులోకి వరదనీరు పోటెత్తుతుండటంతో ఆదివారం సాయంత్రం రెండు గేట్లను వదలి నీటిని కిందకు వదిలారు. పూర్తి స్థాయి నీటి మట్టం 1790 అడుగులు కాగా ప్రస్తుతం 1785.80 అడుగులకు చేరుకుంది. పైనుంచి 208 క్యూసెక్కుల నీరు వస్తుండటంతో 7,9 గేట్లను ఒక అడుగు మేర ఎత్తి 100 క్యూసెక్కుల నీటిని కిందకు వదిలారు. గండిపేట గేట్లను ఎత్తుతున్న అధికారులు దాంతో మూసీ నదిలో నీటి ప్రవాహం మొదలయ్యింది. గండిపేటలోని గేట్లకు మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి, జలమండలి డీజీఎంలు నరహరి, వెంకట్రావులు పూజలు నిర్వహించి గేట్లను పైకి ఎత్తారు. రాత్రికి మరింత వరద ఎక్కువైతే అవే గేట్లను మరింత ఎత్తటం, మరిన్ని గేట్లను ఎత్తేందుకు యంత్రాంగం సిద్దంగా ఉందని జలమండలి అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో గండిపేట కౌన్సిలర్లు విజిత ప్రశాంత్ యాదవ్, నాయకులు గోపాల గణేష్, సీఐ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. వరద నీటితో హిమాయత్‌సాగర్ Waves in Hyderabad @balaji25_t @Rajani_Weather#HyderabadRains pic.twitter.com/1L1TCEjNGt — karthikavsk(sharzsCAr) (@karthikavsk) July 10, 2022 నిండుకుండలా హిమాయత్‌సాగర్.. బండ్లగూడ: భారీ వర్షాలు కురుస్తుండడంతో హిమాయత్‌సాగర్ చెరువు వరద నీటితో నిండుకుండను తలపిస్తోంది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో వరద ప్రవాహం పెరుగుతోంది. హిమాయత్‌సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 1763.50 అడుగులు కాగా ప్రస్తుతం 1760.50 అడుగులుగా ఉంది. దీంతో ఆదివారం సాయంత్రం 6 గంటలకు జలమండలి మేనేజర్ రేణుక, రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్‌ల ఆధ్వర్యంలో 10, 5వ నంబర్ గేట్లను ఒక అడుగు మేర ఎత్తి నీటిని దిగువకు పంపిస్తున్నారు. -
సీఎం రాక నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపులు
సాక్షి, హైదరాబాద్: అల్వాల్ రైతు బజార్ ఎదురుగా ఉన్న స్థలంలో టిమ్స్ ఆసుపత్రి నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు జరుగనున్న ఈ కార్యక్రమం నేపథ్యంలో తిరుమలగిరి చౌరస్తా–బొల్లారం చెక్‌పోస్టు మధ్య ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతాయని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వాహనచోదకులు ఈ మార్గాన్ని అనుసరించవద్దని సూచిస్తున్నారు. కరీంనగర్ హైవేకు రాకపోకలు సాగించే వారు ఔటర్ రింగ్ రోడ్‌ను ఆశ్రయించాలని ట్రాఫిక్ చీఫ్ ఏవీ రంగనాథ్ సోమవారం సూచించారు. నిర్ణీత సమయంలో ఆయా మార్గాల్లో ట్రాఫిక్ మళ్లించడమో, పూర్తిగా ఆపేయడమో జరుగుతుందన్నారు. జేబీఎస్ నుంచి కరీంనగర్ హైవే మధ్య ఉన్న టివోలీ ఎక్స్‌రోడ్స్, హోలీ ఫ్యామిలీ జంక్షన్, తెలంగాణ తల్లి విగ్రహాల కేంద్రంగా ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు. కరీంనగర్ హైవే నుంచి హైదరాబాద్ సిటీలోకి వచ్చే మార్గంలో షామీర్పేట ఓఆర్ఆర్, బిట్స్ జంక్షన్, తూముకుంట ఎన్డీఆర్ విగ్రహం, బొల్లారం చెక్‌పోస్టు కేంద్రంగా ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయి. వాహనచోదకులు వీటిని దృష్టిలో పెట్టుకుని తమకు సహకరించాలని ట్రాఫిక్ పోలీసులు కోరుతున్నారు. (చదవండి: కూకట్‌పల్లిలో... దేవాలయం శిఖర ప్రతిష్ట చేస్తున్న చినజీయర్ స్వామి ) -
ట్రాఫిక్‌లో చిక్కుకున్న అంబులెన్స్
-
Hyderabad: సిగ్నల్ ఫ్రీ చౌరస్తాగా జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ చౌరస్తా అభివృద్ధీకరణలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు నగర ట్రాఫిక్ అదనపు కమిషనర్ ఏవీ. రంగనాథ్ గురువారం చౌరస్తాలో పర్యటించారు. ఆయనతో పాటు ఇంజనీరింగ్ సెల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, జీహెచ్ఎంసీ ఈఈ విజయ్‌కుమార్, ఏఈ వెంకటేష్, సీఆర్ఎంపీ మేనేజర్ శ్రీరాంమూర్తి తదితరులు ఇక్కడ ఆయనతో కలిసి పర్యటించారు. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు చౌరస్తాను ‘సిగ్నల్ ఫ్రీ’ కూడలిగా తీర్చిదిద్దే క్రమంలో ఏమేం చేయాలో చర్చించారు. ఇక నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టులో నాలుగు వైపులా సిగ్నల్‌తో ప్రమేయం లేకుండానే వాహనాలు తేలికగా ఫ్లో అయ్యే విధంగా చర్యలు చేపట్టనున్నారు. ఇందుకు అనుగుణంగా రోడ్డును, ఫుట్‌పాత్‌లను విస్తరించే ప్రణాళికలను రూపొందించనున్నారు. ముఖ్యంగా చౌరస్తాకు నాలుగువైపులా ‘యూ’ టర్న్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. బంజారాహిల్స్ రోడ్ నెం. 2లోని జింఖానా క్లబ్ వద్ద ‘యూ’ టర్న్ కొత్తగా ఏర్పాటు చేసి జూబ్లీహిల్స్ రోడ్ నెం. 1 టీవీ 5 నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45, ఫిలింనగర్ వైపు వెళ్ళే వాహనాలకు అవకాశం కల్పిస్తారు. చదవండి: (తెలుగు రాష్ట్రాల మధ్య మరో వారధి.. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే..) చౌరస్తాలో ‘ఫ్రీ’ లెఫ్ట్‌లు బ్లాక్ కాకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ రోడ్ నెం. 36 కళాంజలి వద్ద వాహనాలు వన్‌వేలో చిరంజీవి బ్లడ్ బ్యాంకు వైపు వెళ్తున్నాయి. ఇక్కడ రూట్ చేంజ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ చౌరస్తాను ట్రాఫిక్ ఇక్కట్లు లేకుండా తీర్చిదిద్దే క్రమంలో జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసులు సమన్వయంతో ముందుకు సాగాలని తీర్మానించారు. -
మళ్లీ లాక్‌డౌనా అనేలా హైదరాబాద్ పరిస్థితి
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి పండుగ నేపథ్యంలో నగరం నుంచి పెద్ద ఎత్తున జనం సొంతూళ్లకు తరలివెళ్లారు. దీంతో నగరం ఒక్కసారిగా బోసిపోయింది. ట్రాఫిక్‌తో రద్దీగా ఉండే ప్రధాన రోడ్లు, చౌరస్తాలు నిర్మానుష్యంగా మారాయి. వాహనాల మోత.. ట్రాఫిక్ జామ్‌ల జంజాటం పూర్తిగా తగ్గింది. మళ్లీ లాక్డౌన్ అమలు చేస్తున్నారా అనే విధంగా పరిస్థితి మారిపోయింది. కరోనా కారణంగా రెండేళ్లుగా చాలా మంది సంక్రాంతికి సైతం సొంతూళ్లకు వెళ్లలేకపోయారు. ఈసారి మాత్రం ముందుగానే ప్లాన్ చేసుకొని మరీ ఊళ్లకు వెళ్లారు. నగర రోడ్ల పైన సాధారణంగా నిత్యం దాదాపు 25 నుంచి 30 లక్షల వాహనాలు తిరుగుతూ ఉంటాయి. అయితే సంక్రాంతి పండుగ ముందు రోజుకే అది సగానికి తగ్గిపోయింది. శుక్రవారం నుంచి పండుగ సెలవులు కావటంతో నగరంలో రద్దీ మరింతగా తగ్గిపోయే అవకాశం కనిపిస్తోంది. హైదరాబాద్‌లో వారాంతంలో సహజంగా కొంత మేర రద్దీ తక్కువగా ఉంటుంది. కానీ, ఇప్పుడు మాత్రం నగరం దాదాపుగా బోసి పోయిన వాతావరణం కనిపిస్తోంది. నిత్యం ట్రాఫిక్‌తో కుస్తీ పట్టే నగరవాసులు..ఇప్పుడు హైవే మీద వెళ్లినట్లుగా నగరంలోని రోడ్లపైన ఈజీగా ప్రయాణం చేస్తున్నారు. ఇక కాలనీలు, బస్తీలు సైతం జనసంచారం లేక నిర్మానుష్యంగా మారాయి. చదవండి: (నాలుగేళ్లుగా మంచంలో.. ఇక జీవితమే లేదనుకున్నాడు.. అంతలోనే..) తగ్గిన వ్యాపారం జనం లేక షాపింగ్ మాల్స్, దుకాణాలు బోసిపోయాయి. గత మూడు రోజులుగా నగరంలోని అన్ని రకాల వ్యాపారాలు కూడా తగ్గిపోయినట్లు ఆయా వర్గాలు పేర్కొన్నాయి. ప్రతిసారి సంక్రాంతి సీజన్లో ఇదే జరుగుతుందని, ఈసారి మాత్రం మరికొంత పెరిగినట్లు చెబుతున్నారు. ఓ వైపు కరోనా కారణంగా దెబ్బతిన్న ఆర్థికపరిస్థితులు..మరోవైపు సొంతూళ్ల ప్రయాణాల కారణంగా దాదాపు 30 నుంచి 40 శాతం వ్యాపారం తగ్గిపోయినట్లు అంచనా వేస్తున్నారు. కొత్త దుస్తులు, నగలు, గృహోపకరణాల కొనుగోళ్లు కూడా బాగా క్షీణించాయంటున్నారు. చదవండి: (తగ్గేదేలే.. గడ్డకట్టే చలిలో.. చెక్కుచెదరని విశ్వాసంతో..) -
ఆ రెండు దేశాల్లో ఫేస్‌బుక్‌కు గట్టి దెబ్బ
Most Used Social Media 2021: సోషల్ మీడియా ఈ కాలంలో స్మార్ట్‌ఫోన్ వాడే ప్రతీ ఒక్కరి జీవితంలో భాగమై ఉండొచ్చు. కానీ, అందులోని ప్లాట్‌ఫామ్స్ మాత్రం కాదు!. అవసరం, ఆసక్తిని బట్టి యాప్స్‌ని ఉపయోగించడం యూజర్ ఇష్టం. ఈ తరుణంలో మోస్ట్ యూజింగ్ ప్లాట్‌ఫామ్‌గా పేరున్న ఫేస్‌బుక్‌కు పెద్ద షాకే తగిలింది. జపాన్, ఉగాండాలో ఫేస్‌బుక్‌ను ట్విటర్ గట్టి దెబ్బ కొట్టింది. అది అలా ఇలా కూడా కాదు. 2021లో మోస్ట్ యూజ్డ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై స్టాట్‌కౌంటర్ అనే వెబ్ ట్రాఫిక్ అనలిసిస్ కంపెనీ ఒక నివేదికను విడుదల చేసింది. కిందటి ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా 72.4 శాతం ట్రాఫిక్ ఫేస్‌బుక్‌కు దక్కింది. ఆ తర్వాతి ప్లేస్‌లో ట్విటర్ జస్ట్ 8.8 శాతంతో నిలిచింది. పింటెరెస్ట్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, రెడ్డిట్, టంబ్లర్, ఇతరాలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. కానీ.. జపాన్‌లో మాత్రం ట్విటర్‌కు ఎక్కువ ఆదరణ లభించింది. 48.65 శాతం యూజర్లు ఆసక్తి చూపించగా.. ఆ తర్వాతి స్థానంలో ఇమేజ్ షేర్ సోషల్ మీడియా యాప్ పింటెరెస్ట్ నిలిచింది. ఫేస్బుక్ 16 శాతం ట్రాఫిక్‌తో మూడో స్థానానికి పరిమితమైంది. ఉగాండా విషయానికొస్తే.. ట్విటర్ 49. 79 శాతంతో ట్విటర్ టాప్ పొజిషన్లో నిలిచింది. రెండో స్థానంలో పింటెరెస్ట్ (23.09), మూడో స్థానంలో ఫేస్బుక్ కేవలం 12 శాతం ట్రాఫిక్కే పరిమితమైంది. కారణాలు? ఫేస్బుక్ మీద వస్తున్న విమర్శల కారణంగానే జపాన్ ఇంటర్నెట్యూజర్లు.. ఫేస్‌బుక్‌కు దూరంగా ఉంటున్నట్లు ఫీడ్‌బ్యాక్, కామెంట్ల ద్వారా తెలుస్తోంది. 2017 చివర్లో జపాన్‌లో ఫేస్బుక్ మార్కెట్ హఠాత్తుగా పడిపోవడం మొదలై.. ఇప్పటికీ అలాగే కొనసాగుతోంది. అయినప్పటికీ ఫేస్బుక్ పేరెంట్ కంపెనీ మెటా ఆందోళన చెందడడం లేదు. అందుకు కారణం.. ఇన్‌స్టాగ్రామ్‌కు క్రమక్రమంగా జపాన్‌లో పెరుగుతున్న ఆదరణ. ఇక ఉగాండాలో ట్విటర్ ఆదరణకు, ఫేస్బుక్ వ్యతిరేకత పట్ల గల కారణాలపై స్పష్టత లేదు. మరవైపు వెనిజులాలో సైతం ట్విటర్‌కు ట్రాఫిక్ ఎక్కువగా ఉంటున్నప్పటికీ.. ఫేస్బుక్ స్ట్రాంగ్ మార్కెట్‌తో గట్టి పోటీ ఇస్తోంది. చదవండి: యూజర్ల ప్రైవసీతో చెలగాటం..! గూగుల్, మెటా సంస్థలకు దిమ్మతిరిగే షాక్..! -
దున్నపోతు వీరంగం.. రైల్వేగేటునే లేపేసింది
సాక్షి, కరీంనగర్: పెద్దపల్లిలో కునారం రైల్వేగేటు వద్ద దున్నపోతు వీరంగాన్ని సృష్టించింది. దున్నపోతు రైల్వేగేటు సమీపంలో చేరుకొని గేటు దాటి అవతలివైపుకి వెళ్తుంది. ఈ క్రమంలో.. సిగ్నల్ పడటంతో రైల్వే కీపర్ గేటును కిందకుదించాడు. దీంతో ఆగ్రహించిన దున్నపోతు.. తన బలం మొత్తాన్ని రైల్వేగేటుపై చూపించింది. అంతటితో ఆగకుండా తన బలమైన కొమ్ములతో రైల్వేగేటును పైకి ఎత్తేసి, వంగిపోయేలా చేసింది. దీంతో కాల్ప శ్రీరాంపూర్, జమ్మికుంట వెళ్లే రహదారిని తాత్కాలికంగా నిలిపేశారు. దీంతో.. ఆమార్గం గుండా వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చదవండి: మాజీ సీఎం భార్య, కుమార్తెకు కరోనా -
పట్టపగలే సినీఫక్కీలో భారీ చోరీ..
సాక్షి, వరంగల్: అత్యంత రద్దీగా ఉండే నగరంలోని నక్కలగుట్ట ప్రాంతంలో పట్టపగలే సినీఫక్కీలో చోరీ జరిగింది. సోమవారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో నక్కలగుట్టలోని హెచ్డీఎఫ్సీ బ్యాంకు ముందు నిలిపి ఉంచిన కారు అద్దాలు పగులగొట్టి అందులో ఉన్న రూ. 25లక్షల నగదును దుండగులు అపహరించారు. సుబేదారి ఇన్స్పెక్టర్ ఎ.రాఘవేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశ్‌రెడ్డిపేటకు చెందిన కొండబత్తుల తిరుపతి తన ఇద్దరు కుమారులతో కలిసి హంటర్‌రోడ్డులోని ఎస్బీఐ బ్యాంకుకు వెళ్లాడు. చిన్నకుమారుడు కృష్ణవంశీ తన అకౌంట్నుంచి రూ.5లక్షలు డ్రా చేసి తండ్రికి ఇచ్చి వెళ్లిపోయాడు. అనంతరం పెద్దకుమారుడితో కలిసి నక్కలగుట్టలోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌కు వెళ్లిన తిరుపతి తన అకౌంట్లో ఉన్న రూ.10లక్షలు, భార్య భాగ్యలక్ష్మి పేరుమీద ఉన్న రూ.5 లక్షలు, పెద్ద కుమారుడు సాయితేజ అకౌంట్లో ఉన్న రూ.5లక్షలు డ్రా చేశాడు. మొత్తం డబ్బులను బ్యాగులో సర్దగా, పెద్దకుమారుడు తీసుకెళ్లి బ్యాంకు ముందు పార్క్ చేసిన కారులో పెట్టాడు. ఆ సమయంలో బ్యాంకునుంచి సంతకం కోసం ఫోన్ రావడంతో కారును లాక్ చేసి లోపలికి వెళ్లి తిరిగి వచ్చాడు. అప్పటికే కారు అద్దాలు పగిలి ఉన్నాయి. పరిశీలించగా కారులో పెట్టిన డబ్బుల బ్యాగు మాయం అయినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. భూమి కొనుగోలు కోసం బ్యాంకులో ఉన్న డబ్బులను తీసినట్లు తిరుపతి కన్నీటిపర్యంతమయ్యాడు. సంఘటనాస్థలాన్ని పరిశీలించిన డీసీపీ సంఘటనా స్థలాన్ని సెంట్రల్ జోన్ డీసీపీ పుష్పారెడ్డి పరిశీలించారు. బాధితుడినుంచి వివరాలు సేకరించారు. బ్యాంకులో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. ఇద్దరు నిందితులు వచ్చి రెక్కీ నిర్వహించినట్లు గుర్తించారు. ఒకరు చోరీ చేసి బ్యాగ్‌తో ముందుకువెళ్లగా, మరో నిందితుడు ద్విచక్ర వాహనంపై వచ్చి తీసుకెళ్లినట్లు డీసీపీ తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు ఆరు బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. డీసీపీవెంట కాజీపేట ఏసీపీ శ్రీనివాస్, ఇన్స్పెక్టర్ రాఘవేందర్, సీసీఎస్ ఇన్స్పెక్టర్ రమేష్‌కుమార్, టాస్క్‌ఫోర్స్ బృందాలు ఉన్నాయి. -
‘హారన్’ మోతను మార్చే పనిలో కేంద్రం.. ఇక చెవులకు వినసొంపైన సంగీతంతో!
-
హైదరాబాద్‌లో ఓజోన్ కమ్మేస్తోంది.. అవస్థలు తప్పవు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్లో కోవిడ్ కలకలంతో వ్యక్తిగత వాహనాల వినియోగం అనూహ్యంగా పెరిగింది. దీంతో ప్రధాన రహదారులపై గంటల తరబడి ట్రాఫిక్ రద్దీ పెరుగుతోంది. వాహనాలు వదులుతోన్న కాలుష్యంతో గ్రేటర్లో భూస్థాయి ఓజోన్ మోతాదు క్రమంగా అధికమవుతోంది. ఈ విపరిణామంతో నగరవాసులు ఆస్తమా, బ్రాంకైటిస్ తదితర శ్వాసకోశ వ్యాధులతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వాహనాల నుంచి వెలువడుతోన్న కాలుష్య ఉద్గారాలతోపాటు ఓజోన్ వాయువులు సిటిజన్ల ముక్కుపుటాలను అదరగొడుతున్నాయి. ట్రాఫిక్ అత్యధికంగా ఉండే ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పలు ప్రధాన రహదారులపై వాహనాలు వెదజల్లే పొగలోని ఓజోన్ వాయువు గాలిలోని నైట్రోజన్ ఆక్సైడ్స్, ఓలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్లతో కలవడంతోపాటు సూర్యరశ్మి ప్రభావంతో భూ ఉపరితల వాతావరణాన్ని ఓజోన్ దట్టంగా ఆవహిస్తోంది. దీంతో తరచూ ట్రాఫిక్ రద్దీలో చిక్కుకొన్న ప్రయాణికులు, వాహనదారులు, చిన్నారులు, వృద్ధులు, రోగులు, పాదచారులకు ఊపిరిసలపడంలేదని కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) పరిశీలనలో తేలింది. చదవండి: విజృంభిస్తున్న విష జ్వరాలు.. డెంగీతో యువ డాక్టర్ మృతి ప్రమాణాల మేరకు ఘనపు మీటరుగాలిలో భూస్థాయి ఓజోన్ మోతాదు వంద మైక్రోగ్రాములకు మించరాదు. కానీ, నగరంలోని ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉండే సుమారు వంద కూడళ్లలో ఘనపు మీటరు గాలిలో 80–100 మైక్రోగ్రాములుగా నమోదవుతుండడంతో పలు అనర్థాలు తలెత్తుతుండడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఓజోన్‌తో అవస్థలు ఇవే.. ► అస్తమా, బ్రాంకైటిస్‌తో బాధపడేవారి సంఖ్య పెరుగుతోంది. ► ట్రాఫిక్ రద్దీలో వేలాది మంది తరచూ ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ► గొంతునొప్పి, ముక్కుపుటాలు దెబ్బతినడం, కళ్లు మండడం వంటి సమస్యలు పెరుగుతున్నాయి. ► ఊపిరితిత్తుల పనితీరు దెబ్బతినడం, ఛాతీలో అసౌకర్యం. చదవండి: ‘వైద్యురాలి నిర్లక్ష్యంతో బాలింత మృతి’ ధూళి కాలుష్యం సైతం ► ఓజోన్తోపాటు మోటారు వాహనాల పొగలో ఉన్న సూక్ష్మ, స్థూల ధూళికణాలైన పీఎం10, పీఎం 2.5, ఆర్ఎస్పీఎంలు పీల్చేగాలిలో చేరి నేరుగా ఊపిరితిత్తుల్లో చేరి తీవ్రమైన శ్వాసకోశవ్యాధులు, పొడిదగ్గు, బ్రాంకైటిస్‌కు కారణమవుతున్నాయి. ► దుమ్ము, ధూళి కళ్లలోకి చేరి రెటీనా దెబ్బతింటోంది. ► చికాకు, అసహనం, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది తలెత్తుతోంది. ► తలనొప్పి, పార్శ్వపు నొప్పి కలుగుతాయి. ► ధూళి కాలుష్య మోతాదు క్రమంగా పెరుగుతుంటే ఊపిరితిత్తుల క్యాన్సర్లు పెరిగే ప్రమాదం ఉంది. ► ఇటీవల నగరంలో శ్వాసకోశ సమస్యలు, ఆస్తమా, క్రానిక్ బ్రాంకైటిస్, సైనస్ సమస్యలు పెరగడానికి ప్రధాన కారణం వాతావరణ మార్పులు, వాయు కాలుష్యమేనని నిపుణులు అంటున్నారు. -
ప్లీజ్ చేంజ్ హారన్: గడ్కరీ
Nitin Gadkari Horn Change Rules: నగరాలు, పట్టణాల్లో ట్రాఫిక్ నడుమ చెవులు చిల్లులు పడే రేంజ్ రణగోణధ్వనుల్ని భరిస్తూ.. వాహనదారులు ముందుకు పోవాల్సిన పరిస్థితి. అయితే ఈ సినారియోను మార్చేందుకు కేంద్రం సరికొత్త ఆలోచన చేయబోతోంది. విచిత్రమైన, ఘోరమైన శబ్దాలు చేసే హారన్ సౌండ్‌ల్ని మార్చేసే దిశగా ఆలోచన చేయనున్నట్లు రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఒక ప్రకటన చేశారు. మరాఠీ న్యూస్ పేపర్ లోక్‌మట్ కథనం ప్రకారం.. నాగ్‌పూర్‌లో ఓ భవనంలో పదకొండవ అంతస్తులో నివాసం ఉంటున్న గడ్కరీకి.. ప్రశాంతంగా గంటసేపు ప్రాణాయామం కూడా చేసుకోని పరిస్థితి ఎదురవుతోందట. వాహనాల రోదనల వల్ల అంత ఎత్తులో ఉన్న తన పరిస్థితే అలా ఉంటే.. సాధారణ పౌరులు ఆ గోలను ఎలా భరిస్తున్నారో తాను ఊహించుకోగలనని చెప్తున్నారాయన. అందుకే బండ్ల ‘హారన్’ మార్చేసేలా చర్యలు చేపట్టబోతున్నట్లు గడ్కరీ వెల్లడించారు. ఇప్పుడున్న వెహికిల్ హారన్ల ప్లేస్‌లో తబలా, వయొలిన్, ఫ్లూట్.. ఇలా రకరకాల వాయిద్యాల శబ్దాలను పరిశీలించబోతున్నట్లు ఆయన తెలిపారు. తొలి దశలో కార్లకు ఈ ఆలోచనను అమలు చేయబోతున్నట్లు, ఈ మేరకు త్వరలో కంపెనీలకు సూచనలు సైతం పంపిచనున్నట్లు గడ్కరీ వ్యాఖ్యలను ఆ కథనం ఉటంకించింది. ఒకవేళ కేంద్రం గనుక కరాకండిగా ఈ రూల్స్ అమలు చేస్తే మాత్రం.. వాహన తయారీదారీ కంపెనీలపై అదనపు భారం పడనుంది. ఆ టైంలోనే గట్టిగా.. హారన్ శబ్దాల వల్ల శబ్ద కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. మనుషుల్లో చెవుడుతో పాటు ఆందోళన, ఒత్తిళ్ల సమస్యలు ఎదురవుతున్నాయి. సాధారణంగా అతి ధ్వనులను అవతి వాహనాలు(ఏవైనా సరే), వ్యక్తులు తప్పిపోయిన సమయాల్లో.. దూరం నుంచి వాహనాలు వస్తున్నాయనే అలర్ట్ ఇవ్వడానికి(ఎమెర్జెన్సీ సర్వీసుల విషయంలో) మాత్రమే ఉపయోగించాలని రూల్స్ చెప్తున్నాయి. కానీ, ఈ రూల్స్ అమలు కావడం లేదు. రోడ్ల మీద వెళ్లే వాహనాల విషయంలోనే కాదు.. షిప్స్, రైళ్ల విషయంలోనూ ఈ నిబంధనలు పాటించాలి. సాధారణంగా రైళ్ల హారన్ 130-150 డెసిబెల్స్ దాకా ఉంటుంది. దూరం ఉన్నప్పుడు మాత్రమే ఈ శబ్ద తీవ్రతతో హారన్ కొట్టాలి. ప్లాట్‌ఫామ్ మీదకు వచ్చిన తర్వాత కూడా ఈ రేంజ్ సౌండ్ హారన్ కొట్టడం రూల్స్‌కి వ్యతిరేకం!. నో హాంకింగ్ జోన్స్ కొన్ని చోట్ల హారన్లు కొట్టడానికి వీల్లేదు. అలాంటి ప్రాంతాల్ని ‘నో హాంకింగ్ జోన్స్’ అంటారు. మన దేశంలో ఎక్కడా అలాంటి జోన్లను ఏర్పాటు చేయలేదు. కేవలం శబ్ద తీవ్రత పరిమితిని మించినప్పుడు.. అదీ ఫిర్యాదుల మేరకు చర్యలు తీసుకుంటున్నారు. ఒకవేళ నో హాంకింగ్ జోన్స్ వ్యవస్థను అమలు చేస్తే.. గడ్కరీ చెప్తున్న హారన్ మార్పిడి ఆలోచన అవసరమే ఉండదనేది చాలామంది వెల్లడిస్తున్న అభిప్రాయం. చదవండి: లెదర్ పరిశ్రమకు మంచి రోజులు -
ట్యాంక్‌బండ్‌పై సండే సందడి
సాక్షి, కవాడిగూడ: ట్యాంక్‌బండ్‌పై ఆదివారం సాయంత్రం సందడి నెలకొంది. సాయంత్రం వేళ ట్యాంక్‌బండ్‌పై సందర్శకులకు అనుమతివ్వడంతో హుస్సేన్‌సాగర్ అందాలను తిలకించేందుకు ఆసక్తి చూపుతున్నారు. చిన్నారులు సైకిలింగ్ చేస్తూ మురిసిపోయారు. చదవండి: మహాగణపతి సిద్ధం.. ఖైరతాబాద్ చరిత్రలోనే తొలిసారి కుటుంబసభ్యులతో డిప్యూటీ మేయర్ ఆటవిడుపులో డిప్యూటీ మేయర్... జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభారెడ్డి కుటుంబసభ్యులతో కలిసి వచ్చారు. ఈ సందర్భంగా సందర్శకులతో మాట్లాడారు. నగర నడిబొడ్డున ఉన్న ట్యాంక్‌బండ్‌కు కుటుంబ సమేతంగా ఇలా రావడం పిక్నిక్ వచ్చినట్లుగా ఉందని డిప్యూటీ మేయర్ సంతోషాన్ని వ్యక్త పరిచారు. చిక్కడపల్లి ట్రాఫిక్ సీఐ ప్రభాకర్‌రెడ్డి భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించారు. -
E- చలాన్లపై కొత్త మార్గదర్శకాలు జారీ
-
Photo Feature: సోనూ సూద్ ఇంటికి జనం తాకిడి
హైదరాబాద్‌లో ఉన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణను రాజకీయ నాయకులు, ఇతర రంగాల ప్రముఖులు మర్యాదపూర్వకంగా కలుస్తున్నారు. లాక్డౌన్ హీరో సోనూ సూద్ ఇంటికి రోజురోజుకు జనం తాకిడి పెరుగుతోంది. తనకు తోచిన సాయం చేస్తూ సోనూ సూద్ సేవలు కొనసాగిస్తున్నారు. హైదరాబాద్‌లో లాక్డౌన్ కష్టాలు కొనసాగుతున్నాయి. -
ఔరా! వీళ్లంతా అత్యవసర సర్వీసులకేనా!
సాక్షి, హైదరాబాద్: ∙నగర పోలీసులు తమ విశ్వరూపం చూపించారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కొరడా ఝళిపించారు. శనివారం ఎక్కడికక్కడ వాహనదారులను అడ్డుకొని పెద్ద ఎత్తున కేసులు నమోదు చేశారు. భారీ సంఖ్యలో వాహనాలు సీజ్ చేశారు. ఏకంగా డీజీపీ మహేందర్‌రెడ్డి సైతం రంగంలోకి దిగారు. గ్రేటర్‌లోని ముగ్గురు సీపీలు అంజనీకుమార్, సజ్జనార్, మహేశ్‌భగవత్‌లు వారి పరిధిలో తనిఖీలు నిర్వహించారు. కారణాలు లేకుండా రోడ్డెక్కిన వాహనదారులకు సీరియస్‌గా క్లాస్ పీకారు. ఎవ్వరినీ ఉపేక్షించకుండా భారీగా జరిమానాలు సైతం విధించారు. లాక్డౌన్ నిబంధనల్ని కఠినతరం చేయాలని సీఎం ఆదేశించడంతో..ఇప్పటి వరకు కాస్త చూసీ చూడనట్లు వ్యవహరించిన పోలీసులు ఒక్కసారిగా ‘లాక్’ బిగించారు. దీంతో వాహనదారులు హడలెత్తారు. కాగా సడలింపు సమయం ముగిసినా ఆ తర్వాత కూడా ఎక్కడ చూసినా జనాలు కనిపించారు. పాస్‌లు ఉన్న వాళ్లు, లేని వాళ్లు అనే తేడా లేకుండా రోడ్లపైనే ఉన్నారు. నిన్నటి వరకు నామమాత్రంగా మారిన చెక్ పోస్టులతో వీరికి చెక్ చెప్పేవాళ్లు లేకుండా పోయారు. అనేక జంక్షన్లలో ట్రాఫిక్ జామ్స్ ఏర్పడ్డాయంటే పరిస్థితి అంచనా వేసుకోవచ్చు. రాజధానిలో నెలకొన్న ఈ పరిస్థితులపై ఉన్నతాధికారులు అసహనం వ్యక్తం చేశారు. మదీనా సెంటర్లో వాహనం సీజ్‌చేసి తీసుకెళ్తున్న పోలీసులు డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి అందరు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వయంగా రంగంలోకి దిగాలని, పరిస్థితుల్ని పర్యవేక్షించాలని ఆదేశించారు. దీంతో మేల్కొన్న పోలీసులు శనివారం నుంచి హడావుడి చేయడం మొదలెట్టారు. ఉన్నతాధికారులు అంతా చెక్‌పోస్టులతో పాటు వారి పరిధిల్లో పర్యటించారు. ఎక్కడిక్కడ పరిస్థితుల్ని పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలకు ఆదేశించారు. ఇప్పటి వరకు సరుకు రవాణా వాహనాల సంచారంపై ఎలాంటి ఆంక్షలు లేవు. అయితే ఆదివారం నుంచి మాత్రం కేవలం రాత్రి 9 నుంచి ఉదయం 8 వరకు మాత్రమే అనుమతించనున్నారు. ఈ మేరకు పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. లోడింగ్, అన్లోడింగ్ వాహనాలకు ఇది వర్తించనుంది. అంజనీ ఆన్ రోడ్ సీపీ అంజనీకుమార్ స్వయంగా రోడ్డెక్కి వాహనదారులను అడ్డుకున్నారు. లాక్డౌన్ సమయం ముగిసినా ఎందుకు బయటకు వచ్చారని వారిని సీరియస్‌గా ప్రశ్నించారు. బిగ్‌బాస్ ఇన్ యాక్షన్ డీజీపీ మహేందర్‌రెడ్డి శనివారం నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. లాక్డౌన్ అమలు తీరును ఆయా అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించినవారిపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. సజ్జనార్ సీరియస్ కూకట్పల్లి: లాక్డౌన్ ఉల్లంఘనలపై సైబరాబాద్ సీపీ సజ్జనార్ సీరియస్ అయ్యారు. స్వయంగా చెక్‌పోస్టుల వద్ద ఆయన వాహనదారులను ఆపి ఎందుకు బయటకు వచ్చారని నిలదీశారు. -
వామ్మో.. బస్సు కుదుపు ఎంత పనిచేసింది!
సాక్షి, సుల్తాన్‌బజార్: ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన శనివారం సుల్తాన్‌బజార్ పోలీస్‌స్టేషన్ పరిదిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ సుబ్బరామిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.... ఎస్ఆర్నగర్ హాస్టల్లో ఉంటున్న పవన్‌చైతన్య (23) బీహెచ్ఈఎల్ డిపోకు చెందిన బస్సులో (రూట్ 218 బి) పటాన్చెరువు నుంచి దిల్సుఖ్నగర్ వెళ్తున్నాడు. కోఠి ఆంధ్రాబ్యాంక్ చౌరస్తాలో బస్సు కుదుపుకు రాక్‌సైడ్ విండోవద్ద కూర్చున్న పవన్‌చైతన్య ఒక్కసారిగా ఎగిరి పడటంతో తలకు, కుడిపక్క తీవ్ర గాయమైంది. దీంతో తీవ్ర రక్తస్రావమైన పవన్‌చైతన్య ఒక్కసారిగా కుప్పకూలాడు. విషయం తెలుసుకున్న తోటి ప్రయాణికులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పవన్ చైతన్యను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పవన్‌చైతన్య మృతిచెందారు. డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రయాణికుడు మృతిచెందాడనే అనుమానంతో డ్రైవర్ గంగయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ట్రాఫిక్ చలానా తగ్గించుకోండిలా!
దేశవ్యాప్తంగా ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించే వాహనదారుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. ట్రాఫిక్ పోలీసులు ఎంత అవగాహన కల్పించిన వాహనదారుల నిర్లక్ష్యం వల్ల కొన్ని సార్లు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఏదేమైనా, ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క వాహనదారుడికి ఉంది. మీరు ట్రాఫిక్ నిబంధలను పాటించకపోతే చలాన్ల రూపంలో పోలీసులకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. మరికొన్ని సందర్భాల్లో జైలు జీవితం కూడా గడపాల్సి ఉంటుంది. ఇంతకీ, చలానా ఎవరు జారీ చేస్తారు? చలానా ఫీజును ఎలా తగ్గించుకోవచ్చు? అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా ఎవరైనా ట్రాఫిక్ రూల్స్‌ను ఉల్లంఘిస్తే ఆ వ్యక్తిని గుర్తించి అక్కడికక్కడే సంబంధిత పోలీసు అధికారి అపి విధించే జరిమానానే స్పాట్ చలాన్ అంటారు. ట్రాఫిక్ రూల్స్‌ను పాటించకుండా అతి వేగంగా వెళ్తున్నప్పుడు, హెల్మెట్ ధరించకుండా ప్రయాణిస్తున్నప్పుడు, సిగ్నల్ జంప్ చేస్తున్నప్పుడు, నాన్ పార్కింగ్ స్థలంలో మీ వాహనాన్ని పార్కింగ్ చేసిన సందర్భాల్లో ట్రాఫిక్ పోలీసులు తమ వద్ద ఉన్న డిజిటల్ కెమెరాతో మీ వాహనాన్ని ఫోటో తీసి అందుకు తగ్గ జరిమానా విధిస్తారు. మీరు అధికారిక వెబ్సైట్లో మీ వాహనంపై విధించిన ఈ- చలాన్‌ను చూసుకోవచ్చు. అక్కడే చలాన్ ఫీజును చెల్లించవచ్చు. ట్రాఫిక్ చలానా విధించే అధికారం కేవలం హెడ్ కానిస్టేబుల్ లేదా అంతకంటే ఎక్కువ హోదా గల అధికారులకు మాత్రమే ఉంటుంది. మీ వాహనాన్ని ఆపడం లేదా జరిమానా విధించే అధికారం సాధారణ పోలీసు సిబ్బందికి లేదు. కొన్ని పరిస్థితుల్లో మీరు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిచకపోయినా తప్పడు ఈ-చలాన్ మీకు వచ్చిన వెంటనే సంబంధిత రాష్ట్ర పోలీసు శాఖకు మెయిల్ పంపించి మీ సమస్యను పరిష్కరించు కోవచ్చు. ఒకవేల మీ వాహనంపై ఎక్కువ మొత్తంలో చలాన్ ఫీజు ఉంటే రాష్ట్ర కోర్టులు ఏర్పాటు చేసే లోక్ అదాలత్‌లో మీ చలాన్ ఫీజును తగ్గించమని విజ్ఞప్తి చేయవచ్చు. అలాగే, మీరు కనుక ఈ చలాన్ ను సకాలంలో చెల్లించకపోతే, మీ చలాన్ కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది. తద్వార మీరు జరిమానా చెల్లించేందుకు కోర్టులో హాజరుకావాల్సి ఉంటుంది. చదవండి: ఆంధ్రా బ్యాంక్, కార్పొరేష బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్! ఉచితంగా ఐపీఎల్ మ్యాచ్‌లు చూడండిలా! -
హైదరాబాద్ ట్రాఫిక్; ఈ రూట్లో వెళ్లకపోవడమే బెటర్!
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగర వాసులకు ట్రాఫిక్ చుక్కలు చూపిస్తోంది. బేగంపేట-సికింద్రాబాద్ మార్గంలో ప్రయాణం వాహన చోదకులకు నిత్యనరకంగా మారుతోంది. గత రెండు రోజులుగా ఈ మార్గంలో ట్రాఫిక్ జామ్ కావడంతో వాహన చోదకులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వీఐపీలు బయటకు వచ్చినప్పుడు కనీస సమాచారం ఇవ్వకుండా ట్రాఫిక్ పోలీసులు ఎక్కడికక్కడ వాహనాలను నిలిపి వేస్తుండటంతో హైదరాబాదీలు ఇక్కట్ల పాలవుతున్నారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో బేగంపేట ఫ్లై ఓవర్ నుంచి పంజాగుట్ట వరకు ట్రాఫిక్ స్తంభించింది. గురువారం కూడా ఇదే సీన్ రిపీటయింది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ప్యారడైజ్ నుంచి బేగంపేట వరకు గంటల తరబడి ట్రాఫిక్ జామయింది. ఇక బంజారాహిల్స్ రోడ్ నంబరు 1, 3లతో పాటు పంజాగుట్ట ఫ్లైఓవర్‌పై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అంబులెన్స్‌లు వెళ్లడానికి కూడా అవకాశం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. సహనం కోల్పోయిన వాహనదారులు పలుచోట్ల ట్రాఫిక్ పోలీసులతో వాదనలకు దిగారు. కనీసం సమాచారం ఇవ్వకుండా ట్రాఫిక్ నిలిపివేయడం సరికాదని భాగ్యనగర వాసులు మండిపడుతున్నారు. మామూలుగానే బేగంపేట మార్గంలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. బేగంపేట ఫ్లైఓవర్ మీద ఏదైనా వాహనం ఆగిపోతే అంతే సంగతులు. గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకోవాల్సిందే. ఇక ప్రముఖుల రాకపోకల సమయంలోనూ వాహనాలను నియంత్రించడం వల్ల ట్రాఫిక్‌కు త్రీవ అంతరాయం కలుగుతోంది. అయితే వీఐపీలు రావడానికి చాలా సమయం ముందే పోలీసులు వాహనాలను నిలిపివేస్తున్నారని చోదకులు ఆరోపిస్తున్నారు. వీఐపీలు వెళ్లడానికి కొద్ది సమయం ముందు వాహనాలను నియంత్రిస్తే ట్రాఫిక్ ఎక్కువగా జామ్ అయ్యే అవకాశం ఉండదని అంటున్నారు. ట్రాఫిక్ కష్టాలు ఎప్పటికీ తీరతాయోనని ఈ మార్గంలో ప్రయాణించే వారు వాపోతున్నారు. చదవండి: ఆర్టీసీ బస్సు వెనక చక్రాల కింద పడి గర్భిణి మృతి 22 రెగ్యులర్ రైళ్లకు పచ్చజెండా -
కూకట్పల్లి నుంచి కోకాపేటకు లైట్ ట్రైన్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ రహదారులపై ఇక రైలు కూతలు వినిపించనున్నాయి. బస్సు ప్రయాణం మాదిరిగానే రోడ్డుపైనా ఏర్పాటు చేసే ట్రాక్‌ల మీదుగా వచ్చే లైట్ ట్రైన్‌ను ఎక్కేసి ఎంచక్కా అనుకున్న సమయానికే గమ్యం చేరుకునే ‘లైట్ ట్రైన్ రైల్ ట్రాన్సిట్ సిస్టమ్’నెలకొల్పే దిశగా అడుగులు పడుతున్నాయి. కేపీహెచ్‌బీలోని జేఎన్టీయూ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మీదుగా ఔటర్ రింగ్ రోడ్డు వైపు నుంచి కోకాపేట వరకు ఈ సేవలు అందుబాటులోకి తీసుకురావడంపై హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థకు అనుబంధమైన యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్టేషన్ అథారిటీ (ఉమ్టా) అధ్యయనం చేస్తోంది. దాదాపు 28 కిలోమీటర్ల మేర నిర్మించనున్న ఈ ప్రాజెక్టు సా«ధ్యాసాధ్యాలపై కసరత్తు చేస్తోంది. గత మూడు నెలల నుంచి దీనిపై అధ్యయనం చేస్తున్న సిబ్బంది సాధ్యమైనంత తొందర్లోనే ఆ నివేదికను ప్రభుత్వానికి అందజేయనుంది. ఉపయోగాలేంటంటే.. నగరంలో మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చినా మెట్లెక్కి పైకెళ్లి టికెట్ తీసుకొని ఆ రైలు ఎక్కాలంటే దాదాపు 10 నుంచి 15 నిమిషాల సమయం పడుతుంది. అదే లైట్ ట్రైన్ సేవలు అందుబాటులోకి వస్తే నేరుగా రహదారిపై బస్సులు ఎక్కినట్టుగానే ప్రయాణికులు ఆయా స్టాప్ల వద్ద టికెట్లు తీసుకొని రైలు రాగానే ఎక్కేయొచ్చు. బస్సు మాదిరిగానే వీటికి స్టాప్‌లు ఉండటంతో గమ్యస్థానంలో అనుకున్న సమయానికి దిగేయవచ్చు. ముఖ్యంగా నగరవాసుల సమయం మరింత ఆదా కానుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ట్రాఫిక్ తిప్పలుండవు.. అలాగే ఈ సేవల వల్ల కాలుష్యం తగ్గుతుంది. ఆయా మార్గాల్లో ఉన్న ఆస్తుల విలువ పెరగడంతో పాటు ఆర్థిక కార్యకలాపాలు మరింత ఊపందుకునే ఆస్కారముంటుంది. దీంతో పాటు పేదలు కూడా ఎక్కేలా తక్కువ చార్జీలకే ఈ సేవలు అందుబాటు లో ఉండే అవకాశముంది. ఇటు పర్యాటకంగా మరింత అభివృద్ధి బాటలు పట్టే చాన్స్ ఉంది. ఏయే మార్గాల్లో...? ఐటీ కారిడార్‌కు నెలవైన ప్రాంతాల్లో ఈ లైట్ ట్రైన్ సేవల దిశగా ఉమ్టా సిబ్బంది అధ్యయనం చేస్తోంది. కేపీహెచ్‌బీ నుంచి హైటెక్ సిటీ, రాయదుర్గం, బయోడైవర్సిటీ, గచ్చిబౌలి, విప్రో సర్కిల్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఓఆర్ఆర్ మీద నుంచి కోకాపేట వరకు ఈ రవాణా మార్గం అనువుగా ఉన్నట్టుగా గుర్తించారు. దాదాపు 28 కిలోమీటర్ల మేర ఉన్న ఈ రహదారి కుడివైపున మీటర్ గేజ్ ఏర్పాటు చేసి బ్యాటరీ ఆపరేటింగ్ లేదంటే విద్యుత్ సరఫరాతో ఈ రైలును నడపనున్నారు. దాదాపు 150 నుంచి 200 మంది ప్రయాణికులు ఈ రైలులో ఎక్కి హ్యాపీగా జర్నీ చేయవచ్చని అధికారులు అంటున్నారు. బస్సులు, ఇతర వాహనాల మాదిరిగానే రోడ్డుపై లైట్ ట్రైన్ వెళ్తుందని, ఈ సే వలు అందుబాటులోకి వస్తే విశ్వనగరంగా హైదరాబాద్‌కు మరింత ప్రతిష్ట పెరుగుతుందని చెబుతున్నారు. చదవండి: స్టాఫ్‌నర్స్ పోస్టుల వెయిటేజీలో అవకతవకలు నా వ్యాఖ్యల్ని వక్రీకరించారు: మేయర్ -
బెంగళూరు తరహాలో పార్కింగ్ పాలసీ 2.o బెటరేమో!
హైదరాబాద్: ప్రస్తుతం నగరంలో వాహనాల సంఖ్య 70 లక్షలు దాటింది. వాటిలో 80 శాతం వ్యక్తిగత వాహనాలే. గతంలో ప్రతిరోజూ 600 చొప్పున కొత్త వాహనాలు రోడ్డెక్కేవి. అయితే కరోనా ప్రభావం, లాక్డౌన్ తదనంతర పరిస్థితుల నేపథ్యంలో ఈ సంఖ్య 1,500 దాటింది. ఒకప్పుడు ఇంటికి ఒక వాహనం చొప్పున ఉండేవి. అయితే ప్రస్తుతం ప్రతి ఇంటికి/ఫ్లాట్‌కు కనిష్టంగా రెండు ద్విచక్రవాహనాలు, కుటుంబానికి ఒక కారు చొప్పున ఉంటున్నాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వంటి సంపన్నులు ఉండే ప్రాంతాలతోపాటు మరికొన్ని చోట్ల కుటుంబంలో ఒక్కోక్కరికీ ఒక్కో కారు ఉంటోంది. కానీ వాహనాలకు సరిపడా స్థాయిలో పార్కింగ్ స్పేస్ మాత్రం వారి ఇళ్లలో అందుబాటులో ఉండట్లేదు. దీంతో ఆయా వాహనాలను ఇళ్ల ముందుండే పబ్లిక్ ప్లేస్ లేదా రోడ్డే పార్కింగ్ ఏరియాగా మారిపోతోంది. ఈ సమస్య నానాటికీ తీవ్రమవుతూ వస్తోంది. కాగితాల్లోనే పార్కింగ్ ప్లేస్‌లు... కమర్షియల్ భవనాలు, అపార్ట్‌మెంట్స్‌లో ఉన్న పార్కింగ్ ప్లేస్‌లు కేవలం నో అబ్జక్షన్ సర్టిఫికెట్, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ పొందే వరకే అందుబాటులో ఉంటున్నాయి. ఆ తర్వాత వాటి రూపురేఖలు పూర్తిగా మారిపోతున్నాయి. అపార్ట్‌మెంట్స్‌లో ఫ్లాట్‌కు ఒక వాహనానికే పార్కింగ్ ఉంటుండగా... ఆ కుటుంబానికి రెండు మూడు వెహికల్స్ వచ్చి చేరుతున్నాయి. మిగిలిన ప్రాంతంలోనూ వాచ్‌మన్ గది, స్టోర్ రూమ్స్, అసోసియేషన్ రూమ్స్ తదితరాలు వచ్చి చేరుతున్నాయి. వాణిజ్య భవనాల్లో ఉన్న సెల్లార్ పార్కింగ్ ఏరియాల్లో కొత్త దుకాణాలు పుట్టుకువస్తున్నాయి. ఫలితంగా వాటిల్లో ఉండాల్సినవాహనాలు ఫుట్‌పాత్‌లపైకి, రోడ్డు మీదకు వస్తున్నాయి. బెంగళూరులో వినూత్న విధానం... కాలనీల్లో ఇదే తరహా పార్కింగ్ సమస్యను ఎదుర్కొంటున్న బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ కొత్త పార్కింగ్ పాలసీ 2.0ను అ మలులోకి తెస్తోంది. దీని ప్రకారం ఆన్ స్ట్రీట్ పార్కింగ్‌కు రేట్లు నిర్దేశించింది. నెలకు చిన్న కార్లకు రూ. వెయ్యి, మధ్య తరహా కార్లకు రూ. 3 వేలు, ఎంయూవీ/ఎస్‌యూవీలకు రూ. 4వేలు, మిగిలిన వాటికి రూ. 5వేలు చొప్పున చార్జీలు నిర్దేశించింది. ఈ రేట్లు కమర్షియల్ వాహనాలకు వర్తించవు. వ్యక్తిగత వాహనాలకూ త్రైమాసికం, వార్షికం చొప్పున చెల్లించి ఇళ్లు, అపార్ట్మెంట్ల ముందు పార్కింగ్ ప్లేస్ పొందవచ్చు. అయితే ఇలా అనుమతి తీసుకున్న వారు సైతం నిర్దేశించిన ప్రాంతం, సమయాల్లోనే వాహనాలను పార్క్ చేయాల్సి ఉంటుంది. వచ్చే నెల నుంచి ఈ విధానం అమలుకానుంది. ముందుకు సాగని కసరత్తు... రాజధానిలో పార్కింగ్ ఇబ్బందులు తీర్చడానికి ప్రభుత్వం, పోలీసు విభాగం 2018లోనే కసరత్తు చేసింది. ప్రత్యేక పార్కింగ్ పాలసీలు అమలులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరిగాయి. వాటికి సంబంధించి జీవోలు వచ్చినా ఫలితాలు రాలేదు. కాలనీలతోపాటు వాణిజ్య ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ స్థలాలను గుర్తించడంతోపాటు ప్రైవేటు స్థలాలను సేకరించి వర్టికల్ పార్కింగ్ ఏరియాలు ఏర్పాటు చేయాలని భావించారు. వాటిని నిర్మించడానికి బీఓటీ పద్ధతిలో రెండుసార్లు టెండర్లు ఆహ్వానించగా కొన్ని సంస్థలు తొలుత ముందుకొచ్చాయి. కానీ ఆయా స్థలాల్లో వర్టికల్ పార్కింగ్స్‌ను ప్రభుత్వం నిర్మించి ఇస్తే తాము లీజుకు తీసుకొని నిర్వహిస్తామని లేదా తాము నిర్మించిన ప్రాంతాల్లో అక్రమ పార్కింగ్‌పై చలాన్లు జారీ చేసి జరిమానాలు వసూలు చేసుకొనే అవకాశం ఇవ్వాలని షరతు పెట్టా యి. ఇందుకు ప్రభుత్వం అంగీకరించకపోవడంతో ఇప్పటికీ ఈ సమస్యకు పరిష్కారం కనిపించట్లేదు. -
రోడ్లపై వాహన వరద!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రహదారులపై వాహన వరద పారుతోంది.. రోడ్లపై హారన్ సౌండ్ చేయనిదే బండ్లు ముందుకు నడిచే పరిస్థితి కనిపించటం లేదు.. 7 నెలల్లో కొత్తగా 4.39 లక్షల ద్విచక్ర వాహనాలు, 89 వేల కార్లు.. ఇటు సెకండ్ హ్యాండ్‌వి 2.52 లక్షల వాహనాలు.. వీటికి తోడు అప్పటికే ఇళ్లలో ఉన్న సొంత వాహనాలు.. మొత్తం అన్నీ రోడ్లపైకి పోటెత్తాయి.. దీంతో ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్‌లు, కి.మీ.ల కొద్దీ వాహనాల బారులే దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా జంట నగరాలు లాక్‌డౌన్‌కు ముందుకంటే ఎక్కువ ట్రాఫిక్ సమస్యతో ఇప్పుడు సతమతమవుతున్నాయి. 10 కి.మీ. ప్రయాణానికే పీక్ అవర్స్‌లో గంటన్నర సమయం పడుతోంది. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ తెచ్చిన మార్పులెన్నో.. ఈ వాహన వరద కూడా దాని ప్రభావమే..! వ్యక్తిగత వాహనాలు సురక్షితమని.. కోవిడ్ అనగానే భౌతిక దూరం ముందుగా గుర్తుకొస్తుంది. బహిరంగ ప్రదేశాల్లో మనిషికి మనిషికి మధ్య దూరం లాక్డౌన్ సమయంలో మరింత ఎక్కువగా ఉండేది. అప్పట్లో కోవిడ్ అంటే కనిపించిన భయం అంతా ఇంతా కాదు. దీంతో భౌతిక దూరం పాటించే ఉద్దేశంతో ప్రయాణాల్లో వ్యక్తిగత వాహనాల వినియోగంపై జనం దృష్టి సారించారు. అలా వాటి వరద మొదలైంది. ఆ తర్వాత క్రమంగా కోవిడ్ భయం మటుమాయమైంది. ప్రస్తుతం మాస్క్ వాడేవాళ్ల సంఖ్య కూడా తక్కువైపోతోంది. ఇక వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి రావటంతో జనంలో ఆ మహమ్మారి భయం దాదాపు తుడిచిపెట్టుకుపోయింది. బజార్లలో భౌతిక దూరం ఊసే లేదు. పెళ్లిళ్లు, పేరంటాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. మరి భయం పూర్తిగా మటుమాయమైనా.. భౌతికదూరం కోసం వ్యక్తిగత వాహనాల వినియోగానికి అలవాటు పడ్డ జనం మాత్రం వెనక్కు రావటం లేదు. లాక్డౌన్లో మొదలైన వ్యక్తిగత వాహన వినియోగం ఇంకా కొనసాగటమే కాదు, మరింతగా పెరుగుతోంది. బస్సెక్కేందుకు ససేమిరా.. లాక్డౌన్ సమయంలో 2 నెలల పాటు బస్సులు తిరగలేదు. ఆ తర్వాత అవి క్రమంగా రోడ్డెక్కాయి. కానీ జనం మాత్రం బస్కెక్కేందుకు ససేమిరా అంటున్నారు. 2 నెలల క్రితం వరకు కూడా 50 శాతం లోపే ఉన్న ఆక్యుపెన్సీ రేషియో అతికష్టమ్మీద 65కు చేరుకుంది. ఎప్పుడూ ఫుట్‌బోర్డుపై జనం వేళ్లాడుతుండటంతో ఓ పక్కకు ఒరిగినట్టుగా పరుగుపెట్టే సిటీ బస్సులు.. ఇప్పుడు సగం సీట్లు ఖాళీగానే ఉండి నీరసంగా నడుస్తున్నాయి. ఇటు జనం దెబ్బకు ఏసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దూరపట్టణాలకు తిరిగే ఏసీ బస్సుల్లో కూడా ఆక్యుపెన్సీ రేషియో 50 శాతానికి కూడా చేరుకోలేదు. ఇందులో కొంత కోవిడ్ భయమున్నా.. సొంత వాహనాలకు అలవాటు పడటమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఆ రెండు నెలలే డల్.. లాక్డౌన్ వల్ల ఉపాధికి ఇబ్బందైందని, ఆదాయం బాగా తగ్గిందని చెప్పేవాళ్లే ఎక్కువ.. అలాంటప్పుడు వాహనాల విక్రయాలు బాగా పడిపోవాలి. కానీ అలా జరగలేదు. లాక్డౌన్లో 2 నెలలు మినహా మిగతా నెలల్లో వాహనాలు మామూలుగానే అమ్ముడయ్యాయి. గత రెండు నెలల గణాంకాలు పరిశీలిస్తే.. గతేడాది అదే నెలల కంటే ఎక్కువగా అమ్ముడవటం విశేషం. గత 7 నెలల్లో రాష్ట్రంలో 4.40 ద్విచక్రవాహనాలు అమ్ముడయ్యాయి. ఏడాది ముందు ఇదే సమయంలో 4.68 లక్షలు విక్రయమయ్యాయి. తేడా స్వల్పమే. ఇక.. 2019 నవంబర్‌లో రాష్ట్రంలో 72 వేల ద్విచక్రవాహనాలు అమ్ముడైతే గత నవంబర్‌లో అది 75 వేలుగా ఉంది. 2019 డిసెంబర్లో 52 వేలు అమ్ముడైతే గతేడాది డిసెంబర్లో 53 వేలు అమ్ముడయ్యాయి. ఇక గత 7 నెలల్లో రాష్ట్రంలో 89,345 కార్లు అమ్ముడయ్యాయి. 2019లో ఈ సంఖ్య 89,837గా ఉంది. 2019 నవంబర్‌లో 12,045 కార్లు అమ్మితే గత నవంబర్‌లో 13,852 అమ్ముడయ్యాయి. 2019 డిసెంబర్లో 17,135 అమ్మితే, గత డిసెంబర్లో 17,506 విక్రయమయ్యాయి. లాక్డౌన్ ప్రభావం తగ్గి ఆర్థికంగా పుంజుకుంటుండటంతో సొంత వాహనాలు కొనుగోలు గతం కంటే పెరుగుతోందని అర్థమవుతోంది. పెరిగిన సెకండ్ హ్యాండ్ వాహనాల విక్రయం.. కొత్త వాహనాలు అంతకుముందు సంవత్సరంలాగే అమ్ముడవుతుండగా, సెకండ్‌హ్యాండ్ వాహనాలు మాత్రం గతంతో పోలిస్తే బాగా పెరిగాయి. 2019లో జూలై నుంచి డిసెంబర్ వరకు 1.10 లక్షల ద్విచక్రవాహనాలు చేతులు మారగా, 2020లో అదే సమయంలో ఏకంగా 1,51,877 అమ్ముడయ్యాయి. అదే కార్ల విషయంలో ఆ సంఖ్య 77 వేలు కాగా, గతేడాది 99,807గా ఉండటం విశేషం. లాక్డౌన్ వల్ల ఏర్పడ్డ ఆర్థిక ఇబ్బందులతో కొత్త వాహనాలు కొనలేని వారు ఎక్కువగా సెకండ్ హ్యాండ్ వాహనాలను కొనేందుకు మొగ్గుచూపారు. అయితే వర్క్ ఫ్రం హోమ్ అమలులో ఉండటం, విద్యాసంస్థలు ఇంకా ప్రారంభం కాకపోవటం వల్ల వాహనాల రద్దీ తక్కువగా ఉండాలి. కానీ అంతకుముందు కంటే పెరగటం గమనార్హం.. ఆర్టీసీ అధ్యయనంలో ఇలా.. నగరంలో సిటీ బస్సులు తిరిగే మార్గాల్లో కొన్నింటిలో బస్సులు నిరంతరం రద్దీగా ఉంటాయి. జియాగూడ, ఎల్బీనగర్, రామంతాపూర్, పటాన్చెరు.. తదితర రూట్లు బాగా బిజీగా ఉంటాయి. నగర రోడ్లపై రద్దీ విపరీతంగా ఉన్న ప్రస్తుత తరుణంలో ఈ రూట్లలో తిరిగే సిటీ బస్సులు పూర్తిగా వెలవెలబోతున్నాయి. దీనిపై తాజాగా ఆర్టీసీ అధికారులు ఓ పరిశీలన జరిపారు. గతంతో పోలిస్తే ఈ మార్గాల్లో బస్సులకు ద్విచక్ర వాహనాలు, కార్లు ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నాయని డ్రైవర్లు గుర్తించారు. అంటే వాటి సంఖ్య బాగా పెరిగిందన్నది వారి మాట. అదే సమయంలో ఆక్యుపెన్సీ రేషియో సగానికి తక్కువగా ఉంది. రోడ్లపై వాహనాలు పెరిగాయి, బస్సుల్లో జనం తగ్గారు. వెరసి నగర రోడ్లపై వ్యక్తిగత వాహనాలు బాగా పెరిగాయని ఆర్టీసీ గుర్తించింది. సిటీ బస్సులు మొదలై ఇన్ని నెలలైనా ఆక్యుపెన్సీ రేషియో పెరగకపోవటానికి ఇదే కారణమని వారు ఉన్నతాధికారులకు ఓ రిపోర్టు సమర్పించారు. ఢిల్లీ తరహా ముప్పు వాటిల్లుతుంది.. ‘కొన్ని రోజులుగా రోడ్లపై వాహనాల సంఖ్య బాగా పెరిగింది. కోవిడ్ భయంతో ఇలా జనం తాత్కాలికంగా సొంత వాహనాలు వాడుతున్నారని సరిపెట్టుకుంటే మాత్రం ఇది పెద్ద ప్రమాదంగా మారుతుంది. ప్రభుత్వం వెంటనే దృష్టి పెట్టాలి. లేకుంటే ఢిల్లీ తరహా సమస్య మనల్ని చుట్టుముడుతుంది. ఒకసారి జనం సొంత వాహనమే మేలన్న అభిప్రాయంలోకి వస్తే ప్రజారవాణావైపు మళ్లటం కష్టమవుతుంది. కోవిడ్ భయం పోగానే ప్రజా రవాణా కిక్కిరిసిపోయేలా చేయాలి. లేకుంటే భూమి నుంచి ఎత్తుకుపోయే కొద్ది చల్లబడాల్సిన వాతావరణం వేడిగా మారుతుంది. పదో అంతస్తువారు కూడా నేలపై ఉన్న వేడినే అనుభూతి పొందుతారు. అది కాలుష్యం వాతావరణంలో పొరలా మారటంతో ఏర్పడే సమస్య. అది ఏర్పడిందంటే జనం ఆరోగ్యం దెబ్బతినే పరిస్థితి వచ్చిందని అర్థం చేసుకోవాలి. అక్కడి దాకా సమస్యను రానీయకూడదు’ – జీవానందరెడ్డి, పర్యావరణ వేత్త రోజుకు 200 కి.మీ. బండిపైనే.. మా గ్రామం నుంచి హైదరాబాద్ 90 కి.మీ. దూరంలో ఉంటుంది. నేను ఆర్గానిక్ ఫుడ్‌కు సంబంధించి ఓ సంస్థ మార్కెటింగ్ విభాగంలో పనిచేస్తున్నాను. రోజూ బైక్‌పై వచ్చి వెళ్తున్నాను. అంతకుముందు బస్సుల్లో వచ్చే వాడిని లాక్‌డౌన్‌నుంచి బైక్‌పైనే వస్తున్నా.. – ఐలి గణేశ్‌కుమార్, రసూలాబాద్, సిద్దిపేట జిల్లా నెల ద్విచక్ర వాహనాలు కార్లు 2019 2020 2019 2020 జూన్ 67,869 67,562 11,652 8,364 జూలై 64,338 55,783 9,772 9,326 ఆగస్టు 60,557 56,290 11,104 10,575 సెప్టెంబర్ 47,042 53,303 9,314 11,322 అక్టోబర్ 1,03,430 77,273 18,815 18,400 నవంబర్ 72,464 75,673 12,045 13,852 డిసెంబర్ 52,385 53,304 17,135 17,506 మొత్తం 4,68,085 4,39,188 89,837 89,345 -
బాలానగర్ ఫ్లైఓవర్ పనులకు బ్రేక్
సాక్షి, సిటీబ్యూరో: నగరవాసుల ట్రాఫిక్ కష్టాలను తీర్చే బాలానగర్ ఫ్లైఓవర్ పనులకు కరోనా కారణంగా బ్రేక్ పడింది. పనులకు ఆదిలో ఆస్తుల సేకరణతో ఆలస్యం కాగా.. లాక్డౌన్ నేపథ్యంలో పనులు వేగిరంగా సాగాయి. ప్రస్తుతం సిబ్బందిని కరోనా వెంటాడుతోంది. పనులు చేస్తున్న బీఎస్సీపీఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, ప్రాజెక్ట్ మేనేజర్, కిందిస్థాయి సిబ్బందితో పాటు దాదాపు 10 మందికిపైగా కోవిడ్ నిర్ధారణ అయినట్లు సమాచారం. దీంతో పనుల్లో వేగిరం తగ్గింది. మిగిలిన 40 మందిలోనూ కలవరం మొదలవడంతో వారికి కూడా కరోనా టెస్టులు చేస్తున్నారు. అక్టోబర్ నాటికి ఫ్లైఓవర్ పనులు పూర్తి కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మరింత ఆలస్యమయ్యే పరిస్థితి నెలకొంది. . కొనసాగుతున్న స్లాబ్ వర్క్.. బాలానగర్‌లోని శోభనా థియేటర్ నుంచి ఐడీపీఎల్ వరకు 1.13 కిలోమీటర్ల మేర ఆరు లేన్ల ఫైఓవర్ నిర్మాణానికి హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) రూ.387 కోట్లు కేటాయించింది. ఆస్తుల సేకరణకు రూ.265 కోట్లు, నిర్మాణానికి రూ.122 కోట్లు వ్యయం చేస్తోంది. 2017 ఆగస్టు 21న ఫ్లైఓవర్ పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. దాదాపు రెండేళ్లకుపైగా ఆస్తుల సేకరణ జరగడంతో ఆ తర్వాత ఇంజినీరింగ్ పనులు మొదలయ్యాయి. ఇటీవల లాక్డౌన్ కాలంలో కమిషనర్ అర్వింద్‌కుమార్ ఆదేశాల మేరకు పనుల్లో వేగిరం పెంచారు. మొత్తం 26 పిల్లర్ల నిర్మాణం పూర్తయ్యింది. మూడు స్లాబ్‌లు పూర్తి చేశారు. మిగిలిన పనులు కొనసాగుతున్న క్రమంలోనే కాంట్రాక్ట్ చేపట్టిన కంపెనీ సిబ్బందికి కరోనా రావడంతో మిగిలినవారిలో అలజడి మొదలైంది. దీనిపై హెచ్ఎండీఏ ఇంజినీరింగ్ విభాగం అధికారులు మాట్లాడుతూ.. కొంతమంది సిబ్బందికి కరోనా వచ్చినట్టుగా తెలిపారు. అక్టోబర్ ఆఖరునాటికి ఫ్లైఓవర్ పనులు పూర్తి చేయాల్సి ఉందన్నారు. -
ఆగండి.. చూడండి.. వెళ్లండి
జీహెచ్ఎంసీ, పోలీసు విభాగాల సమన్వయంతో కాంట్రాక్టు ప్రక్రియ త్వరలో పూర్తి కానుంది. వాహనాల కోసం ట్రాఫిక్ సిగ్నల్స్‌తో పాటు పాదచారులు రోడ్డు దాటేందుకు సదుపాయంగా 104 ప్రాంతాల్లో పెలికాన్ సిగ్నల్స్ కూడా ఏర్పాటు చేయనున్నారు. స్టడీ, డిజైన్, సప్లై ఏర్పాటు, నిర్వహణలన్నీ కాంట్రాక్టు సంస్థే చేయాల్సిఉంటుంది. మూడేళ్ల కాలానికి నిర్వహణతోసహా అంచనా వ్యయం దాదాపు రూ.60 కోట్లు. సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లోని మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్ సజావుగా సాగేందుకు త్వరలో కొత్తగా అడాప్టివ్ ట్రాఫిక్ సిగ్నల్ కంట్రోల్ సిస్టమ్ (ఏటీఎస్సీ)తో జంక్షన్లలోని సిగ్నళ్లను నిర్వహించనున్నారు. ప్రస్తుతం గ్రేటర్‌లోని జంక్షన్ల వద్ద ట్రాఫిక్ సిగ్నల్స్ నిర్వహిస్తున్న సంస్థ కాంట్రాక్టు వచ్చే ఆగస్ట్ నెలతో ముగియనుండటంతోఇప్పటికే ఉన్న 231 జంక్షన్ల నిర్వహణతో పాటు కొత్తగా మరో 150 జంక్షన్లలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు, నిర్వహణ బాధ్యతల కాంట్రాక్టు కోసం టెండర్లకు సంబంధించిన ప్రక్రియ మొదలైంది. రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్ఎఫ్పీ)గా ఆహ్వానించారు. సులువుగా ప్రయాణం.. రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్‌ను, భవిష్యత్ పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని సాఫీ ప్రయాణం కోసం ఆటోమేటిక్‌గా పనిచేసే ఏటీఎస్సీ సాంకేతికతతో వీటిని ఏర్పాటు చేయనున్నారు. కొత్తగా ఏర్పాటు చేసే ట్రాఫిక్ సిగ్నళ్లు అల్ఫా న్యూమరిక్ టైమర్లను కలిగి ఉంటాయి. ట్రాఫిక్ సెంట్రల్ కమాండ్ సెంటర్ (టీసీసీసీ) నుంచి వీటిని పర్యవేక్షిస్తారు. ట్రాఫిక్‌కు సంబంధించిన సమాచారం తదితర విషయాలను తెలియజేసే ఏర్పాట్లు కూడా ఈ విధానంలో ఉంటాయి. ఒక సమయంలో ఒక కారిడార్‌లో ఉండే అన్ని జంక్షన్ల వద్ద కూడా రెడ్ లేదా గ్రీన్ లైట్ మాత్రమే ఉండే ఏర్పాట్లు సైతం కొత్త విధానంలో ఉంటాయని సమాచారం. తద్వారా ఒక కారిడార్‌లో ఒక జంక్షన్ దాటగానే దగ్గరలోని మరో జంక్షన్ వద్ద ఆగిపోకుండా వెళ్లేందుకు వీలవుతుంది. 24 గంటల పాటు పనిచేసే హెల్ప్‌డెస్క్ కూడా ఉంటుంది. భువనేశ్వర్ తదితర నగరాల్లో ఈ విధానం ఉంది. ఏటీఎస్సీతో ప్రయోజనాలు.. ♦ టీసీసీసీ నుంచే ప్రతి సిగ్నల్ పనితీరును పర్యవేక్షించవచ్చు. ♦ ఏవైనా లోటుపాట్లున్నా, పనిచేయకున్నా తెలుసుకోవచ్చు. ♦ ట్రాఫిక్ సిగ్నల్ నిర్వహణ సామర్థ్యం పెరుగుతుంది. ♦ సందర్భాన్ని బట్టి ట్రాఫిక్ పరిస్థితులపై వాహనదారులకు సమాచారం ♦ రహదారుల ప్రమాదాల నివారణ ♦ రియల్ టైమ్‌తో ట్రాఫిక్ రద్దీ విశ్లేషణ ♦ ప్రయాణ భద్రత మెరుగు. ఇతరత్రా పనులతో సహా కొత్తగా కాంట్రాక్టు దక్కించుకునే సంస్థ చేయాల్సిన పనులు ♦ ప్రస్తుతం ఉన్న 231 జంక్షన్లలో ట్రాఫిక్ సిగ్నళ్ల నిర్వహణ ♦ 3 పాదచారుల సిగ్నల్స్ ఆపరేషన్, నిర్వహణ ♦ 17 వేరియబుల్ మెసేజ్ బోర్డుల నిర్వహణ ♦ 150 జంక్షన్లలో కొత్త సిగ్నళ్ల ఏర్పాటు, నిర్వహణ ♦ 104 పెలికాన్ సిగ్నళ్ల ఏర్పాటు, నిర్వహణ ♦ అన్నీ కలిపి యూనిఫైడ్ సిగ్నల్ సిస్టమ్‌గా వ్యవహరిస్తారు. -
22న విజయవాడలో ట్రాఫిక్ మళ్లింపు
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనమహోత్సవం కార్యక్రమాన్ని 22న జూపూడిలో నిర్వహించనున్నారు. కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరుకానున్న దృష్ట్యా విజయవాడ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ రవిచంద్ర తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. బుధవారం ఉదయం 8 గంటల నుంచి 11.30 వరకు ట్రాఫిక్‌ను దారిమళ్లిస్తున్నాం. విశాఖపట్నం నుంచి నగరంలోకి వచ్చే భారీ వాహనాలు, లారీలను హనుమాన్ జంక్షన్ వద్ద నిలిపివేస్తాం. హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలను నందిగామలో నిలిపివేస్తాం. చెన్నై నుంచి వచ్చే వాహనాలను గుంటూరులో నిలిపివేయనున్నట్లు ట్రాఫిక్ డీసీపీ రవిచంద్ర పేర్కొన్నారు. (అమూల్ కంపెనీతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం) -
ముందుకు సాగని ‘మూడో దారి’
సాక్షి, సిటీబ్యూరో: ‘గ్రేటర్’ వ్యాప్తంగా ఎక్కడిక్కడ కొత్త మార్గాల అభివృద్ధి, అండర్‌పాస్‌లు, ఫ్లైఓవర్ల నిర్మాణం జరుగుతోంది. పూర్తయిన వాటిని ఎప్పటికప్పుడు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. అయితే ఏళ్ళుగా మలక్‌పేట్ రైల్వే బ్రిడ్జ్ వద్ద మూడో అండర్ పాస్ కట్టాలనే ప్రతిపాదనలకు మాత్రం మోక్షం లభించట్లేదు. ఫలితంగా ఈ మార్గంలో ప్రయాణించే వాహనచోదకులు అనునిత్యం నరకం చవి చూస్తున్నారు. సిటీ బస్సులు నడవని, ‘కరోన ఫీవర్’ తీవ్రంగా ఉన్న ఈ రోజుల్లోనే ట్రాఫిక్ జామ్స్ అవుతున్నాయంటే... రేపు సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత పరిస్థితి వేరుగా చెప్పక్కర్లేదు. ‘డైనమిక్’గా వాడుకోవచ్చని భావించారు... ప్రస్తుతం మలక్‌పేట రైల్ వంతెన వద్ద ఉన్న రెండు మార్గాలను ఒకటి చాదర్‌ఘాట్ వైపు, మరోటి మలక్పట వైపు వెళ్ళే వాహనాల కోసం వినియోగిస్తున్నారు. మూడో మార్గం అందుబాటులోకి వస్తే దాంతో సహా అన్నింటినీ డైనమిక్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్‌గా పిలిచే రివర్సబుల్ లైన్ ట్రాఫిక్ మెథడ్‌లో వినియోగించుకోవచ్చని అధికారులు భావిస్తున్నారు. దీనిప్రకారం ఓ మార్గాన్ని పూర్తి స్థాయిలో వన్ వేగా మార్చకుండా... రద్దీని బట్టి ఆయా సమయాల్లో వన్‌వేగా చేస్తుంటారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పీక్ అవర్స్‌లో వన్‌వేగా ఉన్న మార్గం ఆపై టూ వేగా మారిపోతుంది. తిరిగి సాయంత్రం పీక్ అవర్స్ ప్రారంభమైనప్పు ఉదయం నడిచిన దిశకు వ్యతిరేకంగా వన్‌వేగా మారుతుంది. ఇలా చేయడం ద్వారా రద్దీని తట్టుకోవడంతో పాటు ఒకే మార్గాన్ని వివిధ రకాలుగా వినియోగించుకునే అవకాశం ఉంటుందని భావించారు. ఈ వన్‌వేలు, వాటి సమయాలపై పూర్తి స్థాయి ప్రచారం కల్పిండంతో ప్రతి వాహనచోదకుడికీ అవగాహన కల్పిస్తే ఫలితాలుంటాయని అంచనా వేశారు. హెచ్ఎంఆర్ అప్పట్లో ముందుకు వచ్చినా... మలక్‌పేట రైలు వంతెన సమీపంలో వాహనాల కోసం మరో అండర్ పాస్ ఏర్పాటుకు సహకరించడానికి అప్పట్లో హైదరాబాద్ మెట్రో రైల్ (హెచ్ఎంఆర్) ముందుకు వచ్చింది. ఈ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రైల్వే శాఖ ప్రారంభించడానికి ముందే రూ.10 కోట్లు డిపాజిట్ చేయాలని షరతు పెట్టింది. దాదాపు రెండేళ్ళ క్రితం జీహెచ్ఎంసీ కార్యాలయంలో బల్దియా నేతృత్వంలో జరిగిన వివిధ శాఖల ఉమ్మడి కమిటీ సమావేశంలో ఈ కీలక నిర్ణయాన్ని హెచ్ఎంఆర్ ప్రకటించింది. ఇప్పటికీ మోక్షం లభించలేదు. మూసీ వెంట మార్గాన్నీఅన్వేషించినా... మరోపక్క మలక్‌పేట సమీపంలో ఉన్న మూసీ నది వెంబడి మరో రహదారి అభివృద్ధి చేస్తే ఉపయుక్తంగా ఉంటుందని ట్రాఫిక్ అధికారులు తమ అధ్యయనంలో గుర్తించారు. చాదర్‌ఘాట్ కాజ్వే దాటిన తర్వాత మూసీ వెంట ప్రస్తుతం ఓ మార్గం ఉంది. ఇది ఓల్డ్ మలక్‌పేట మీదుగా వెళ్తుంది. అయితే అనేక చోట్ల పూర్తిస్థాయిలో నిర్మాణం లేకపోవడంతో వాహనాల రాకపోకలకు అనువుగా లేదు. మరోపక్క ఈ రూట్‌ను అభివృద్ధి చేయాలంటే అనే చోట్ల అడ్డంగా ఉన్న హైటెన్షన్ వైర్లకూ పరిష్కారం కనుక్కోవాల్సి ఉంటుంది. దీన్ని వాహనచోదకులకు అందుబాటులోకి తీసుకువస్తే చాదర్‌ఘాట్ నుంచి మలక్‌పేట వెళ్ళాల్సిన అవసరం లేకుండా మూసరామ్‌బాగ్ సమీపంలోని అంబర్పేట్ కాజ్ వే వరకు ట్రాఫిక్‌ను మళ్ళించవచ్చు. ఫలితంగా ఇరుకుగా ఉన్న మలక్‌పేట రహదారిపై రద్దీ తగ్గుతుంది. ఈ మేరకు ట్రాఫిక్ పోలీసులు మూసీ రహదారి అభివృద్ధికి సంబంధించి ప్రతిపాదనలు రూపొందించి బల్దియాకు పంపాలని భావించారు. మలక్‌పేటలో మూడో అండర్ పాస్‌తో పాటు వీటికీ మోక్షం కలగకపోవడంతో వాహనచోదకుడిని నిత్యం నరకం తప్పట్లేదు. అత్యంత కీలక రహదారుల్లో ఒకటి... నగరంలోని అత్యంత కీలకమైన రహదారుల్లో దిల్సుఖ్నగర్–చాదర్‌ఘాట్ మధ్యలోనిది ప్రధానమైంది. ఈ రూట్లో నగరానికి చెందిన అంతర్గత వాహనాలే కాకుండా విజయవాడ వైపు వేళ్లేవీ నడుస్తుంటాయి. ఫలితంగా దాదాపు 24 గంటలూ ఈ మార్గం రద్దీగానే ఉంటుంది. మలక్‌పేట రైల్వేస్టేషన్ పక్కన ఉన్న రైలు వంతెన వద్ద ఉన్న బాటిల్ నెక్ ఈ రూట్లో తిరిగే వాహనచోదకులకు తీవ్రమైన ట్రాఫిక్ ఇబ్బందులు కలిగిస్తోంది. ఆ ప్రాంతంలో చాదర్‌ఘాట్ వైపు మెట్రో రైల్ స్టేషన్ కూడా రావడంతో పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. దీని ప్రభావంతో రద్దీ వేళల్లో అటు చాదర్‌ఘాట్ కాజ్ వే వరకు... ఇటు నల్లగొండ చౌరస్తా వరకు వాహనాలు బారులు తీరుతున్నాయి. ఈ మార్గాన్ని అనుసరించాలంటేనే వాహనచోదకులు హడలిపోతున్నారు. మలక్‌పేట రైల్వేస్టేషన్ పక్కనే ఉన్న రైలు వంతెన అటు–ఇటు ఉన్న రహదారి కంటే ఇరుకుగా ఉండటమే దీనికి ప్రధాన కారణం. ఆర్టీసీ బస్సుల రద్దీ ఎక్కువగా ఉండే పండుగల సీజన్లో నరకం చవిచూడాల్సిందే. -
కలకలం రేపిన జూబ్లీహిల్స్ యాక్సిడెంట్
సాక్షి, సిటీబ్యూరో: ట్రాఫిక్ చిక్కులు తగ్గించేందుకు... రైట్–లెఫ్ట్ రహదారుల్ని వేరు చేసేందుకు ఉద్దేశించిన డివైడర్లు ప్రస్తుతం నగర వాసులకు భయం పుట్టిస్తున్నాయి. వీటితో పాటు మధ్యలో ఏర్పాటు చేసిన సైన్బోర్డుల్లో కొన్ని ప్రమాదహేతువులుగా మారడంతో ఏటా అనేక మంది ప్రాణాలు కోల్పోవడంతోపాటు తీవ్రంగా గాయపడుతున్నారు. వీటి నిర్మాణంలో శాస్త్రీయత కొరవడటం, అవసరమైన కనీస జాగ్రత్తలు, ప్రమాణాలు సైతం పాటించకపోవడంతో ఈ పరిస్థితి నెలకొందని నిపుణులు చెప్తున్నారు. బుధవారం ఉదయం జూబ్లీహిల్స్ రోడ్ నెం.10లో 27 ఏళ్ళ వంశీకృష్ణ ఇలానే బలైపోవడం తీవ్రకలకలం రేపింది. ఈ డివైడర్ ప్రమాదాలకు గురవుతున్న వాటిలో ద్విచక్ర వాహనాలు, మృతులు, క్షతగాత్రుల్లో యువత ఎక్కువగా ఉండటం ఆందోళనకరంగా మారుతోంది. యాక్సిడెంట్స్‌లో 30 శాతం వాటా... రాజధానిలోని మూడు కమిషనరేట్ల పరిధిలోని ప్రధాన రహదారులతో పాటు శివారు మార్గాల్లో ఉన్న డివైడర్లు ప్రాణాంతకంగా మారుతూ వాహనచోదకుల గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి. నగరంతో పాటు సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో చోటు చేసుకుంటున్న రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 30 శాతం వరకు డివైడర్ల కారణంగానే జరుగుతున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇవి కాంక్రీటుతో నిర్మితం కావడం, కొన్ని ప్రాంతాల్లో అవసరానికి మించి ఎత్తు, వెడల్పులతో ఉండటంతో ఢీ కొట్టిన వాహనం నుగ్గుకావడంతో పాటు చోదకుడు ప్రాణాలతో బయటపడే అవకాశం చాలా తక్కువగా ఉంటోంది. గడిచిన కొన్ని ఏళ్లుగా వీటి వల్ల జరుగుతున్న ప్రమాదాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ట్రాఫిక్ క్రమబద్దీకరణ కోసం కొన్నిచోట్ల హఠాత్తుగా ఏర్పాటు చేస్తున్న డివైడర్లు పగటిపూట వాహనచోదకుల కళ్లలో పడకుండా రాత్రిళ్లు ప్రాణాలను హరిస్తున్నాయి. ప్రమాదాలకు కారణాలు అనేకం... డివైడర్లు డెత్స్పాట్స్గా మారడానికి అనేక కారణాలు ఉంటున్నాయి. రాత్రి వేళల్లో కనిపించక ఢీ కొట్టడం, కీలక ప్రాంతాల్లో అశాస్త్రీయంగా ఏర్పాటు చేసిన వాటి వద్ద వాహనం కంట్రోల్ తప్పి దూసుకుపోవడం జరుగుతోంది. సిటీలోని కొన్ని ఫ్లైఓవర్ల వద్ద తరచుగా ప్రమాదాలు నమోదు కావడానికి ఇవే కారణాలుగా మారుతున్నాయి. ఇక మితిమీరిన వేగంతో, మద్యం మత్తులో దూసుకుపోతున్న ‘నిషా’చరులు వీటిని పట్టించుకునే స్థితిలో ఉండట్లేదు. వాహనచోదకులు హెల్మెట్ ధరించకపోవడంతోనూ డివైడర్ ప్రమాదాలు పెరుగుతున్నాయి. వంశీకృష్ణ ప్రమాదం వెనుక ఓవర్ స్పీడింగ్, హెల్మెట్ ధరించకపోవడం కారణాలుగానే ట్రాఫిక్ పోలీసులు ప్రాథమికంగా నిర్ధారిస్తున్నారు. వాణిజ్య ప్రాంతాలు, కనెక్టివిటీ ప్రాంతాలగా పరిగణించే కోఠి, అబిడ్స్, నాంపల్లిలోని ప్రధాన రహదారులతో పాటు సర్వీస్ రోడ్లు, నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్‌లోని డివైడర్లు, లక్టీకపూల్, హిమాయత్‌నగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కృష్ణనగర్, ఎస్సార్నగర్లతో పాటు మాదాపూర్, గచ్చిబౌలి, ఎల్బీనగర్ తదితర శివార్లలోని అనేక రహదారుల్లోని డివైడర్లు ప్రాణాంతకాలుగా మారుతున్నాయి. నిర్మాణంలో తేడానే కారణమా? సాధారణంగా 100 అడుగుల కంటే ఎక్కువ వెడల్పు ఉన్న రోడ్ల మధ్యలోనే డివైడర్లు నిర్మించాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుత అవసరాలు స్థానిక పరిస్థితుల దృష్ట్యా ఇందులో సగం ఉన్న రహదారుల్లోనూ వీటిని ఏర్పాటు చేయాల్సి వస్తోంది. మరోపక్క గతంలో అనేక ప్రాంతాల్లో డివైడర్లు మాత్రమే ఉండేవి. వీటి మధ్యలో వర్షపు నీరు ఓ పక్క నుంచి మరో పక్కకు పోయే అవకాశం ఉండేది. అయితే అడ్వర్టైజ్మెంట్ బోర్డులు, లాలీపాప్స్ ఏర్పాటు చేయడం ద్వారా ఆదాయం ఆర్జించాలనే జీహెచ్ఎంసీ వైఖరి కారణంగా డివైడర్ల స్థానంలో సెంట్రల్ మీడియమ్స్ వచ్చి చేరుతుండటంతో వీటి వల్ల ఇబ్బందులు పెరుగుతున్నాయి. ఫలానా ప్రాంతం ప్రమాదకరమైంది, ప్రమాద హేతువు అని వివరించేందుకు సదరు స్పాట్‌కు కొద్దిదూరంలో కాషనరీ సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలి. ఆయా స్పాట్లకు రెండు వైపులా కనీసం 200 మీటర్ల దూరంలో తొలి బోర్డు (కాషన్–1), 100 మీటర్ల దగ్గర మరోటి (కాషన్–2) కచ్చితంగా ఉండాలి. అత్యంత ప్రమాదకరంగా మారిన డివైడర్ల వద్ద ఈ సైన్‌బోర్డులు అవసరమైన స్థాయిలో కనిపించట్లేదు. ఈ డెత్ స్పాట్స్ దగ్గర ఉన్న డివైడర్‌ను సక్రమంగా నిర్వహించాలి. ఆ ప్రాంతాలకు ఇరువైపులా కనీసం 400 మీటర్ల మేర అయినా నిర్ణీత ఎత్తులో దీన్ని నిర్మించాలి. దీనికి ఇరువైపులా హజార్డ్ మార్కర్స్ (ప్రమాద సూచికలు) ఏర్పాటు చేయాలి. చీకట్లోనూ వీటి ఉనికి వాహనచోదకులకు తెలిసేలా రిఫ్లెక్టివ్ మార్కర్స్ లేదా సోలార్ మార్కర్స్ పెట్టాలని నిపుణులు చెప్తున్నారు. కలర్స్, క్యాట్ ఐస్ ఏర్పాటూ అంతంతే... ప్రమాదహేతువులుగా ఉన్న ప్రాంతాల్లో డివైడర్‌తో పాటు రోడ్ మార్జిన్స్‌లోనూ పెయిటింగ్ వేయడం అవసరం. సాధారణ పెయింట్స్ కంటే రిఫ్లెక్టివ్ పెయింట్స్ వల్ల ఉపయోగాలు ఎక్కువగా ఉంటాయి. రాత్రి వేళ కూడా ఇవి స్పష్టంగా కనిపిస్తాయి. మార్జిన్స్‌తో పాటు ఎంపిక చేసుకున్న ప్రాంతాల్లో రాత్రి పూట మెరిసే క్యాట్ ఐస్ ఏర్పాటు చేయాలి. ఇవి రాత్రి పూట వాహనచోదకుల దృష్టి ఆకర్షిస్తాయి. నగరంలో డివైడర్ల వద్ద వీటి ఏర్పాటు సైతం అంతంతగానే ఉంటోంది. డివైడర్‌ను పూర్తి శాస్త్రీయ పద్ధతిలో, ఇంజనీరింగ్ నిపుణుల సహకారంతో ఏర్పాటు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. కొత్తగా వెలిసిన డివైడర్ల వద్ద వాటి ఉనికి తెలిసేలా సూచికలు కచ్చితంగా ఉండాలని చెప్తున్నారు. రాత్రి వేళల్లో డివైడర్లను గుర్తించేందుకు వీలుగా రిఫ్లెక్టర్లు, క్యాట్‌ఐస్ వంటివి వెంటనే ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేస్తున్నారు. ప్రాణం తీసిన మ్యాన్‌హోల్: ద్విచక్రవాహనంపైనుంచి పడి ఒకరి మృతి జూబ్లీహిల్స్: ప్రమాదవశాత్తు బైక్‌పై నుంచి పడి యువకుడు దుర్మరణం పాలయ్యాడు. ఈ సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. బోరబండకు చెందిన కుంచాల వంశీకృష్ణ(26) ఓ ఫైనాన్స్ కంపెనీ రికవరీ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం లింగంపల్లికి వెళ్లడానికి ద్విచక్రవాహనం ( ఏపీ09 సీహెచ్ 7103 )పై బయలుదేరి జూబ్లీహిల్స్ రోడ్‌నెంబర్ 10లోని వాక్స్బేకర్స్ సమీపంలోకి రాగానే మ్యాన్‌హోల్ గుంతలో వాహనంపడి అదుపుతప్పి కిందపడిపోయాడు. తల డివైడర్‌కు ఢీకొని తీవ్రగాయాలపాలై అక్కడిక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంవత్సరం ‘డివైడర్ ప్రమాదాల్లో’ కొన్ని... ♦ జనవరిలో మాదాపూర్ ఠాణా పరిధిలో ఐటీ మొబైల్–2 డివైడర్‌ను ఢీ కొట్టడంతో కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. ♦ అదే నెలలో బంజారాహిల్స్ పోలీసుస్టేషన్ పరిధిలోని కేబీఆర్ పార్క్ వద్ద జరిగిన బైక్ ప్రమాదంలో ఒకరు మరణించగా మరొకరికి తీవ్రగాయాలు. ♦ ఫిబ్రవరిలో సైబరాబాద్ కమిషనరేట్‌లోని రాయదుర్గం సబ్–స్టేషన్ వద్ద చోటు చేసుకున్న ద్విచక్ర వాహన ప్రమాదంలో ఇద్దరు మృతి. ♦ మార్చిలో కేపీహెచ్‌బీ పోలీసుస్టేషన్ పరిధిలోకి వచ్చే క్లాస్రూమ్ కాంప్లెక్స్ వద్ద బైక్ ప్రమాదానికి గురై ఒకరు మృతి. -
లాక్‌డౌన్‌ను ఉల్లంఘిస్తున్న నగరవాసులు
-
మందు బాబులకు కరోనా వైరస్ భయం
సాక్షి, సిటీబ్యూరో: కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో నగర ట్రాఫిక్ విభాగం అధికారులు మందుబాబులకు నిర్వహించే శ్వాస పరీక్షలపై కొన్ని వదంతులు చెలరేగుతున్నాయి. కొన్ని స్వచ్ఛంద సంస్థలు సైతం ఈ పరీక్షల్ని నిలిపివేయాల్సిందిగా కోరుతూ పోలీసు ఉన్నతాధికారులకు లేఖలు రాస్తున్నాయి. ట్రాఫిక్ పోలీసులు నిర్వహించే డ్రంక్ డ్రైవింగ్‌పై స్పెషల్ డ్రైవ్‌లోనూ వాహనచోదకుల నుంచి ఈ తరహా ప్రశ్నలు ఎదురవుతున్నాయి. వీటిని పరిగణనలోకి తీసుకున్న సిటీ ట్రాఫిక్ కాప్స్ బ్రీత్ ఎనలైజర్లతో ఎలాంటి భయం లేదని హామీ ఇస్తున్నాయి. ఐఎస్ఐ గుర్తింపులతో కూడిన ఈ యంత్రాలు సాంకేతికంగా ఆధునిక పరిజ్ఞానంతో రూపొందాయని స్పష్టం చేస్తున్నారు. నగర ట్రాఫిక్ విభాగం అధికారులు వినియోగిస్తున్న బ్రీత్ ఎనలైజర్లు ‘వన్ వే మౌత్ పీస్ విత్ నాన్ రిటర్నింగ్ వాల్’ పరిజ్ఞానంతో తయారు చేసినవి అధికారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే వీటితో పరీక్షిస్తే ఎలాంటి బ్యాక్టీరియా, వైరస్, ఇన్ఫెక్షన్స్ వ్యాప్తి ఉండదని చెప్తున్నారు. వాహనచోదకుల్ని తనిఖీ చేస్తున్న సందర్భంలో ఈ బ్రీత్ ఎనలైజర్‌ను తొలుత నేరుగా వారి నోటికి సమీపంలో పెడుతున్న ట్రాఫిక్ పోలీసులు ఊదమని చెప్తున్నారు. మద్యం తాగినట్లు సంకేతాలు వస్తే... అప్పుడు ఆ యంత్రానికి స్ట్రాపైపు తగిలించి మరోసారి ఊదించి బడ్ ఆల్కహాల్ కౌంట్ (బీఏసీ) రికార్డు చేస్తున్నారు. ఈ ప్రక్రియలో ఒక్కొక్కరికీ ఒక్కో స్ట్రా వాడుతామని, ఒకసారి వినియోగించింది మరోసారి ఎట్టిపరిస్థితుల్లోనూ మిషన్‌కు తగిలించమని స్పష్టం చేస్తున్నారు. బ్రీత్ ఎనలైజర్లోకి నేరుగా ఊదినప్పుడు గాలి దాని ద్వారా వెళ్ళిపోతుందని...మరోవ్యక్తో, లేక ఆ వ్యక్తో ఎనలైజర్ ద్వారా గాలి పీల్చాలని చూసినా సాధ్యం కాదని పేర్కొంటున్నారు. అందులో ఉండే నాన్ రిటర్నింగ్ వాల్ గాలి వెనక్కు రాకుండా అడ్డుకుంటుందని, ఈ నేపథ్యంలోనే ఎనలైజర్ ద్వారా గాలి, ఇతర ఇన్ఫెక్షన్స్ పీల్చిన వ్యక్తి నోటిలోకి వచ్చే అవకాశం లేదని చెప్తున్నారు. గతంలో సిటీలో స్వైన్çఫ్లూ చాయలు కనిపించినప్పుడు ఇలాంటి ఆందోళనలు వ్యక్తమయ్యాయని, అప్పట్లో బ్రీత్ ఎనలైజర్లు సరఫరా చేసిన సంస్థను సంప్రదించి అన్ని సందేహాలు నివృతి చేసుకున్నట్లు స్పష్టం చేస్తున్నారు. -
హైవేలపై సంక్రాంతి రద్దీ
చౌటుప్పల్ /కేతేపల్లి/మహబూబ్‌నగర్ నెట్వర్క్: సంక్రాంతి పండుగ కోసం ప్రజలు పెద్ద ఎత్తున తమ స్వస్థలాలకు ప్రయాణమవుతున్నారు. హైదరాబాద్‌తోపాటు రాష్ట్రం లోని పలు జిల్లాల నుంచి అత్యధికంగా ఏపీలోని వివిధ ప్రాంతాలకు వెళుతున్నా రు. ఉమ్మడి నల్లగొండ జిల్లాతోపాటు ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో జాతీయ రహదారులపై వాహనాల రద్దీ ప్రారంభమైంది. నల్లగొండ జిల్లాలోని 65వ నంబర్ జాతీయ రహదారిపై పంతంగి, కొర్లపహాడ్ టోల్గేట్ల వద్ద విజయవాడ మార్గంలో శనివారం కిలోమీటర్ వరకు వాహనాలు నిలిచిపోయాయి. పంతంగి టోల్‌ప్లాజా వద్ద ఇరువైపులా 16 మార్గాలు ఉండగా విజయవాడ వైపు పది ద్వారాలను తెరిచారు. యాదాద్రి జిల్లా గూడూరు టోల్‌ప్లాజా వద్ద పాస్టాగ్ గేట్ల పనితీరు సరిగ్గా లేకపోవడంతో వాహనాదా రులు ఇబ్బందులు పడ్డారు. సాంకేతిక సమస్యలతో ఫాస్టాగ్ ఉన్న వాహనదారులకు టోల్ గేట్ల వద్ద రద్దీ తిప్పలు తప్పలేదు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాల రద్దీ -
దయచేసి లైనులో వెళ్లండి
నిత్యం రహదారిపై తిరుగుతూ ఉంటాం. కానీ మనలో ఎంతమందికి రోడ్డు నిబంధనలు తెలుసు? అంటే సగం మంది నుంచి కూడా సమాధానం రాదు. ఎవరికి వారు ఇష్టానుసారం దూసుకుపోతుంటారు. ఎదుటివారికి ఇబ్బంది కలిగినా.. వెళ్లేది రాంగ్ రూట్ అయినా ఎక్కడి నుంచో దూసుకొచ్చివాహనాన్ని అడ్డంగా పెట్టేస్తుంటారు. ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు నగరంలో ‘లైన్ డిసిప్లేన్’ అమలు చేయాలని యోచిస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో తప్పనిసరిగా అమలు చేస్తున్న ఈ విధానం ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)కు మాత్రమే పరిమితమైంది. ఇప్పుడు ఈ ‘లైన్ డిసిప్లేన్’ విధానాన్ని గ్రేటర్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలో అమలు చేయాలని ట్రాఫిక్ పోలీసులుభావిస్తున్నారు. ముంబైలో విజయవంతం మహానగరం కంటే వాహనాలు ఎక్కువగా ఉన్న ముంబైలో లేన్ డిసిప్లేన్ విధానం అమలు చేస్తున్నారు. ఇది అక్కడ మంచి ఫలితాలనిచ్చింది. అక్కడి అధికారులు కొన్నేళ్ల క్రితమే లేన్ డిసిప్లేన్‌ను అమలు చేశారు. నగరంలో తిరిగే వాహనాల సామర్థ్యం, ప్రయాణించే వేగాన్ని బట్టి సిగ్నల్స్ వద్ద వేర్వేరుగా లైన్లు కేటాయిస్తారు. రెడ్‌లైట్ పడినప్పుడు ఆయా వాహనాలను కచ్చితంగా వాటికి కేటాయించిన వరుసలోనే ఆగేలా చర్యలు తీసుకున్నారు. దీంతో గ్రీన్‌లైట్ పడినప్పుడూ ముందుకు క్రమపద్ధతిలో వెళ్లడంతో జంక్షన్లలో ట్రాఫిక్ జామ్స్‌తో పాటు ప్రమాదాలు సైతం గణనీయంగా తగ్గాయి. ఫలితంగా ఈ విధానం అమలుకు ముందున్న పరిస్థితి పూర్తిగా మారింది. పద్ధతిలేని ప్రయాణం నగరంలో ఏ జంక్షన్ వద్ద చూసినా రెడ్‌లైట్ సిగ్నల్ పడినప్పుడు ‘స్టాప్‌లైన్’ వద్ద వాహనాలు ఆగే తీరు నిర్దిష్టంగా ఉండదు. ద్విచక్ర వాహనాల నుంచి ఆర్టీసీ బస్సుల వరకు ఎక్కడపడితే అక్కడ అడ్డదిడ్డంగా ఆగుతాయి. కుడి వైపు వెళ్లాల్సిన వాహనాలు కూడా ఎడమ వైపు ఆగుతుంటాయి. దీనివల్ల ‘గ్రీన్‌లైట్’ పడినప్పుడు వేటికవి ముందుకు దూసుకు పోవడానికి ప్రయత్నించడంతో అనేక సందర్భాల్లో తీవ్రమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. కొన్నిసార్లు ఇబ్బందికరమైన జంక్షన్లలో వీటివల్ల ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. వాహన చోదకుల మధ్య చిన్న చిన్న తగాదాలు, ఘర్షణలు పరిపాటిగా మారాయి. ఇలాంటి సమస్యలకు ‘లేన్ డిసిప్లేన్’ అమలు పరిష్కారం చూపుతుంది. ఏదైనా సంస్థ సహకారంతో.. రహదారులను సర్వే చేయడంతో పాటు లైన్ డిసిప్లేన్ అమలు, అందుకు చేపట్టాల్సిన ఇంజినీరింగ్ మార్పులను సూచించేందుకు ట్రాఫిక్ పోలీసులు ఏదైనా ప్రముఖ సంస్థకు చెందిన నిపుణుల సహకారం తీసుకోవాలని భావిస్తున్నారు. వారి ద్వారా సాంకేతిక అధ్యయనం చేసిన తర్వాతే లైన్ డిసిప్లేన్ విధానం అమలు చేయనున్నారు. దీనివల్ల వాహనాల సరాసరి వేగం పెరగడంతో పాటు గమ్యం చేరే సమయం గణనీయంగా తగ్గుతుందని అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు ‘గ్రీన్‌లైట్–రెడ్‌లైట్’ మధ్య సమయంలో సిగ్నల్‌ను 100 వాహనాలు దాటుతున్నాయనుకుంటే.. లేన్ డిసిప్లేన్ అమలుతో ఆ వాహనాల సంఖ్యను 150కి పైగా దాటేలా చేయవచ్చని పోలీసులు చెబుతున్నారు. లేన్ డిసిప్లేన్ విధానాన్ని పరిచయం చేయడానికి ముందు కొన్ని మౌలిక వసతులను మెరుగుపచడంతో పాటు ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అన్ని రోడ్లలోనూ సాధ్యమేనా! ట్రాఫిక్ విభాగం అధికారులు ఆ లైన్ డిసిప్లేన్ విధానాన్ని కేవలం జంక్షన్ల వద్దే కాకుండా.. రహదారుల పైనా అమలు చేయాలని భావిస్తున్నారు. సిటీలోని అన్ని ప్రాంతాల్లోని రహదారులూ ఒకేలా లేవు. కొన్ని రోడ్లు అవసరమైన వెడల్పుతో ఉండగా.. మరికొన్ని కుంచించుకుపోయి, బాటిల్ నెక్స్‌గా మారాయి. జంక్షన్ల పరిస్థితీ ఇలానే ఉంది. ఈ నేపథ్యంలో నగర వ్యాప్తంగా ఒకేసారి ‘లైన్ డిసిప్లేన్’ విధానాన్ని అమలుచేస్తే వీటివల్ల ఎన్నో ఇబ్బందులు తలెత్తి వాహన చోదకులు తీవ్రంగా ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న ట్రాఫిక్ పోలీసులు ప్రాథమికంగా లైన్ విధానం అమలుకు అనువైన ప్రాంతాలను గుర్తించాలని నిర్ణయించారు. గ్రేటర్లో ప్రాథమికంగా ఎంపిక చేసిన మార్గాల్లో ప్రయోగాత్మకంగా ‘లైన్ డిసిప్లేన్’ విధానం అమలు చేసి.. ఆపై అనువైన ప్రతి మార్గానికీవిస్తరించాలని ట్రాఫిక్ పోలీస్ అధికారులు యోచిస్తున్నారు. దీనికోసం అవసరమైన అధ్యయనంచేయడానికి ఓ సంస్థ నుంచి సాంకేతిక సహకారం తీసుకుంటామని చెబుతున్నారు. ఈ విధానం ముంబైలో మంచి ఫలితాలిచ్చిందంటున్నారు. రాజధానిలోని రోడ్లపై ‘లేన్ డిసిప్లేన్’ను అమలు చేయడం ద్వారా వాహనాల ప్రయాణ వేగాన్ని పెంచడంతో పాటు వాహన చోదకులు గమ్యం చేరే సమయాన్ని గణనీయంగా తగ్గించవచ్చని ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. -
ట్రాఫిక్ వేళ..రాంగే రైటు!
అసలే సోమవారం.. సమయం ఉదయం 9.30 గంటలు.. ఐటీ కారిడార్ రద్దీగా ఉండేది కూడా అప్పుడే. కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగలతో కిటకిటలాడుతూ ఉంది. ఇదే సమయంలో బయోడైవర్సిటీ డబుల్ హైట్ ఫ్లైఓవర్ ప్రారంభానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. మంత్రులు, ఉన్నతాధికారుల వాహనాల రాకతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. దాంతో చాలామంది లీడర్లు తమ వాహనాలను రాంగ్ రూట్లోనే కొత్త వంతెన దగ్గరకు పోనిచ్చారు. 108 వాహనాలు కూడా ట్రాఫిక్‌లో చిక్కుకుపోయాయి. ఐటీ ఉద్యోగులైతే కార్యాలయాలకు సమయం మించి పోతుందని టెన్షన్ పడ్డారు. ఇటు మెహిదీపట్నం నుంచి గచ్చిబౌలి జంక్షన్.. మాదాపూర్ వరకు భారీగా ట్రాఫిక్ జామైంది. – ఫొటోలు: నోముల రాజేష్‌రెడ్డి -
గచ్చిబౌలి జంక్షన్ వద్ద ట్రాఫిక్ రిలీఫ్
సాక్షి, హైదరాబాద్: నిత్యం ట్రాఫిక్‌తో రద్దీగా ఉండే ఐటీ కారిడార్‌లో మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. బయోడైవర్సిటీ డబుల్ హైట్ ఫ్లైఓవర్‌ను సోమవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. దీంతో రాయదుర్గం నుంచి హైటెక్‌సిటీ, ఇనార్బిట్ మాల్ వైపు వెళ్లే ప్రయాణికులు ట్రాఫిక్ అంతరాయం లేకుండా ప్రయాణం చేయవచ్చు. రెండున్నర ఏళ్లకు ముందు ప్రారంభమైన నిర్మాణానికి స్థల సేకరణ అడ్డంకిగా మారడంతో పనుల్లో జాప్యం జరిగింది. ఎట్టకేలకు నిర్మాణ పనులు పూర్తి కావడంతో అతి ఎత్తయిన వంతెన అందుబాటులోకి వచ్చింది. బల్దియా పరిధిలో ఎస్ఆర్డీపీ పనుల కింద చేపట్టిన ఫ్లైఓవర్లలో ఈ డబుల్ ఫ్లైఓవర్ నగరంలోనే ఎత్తయినది. దాదాపు రూ.16.47 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ వంతెన జంక్షన్లో ఎత్తు 17.45 మీ. కాగా, పొడవు 990 మీ, వెడల్పు 11.5 మీటర్లు. మూడు లైన్ల వెడల్పులో వన్ వేలో వెళ్లాల్సి ఉంటుంది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేటీఆర్‌తో పాటు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ పాల్గొన్నారు. మరోవైపు గచ్చిబౌలి వద్ద రెండు ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్ నిర్మాణానికి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. రెండు ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌ను రూ. 330 కోట్ల వ్యయంతో నిర్మిస్తారు. MA&UD Minister @KTRTRS laid foundation stones for two flyovers and an underpass in Gachibowli today. At an estimated cost of Rs 330 crore, @GHMCOnline will construct these projects under the Strategic Road Development Programme (SRDP). pic.twitter.com/tdDx5EC9fF — Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) November 4, 2019 ఎస్ఆర్డీపీలో భాగం గా 69.47 కోట్ల రూపాయల వ్యయంతో 900 మీటర్ల పొడవున మూడు లేన్లుగా జీహెచ్ఎంసీ నిర్మించిన బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్ నగరంలో ఇప్పటికే 3 ఫ్లై ఓవర్లు , 4 అండర్ పాసులు అందుబాటులోకి రావడంతో ఆ రూట్లో తగ్గిన ట్రాఫిక్ కష్టాలు బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్‌తో మోహిదీపపట్నం, ఖాజాగూడ నుంచి మైండ్ స్పేస్ వైపు వెళ్లే వారికి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సిగ్నల్ ఫ్రీగా వెళ్ళవచ్చు ఈ ఫ్లైఓవర్ మెహిదీపట్నం నుంచి కూకట్పల్లి వైపు వెళ్లే వారికి ఎంతో సమయం కలిసిరావడంతో పాటు.. ట్రాఫిక్ ఇబ్బందులు తప్పుతాయి హైటెక్ సిటీ వైపు వెళ్లేవారు కూడా జంక్షన్ దగ్గర ఆగకుండా నేరుగా వెళ్లిపోవచ్చు. బయో డైవర్సిటీ, మంత్రి కేటీఆర్, ఫ్లై ఓవర్, రాయదుర్గం, ట్రాఫిక్ ఫ్రీ -
అంబులెన్స్‌కే ఆపద.. గర్భిణికి ట్రాఫిక్ కష్టాలు
బోడుప్పల్‌కు చెందిన గర్భిణి నాగలక్ష్మికి గురువారం మధ్యాహ్నం పురిటి నొప్పులు రావడంతో బంధువులు 108 అంబులెన్స్‌లో తీసుకొని ఆస్పత్రికి బయలుదేరారు. అప్పటికే రోడ్లపై భారీగా ట్రాఫిక్ రద్దీ ఉండడం, చాలాచోట్ల రహదారులపై గుంతలు ఉండడతో వాహనాల వేగం నెమ్మదించింది. వాస్తవానికి 15 నిమిషాల్లో ఆస్పత్రికి చేరుకోవాల్సిన వాహనం అరగంటకు పైగా ట్రాఫిక్‌లోనే చిక్కుకుంది. అప్పటికే నొప్పులతో బాధపడుతున్న నాగలక్ష్మి అంబులెన్స్‌లోనే బిడ్డకు జన్మనిచ్చింది. వాహనం ట్రాఫిక్‌లో చిక్కుకోవడం, అప్పటికే ఆమెకు నొప్పులు ఎక్కువ కావడంతో చాదర్‌ఘాట్ వద్ద టెక్నీషియన్లు శ్రీనివాస్, రామ్‌దాస్ కాన్పు చేశారు. అనంతరం తల్లీబిడ్డను ఆస్పత్రిలో చేర్పించారు. 25 రోజుల క్రితం బడంగ్‌పేటకు చెందిన ఓ గర్భిణికి పురిటి నొప్పులు వచ్చాయి. ఆమెను 108లో ఆస్పత్రికితరలిస్తుండగా... నల్లగొండ క్రాస్‌రోడ్డు వద్ద అంబులెన్స్ ట్రాఫిక్‌లో చిక్కుకుంది. గత్యంతరం లేని పరిస్థితిలో సిబ్బంది వాహనాన్ని పక్కకు నిలిపేశారు. బాధితురాలు అంబులెన్స్‌లోనే బిడ్డను ప్రసవించింది. సాక్షి, సిటీబ్యూరో :ఇలా ఒక్క గర్భిణులనే కాదు... 108, ఇతర అంబులెన్స్‌లలో వైద్యం కోసంఆస్పత్రులకు వెళ్తున్న బాధితులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. నగరంలో తీవ్రమవుతున్న ట్రాఫిక్ రద్దీనే ఇందుకుకారణమవుతోంది. ఓఆర్ఆర్ సహా శివారు జిల్లాల్లో రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు క్షతగాత్రులను, గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ బాధితులను అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రులకు చేర్చే క్రమంలో అంబులెన్స్‌లకు ట్రాఫిక్ అడ్డంకిగా మారింది. అంబులెన్స్‌లు సకాలంలో ఆస్పత్రులకు చేరుకోకపోవడంతో గర్భిణులు ఆయా వాహనాల్లోనే ప్రసవిస్తుండగా... అనారోగ్య బాధితులు మృత్యువాతపడుతున్నారు. నగరంలో ఇటీవల వరుసగా కురిసిన వర్షాలకు రహదారులు దెబ్బతిన్నాయి. రోడ్లపై భారీ గుంతలు ఏర్పడ్డాయి. ఫలితంగా వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. పీక్ అవర్స్‌గా పేర్కొనే ఉదయం 8:30–11గంటల వరకు.. మధ్యాహ్నం 12:30 నుంచి 2గంటల వరకు.. సాయంత్రం 4 నుంచి రాత్రి 8:30 గంటల వరకు ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటోంది. ఈ సమయాల్లో నగరంలోకి వచ్చే అంబులెన్సులు ట్రాఫిక్‌లో చిక్కుకుంటున్నాయి. సకాలంలో ఆస్పత్రికి చేరుకోకపోవడంతో పరిస్థితి విషమించి బాధితుల ప్రాణాల మీదకు వస్తోంది. వైద్య పరిభాషలో ప్రమాదం జరిగిన తర్వాత తొలి గంటను ‘గోల్డెన్ అవర్’గా పేర్కొంటారు. క్షతగాత్రులను ఈ సమయం లోపు ఆస్పత్రులకు తరలిస్తే వారి ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుంది. కానీ తరలింపులో జరుగుతున్న జాప్యంతో మరణాలు సంభవిస్తున్నాయి. కారణాలెన్నో... వర్షాలకు రోడ్లు దెబ్బతినడంతో పాటు నగరంలో వాహనాల రద్దీ కూడా ఎక్కువగా ఉంటోంది. అంబర్పేట్, మలక్‌పేట్, చాదర్ఘట్, ఉప్పల్, సంతోష్‌నగర్, సైదాబాద్ సహా పలు ప్రాంతాల్లో బాటిల్‌నెక్స్ ఉన్నాయి. పీక్ అవర్స్‌లో వాహనాలన్నీ ఒకేసారి రోడ్లపైకి వస్తుండడంతో ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్‌జామ్ అవుతోంది. అంతేకాకుండా అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్‌లకు దారి ఇవ్వాలనే సామాజిక స్పృహ చాలా మంది వాహనదారుల్లో ఇప్పటికీ లేకపోవడంతోనూ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఫలితంగా 15 నిమిషాల్లో ఆస్పత్రికి చేరుకోవాల్సిన అంబులెన్స్‌లు 30 నిమిషాలకు పైగా రోడ్లపైనే నిలిచిపోతున్నాయి. గంటకు పైగా సమయం... గ్రేటర్ ఏడు జిల్లాల పరిధిలో దాదాపు 7,200 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. సుమారు 150 కిలోమీటర్ల పొడవైన ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు పలు రాష్ట్ర, జాతీయ రహదారులు దీనికి ఆనుకొని ఉన్నాయి. ఈ రహదారులపై ఏటా రెండు వేలకు పైగా జరిగే రోడ్డు ప్రమాదాల్లో 200–300 మంది వరకు ప్రాణాలు కోల్పోతున్నారు. అనేక మంది వికలాంగులుగా మారుతున్నారు. ప్రధాన నగరంలో ప్రతి 5 కిలోమీటర్లకు ఒక 108 అంబులెన్స్ ఉండగా.. అదే శివార్లలో ప్రతి 25–30 కిలోమీటర్లకు ఒకటి ఉంది. ఔటర్‌పై ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అంబులెన్సు ఘటనాస్థలికి చేరుకోవాలంటే కనీసం గంటకు పైగా పడుతోంది. ఘటనా స్థలానికి చేరుకున్న తర్వాత క్షతగాత్రులను ఉస్మానియా, నిమ్స్, గాంధీ ఆస్పత్రులకు తరలించడానికి మరో గంటకు పైగా పడుతోంది. ఇలా ఔటర్ నుంచి ఆస్పత్రులకు బాధితులను తరలించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. నల్లగొండ, మహబూబ్‌నగర్, వరంగల్, మెదక్ జిల్లాల నుంచి వచ్చే ఇతర అంబులెన్సులకు సిటీలో ఇబ్బందులు తప్పడం లేదు. ప్రయాణ దూరానికి రోడ్లపై నిలిచిపోయిన ట్రాఫిక్ తోడవుతుండటంతో అంబులెన్స్‌లు సకాలంలో ఆస్పత్రులకు చేరుకోవడం లేదు. -
భారీ వర్షం.. ట్రాఫిక్‌లో ఇరుక్కున్న కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ : నగరంలో వర్షం దంచి కొడుతోంది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో పలు చోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. మంత్రి కేటీఆర్ సైతం ట్రాఫిక్‌లో ఇరుకున్నారు. భారీ వర్షంతో బంజారాహిల్స్ కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో అటుగా వెళ్తున్న మంత్రి కేటీఆర్ వాహనం సైతం ట్రాఫిక్‌లో నిలిచిపోయింది. మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి వరకూ ఏకధాటిగా కురిసిన వర్షానికి భాగ్యనగరం తడిసిముద్దయిన సంగతి తెలిసిందే. బుధవారం ఉదయం కాస్తా తెరపి ఇచ్చినా.. సాయంత్రానికి మళ్లీ భారీ వర్షం మొదలైంది. ముషిరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్డు, చిక్కడపల్లి, హిమాయత్‌నగర్, అబిడ్స్, కోఠీ, దిల్సుఖ్నగర్, చైతన్యపురి, కొత్తపేట, సరూర్‌నగర్, మీర్పేట్, వనస్థలిపురం, ఎల్బీనగరలో భారీ వర్షం కురుస్తోంది. కాగా వర్షాలపై జీహెచ్ఎంసీ సిబ్బంది అప్రమత్తమైంది. భారీ వర్షాలతో ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఉండేందుకు 13 డిజాస్టర్ రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. నగరంలో మరో 2 గంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని జీహెచ్ఎంసీ అధికారుల తెలిపారు.రానున్న రెండు గంటల పాటు ఉద్యోగులు కార్యాలయాల నుంచి బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. మెట్రో సర్వీసులకు అంతరాయం భారీ వర్షం కారణంగా ఎల్బీనగర్ నుంచి అమీర్‌పేట్, మియాపూర్ రూట్లో మెట్రో సర్వీసులకి అంతరాయం ఏర్పడింది. దాదాపు గంటకు పైగా రైళ్లు నిలిచిపోయాయి. ట్రాక్‌పైకి భారీగా వర్షం నీరు వచ్చి చేరింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
ఎల్"బీపీ".. నగర్
ఎల్బీనగర్: ఎల్బీనగర్ జంక్షన్ జనసంద్రంగా మారుతోంది. ఓవైపు బస్సులు.. మరోవైపు ప్రయాణికులు.. ఇంకోవైపు ఇతర వాహనాలతో ఈ చౌరస్తా కిక్కిరిసిపోతోంది. దీంతో తీవ్రమైన ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. ఇక్కడి నుంచి తెలుగు రాష్ట్రాలకు ప్రతిరోజు 800–900 బస్సులు రాకపోకలు సాగిస్తాయి.ఇవికాకుండా మరో కార్లు, ఆటోలు, ఇతర వాహనాలతో ఈ ప్రాంతమంతా రద్దీగా మారుతోంది. రోజూ సుమారు 2లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. తెలంగాణ బస్సులు 150, ఆంధ్రప్రదేశ్ బస్సులు 350, ప్రైవేట్ బస్సులు 400, కార్లు సహా ఇతర వాహనాలు వేల సంఖ్యలో రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ స్థాయిలో వాహనాలు, ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుండడంతోఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇక వరుస సెలవులు వస్తే చాలు... ఇక్కడ నిల్చొనేందుకు కూడా చోటు దొరకడం లేదు. బస్సు ఆగేదెలా? ఈ చౌరస్తా నుంచి రోజుకు వందల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుండగా... వాటిని నిలిపేందుకు స్థలం కరువైంది. అధికారులు ఎక్కడా బస్‌బేలు ఏర్పాటు చేయకపోవడంతో రోడ్లపైనే బస్సులను నిలపాల్సి వస్తోంది. ఇక ఇతర వాహనాలను రోడ్లపైనే పార్కింగ్ చేస్తుండడంతో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంటోంది. మరోవైపు ఇక్కడ అండర్‌పాస్‌లు, ప్లైఓవర్ బ్రిడ్జీల నిర్మాణంతో రోడ్లు ఇరుకుగా మారాయి. దీంతో ఉదయం, సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ జామ్ అవుతోంది. బస్సుల కోసం ప్రయాణికులు రోడ్లపై పరుగులు తీయాల్సి వస్తోంది. విస్తరణేదీ? ఎల్బీనగర్ నాలుగు రహదారులకు జంక్షన్. ఉప్పల్, బెంగళూర్ హైవే, సాగర్ రింగ్‌రోడ్డు, నగరానికి వెళ్లాలన్న ఈ చౌరస్తా దాటాల్సిందే. ఓవైపు రోడ్ల పనులు జరుగుతుండడం, మరోవైపు జంక్షన్ విస్తరించకపోవడంతో ఈ సమస్యలు తలెత్తుతున్నాయి. అధికారులు కనీసం పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయకపోవడం కూడా ఇందుకు ఒక కారణం. అధికారులు ఇప్పటికైనా స్పందించి పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయాలని, వాహనాలను రోడ్లపై నిలపకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. రోజూ గొడవలే.. ట్రాఫిక్ సమస్యతో ఈ రూట్లో రోజూ వాహనదారుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకున్న వాహనదారులు ఒక్కోసారి ఫ్రస్టేషన్‌కు గురవుతున్నారు. ఆవేశకావేశాలకు లోనై ఇతర వాహనదారులతో ఘర్షణలకు సైతం దిగుతున్నారు. పక్కపక్కనుంచే వాహనాలు వెళ్లాల్సి రావడం, ఒక దానికి మరోటి వాహనం తగులుతుండడంతో గొడవలు చోటు చేసుకుంటున్నాయి. ఎక్కడ ఆగుతుందో? ఎల్బీనగర్ చౌరస్తా వద్ద బస్సులు ఎక్కడ ఆగేది తెలియడంల లేదు. బస్సు వచ్చిందంటే చాలు అది ఎక్కడికి పోతుందోనని ప్రయాణికులు ఉరుకులు పరుగులు తీయాల్సి వస్తోంది. బస్టాప్ అనేది లేకపోవడంతో ఇబ్బందిగా మారింది. – కుమార్, ప్రయాణికుడు రోజూ జంక్షన్ జామ్ ఇలా... బస్సులు 800-900 కార్లు, ఇతర వాహనాలు వేల సంఖ్యలో ప్రయాణికులు 2లక్షలు -
డ్యూటీ డబుల్...లైఫ్ ట్రబుల్!
సాక్షి, సిటీబ్యూరో: లెక్కలేని పనిగంటలు..పగలు–రాత్రి ఎప్పుడు అవసరమైతే అప్పుడు డబుల్ డ్యూటీలు..అడుగడుగునా ట్రాఫిక్ వెతలు..కాలం చెల్లిన బస్సులు వెరసి తీవ్రమైన ఒత్తిడితో అనారోగ్యం పాలవుతున్నామని గ్రేటర్ ఆర్టీసీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్మికులకు వర్తిస్తున్న 8 గంటల పని విధానం తాము ఎప్పుడో మర్చిపోయామని, ఆ రోజు పరిస్థితిని బట్టి 10 నుంచి 15 గంటల వరకు కూడా పని చేస్తున్నామని ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు వాపోతున్నారు. పనిఒత్తిడి వల్ల వ్యాధుల పాలవుతున్నామంటున్నారు. సిబ్బందిని భర్తీ చేయకపోవడం...వేతన సవరణ లేకపోవడం..జీతాల చెల్లింపులో జాప్యంతో తాము అధ్వానమైన జీవనం గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సిటీలోని 29 డిపోల్లో పనిచేస్తున్న ఆర్టీసీ కార్మికులు. ♦ ఆర్డినరీ బస్సులు 3 నిమిషాలకు ఒక కిలోమీటర్ చొప్పున, ఎక్స్‌ప్రెస్‌లకు రెండున్నర నిమిషాలకు కిలోమీటర్ చొప్పున చాలా ఏళ్ల క్రితం కేటాయించిన సమయమే ఇప్పటికీ అమలు జరుగుతుంది. గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రతి రోజు 3500 బస్సులు 42 వేల ట్రిప్పులు తిరుగుతున్నట్లు అధికారుల అంచనా. కానీ ఒకప్పటి వాహనాల రద్దీకి, ఇప్పటి రద్దీకి ఎంతో తేడా ఉంది. ♦ గ్రేటర్లో వాహనాలు 55 లక్షలకు చేరుకున్నాయి. ఏటా కనీసం 2 లక్షల వాహనాలు అదనంగా వచ్చి చేరుతున్నాయి. ఇందుకు తగిన విధంగా రోడ్ల విస్తరణ జరగడం లేదు. కానీ కొత్త కాలనీలకు, కొత్త రూట్లకు బస్సులను నడపాల్సి వస్తుంది. దీంతో పద్మవ్యూహాన్ని తలపించే ఈ రద్దీలో పాతకాలం నాటి రన్నింగ్ టైమ్ ప్రకారం బస్సులు నడుపలేకపోతున్నట్లు ఆర్టీసీ కార్మికులు నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నారు. ♦ సనత్‌నగర్ నుంచి కోఠీ రూట్లో నడిచే 45వ నెంబర్ బస్సులు, పటాన్చెరు, కోఠి, దిల్సుఖ్నగర్ రూట్లో తిరిగే 9వ నెంబర్ బస్సులు, సికింద్రాబాద్ నుంచి బార్కాస్ వరకు వెళ్లే 2సి బస్సులు, సికింద్రాబాద్–ఆఫ్జల్‌గంజ్, కోఠి మార్గంలో నడిచే 40వ నెంబర్ రూట్లో, సికింద్రాబాద్ నుంచి సరూర్‌నగర్, దిల్సుఖ్నగర్ మార్గంలో తిరిగే 107వ రూట్ బస్సులు, మియాపూర్, పటాన్చెరు, కోఠి, ఎర్రగడ్డ నుంచి కూకట్పల్లి రూట్లో తిరిగే అన్ని బస్సుల్లో రన్నింగ్ టైమ్ కొరత తీవ్ర సమస్యగా ఉంది. మరోవైపు రన్నింగ్ టైమ్ కొరత కారణంగా పెద్దఎత్తున ట్రిప్పులు రద్దవుతున్నాయి. ప్రతి రోజు కనీసం 3000 ట్రిప్పులకు పైగా రద్దవుతున్నట్లు అంచనా. దీంతో కొన్ని వేల మంది ప్రయాణికులు రవాణా సదుపాయాన్ని కోల్పోతున్నారు.‘రన్నింగ్ టైమ్పైన శాస్త్రీయమైన సర్వే నిర్వహించి కచ్చితమైన సమయాన్ని నిర్ధారించాలి. రూట్ల వారీగా సమయాన్ని నిర్ధారిస్తే పని భారం తగ్గుతుంది. మెరుగైన రవాణా సాధ్యమవుతుంది.’అని చెప్పారు తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్. నిలిచిపోయిన నియామకాలు... ఆర్టీసీలో 2011 నుంచి ఉద్యోగ నియామకాలు లేవు. అప్పటి నుంచి సుమారు 7000 మంది ఉద్యోగ విరమణ చేశారు.దీంతో ఉన్న సిబ్బంది పైనే పని భారం పెరిగింది. గ్రేటర్ హైదరాబాద్‌లో కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్‌లు తదితర సిబ్బంది అంతా కలిసి 24 వేల మంది ఉన్నారు. బస్సులు నడిపేందుకు ఇప్పటికిప్పుడు కనీసం 2500 మంది అవసరం. సిటీ బస్సులు ఒకప్పుడు 35 వేల ట్రిప్పులు తిరిగితే ఇప్పుడు 42 వేల ట్రిప్పులు తిరుగుతున్నాయి. కానీ ఇందుకు తగిన విధంగా సిబ్బంది మాత్రం పెరగలేదు. ‘డబుల్ డ్యూటీలు చేసిన వాళ్లకు డబుల్ వేతనాలు ఇవ్వాలి. కానీ డ్రైవర్‌కు రూ.650, కండక్టర్‌కు రూ.610 చొప్పున ఇస్తున్నారు. ఇది చాలా అన్యాయం.’ అని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లీవ్ఎన్క్యాష్మెంట్ కూడా లభించడం లేదు, సెలవులు వినియోగించుకోకుండా విధులు నిర్వహించిన వాళ్లకు వాటిని నగదుగా మార్చుకొనే సదుపాయం ఉంది. కానీ 5 ఏళ్లుగా లీవ్ఎన్క్యాష్మెంట్ నిలిపివేశారు. 2017 ఏప్రిల్ నుంచి వేతన సవరణ జరగలేదు. ‘‘ కనీసం న్యాయమైన సమస్యలను కూడా పరిష్కరించుకోలేకపోతున్నాం. అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం ఆర్టీసీని పూర్తిగా విస్మరించింది.’’ అని బీహెచ్ఈఎల్ డిపోకు చెందిన కండక్టర్ లక్ష్మి విస్మయం వ్యక్తం చేశారు. ఆలస్యంగా జీతాలు సాధారణంగా ప్రతి నెల ఒకటవ తేదీ నాటికి కార్మికుల జీతాలు వాళ్ల ఖాతాలో పడిపోతాయి. కానీ కొంతకాలంగా వారం రోజులు దాటినా జీతాలు లభించడం లేదు. తీవ్ర నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న ఆర్టీసీ కార్మికులకు సకాలంలో జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో కూరుకొనిపోయింది. వివిధ రూపాల్లో ఉద్యోగులు పొదుపు చేసుకున్న సుమారు రూ.1500 కోట్లకు పైగా ఆర్టీసీ వినియోంచుకుంది. అయినప్పటికీ ప్రస్తుతం జీతాల చెల్లింపుల్లో జాప్యం చోటుచేసుకొంటోంది. ‘‘ఆర్టీసీ ఉద్యోగుల జీతాల కోసం ప్రతి నెలా రూ.100 కోట్ల నుంచి రూ.110 కోట్ల వరకు అవసరమవుతా యి. విద్యార్ధుల బస్‌పాస్‌లపైన ప్రభుత్వం ఇవ్వాల్సి న రాయితీలు ఇచ్చినా చా లు మాకు సకాలంలో జీతాలు లభిస్తాయి..’’ అని హనుమంతు ముదిరాజ్ అభిప్రాయపడ్డారు. రెస్ట్రూమ్లు లేవు సిటీలో చాలాచోట్ల బస్సులు నైట్అవుట్ చేస్తాయి. కానీ డ్రైవర్లు, కండక్టర్లు నిద్రించేందుకు రెస్ట్రూమ్లు, పడకలు లేవు. చాలా ఇబ్బందికి గురవుతున్నాం. పటాన్చెరులో ప్రతి రోజు వందలాది బస్సులు ఆగుతాయి. అక్కడి రెస్ట్‌రూమ్‌లలో సరైన వసతులు లేక నిద్రకు నోచుకోలేకపోతున్నాం. తిరిగి ఉదయాన్నే బస్సు నడపవలసి రావడం వల్ల ఒత్తిడికి గురవుతున్నాం. – విక్రమ్, డ్రైవర్ ఇదేం రన్నింగ్ టైమ్? సికింద్రాబాద్ నుంచి చార్మినార్‌కు వెళ్లే సిటీ బస్సుకు కేటాయించిన సమయం 40 నిమిషాలు. కానీ ట్రాఫిక్ రద్దీ కారణంగా గంట దాటినా ఆ బస్సు గమ్యానికి చేరుకోవడం లేదు. దీంతో ఆ రూట్లో ఏడున్నర గంటలకు బదులు 11 నుంచి 12 గంటల పాటు పని చేయాల్సి వస్తుంది. ఈ ఒక్క రూట్ మాత్రమే కాదు. నగరంలోని సుమారు 1050 రూట్లలో ఇదే పరిస్థితి. నిర్ణయించిన రన్నింగ్ టైమ్ ప్రకారం బస్సులు నడపడం చాలా వరకు అసాధ్యంగా మారింది. ‘విశ్రాంతి’ లేదు మహిళా కండక్టర్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. డిపోల్లో రెస్ట్రూమ్లు లేవు. టాయిలెట్లు లేవు, బస్టేషన్లలో కూడా అదే పరిస్థితి. నాలుగేళ్ల క్రితం యూనిఫామ్‌లు ఇచ్చారు. ఇప్పటి వరకు యూనిఫామ్‌లు కూడా ఇవ్వలేదు. రాత్రి వేళల్లో రక్షణ ఉండడం లేదు. రాత్రి పూట 8 గంటల వరకు మహిళలకు డ్యూటీలు ఇవ్వాలని గతంలో నిర్ణయించారు. కానీ అమలుకు నోచుకోవడం లేదు. 11 దాటినా ఇంటికి చేరుకోలేకపోతున్నాం. – జ్యోతి, కండక్టర్, కాచిగూడ నిలిచిపోయిన గుర్తింపు సంఘం ఎన్నికలు ఆర్టీసీలో ప్రతి రెండేళ్లకు ఒకసారి కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలు జరుగుతాయి. గత సంవత్సరం ఆగస్టు 7వ తేదీ నాటికి ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ కార్మిక సంఘం గుర్తింపు గడువు ముగిసింది. గడువులోపు ఎన్నికలు నిర్వహించి కొత్త సంఘం ఎన్నుకొనేందుకు అవకాశం కల్పించాలి. కానీ ఏడాది దాటినా కార్మిక శాఖ ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఇటీవల గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణ కోసం ఒక ప్రిసైడింగ్ అధికారిని నియమించారు. కానీ ఎలాంటి కార్యాచరణ చేపట్టలేదు. -
జూడాల ఆందోళన ఉద్రిక్తం
లబ్బీపేట (విజయవాడ తూర్పు)/సాక్షి, అమరావతి/తిరుపతి తుడా: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎమ్సీ)ను రద్దు చేయాలని కోరుతూ విజయవాడలో జూనియర్ వైద్యులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ఆరు రోజులుగా ప్రభుత్వాస్పత్రి, వైద్య కళాశాల ప్రాంగణంలో నిరసనలు తెలుపుతున్న జూడాలు బుధవారం జాతీయ రహదారిపైకి వచ్చి మహానాడు రోడ్డు జంక్షన్‌ను దిగ్బంధం చేశారు. వారి ఆందోళన అర్ధగంటకు పైగా సాగడంతో నాలుగు వైపులా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో సంఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు ట్రాఫిక్ సమస్య దృష్ట్యా ఆందోళన విరమించాలని కోరారు. అందుకు జూడాలు నిరాకరించడంతో బలవంతంగా వాహనాల్లో ఎక్కించి భవానీపురం, వన్‌టౌన్ పోలీసుస్టేషన్లకు తరలించారు. ఆ క్రమంలో ఓ జూడాపై డీసీపీ హర్షవర్ధన్ దురుసుగా ప్రవర్తిస్తూ చేయి చేసుకోవడం వివాదాస్పదంగా మారింది. ఐఎంఏ ప్రతినిధుల సంప్రదింపులు ఐఎంఏ ప్రతినిధులు డాక్టర్ టీవీ రమణమూర్తి, డాక్టర్ మనోజ్ తదితరులు వన్‌టౌన్, భవానీపురం పోలీసుస్టేషన్లకు వెళ్లి జూడాలను వదిలివేయాలని కోరారు. వారి భవిష్యత్‌తో కూడిన అంశం కావడంతో ఆందోళన చేస్తున్నారని తెలిపారు. ట్రాఫిక్ సమస్య సృష్టించాలని కానీ, ప్రజలను ఇబ్బంది పెట్టే ఉద్దేశం వారికి లేదని చెప్పడంతో కొద్దిసేపటి తర్వాత జూడాలను పోలీసులు వదిలివేశారు. అనంతరం ప్రభుత్వాస్పత్రికి చేరుకున్న జూడాలు.. తమ పట్ల దురుసుగా ప్రవర్తించిన పోలీసు అధికారి క్షమాపణ చెప్పాలంటూ నిరసన దీక్షకు దిగారు. జూడాలను బూట్ కాలితో తన్నుతున్న టీటీడీ వీజీవో అశోక్‌కుమార్ గౌడ్ మంత్రి, కార్యదర్శులకు వినతిపత్రాలు ఎన్ఎమ్సీని రద్దు చేసి, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను పునరుద్ధరించాలనే డిమాండ్‌తో కూడిన వినతిపత్రాలను జూనియర్ వైద్యుల సంఘ ప్రతినిధులు సచివాలయంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణప్రసాద్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి జవహర్‌రెడ్డికి సమర్పించారు. అలిపిరి వద్ద ఆందోళన.. రసాభాస ఎన్ఎమ్సీ బిల్లుకు వ్యతిరేకంగా తిరుపతిలో జూడాలు చేపట్టిన ఆందోళన రసాభాసగా మారింది. భక్తులు తిరుమలకు వెళ్లే అలిపిరి మార్గంలో రాస్తారోకో నిర్వహించడంతో మూడు గంటల పాటు రాకపోకలు ఆగిపోయాయి. దీంతో పోలీసులు, టీటీడీ సెక్యూరిటీ అండ్ విజిలెన్స్ అధికారులు అక్కడకు చేరుకుని జూడాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఓ వైపు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుపోవడంతో సహనం నశించి భక్తులు వైద్య విద్యార్థులతో గొడవకు దిగారు. ఈ క్రమంలో టీటీడీ విజిలెన్స్ అధికారి అశోక్‌కుమార్ గౌడ్ వైద్య విద్యార్థిపై దురుసుగా ప్రవర్తించడంతో పాటు కాలితో తన్నడంతో ఒక్కసారిగా జూడాల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆ అధికారి చర్యలకు నిరసనగా మరోసారి ఆందోళనకు దిగారు. ఎంతకీ వినకపోవడంతో వారిని అరెస్టు చేసి ఎమ్మార్పల్లిలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌కు తరలించారు. -
వాన వదలట్లే!
సాక్షి, సిటీబ్యూరో: నగరాన్ని ముసురు చుట్టేసింది. ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఉపరితల ఆవర్తనం, అల్పపీడన ప్రభావంతో ప్రతిరోజూ వర్షం పడుతుండడంతో ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాల్లోకి వరద చేరుతోంది. ఫలితంగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఉదయం, సాయంత్రం వేళల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోతోంది. ఓవైపు వర్షం.. మరోవైపు ట్రాఫిక్‌తో నగరవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ సమస్యతో ఒక్కొక్కరు సగటున రెండు గంటల పని కోల్పోతుండడం గమనార్హం. ఇక వర్షంకారణంగా ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి నగరంలోని ప్రధాన మార్కెట్లకు వచ్చే కూరగాయల దిగుమతులు అనూహ్యంగా తగ్గిపోయాయి. ఫలితంగా కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. మరోవైపు సీజనల్ వ్యాధులు విజృంభించడంతో సిటీజనులు ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు. తగ్గిన దిగుమతులు... వరుస వర్షాలతో నగరంలోని బోయిన్పల్లి, గుడిమల్కాపూర్ తదితర మార్కెట్లకు వచ్చే కూరగాయల దిగుమతి అనూహ్యంగా తగ్గింది. ప్రధానంగా బెంగళూరు, చిక్మంగళూరు, ఏపీలోని జిల్లాల నుంచి నిత్యం నగరానికి వచ్చే కూరగాయల్లో 30శాతం తగ్గినట్లు మార్కెటింగ్ శాఖ వర్గాలు తెలిపాయి. ఇక రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల నుంచి వచ్చే కూరగాయల్లో 60శాతం మేర తగ్గాయి. దీంతో కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. దాదాపు అన్ని రకాల కూరగాయల ధరలు కిలోకు రూ.10 నుంచి రూ.15 వరకు పెరిగాయి. మరోవైపు సిటీలో చికెన్ వినియోగం అనూహ్యంగా పెరిగింది. వ్యాధుల పంజా.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి సిటీలో మురుగు కాల్వలు పొంగిపొర్లుతున్నాయి. చాలా చోట్ల ఇళ్ల మధ్యే నీరు నిల్వ ఉంటోంది. ఇవన్నీ ఈగలు, దోమలకు నిలయాలుగా మారాయి. వాటి వల్ల డెంగీ, మలేరియా, డయేరియా తదితర వ్యాధులు పంజా విసురుతున్నాయి. సీజనల్ వ్యాధులతో బాధపడుతూ సిటీజనులు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. మరో రెండు రోజులు.. ఉపరితల ఆవర్తనం, అల్పపీడన ప్రభావంతో మరో రెండు రోజుల పాటు నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశాలున్నట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. సరాసరిన నగరంలో మూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బల్దియాకు ఫిర్యాదుల వెల్లువ.. ముసురు కారణంగా జీహెచ్ఎంసీకి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. చెట్లు కూలిపోయిన సంఘటనలపై 3 ఫిర్యాదులు, లోతట్టు ప్రాంతాలు జలమయమైన సంఘటనలపై 23 ఫిర్యాదులు అందినట్లు బల్దియా వర్గాలు తెలిపాయి. అప్రమత్తమైన బల్దియా బృందాలు వర్షాల నేపథ్యంలో నగరవాసులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టినట్టు జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిశోర్ తెలిపారు. రోడ్లపై నీరు నిల్వకుండా, లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురికాకుండా, కూలిన చెట్లను వెంటనే తొలగించేందుకు జీహెచ్ఎంసీ మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు, డిజాస్టర్ రెస్క్యూ బృందాలు విధుల్లో ఉన్నాయని చెప్పారు. శుక్రవారం 40కి పైగా ప్రాంతాల్లో ఏర్పడిన నీటి నిల్వలను డిజాస్టర్ రిలీఫ్ బృందాలు తొలగించాయని పేర్కొన్నారు. చెట్లు కూలిన ఫిర్యాదులు 12 నమోదు కాగా.. వాటిని వెంటనే తొలగించామన్నారు. పోలీస్, ట్రాఫిక్, జలమండలి, అగ్నిమాపక విభాగం, రెవెన్యూ తదితర విభాగాలతో జీహెచ్ఎంసీ సమన్వయంతో పని చేస్తోందన్నారు. గ్రేటర్లో గుర్తించిన 195 ముంపు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిసారించినట్లు తెలిపారు. ఈ ప్రాంతాల్లోని మ్యాన్‌హోళ్లు, క్యాచ్పిట్ల వద్ద నిరంతరం తనిఖీలు నిర్వహించి అక్కడి నాలాల్లో ఏ విధమైన పూడిక, వ్యర్థాలు లేకుండా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్ బృందాలు 13, మినీ మొబైల్ మాన్సూన్ బృందాలు 76, మేజర్ మొబైల్ మాన్సూన్ బృందాలు 75, జోనల్ ఎమర్జెన్సీ బృందాలు 2, స్టాటిక్ లేబర్ టీమ్‌లు 138, జలమండలి ఎమర్జెన్సీ రెస్క్యూ బృందాలు 45 క్షేత్రస్థాయిలో పని చేస్తున్నాయని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో జీహెచ్ఎంసీ కాల్ సెంటర్ 040–21111111, డయల్ 100కు ఫోన్ చేయాలని సూచించారు. మేయర్ పర్యటన... వర్షాలతో నగరంలో నీటి నిల్వలు ఏర్పడ్డ ప్రాంతాలు, తదితర ప్రదేశాల్లో తనిఖీలు చేసిన మేయర్ రామ్మోహన్ నివారణ చర్యలను పరిశీలించారు. మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు, డిజాస్టర్ రెస్క్యూ బృందాలు క్షేత్రస్థాయిలో చేపడుతున్న పనులను పరిశీలించారు. ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, ఇందిరాపార్కు, ట్యాంక్‌బండ్ తదితర ప్రాంతాల్లో పర్యటించి లోతట్టు ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ సిబ్బంది చేపట్టిన సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఇదీ పరిస్థితి.. ♦ కంటోన్మెంట్ పరిధిలోని లోతట్టు ప్రాంతాలకు వరద నీరు చేరింది. రహదారుల పైకి వరద రావడంతో ట్రాఫిక్ జామ్ అయింది. గాలులకు చెట్లు నేలకూలాయి. అక్కడక్కడ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ♦ మేడ్చల్‌లో గురువారం రాత్రి నుంచి శుక్రవారం రాత్రి వరకూ వర్షం కురిసింది. దీంతో రోడ్లపైకి వరద నీరు చేరింది. ♦ గండిమైసమ్మ–దుండిగల్ మండలం 120 గజాల్లో వరద నీరు చేరడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని ఇళ్లలోకి వరద చేరడంతో వస్తు సామగ్రి, ఆహార పదార్థాలు తడిసిపోయాయి. వరద బయటకు వెళ్లే మార్గం లేకపోవడంతో ప్రతిసారీ మాకు ఇబ్బందులు తప్పడం లేదని వాపోయారు. ♦ జియాగూడ డోర్ బస్తీలో ఓ పాత ఇల్లు కూలిపోయింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగనప్పటికీ... ఓ యాక్టివా వాహనం ధ్వంసమైంది. ♦ ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ స్తంభించింది. రాయదుర్గం, గచ్చిబౌలి, కూకట్పల్లి, కొండాపూర్ రోడ్లపై ట్రాఫిక్ జామ్ అయింది. ♦ ఎల్బీనగర్లో జన జీవనం స్తంభించింది. ఎల్బీనగర్ రింగ్ రోడ్డు, నాగోలు, సాగర్ రింగ్ రోడ్డు తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ♦ వర్షాలకు కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ సిగ్నల్స్ మొరాయించాయి. ఈసీఐఎల్ చౌరస్తాలో సిగ్నల్ మొరాయించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. నాచారం, మల్లాపూర్, భవానీనగర్, అశోక్‌నగర్, మర్రిగూడ, రాఘవేంద్రనగర్ తదితర ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. వర్షానికి అడ్డా కూలీ మృతి తార్నాక: రెండు రోజులుగా కురుస్తున్న వర్షం, ఈదురు గాలుల కారణంగా ఫుట్‌పాత్‌పై ఉంటున్న ఓ అడ్డాకూలీ మృతిచెందిన సంఘటన ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరి«ధిలోని తార్నాక వైట్‌హౌజ్ ప్రాంతంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి...జనగామ జిల్లా, ఈరంటి గ్రామానికి చెందిన సోమయ్య(50) బతుకుదెరువు నిమిత్తం నగరానికి వలస వచ్చి తార్నాకలో ఉంటున్నాడు. అతడి భార్య ఇళ్లల్లో పాచిపనులు చేస్తూ హబ్సిగూడలోని ఓ ఇంట్లో ఉంటోంది. సోమయ్య సెయింట్ ఆన్స్ పాఠశాల సమీపంలోని లేబర్ అడ్డాలో ఉంటూ కూలీగా పని చేసేవాడు. గురువారం రాత్రి తోటి కూలీలతో కలిసి ఫుట్‌పాత్‌పై నిద్రపోతున్న అతను శుక్రవారం ఉదయం మృతి చెందాడు. దీనిపై సమాచారం అందడంతో స్థానిక కాంగ్రెస్ నాయకుడు వీరన్న విరాళాలు సేకరించి సోమయ్య మృతదేహాన్ని స్వగ్రామానికి పంపించాడు. మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. -
రయ్.. రయ్
సాక్షి సిటీబ్యూరో: వ్యూహాత్మక రహదారుల పథకం (ఎస్సార్డీపీ)... నగరంలో ట్రాఫిక్ చింతలను తీర్చేందుకు, సిగ్నల్ ఫ్రీ ప్రయాణం సాధ్యం చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన బృహత్తర పథకం. ఈ ప్రాజెక్టు కింద వివిధ దశల్లో రూ.25 వేల కోట్ల పనులకు ప్రణాళికలు రూపొందించగా... దాదాపు రూ.7వేల కోట్ల పనులకు శ్రీకారం చుట్టారు. దాదాపు రూ.300 కోట్ల మేర పనులు పూర్తయ్యాయి. ఆయా మార్గాల్లో ప్రజలకు ట్రాఫిక్ ఇక్కట్లు తగ్గాయి. మరికొన్ని ప్రాంతాల్లో పనులు వివిధ దశల్లో ఉన్నాయి. గడిచిన 10 నెలల కాలంలో వివిధ ఎన్నికలకు సంబంధించిన ప్రవర్తనా నియమావళి ఉండడం, బాండ్ల ద్వారా నిధులు సేకరించేందుకు మార్కెట్ పరిస్థితి బాగాలేకపోవడం, వడ్డీ రేటు అధికంగా ఉండడం తదితర కారణాలతో జీహెచ్ఎంసీ బాండ్లకు వెళ్లలేదు. కొన్ని మార్గాల్లో భూసేకరణ, యుటిలిటీస్ తరలింపు పనుల్లో జాప్యం లాంటి కారణాలతో పనుల్లో వేగం తగ్గింది. త్వరలోనే బాండ్ల ద్వారా రూ.400 కోట్లు సేకరించేందుకు, భూసేకరణ సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా అడిషనల్ కమిషనర్, సిబ్బందిని నియమించేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఎస్సార్డీపీ పనుల్లో తిరిగి వేగం పుంజుకుంటుందని కమిషనర్ దానకిశోర్ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటి వరకు జరిగిన పనులు, ఎదురవుతున్న అవాంతరాలు, ఆయా దశల్లోని పనుల స్థితిగతులపై ‘సాక్షి’ రిపోర్టు. మూడేళ్ల క్రితం ప్రారంభం గ్రేటర్లో వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించేందుకు, ఇతర జిల్లాలకు వెళ్లేందుకు ట్రాఫిక్ సమస్యలు లేకుండా సాఫీ ప్రయాణానికి ప్రభుత్వం మూడేళ్ల క్రితం ఎస్సార్డీపీ ప్రాజెక్టు చేపట్టింది. గతేడాది వరకు ఈ పనులు వేగంగానే జరగ్గా... ఇటీవల కొంత మందగించాయి. ఈ పనుల కోసం రెండు దశల్లో జీహెచ్ఎంసీ రూ.395 కోట్లు సేకరించింది. ఈ నిధులను ఇతర పనులకు కేటాయించే వీలు లేకపోవడంతో పనులు ముందుకు సాగాయి. అయితే ఏప్రిల్ నుంచి నిధులు లేకపోవడంతో బాండ్లు/ బ్యాంకు రుణాల ద్వారా తీసుకునేందుకు చర్యలు చేపట్టిన జీహెచ్ఎంసీ త్వరలోనే రూ.400 కోట్లు సేకరించనుంది. ప్రాజెక్టుల వివరాలివీ... ♦ ఎల్బీనగర్ ఐదు జంక్షన్లలో (ఎల్బీనగర్, కామినేని, నాగోల్, బైరామల్‌గూడ, చింతల్‌కుంట) 8 ఫ్లైఓవర్లు, 2 అండర్‌పాస్‌లు. అంచనా వ్యయం రూ.448 కోట్లు కాగా.. ఇప్పటి వరకు రూ.167 కోట్లు ఖర్చు చేశారు. ఈ ఆర్థిక సంవత్సవరానికి రూ.105 కోట్లు, భూసేకరణకు రూ.205 కోట్లు అవసరం. 35 శాతం సివిల్ పనులు పూర్తయ్యాయి. ♦ మైండ్‌స్పేస్, బయో డైవర్సిటీ పరిసరాల్లో పనులకు అంచనా వ్యయం రూ.379 కోట్లు కాగా.. ఇప్పటి వరకు రూ.284 కోట్లు ఖర్చు చేశారు. ఈ ఏడాదికి రూ.40 కోట్లు అవసరం. భూసేకరణకు రూ.64 కోట్లు ఖర్చు చేశారు. 80 శాతం సివిల్ పనులు పూర్తయ్యాయి. బయో డైవర్సిటీ వద్ద మూడు ఆస్తులు సేకరించాల్సి ఉంది. ♦ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 నుంచి దుర్గం చెరువు వరకు నాలుగు లేన్ల రహదారి (ఎలివేటెడ్ కారిడార్)కి అంచనా వ్యయం రూ.150 కోట్లు కాగా.. ఇప్పటి వరకు రూ.65 కోట్లు ఖర్చు చేశారు. ఈ ఏడాదికి రూ.40 కోట్లు, భూసేకరణకు రూ.20 కోట్లు అవసరం. సివిల్ పనులు 52 శాతం పూర్తయ్యాయి. 21 ఆస్తులు సేకరించాల్సి ఉంది. ♦ దుర్గం చెరువుపై కేబుల్ స్టే బ్రిడ్జి ఏర్పాటుకు అంచనా వ్యయం రూ.184 కోట్లు కాగా.. ఇప్పటి వరకు రూ.90 కోట్లు ఖర్చు చేశారు. ఈ ఏడాదికి రూ.94 కోట్లు అవసరం. సివిల్ పనులు 63 శాతం పూర్తయ్యాయి. ♦ షేక్‌పేట – విస్పర్‌వ్యాలీ... సెవెన్ టూంబ్స్ (షేక్‌పేట), ఫిల్మ్‌నగర్ రోడ్ జంక్షన్, ఓయూ కాలనీ జంక్షన్, విస్పర్‌వ్యాలీ వరకు ఆరు లేన్లుగా రెండువైపులా రాకపోకలకు ఫ్లైఓవర్ల ఏర్పాటుకు అంచనా వ్యయం రూ.333.55 కోట్లు కాగా.. ఇప్పటి వరకు రూ.50 కోట్లు ఖర్చు చేశారు. ఈ ఏడాదికి రూ.181 కోట్లు, భూసేకరణకు రూ.205 కోట్లు అవసరం. 88 ఆస్తులు సేకరించాల్సి ఉండగా.. 13 ఆస్తుల సేకరణ క్లిష్టంగా మారింది. ♦ బొటానికల్ గార్డెన్, కొత్తగూడ, కొండాపూర్ జంక్షన్లలో ఫ్లైఓవర్ల ఏర్పాటుకు అంచనా వ్యయం రూ.263 కోట్లు కాగా... ఇప్పటి వరకు రూ.60 కోట్లు ఖర్చు చేశారు. ఈ ఏడాదికి రూ.138 కోట్లు, భూసేకరణకు రూ.205 కోట్లు అవసరం. సివిల్ పనులు 63 శాతం పూర్తయ్యాయి. 160 ఆస్తులు సేకరించాల్సి ఉండగా... 40 ఆస్తుల సేకరణ క్లిష్టంగా మారింది. ♦ ఒవైసీ జంక్షన్ ఫ్లైఓవర్ అంచనా వ్యయం రూ.63 కోట్లు కాగా.. ఇప్పటి వరకు చేసిన రూ.15 కోట్లు ఖర్చు చేశారు. ఈ ఏడాదికి రూ.37 కోట్లు అవసరం. 19 శాతం మేర పనులు పూర్తయ్యాయి. 1.6 కిలోమీటర్ల పొడవైన ఈ ఫ్లైఓవర్‌కు 38 పిల్లర్లకు గాను 13 పూర్తయ్యాయి. 13 ఆస్తులు సేకరించాల్సి ఉంది. ♦ బహదూర్‌పురా జంక్షన్ ఫ్లైఓవర్ అంచనా వ్యయం రూ.69 కోట్లు కాగా... ఇప్పటి వరకు రూ.6 కోట్లు ఖర్చు చేశారు. ఈ ఏడాదికి రూ.28 కోట్లు అవసరం. 780 మీటర్ల పొడవుండే దీనికి 9 పిల్లర్లకు గాను నాలుగింటి పనులు ప్రారంభమయ్యాయి. మొత్తం 47 ఆస్తులకు గాను ఆరింటిని సేకరించారు. నిధులకు కొరత లేదు బాండ్ల ద్వారా నిధుల సేకరణ కోసం శుక్రవారం ముంబై వెళ్తున్నాం. రూ.400 కోట్లు సేకరిస్తాం. రానున్న 6 నెలల్లో మరో రూ.3,000 కోట్ల మేర పనులకు టెండర్లు పూర్తి చేసి ప్రారంభిస్తాం. భూసేకరణ, యుటిలిటీస్ తరలింపులో జాప్యం నిజమే. వీటి పరిష్కారానికి ప్రత్యేకంగా అడిషనల్ కమిషనర్, సిబ్బందిని నియమిస్తాం. నిధుల లేమితో పనులు ఆగిపోలేదు. బాండ్ల నిధులు ఖర్చయ్యాక కూడా దాదాపు రూ.100 కోట్లు జనరల్ ఫండ్ నుంచి ఖర్చు చేశాం. వడ్డీ భారం పెరగకుండా ఉండేందుకు పనుల పురోగతి మేరకు ఎప్పటి కప్పుడు నిధులు సేకరిస్తాం. – ఎం.దానకిశోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ పూర్తయిన పనులివీ... ♦ అయ్యప్పసొసైటీ అండర్‌పాస్ ♦ మైండ్‌స్పేస్ జంక్షన్ అండర్‌పాస్ ♦ మెండ్స్పేస్ ఫ్లైఓవర్ ♦ చింతల్‌కుంట చెక్‌పోస్ట్ జంక్షన్ ♦ కామినేని ఎడమవైపు ఫ్లైఓవర్ ♦ ఎల్బీనగర్ ఎడమవైపు ఫ్లైఓవర్ ♦ రాజీవ్‌గాంధీ ఫ్లైఓవర్ మొత్తం రూ.6,759 కోట్లు ఎస్సార్డీపీ పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఇప్పటికే టెండర్లు పూర్తయిన వాటిలో ఎన్జీటీ తీర్పులు, టెండర్లకు ప్రభుత్వ ఆమోదం రావాల్సి ఉండడం తదితర కారణాలతో దాదాపు రూ.1297 కోట్ల పనులు అనుమతుల కోసం ఎదురు చూస్తున్నాయి. రూ.292 కోట్ల పనులు పూర్తయి.. పలు ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. -
కాలుష్యానికి చెక్
సాక్షి సిటీబ్యూరో: నగరంలో నానాటికి పెరిగిపోతున్న ట్రాఫిక్ రద్దీ, కాలుష్యం భారి నుంచి ప్రజలకు ఉపశమనం కలిగిస్తూ వారికి మెరుగైన జీవన విధానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం వినూత్న చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రాజధాని నగరంలో పాటు శివారు ప్రాంతాల్లో అహ్లాదకరమైన వాతావరణాన్ని అందిచేందుకు అటవీశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా పార్కులను ఏర్పాటు చేయనుంది. పట్టణాలకు సమీపంలో ఉన్న అటవీ భూములను గుర్తించి వాటిల్లో కొంత భాగాన్ని ‘అర్బన్ లంగ్ స్పేస్‌లు’గా అభివృద్ధి చేస్తున్నారు. నగరం నలువైపులా ఈ తరహా పార్కులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాజధాని పరిధిలో ఔటర్ రింగ్ రోడ్డుకు లోపల, వెలుపల మొత్తం 14 ప్రాంతాలను అర్బన్ పార్కులుగా తీర్చిదిద్దేందుకు అటవీ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసి ఇప్పటికే పలు చోట్ల పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఆయా అర్బన్ పార్క్‌లను పలు బ్లాక్‌లుగా విభజించి అభివృద్ధి చేస్తున్నారు. ఆహ్లాదం..ఉత్సాహం.. గుర్రంగూడ, కండ్లకోయ, మేడ్చల్, దూలపల్లి, గాజుల రామారం తదితుర ప్రాంతాల్లోని అటవీ బ్లాక్‌లలో పార్కుల అభివృద్ధి శరవేగంగా జరుగుతోంది. ఇందుకుగాను 3345 హెక్టార్ల అటవీ భూమిని గుర్తించి పార్కులుగా అభివృద్ధి చేయనున్నారు. నిత్యం ట్రాఫిక్, కాంక్రీట్ జంగిల్‌గా మారిన బిజీ లైఫ్ లో ఉదయమో, సాయంత్రం వేళ్లో్ల వాకింగ్, కుటుంబం లేదా స్నేహితులతో సరదాగా కాసేపు గడిపేందుకు, పెద్దలకు వాకింగ్ ట్రాక్, యోగా ప్లేస్ లతో పాటు, పిల్లలు ఆడుకునేందుకు ప్లే గ్రౌండ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. కుటుంబాలతో కలిసి పిక్నిక్ కు వెళ్లినా, అన్ని సౌకర్యాలు ఉండేలా ఈ పార్క్‌లను తీర్చిదిద్దుతున్నారు ఎకో టూరిజానికి అవకాశాలు... గుర్రంగూడ సంజీవని పార్క్, అజీజ్ నగర్ సమీపంలోని మృగవని నేషనల్ పార్క్, కండ్లకోయ నేచర్ పార్క్, శంషాబాద్ సమీపంలో డోమ్ నేర్ పార్క్, ఘట్ కేసర్ సమీపంలోని భాగ్యనగర్ సందనవనం పార్క్, హయత్‌నగర్‌లోని మహవీర్ హరిణ వనస్థలి, కుంట్లూర్, మన్సురాబాద్, కుత్బుల్లాపూర్ బ్లాక్‌లు, గండిగూడ పార్కులు ఇప్పటికే పూర్తయి పెద్ద సంఖ్యలో స్థానికులను, పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. చుట్టుపక్కల ఉన్న కాలనీలు, పట్టణ ప్రాంతానికి కేవలం మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ పార్కుల అభివృద్ధి చేయడంతో సందర్శకుల సం ఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. వీటిల్లో కొన్ని పార్కుల్లో కాటేజీలను కూడా అటవీ శాఖ ఏర్పా టు చేసింది. దీంతో ఎకో టూరిజానికి అవకాశాలు పెరిగాయి. ప్రకృతి మధ్యలో అటవీ ప్రాంతాల్లో ఒకటి రెండు రోజులు గడపటంతో పాటు పచ్చటి వాతావరణంలో సేదతీరాలని భావించే వారికి ఇవి చక్కటి అవకాశంగా మారాయి. ఒక్కో పార్క్ ఒక్కో థీమ్.... ఒక్కో పార్క్ ను ఒక్కో థీమ్ తో తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 80 అర్బన్ పార్క్‌ల ఏర్పాటు లక్ష్యంగా పనిచేస్తున్న అటవీ శాఖ. అన్ని పట్టణ ప్రాంతాలు, ఆవాసాలకు వీలైనంత సమీపంలో ఈ అర్బన్ లంగ్ స్పేస్ లను అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో అటవీ శాఖ పనిచేస్తోంది. రంగారెడ్డి జిల్లాలో 26 బ్లాక్‌లను గుర్తించగా వీటిలో 7 అటవీశాఖ, 9 హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ 2, టీఎస్ఐఐసీ 5, హైదరాబాద్ మెట్రో రైల్ 2, టీఎస్ఎఫ్డీసీ 1 బ్లాక్‌లను అభివృద్ధి చేస్తున్నారు. అన్ని అర్బన్ పార్కులు, బ్లాక్‌ల పనులు ఈ ఏడాది నవంబర్ నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు పనిచేస్తున్నారు. ఇవే కాకుండా మేడ్చల్ జిల్లా పరిధిలోను 11 బ్లాక్‌లలో పనులు చేపడుతున్నారు. -
ఆ స్థలంలో వాహనాలు అదృశ్యం
-
ఆ స్థలంలో వాహనాలు అదృశ్యం
కొన్ని దృశ్యాలు కంటితో చూసినప్పటికీ.. అవి నిజమా? కాదా?.. అనే సందేహం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. అలాంటి భావనే కలిగించే ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ట్రాఫిక్ సిగ్నల్ దాటుకొని వస్తున్న వాహనాలు.. పక్కనే ఉన్న నది వంతెనలోకి దూసుకుపోయి అదృశ్యమవుతున్నట్టు కన్పిస్తున్న వీడియోను డేనియల్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కాగా దీనిపై చాలా మంది నెటిజన్లు తమకు తోచిన విధంగా సమాధానమిస్తున్నారు. మరి కొందరైతే వాహనాలు ఎలా అదృశ్యమవుతున్నాయో తెలుసుకోవడానికి వారి ఊహకు పని చెబుతున్నారు. ఈ వంతెన.. విమానాలు, పడవలను అదృశ్యం చేసే ‘బెర్ముడా ట్రయాంగిల్’ ప్రాంతంలా ఉందని, హ్యారీపోటర్ సినిమాలోని మాయా విశ్వం మాదిరిగా ఉందని ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ వీడియోను గ్రాఫిక్స్‌లో అలా క్రియేట్ చేశారా లేదా అనేది తెలాల్సి ఉంది. -
రాంగ్ రూట్లో రావొద్దన్నందుకు దాడి
బంజారాహిల్స్: రాంగ్రూట్లో ఎందుకు వస్తున్నావంటూ ప్రశ్నించినందుకు ఓ యువకుడిపై కొంత మంది యువకులు దాడి చేసి గాయపరిచారు. ఈ సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. రహ్మత్‌నగర్ సమీపంలోని జవహర్‌నగర్ సాయిబాబా టెంపుల్ వద్ద కొందరు యువకులు రాంగ్రూట్లో బైక్‌పై వస్తుండగా పాదాచారులతో పాటు ఇతర వాహనదారులు భయాందోళనలకు గురయ్యారు. రాంగ్రూట్లో వస్తే ప్రమాదాలు జరుగుతాయని స్థానికంగా నివసించే జోమాటో డెలివరీ బాయ్ శివశంకర్(22) వారిని మందలిస్తూ నిలదీశాడు. దీంతో సదరు యువకులు మద్యం మత్తులో శివశంకర్‌పై కత్తులు,రాడ్లు, ట్యూబ్‌లైట్లతో దాడి చేసి గాయపర్చారు. ఎంత బతిమిలాడినా వినిపించుకోలేదు. వారి నుంచి తప్పించుకునేందుకు శివశంకర్ తీవ్రంగా యత్నించాడు. అయినా వదిలిపెట్టకుండా వెంటపడి కొట్టారు. సుమారు గంటపాటు సాయిబాబా టెంపుల్చౌరస్తాలో యువకుల మధ్య ఘర్షణ ఉధ్రిక్తతకు దారి తీసింది. స్థానికులు ఆపేందుకు యత్నించినా ఉపయోగం లేకుండా పోయింది. దాడి చేసిన యువకులు అక్కడి నుంచి పరారీ కాగా పోలీసులు రాత్రంతా గాలించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. శివశంకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
‘ఆపరేషన్’ రెయిన్!
సాక్షి, సిటీబ్యూరో: ఈ సీజన్లో కురిసిన తొలి వర్షానికే ఐటీ కారిడార్‌లో పరిస్థితి అతలాకుతలంగా మారడంతో..ఇక ముందు అలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు జీహెచ్ఎంసీ అధికారులు తగిన కార్యాచరణ రూపొందించారు. ఒక్క వర్షానికే హైటెక్‌సిటీ జీవనం కకావికలం కావడంతో, అందుకు కారణాలు, పరిష్కార మార్గాలపై సమీక్షలు నిర్వహించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిశోర్, శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ హరిచందన దాసరి, చీఫ్ ఇంజినీర్ జియాఉద్దీన్, జేఎన్టీయూ నిపుణులు శని, ఆదివారాల్లో నీటిముంపు ప్రాంతాలను పరిశీలించారు. ఆదివారం సైబరాబాద్ పోలీస్ కార్యాలయంలో వీరితో పాటు విద్యుత్ అధికారులు, తదితరులతో సమీక్ష నిర్వహించారు. సమీక్షలు, క్షేత్రస్థాయి తనిఖీల పరిస్థితులతో వర్ష సమస్యల పరిష్కారానికి తగు నిర్ణయాలు తీసుకున్నారు. నగరంలో మొత్తం 197 ప్రాంతాల్ని నీటి ముంపు సమస్య ప్రాంతాలుగా గుర్తించారు. వీటిల్లో 37 ప్రాంతాలకు ఇప్పటికే శాశ్వత పరిష్కారం చేయగా, ఇవి పోను మిగతా 160 ప్రాంతాలను సమస్య తీవ్రతను బట్టి ఏ,బీ,సీ కేటగిరీలుగా విభజించారు. వీటిల్లో ఏ కేటగిరీలో సీజన్ ముగిసేంత వరకు నీటిని తోడే భారీ మోటార్ పంపులను, సిబ్బందిని శాశ్వతంగా 24 గంటల పాటు అందుబాటులో ఉంచుతారు. వర్షం పడగానే వారు రంగంలోకి దిగుతారు. మిగతా ప్రాంతాల్లో దగ్గర్లోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, షాపులు, వంటి ప్రాంతాల్లో 3 హెచ్‌పీ, 5 హెచ్‌పీ సామర్ధ్యం కలిగిన మోటార్ పంపులను ఉంచుతారు. వర్షం పడుతుందనే వాతావరణశాఖ సూచనలతో లేదా వర్షం పడ్డ వెంటనే తోడేందుకు మనుషులు అక్కడకు వెళ్తారు. ఇరవైనాలుగు గంటల్లో ఎప్పుడైనా వెంటనే సన్నద్ధంగా ఉంటారు. ప్రత్యేక యాక్షన్ ప్లాన్.. శేరిలింగంపల్లి, గచ్చిబౌలి ప్రాంతాల్లోని 12 లొకేషన్లలో సమస్య పరిష్కారానికి ప్రత్యేకంగా యాక్షన్‌ప్లాన్ రూపొందించారు. అక్కడి పరిస్థితుల్ని బట్టి దేనికదిగా వేర్వేరుగా ఈ యాక్షన్‌ప్లాన్ రూపొందించారు. జేఎన్టీయూ ప్రొఫెసర్ లక్ష్మణ్‌రావు సూచనల మేరకు ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఎక్కడికక్కడే వరదనీరు సమీపంలోని ఒక ప్రాంతానికి చేరి నిల్వ ఉండేలా పర్కొలేషన్ట్యాంక్స్ (నీటి కుంటలు) 30 ్ఠ 20 అడుగులతో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దుర్గం చెరువు, నెక్టర్‌గార్డెన్, శిల్పారామం తదితర ప్రాంతాల్లోని ఖాలీస్థలాల్లో ఈ నీటికుంటలు ఏర్పాటు చేసి వరదనీరు వాటిల్లోకి వెళ్లేలా ఏర్పాట్లు చేస్తారు. శిల్పారామం వంటి ప్రాంతాల నుంచి తూము పొంగుతున్నా పక్కనే ఉన్న చెరువులోకి నీరు వెళ్లేందుకు దారి లేదు. ఇలాంటి సమస్యలనూ పరిష్కరించాలని నిర్ణయించారు. అవసరమైన ప్రాంతాల్లో 1. 2 డయామీటర్ పైపుల్ని వెంటనే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్( హెచ్ఆర్డీసీఎల్) ప్రాంతాల్లో అది సంబంధిత పనుల్ని చేస్తుంది. మైండ్‌స్పేస్ వద్ద సమస్య సరిష్కారానికి టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో నీరు రోడ్డుకు ఇటు నుంచి అటు వెళ్లేందుకు పైప్‌లైన్‌ను మూడు రోజుల్లో వేయనున్నారు. సీఓడీ, సాఫ్టెల్ సిగ్నల్ జంక్షన్ల వద్ద అభివృద్ధి పనులకు జోనల్ కమిషనర్ వెంటనే టెండర్లు పిలవనున్నారు. పలు ప్రాంతాల్లో వరదకాలువల్లో ఉన్న విద్యుత్ లైన్లు, ఫైబర్ కేబుళ్లు తదితరమైన వాటితో సమస్య పెరుగుతుండటంతో . వీటిని వెంటనే తొలగించనున్నారు. పలు ప్రాంతాల్లో వరదకాలువల్లో ఉన్న విద్యుత్ లైన్లు, ఫైబర్ కేబుళ్లు తదితరమైన వాటితో సమస్య పెరుగుతుండటంతో . వీటిని వెంటనే తొలగించనున్నారు. ఫుట్‌పాత్‌ల దగ్గర నీరు సాఫీగా వెళ్లేందుకు వీలుగా అవకాశమున్న అన్ని ప్రాంతాల్లో వెంట్లను పెద్దగా ఏర్పాటు చేస్తారు. జీహెచ్ఎంసీ వర్షాకాల విపత్తు బృందాలు, డీఆర్ఎఫ్ టీమ్స్ తదితరమైనవి కలిపి దాదాపు 500 వర్షాకాల బృందాలు సేవలందించేందుకు సిద్ధంగా ఉంటాయి. ప్రస్తుతం 8 డీఆర్ఎప్ టీమ్‌లుండగా, మరో 8 ఏర్పాటు చేయనున్నారు. ఎస్సార్డీపీ (వ్యూహాత్మక రహదారుల పథకం) పనులు జరుగుతున్న ప్రాంతాల్లో నిర్మాణ సామాగ్రి, ఇసుక, తదితరమైన వాటివల్ల నీరు నిలిచిపోకుండా తగిన చర్యలు తీసుకోవాలని దానకిశోర్ ఆదేశించారు. పనులు జరిగే ప్రాంతాల్లో తప్పనిసరిగా సైన్‌బోర్డులు ఏర్పాటు చేయడంతో వర్షాల వల్ల ప్రమాదాలు జరగకుండా అవసరమైన అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్ల వెంబడి, నాలాల్లో నిర్మాణ, కూల్చివేతల వ్యర్థాలు (సీఅండ్‌డీ వేస్ట్), ప్లాస్టిక్స్, చెత్త వేసేవారికి భారీ జరిమానాలు విధించాల్సిందిగా సూచించారు. వర్షం కురుస్తున్నప్పుడు ప్రజలు బయటకు రావద్దని కమిషనర్ సూచించారు. అప్పటికే రోడ్ల మీద వున్నవారు సాఫీగా ఇంటికి చేరుకునేందుకు అవకాశమివ్వాలన్నారు. అందరూ రోడ్లపైకి వస్తే ట్రాఫిక సమస్యలు ఎదురవుతాయన్నారు. ఐటీ కారిడార్‌లోని 5 లక్షలమంది ఒకేసారి బయటకు వస్తే ఇబ్బందులుంటాయని, విడతల వారీగా అయితే ట్రాఫిక్ చిక్కులుండవని పేర్కొన్నారు. వర్షం వచ్చాక గంట సేపటి వరకు బయటకు రాకపోవడం శ్రేయస్కరమని చెప్పారు. -
జోరుగా షి'కార్'!
రాజధానిలోని ట్రాఫిక్‌పై క్రమక్రమంగా ‘కారు’మబ్బులు కమ్ముకుంటున్నాయి. నగరంలో కార్లు వంటి తేలికపాటివాహనాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇతర వాహనాలు, చివరకు టూ వీలర్స్ సైతం వీటి‘వేగాన్ని’ అందుకోలేకపోతున్నాయి. మెట్రో రైల్ సేవలు అందుబాటులోకి వస్తే రోడ్లపై ట్రాఫిక్ గణనీయంగా తగ్గుతుందని భావించారు. రెండు మార్గాల్లో మెట్రో పరుగులు పూర్తిస్థాయిలో మొదలైనాట్రాఫిక్ ఉపశమనం ఆశించిన స్థాయిలో లేదు. దీనికి కార్ల సంఖ్య పెరగటమూ ఓ కారణమనిఅధికారులు అంచనా వేస్తున్నారు. సాక్షి, సిటీబ్యూరో: 2001–19 (మార్చి) మధ్య గణాంకాలకువిశ్లేషిస్తే మొత్తం వాహనాల్లో ద్విచక్ర వాహనాల శాతం నానాటికీ తగ్గుతూ వస్తుండగా... కార్లది మాత్రం పైపైకి పోతోంది. తేలికపాటి వాహనమైన కార్లలో వ్యక్తిగతమైనవే అత్యధికం. ఈ ధోరణి కొనసాగితే భవిష్యత్తులో మరిన్ని ‘జామ్’జాటాలు, కాలుష్య కష్టాలు తప్పవని ట్రాఫిక్ విభాగంఅధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తీసికట్టుగా సిటీ రోడ్ల విస్తీర్ణం... హైదరాబాద్ నగరం విస్తీర్ణంలో కేవలం 8.32 శాతం మాత్రమే రోడ్లు ఉన్నాయి. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం కనీసం 12 శాతం ఉండాలి. ముంబైలో ఇది 10 శాతంగా, చెన్నైలో ఏకంగా 18 శాతంగా ఉంది. వాహనాలుపెరుగుతున్న స్థాయిలో రోడ్ల విస్తరణ, ఫ్లైఓవర్ల నిర్మాణం వంటి మౌళిక వసతుల కల్పన జరగట్లేదు. గ్రేటర్లో వాహనాల సంఖ్య మాత్రం నానాటికీ పెరుగుతూ మార్చి నాటికి 60,34,398కు చేరింది. వీటికి తోడు ప్రతి రోజూ కొత్తగా 600 వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి. గడిచిన పదిహేడేళ్ల కాలంలో రాజధానిలోని వాహనాల సంఖ్య ఐదు రెట్లు అయింది. ఇంతకు మించి ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే... ద్విచక్ర వాహనాలకు పోటీగా కార్లు వంటి తేలికపాటి వాహనాలు వచ్చి చేరుతున్నాయి. కారు ఉండటం ఒక ఎత్తయితే... దాన్ని తీసుకుని నిత్యం రోడ్డు పైకి రావడం మరో ఎత్తు. రోడ్డుపై ఒక్క కారు ఆక్రమించే స్థలంలో దాదాపు కనిష్టంగా 4 ద్విచక్ర వాహనాలు ప్రయాణిస్తాయి. అయితే కొత్తగా వస్తున్న తేలికపాటి వాహనాల్లో వ్యక్తిగతమైనవే ఎక్కువగా ఉండటంతో అందులో ఒకరు లేదా ఇద్దరు చొప్పునే ప్రయాణిస్తున్నారు. అంటే రోడ్డుపై 8 మంది వెళ్లాల్సిన ప్రదేశాన్ని ఇద్దరే ఆక్రమిస్తున్నారన్న మాట. ఇదే ట్రాఫిక్ పోలీసులకు ఆందోళన కలిగిస్తున్న అంశంగా మారింది. 19 ఏళ్ళల్లో పెరుగుదల ఇలా... 2001–19 (మార్చ్) మధ్య వాహనాల పెరుగుదల గణనీయంగా కనిపించింది. 2001లో నగరంలోని వాహనాల సంఖ్య 10,91,734గా ఉండగా... 2019 మార్చ్ నాటికి 60,34,398కు చేరింది. తేలికపాటి వాహనాల విషయానికి వస్తే 2001లో మొత్తం వాహనాల్లో 11.58 శాతం కార్లు, 78.44 శాతం ద్విచక్ర వాహనాలు ఉండేవి. 2019 మార్చ్ నాటికి ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ద్విచక్ర వాహనాల శాతం తగ్గగా... తేలికపాటి వాహనాల వాటా పెరిగింది. క్యాబ్‌ల రాక సైతం ఈ మార్పునకు ఓ ప్రధాన కారణంగా నిపుణులు చెప్తున్నారు. మరోపక్క కార్లకు సంబంధించి సెకండ్ హ్యాండ్ మార్కెట్, రుణ సౌకర్యాలు పెరగడం, ద్విచక్ర వాహనం ఖరీదు చేసే వారు నేరుగా సెకండ్‌హ్యాండ్ కారుకు ప్రాధాన్యం ఇవ్వడం కూడా కారణాలేనని విశ్లేషిస్తున్నారు. 2019 మార్చ్ నాటికి మొత్తం వాహనాల్లో కార్ల శాతం 17.16కు చేరగా... ద్విచక్ర వాహనాల వాటా 72.99 శాతానికి తగ్గింది. వ్యక్తిగత వాహనాల సంఖ్యను తగ్గించడానికి ప్రభుత్వం ఒకే పేరుతో రెండో వాహనం కొంటే అధిక పన్ను అంశాన్ని అమలు చేస్తోంది. అయితే ఇది కేవలం కొత్త వాహనాలకు మాత్రమే వర్తించడం, పేర్ల మార్పిడి, వేరే వ్యక్తుల పేర్లతో ఖరీదు చేయడం వంటి లోపాల కారణంగా ఇది ఫలితాలు ఇవ్వలేదు. ఇలా కొనసాగితే తిప్పలే... రాజధానిలో వాహనాలు పెరుగుతున్న స్థాయిలో కాకపోయినా కనీస స్థాయిలోనూ రోడ్ల విస్తీర్ణం పెరగట్లేదు. ఫ్లైఓవర్లు వంటి కొత్త మార్గాల ఏర్పాటు, ఉన్న వాటి విస్తరణ జరగట్లేదు. మరోపక్క మెట్రోరైల్ అందుబాటులోకి వచ్చినా లాస్ట్ మైల్ కనెక్టివిటీ లేని కారణంగా పూర్తి స్థాయిలో ఫలితాలు అందట్లేదు. ఈ పరిణామాల నేపథ్యంలో తేలికపాటి వాహనాల పెరుగుదలలో ఇదే ధోరణి కొనసాగితే భవిష్యత్తులో మరిన్ని ట్రాఫిక్ ఇబ్బందులు తప్పవని ట్రాఫిక్ విభాగం అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని గతంలో శాసనసభ ఎస్టిమేట్స్ కమిటీకి నివేదించామని వివరిస్తున్నారు. దీనికి అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వమే అవసరమైన చర్యలు తీసుకోవాలని అప్పట్లో కోరామంటున్నారు. ప్రజారవాణా వ్యవస్థ సక్రమంగా లేకపోవడమే ఈ ధోరణికి కారణమని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. నగర జనాభాకు చాలినంత స్థాయిలో ఆర్టీసీ బస్సులు లేకపోవడం, మెట్రోరైల్ వంటివి ఇంకా పూర్తిస్థాయిలో రాకపోవడం వంటి కారణాల వల్లే అనేక మంది వ్యక్తిగత వాహనాలపై ఆధారపడుతున్నారని చెప్తున్నారు. వీటిని అభివృద్ధి చేస్తే ఈ స్థాయిలో పెరుగుదల ఉండదని స్పష్టం చేస్తున్నారు. సింగపూర్ సహా మరికొన్ని దేశాల్లో ప్రస్తుతం కార్ల రీ–ప్లేస్మెంట్ విధానం అమలులో ఉంది. దీని ప్రకారం కొత్త ప్రత్యేక పరిస్థితుల్లో మినహా ఎవరైనా కారు కొనాలంటే పాతది స్కాప్ర్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి వాటితో పాటు కార్ పూలింగ్ వంటివి పక్కాగా అమలైతేనే ఈ సమస్యకు ఓ పరిష్కారం ఉంటుందని చెప్తున్నారు. కుటుంబానికి ఒకే కారు వంటి కఠిన విధానాలు అమలు చేయాల్సి ఉంటుందని సూచిస్తున్నారు. -
‘ఆర్టీఏ’ పనితీరు అదుర్స్
సాక్షి, సిటీబ్యూరో: రోడ్డు ప్రమాదాలకు కారణాలు గుర్తించడంతో పాటు ఆయా కేసులను పక్కాగా దర్యాప్తు చేసేందుకుగాను సైబరాబాద్ పోలీసులు ఏర్పాటు చేసిన రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ (ఆర్టీఏ) మానిటరింగ్ సెల్ సత్ఫలితాలు ఇస్తోందని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఎస్ఎం విజయ్‌కుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ ఏడాది మార్చ్ 19 నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ సెల్ ఇప్పటి వరకు 12 హిట్ అండ్ రన్ (ప్రమాదం చేసి ఆగకుండా వెళ్లిపోవడం) కేసులను కొలిక్కి తీసుకువచ్చిందని, మైలార్‌దేవ్‌పల్లి ఠాణా పరిధిలో ప్రమాదంగా నమోదైన హత్య కేసును ఛేదించినట్లు తెలిపారు. ఇన్స్పెక్టర్ మహ్మద్ వహీదుద్దీన్ నేతృత్వంలో పని చేస్తున్న ఈ విభాగం ప్రతి ప్రమాద స్థలాన్ని సందర్శించి నిశితంగా దర్యాప్తు చేయడంతో పాటు కారణాలతో కూడిన డాక్యుమెంట్లనూ రూపొందిస్తోంది. ఈ ప్రక్రియలో అక్కడి సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలు, ప్రత్యక్ష సాక్షుల కథనాలు తదితరాలను పరిగణలోకి తీసుకుంటోంది. వీటితో పాటు ప్రమాద ఘటనల్లో మృతులుగా మారిన వారి కుటుంబాలకు, బాధితులకు సహాయం అందించడంలోనూ చర్యలు తీసుకుంటోంది. అత్యుత్తమ ఫలితాల కోసం ఈ సెల్ స్థానిక శాంతిభద్రతల విభాగంతో సమన్వయం ఏర్పాటు చేసుకుని పని చేస్తున్నట్లు విజయ్‌కుమార్ పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల నిరోధానికి, రోడ్ ఇంజినీరింగ్‌లో మార్పులకు కీలక సూచనలు చేస్తోందన్నారు. గత రెండు నెలల్లో ఈ సెల్ పనితీరుపై నివేదికను ఆయన విడుదల చేశారు. కీలక కేసుల వివరాలివీ... ♦ మైలార్‌దేవ్‌పల్లి ఠాణా పరిధిలో మే 6న ఒక హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. తెల్లవారుజామున మసీదుకు వెళ్తున్న మహ్మద్ ఖాన్‌ను ఓ వాహనం ఢీ కొట్టి వెళ్లిపోయింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అతను అక్కడికక్కడే మృతి చెందాడు. రంగంలోకి దిగిన ఆర్టీఏ సెల్ అధికారులు వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన సీసీ కెమెరాల ఫీడ్‌ను అధ్యయనం చేశారు. ఎట్టకేలకు వాహనాన్ని గుర్తించి లోతుగా దర్యాప్తు చేయగా అది హత్యగా వెలుగులోకి వచ్చింది. దీంతో ముగ్గురు నిందితులు కటకటాల్లోకి చేరారు. ♦ కేపీహెచ్‌బీ ఠాణా పరిధిలో మార్చ్ 19న జేఎన్టీయూ నుంచి మియాపూర్ వైపు బైక్‌పై వెళ్తున్న మహేశ్వరిని ఓ బస్సు ఢీ కొట్టి ఆగకుండా వెళ్ళిపోయింది. ఘటనాస్థలిలో సీసీ కెమెరాలు లేకపోయినా వివిధ కోణాల్లో దర్యాప్తు చేసి సెల్ ప్రమాదానికి కారణమైన బస్సు కర్ణాటక ఆర్టీసీకి చెందినదిగా గుర్తించింది. ♦ శామీర్‌పేట పరిధిలో ఆటోలో ప్రయాణిస్తున్న డి.శ్రీనివాసరావు కిందపడి మృతి చెందాడు. ఆటో డ్రైవర్ వాహనాన్ని అతి వేగంగా నడపడమే ఇందుకు కారణంగా తేల్చారు. ♦ దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్.నిరీక్షణ్రావు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఉదంతం జరిగిన ప్రాంతంలో కొంత మేర రోడ్డు ధ్వంసమైంది. దీనికి కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు నిర్థారించారు. ♦ శామీర్‌పేట పరిధిలో ఆటోలో వెళ్తున్న బోయ వీరాస్వామిని పొట్టనపెట్టుకున్న ప్రమాదానికి వాటర్ ట్యాంకర్ కారణంగా తేలింది. రోడ్డు మధ్యలో ఉన్న చెట్లకు నీళ్లు పోస్తున్న ట్యాంకర్‌ను తప్పించబోయిన ఆటో దానిని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. -
లారీపై 102 చలాన్లు
గచ్చిబౌలి: 102 చలాన్లు పెండింగ్‌లో ఉన్న ఓ లారీని గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేశారు. బుధవారం ఉదయం నానక్‌రాంగూడలోని క్యూసిటీ వద్ద వెళ్తున్న లారీ(ఏపీ 12 డబ్ల్యూ 1445)ని గచ్చిబౌలి ట్రాఫిక్ ఎస్ఐ ఖాజాపాషా అడ్డుకుని తనికీ చేయగా 102 చలాన్లు పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆ లారీని సీజ్ చేశారు. పెండింగ్ చలానాలు చెల్లిస్తేనే లారీని విడుదల చేస్తారని డ్రైవర్ జె.రాజుకు సూచించారు. -
వాట్సాప్.. హ్యాట్సాఫ్
సాక్షి, సిటీబ్యూరో: ఐటీ కారిడార్ ఉద్యోగులకు ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్(ఎస్సీఎస్సీ) ట్రాఫిక్ వలంటీర్లుగా పని చేయడమేకాకుండా మానవతా ధృక్ఫథాన్ని చాటుకుంటోంది. ఐటీ ఉద్యోగులుగా పని చేస్తూనే ట్రాఫిక్ వలంటీర్లుగా సేవలందిస్తూ ఆయా ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారి ప్రాణాలను కాపాడుతున్నారు. రోడ్డు ప్రమాదాల సమయంలో క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందించడంతో పాటు 108, డయల్ 100కి కాల్ చేస్తున్నారు. సేవలు అందడంలో జాప్యం జరిగితే ఎస్సీఎస్సీ ట్రాఫిక్ వలంటీర్ వాట్సాప్ గ్రూప్‌లో పోస్టు చేస్తున్నారు. ఈ గ్రూప్‌లో సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్, ట్రాఫిక్ డీసీపీ విజయ్‌కుమార్ తదితరులు సభ్యులుగా ఉండటంతో వెంటనే స్పందించి క్షతగాత్రుల ప్రాణాలను కాపాడుతున్నారు. సెకన్లలో స్పందించిన సీపీ మాదాపూర్‌లోని 24ఎంఎం స్టార్టప్ కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తున్న రాజశేఖర్ చిన్నం ప్రతిరోజూ శంకర్పల్లి సమీపంలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ నుంచి కార్యాలయానికి వచ్చి వెళుతుంటాడు. 2018 అక్టోబర్‌లో ఎస్సీఎస్సీ వలంటీర్‌గా చేరిన అతను సైబర్ టవర్ జంక్షన్ సిగ్నల్ వద్ద వారంలో నాలుగు రోజులు సేవలందిస్తున్నాడు. సోమవారం రాత్రి అతను వలంటీర్ విధులు ముగించుకొని కారులో వెళుతుండగా మోకిలా వద్ద రెండు బైక్‌లు కిందపడి తీవ్రంగా గాయపడిన ఇద్దరు వ్యక్తులు కనిపించారు. వారికి తన వద్ద ఉన్న ఫస్ట్ ఎయిడ్ కిట్ బ్యాగ్‌తో ప్రాథమిక చికిత్స చేశాడు. అనంతరం 108కి కాల్చేస్తే అంబులెన్స్‌లు అందుబాటులో లేవని సమాధానం వచ్చింది. డయల్ 100కు కాల్ చేసినా వెయింటింగ్ అని రావడంతో ఎస్సీఎస్సీ ట్రాఫిక్ వలంటీర్ వాట్సాప్ గ్రూప్‌లో పోస్టు చేశాడు. దీనిపై వెంటనే స్పందించిన సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ శంకర్పల్లి పెట్రోలింగ్ వాహనాన్ని అక్కడికి పంపారు. బాధితులను శంకర్‌పల్లిలోని ఓ ఆస్పత్రికి తరలించి తదుపరి చికిత్స కోసం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. క్విక్ రియాక్షన్... నిజాంపేటకు చెందిన విద్యాసాగర్ జగదీషన్ గచ్చిబౌలి ఫైనాన్స్ డిస్ట్రిక్ట్‌లోని ఐసీఐసీఐ బ్యాంక్ టెక్నాలజీ విభాగంలో మేనేజర్‌గా పనిచేస్తూ ఐదు నెలలుగా ఎస్సీఎస్సీ ట్రాఫిక్ వలంటీర్‌గా సేవలందిస్తున్నాడు. ఐసీఐసీఐ బ్యాంక్ సిగ్నల్ వద్దనే ప్రతిరోజూ సాయంత్రం ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు ట్రాఫిక్ వలంటీర్‌గా సేవలందిస్తున్నాడు. సోమవారం రాత్రి అతను నల్లగండ్ల ఫ్లైఓవర్ మీదుగా ఇంటికి తిరిగివెళుతుండగా ఓ గుర్తు తెలియని బైక్ రోడ్డు క్రాస్ చేస్తున్న వ్యక్తిని ఢీకొట్టి వెళ్లిపోయింది. దీనిని గుర్తించిన విద్యాసాగర్ తన వద్ద ఉన్న ఫస్ట్ ఎయిడ్ కిట్‌తో అతడికి ప్రాథమిక చికిత్స చేశాడు. అనంతరం 108, 100 డయల్‌కు ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో ఎస్సీఎస్సీ ట్రాఫిక్ వలంటీర్ గ్రూప్‌లో పోస్టు చేశాడు. దీనిపై స్పందించిన సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్‌కుమార్ సమీపంలోని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరెడ్డిని అప్రమత్తం చేసి ఘటనాస్థలికి పంపడంతో ఆస్పత్రికి తరలించారు. అందరూ ముందుకొస్తేనే.. పోలీసులు, ట్రాఫిక్ వలంటీర్లే కాకుండా రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు మనకెందుకులే అనుకోకుండా ఎవరైనా ముందుకు వచ్చి సాయం చేయవచ్చు. అలాంటి వారికి ఏ ఇబ్బంది లేకుండా చూస్తాం. చాలా సార్లు రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి సాయం చేద్దామని అనుకున్నప్పటికీ... సాయంచేస్తే ఏమైనా ఇబ్బందులు ఉంటాయేమోనని ముందుకు రారు. మీ నిర్లక్ష్యం ఖరీదు ఓ ప్రాణం. మీ ఉదాసీనత కారణంగా క్షతగాత్రులకు చికిత్స ఆలస్యమై వారు చనిపోయే ప్రమాదం ఉంది. మీరు తక్షణమే స్పందించడం వల్ల ఓ మనిషి ప్రాణాన్ని కాపాడినవారవుతారు. ముగ్గురు క్షతగాత్రుల ప్రాణాలు కాపాడిన వలంటీర్లకు అభినందనలు. – వీసీ సజ్జనార్ , సైబరాబాద్ పోలీసు కమిషనర్ ఏమిటీ వాట్సాప్ గ్రూప్ ఐటీ కారిడార్‌లోని వివిధ జంక్షన్లలో పనిచేస్తున్న 250 మంది ట్రాఫిక్ వలంటీర్లు ఈ ఎస్సీఎస్సీ ట్రాఫిక్ వలంటీర్ వాట్సాప్ గ్రూప్‌లో సభ్యులుగా ఉన్నారు. ఆయా జంక్షన్లలో వాహనదారులకు ఎదురవుతున్న సమస్యలతో పాటు రోడ్ల పరిస్థితి, సిగ్నలింగ్ సమస్యలపై స్థానికుల అభిప్రాయాలు తీసుకొని ఇందులో పోస్టు చేస్తుంటారు. భారీగా ట్రాఫిక్ ఉన్న సమయాల్లోనూ సమాచారం చేరవేస్తూ సిగ్నల్ మాన్యువల్‌గా మార్చేస్తుంటారు. ఈ గ్రూప్‌లో ఎస్సీఎస్సీ ప్రతినిథులు, వలంటీర్లతో పాటు సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్, ట్రాఫిక్ డీసీపీ విజయ్‌కుమార్ సభ్యులుగా ఉన్నారు. -
మలక్‌పేట రైలు వంతెన వద్ద ట్రాఫిక్.. ‘మూడో మార్గం’!
సాక్షి, సిటీబ్యూరో: సిటీలో అత్యంత కీలకమైన రహదారుల్లో దిల్సుఖ్నగర్–చాదర్‌ఘాట్ రహదారి ప్రధానమైనది. ఈ రూట్లో మలక్‌పేట రైలు వంతెన వద్ద ఉన్న బాటిల్ నెక్ తీవ్రమైన ట్రాఫిక్ ఇబ్బందులకు కారణంగా మారుతోంది. రద్దీ వేలల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంటోంది. దీనిని దృష్టిలో పెట్టుకున్న నగర ట్రాఫిక్ విభాగం అధికారులు ఈ ప్రాంతంలో అండర్ పాస్ ఏర్పాటు చేయాలని మూడేళ్ల క్రితం నిర్ణయించారు. దీంతో సహా ప్రీ–పెయిడ్ బూత్‌లకు సంబంధించిన ప్రతిపాదనలను రైల్వే అధికారులకు పంపించారు. ఇది నత్తనడకన నడుస్తోంది. ఇప్పటికీ వీటికి మోక్షం లభించలేదు. మరోపక్క మూసీ వెంట మరో మార్గాన్ని అభివృద్ధి చేయాలంటూ ఇచ్చిన ప్రతిపానలు జీహెచ్ఎంసీ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే వాహనచోదకులకు నిత్యం నరకం తప్పట్లేదు. అత్యంత కీలకం దిల్సుఖ్నగర్–చాదర్‌ఘాట్ రూట్లో నగరానికి చెందిన అంతర్గత వాహనాలే కాకుండా విజయవాడ వైపు వెళ్లే భారీ వాహనాలు నడుస్తుంటాయి. ఫలితంగా దాదాపు 24 గంటలూ ఈ మార్గం రద్దీగానే ఉంటుంది. మలక్‌పేట రైల్వేస్టేషన్ పక్కనే ఉన్న రైలు వంతెన వద్ద ఉన్న బాటిల్ నెక్ ఈ రూట్లో తిరిగే వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాదర్‌ఘాట్ వైపు మెట్రో రైల్ స్టేషన్ ఏర్పాటు చేయడంతో పరిస్థితి మరీ దారుణంగా మారింది. ఈ కారణంగా రద్దీ వేళల్లో అటు చాదర్‌ఘాట్ కాజ్ వే వరకు... ఇటు నల్లగొండ చౌరస్తా వరకు వాహనాలు బారులు తీరుతున్నాయి. ఈ మార్గంలో వెళ్లాలంటేనే వాహన చోదకులు హడలిపోతున్నారు. మలక్‌పేట రైల్వేస్టేషన్ సమీపంలోని రైలు వంతెన అటు–ఇటు ఉన్న రహదారి కంటే ఇరుకుగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. ఆర్టీసీ బస్సుల రద్దీ ఎక్కువగా ఉండే పండుగల సీజన్లో నరకం చవి చూడాల్సిందే. ఆ రెండింటి స్ఫూర్తితో ప్రతిపాదనలు... ఇలాంటి అనేక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకున్న ట్రాఫిక్ విభాగం అధికారులు నగర వ్యాప్తంగా రైలు వంతెనలు, వాటి కింద నుంచి వెళ్లే రహదారుల్లో పరిస్థితుల్ని అధ్యయనం చేశారు. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్ నిలయం, కాలాడేరా ప్రాంతంలో చేపట్టిన చర్యలను పరిగణలోకి తీసుకున్నారు. రైల్ నిలయం వంతెన కింద గతంలో రెండు మార్గాలే ఉండేవి. చాదర్‌ఘాట్ నుంచి మలక్‌పేట, చంచల్‌గూడ వైపు వెళ్లేందుకు ప్రత్యామ్నాయంగా ఉన్న కాలాడేరా ప్రాంతంలోనూ నాలా వద్ద ఉన్న రైల్ వంతెన ఒకటే ఉండేది. దీంతో ఆ రెండు చోట్లా భారీ ట్రాఫిక్ జామ్స్ తప్పేవి కాదు. ట్రాఫిక్ అధికారుల ప్రతిపాదనలు, రైల్వే విభాగం చొరవ తీసుకోవడంతో రైల్ నిలయం వద్ద మూడో మార్గం, కాలాడేరాలో రెండోది అందుబాటులోకి వచ్చాయి. ఇదే తరహాలో మలక్‌పేట రైల్ వంతెన వద్ద మూడో మార్గం ఏర్పాటు చేయించాలని అధికారులు 2016లో నిర్ణయించారు. ‘డైనమిక్’గా వాడుకోవచ్చునని... ప్రస్తుతం మలక్‌పేట రైల్ వంతెన వద్ద ఉన్న రెండు మార్గాలను ఒకటి చాదర్‌ఘాట్ వైపు, మరోటి మలక్‌పేట్ వైపు వెళ్లే వాహనాల కోసం వినియోగిస్తున్నారు. మూడో మార్గం అందుబాటులోకి వస్తే దాంతో సహా అన్నింటినీ డైనమిక్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్‌గా పిలిచే రివర్సబుల్ లైన్ ట్రాఫిక్ మెథడ్‌లో వినియోగించుకోవచ్చని అధికారులు భావిస్తున్నారు. దీని ప్రకారం ఓ మార్గాన్ని పూర్తి స్థాయిలో వన్ వేగా మార్చకుండా... రద్దీని బట్టి ఆయా సమయాల్లో వన్‌వేగా చేస్తుంటారు. ఉదయం నుంచి మధ్యా హ్నం వరకు పీక్ అవర్స్‌లో వన్‌వేగా ఉన్న మార్గం ఆపై టూ వేగా మారిపోతుంది. తిరిగి సాయం త్రం పీక్ అవర్స్ ప్రారంభమైనప్పునప్పు ఉద యం నడిచిన దిశకు వ్యతిరేకంగా వన్‌వేగా మారు తుంది. తద్వారా రద్దీని తట్టుకోవడంతో పాటు ఒకే మార్గాన్ని వివిధ రకాలుగా వినియోగించుకు నే అవకాశం ఉంటుందని భావించారు. ఈ వన్‌వేలు, వాటి సమయాలపై పూర్తి స్థాయి ప్రచారం కల్పించడంతో ప్రతి వాహనచోదకుడికీ అవగాహ న కల్పిస్తే ఫలితాలుంటాయని అంచనా వేశారు. మూసీ మార్గాన్ని అన్వేషించినా... మలక్‌పేటలో మూడో అండర్ పాస్ ఏర్పాటుకు రూ.10 కోట్లు ఖర్చవుతాయని రైల్వే శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. ఈ మొత్తం చెల్లించేందుకు హైదరాబాద్ మెట్రో రైల్ (హెచ్ఎంఆర్) సంస్థ ముందుకు వచ్చింది.ఈ ప్రతిపాదనలు నత్త నడకన సాగుతుండటంతో మూడేళ్లుగా పనులు ప్రారంభం కాలేదు. మరోపక్క మలక్‌పేట సమీపంలోని మూసీ నది వెంబడి మరో రహదారి అభివృద్ధి చేస్తే ఉపయుక్తంగా ఉంటుందని ట్రాఫిక్ అధికారులు భావించారు. చాదర్‌ఘాట్ కాజ్వే దాటిన తర్వాత మూసీ వెంట ప్రస్తుతం ఓ మార్గం ఉంది. ఇది ఓల్డ్ మలక్‌పేట మీదుగా వెళ్తుంది. అయితే అనేక చోట్ల పూర్తిస్థాయిలో నిర్మాణం లేకపోవడంతో వాహనాల రాకపోకలకు అనువుగా లేదు. మరోపక్క ఈ రూట్‌ను అభివృద్ధి చేయాలంటే పలు ప్రాంతాల్లో రోడ్డుకు అడ్డంగా ఉన్న హైటెన్షన్ వైర్లకూ పరిష్కారం కనుక్కోవాల్సి ఉంటుంది.దీనిని వాహనచోదకులకు అందుబాటులోకి తీసుకువస్తే చాదర్‌ఘాట్ నుంచి మలక్‌పేట వెళ్లాల్సిన అవసరం లేకుండా మూసరామ్‌బాగ్ సమీపంలోని అంబర్పేట్ కాజ్ వే వరకు ట్రాఫిక్‌ను మళ్లించవచ్చు. ఫలితంగా ఇరుకుగా ఉన్న మలక్‌పేట రహదారిపై రద్దీ తగ్గుతుంది. ఈ మేరకు ట్రాఫిక్ పోలీసులు మూసీ రహదారి అభివృద్ధికి సంబంధించి ప్రతిపాదనలు రూపొందించి బల్దియాకు పంపాలని భావించారు. వీటికీ మోక్షం కలగకపోవడంతో వాహనచోదకులకు నిత్య నరకం తప్పట్లేదు. -
ట్రాఫిక్ పోలీస్ ‘మన్కడింగ్’
బట్లర్‌ను ‘మన్కడింగ్’ ద్వారా అశ్విన్ ఔట్ చేయడం ఎంత వివాదం రేపిందో తెలిసిందే. అయితే కోల్‌కతా పోలీసులు దీనిలో మరో కోణాన్ని చూశారు. వెంటనే దానిని పోస్టర్‌గా మలచి ప్రజల్లో ‘ట్రాఫిక్ అవగాహన’ కోసం వాడుకునే ప్రయత్నం చేశారు. ‘ఆకుపచ్చ లైట్ రాక ముందే ముందుకు వెళ్లవద్దు, గీత దాటితే తప్పించుకోలేరు... అంటూ బెంగాలీలో వ్యాఖ్య రాసి ట్రాఫిక్ ఫోటో కూడా కలిపి పెట్టారు. దీనిపై స్పందన ఎలా ఉంటుందనేది ఆసక్తికరం. ఎందుకంటే 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో బుమ్రా నోబాల్ కారణంగా బతికిపోయిన ఫఖర్ జమాన్ సెంచరీతో పాక్‌ను గెలిపించడంతో ఇదే తరహాలో జైపూర్ పోలీసులు పోస్టర్లు వేశారు. దేశం తరఫున ఆడే ఆటగాడికి మీరిచ్చే గౌరవం ఇదేనా అంటూ అప్పట్లో స్వయంగా బుమ్రా దీనిపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేయడంతో పోలీసులు వాటిని తొలగించాల్సి వచ్చింది. -
మా నాన్న కారుకే సైడ్ ఇవ్వవా.. అంటూ
కుత్బుల్లాపూర్: మా నాన్న కారుకే సైడ్ ఇవ్వవా.. అంటూ ఓ యువకుడు విద్యార్థిపై దాడికి పాల్పడిన సంఘటన సోమవారం చింతల్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..గాజులరామారం ప్రాంతానికి చెందిన అశు హిమాయత్‌నగర్‌లోని హైందవి కళాశాలలో బీకాం మొదటి సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం అతను బైక్‌పై ఇంటికి వస్తుండగా ఐడీపీయల్ చౌరస్తా సమీపంలో వెనుక నుంచి వచ్చిన కారు అతడిని ఢీకొట్టింది. దీంతో అతను చూసి నడపండి అంటూ కారు డ్రైవర్‌కు సూచించాడు. దీంతో కారు వెనకే వస్తున్న మరో ముగ్గురు యువకులు ‘మా నాన్న కారుకే సైడ్ ఇవ్వవా’ అంటూ అతడిపై దాడికి పాల్పడ్డారు. బాధితుడు జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. -
జర సునో జీ... పెగ్గాలజీ!
పొద్దున్నే శవాన్ని భుజాన వేసుకొని మార్నింగ్‌వాక్‌కు బయలుదేరాడు విక్రమార్కుడు.రోడ్డు మీద ఒక తాగుబోతు సిన్సియర్‌గా ఊగుతూ ట్రాఫిక్‌ను కంట్రోల్ చేస్తున్నాడు.‘‘తమ్ముడూ, ముందు నువ్వు కంట్రోల్లో ఉండు...’’ అని జాగ్రత్త చెప్పబోయాడు విక్రమార్కుడు.‘‘ఐ డోన్డ్ వాంట్ టు లిజన్ ఎనీ థింగ్ ఫ్రమ్ అదర్స్’’ అన్నాడు ఆ తాగుబోతు.‘‘ఎంత చక్కని ఇంగ్లీషో’’ ముచ్చటపడ్డాడు భుజం మీది బేతాళుడు.‘‘ఇంకాసేపైతే సంస్కృతం కూడా మాట్లాడతాడు. ఎందుకొచ్చిన లొల్లి...ఇక్కడి నుంచి వెళ్దాం’’ అన్నాడు విక్రమార్కుడు.‘‘రాజా! మనదేశంలో నీటి కొరత ఉందిగానీ, మందు కొరతలేదు....మారుమూల కుగ్రామమునకు వెళ్లినా ముందు మందు ఎదురొస్తుంది..’’ నిట్టూర్చాడు భేతాళుడు.‘‘లెస్సపలికావు’’ అన్నాడు విక్రమార్కుడు.‘‘రాజా! నీకు పెగ్గాలజీ అనే గ్రంథం గురించి తెలుసునా? తెల్సినా చెప్పకపోయావో...’’ వార్నింగ్ ఇచ్చాడు భేతాళుడు.‘‘నాకు తెలుసు’’ అంటూ చెప్పడం మొదలుపెట్టాడు భేతాళుడు. లాంగ్....లాంగ్ ఎగో ఛీట.జీnజు (డా. ఇంక్) అనే శాస్త్రవేత్త ఉండేవాడు. ఎప్పుడూ ఏవో ప్రయోగాలు చేస్తూ ఉండేవాడు. ఒకసారి రకరకాల పండ్ల రసాలు, తొక్కలు, తోటకూరతో ఏదో ద్రావకాన్ని తయారుచేశాడు. డా.ఇంక్గారి మామ పేరు డా.బంక్.‘‘మామగారు....ఓసారి ఇది తాగి మీ ఓపీనియన్ చెప్పండి’’ అని ఒక గ్లాసులో ద్రావకాన్ని అతనికి ఇచ్చాడు.ఇక్కడ మనం డా.బంక్ గురించి చెప్పుకోవాలి. ఈయన పెద్దగా మాట్లాడడు. పెద్దగా నవ్వడు. ‘మౌనమే నా భాష ఓ మనసా’ అన్నట్లుగా ఉంటాడు. గంభీరంగా ఉంటాడు. హుందాగా ఉంటాడు.ఇప్పుడు మళ్లీ సీన్లోకి వద్దాం.గ్లాసులోని ద్రావకాన్ని గటగటా తాగిన డా.బంక్...‘‘అదిరింది అల్లుడు’’ అన్నాడు హుషారుగారు.మరోగ్లాస్ ఇచ్చాడు ఇంక్. సేమ్....గటగటా తాగేశాడు.‘‘అది...రింది....అల్లు....డూ...డూ....డూ’’ అన్నాడు.మామ వాయిస్‌లో మార్పును గ్రహించిన డా.ఇంకో ఇంకో గ్లాస్ ఇచ్చాడు.ఈసారి మరింత మార్పు కనబడింది మామ వాయిస్‌లో...‘ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్‌స్టార్ నీ ఫేస్ చూస్తే దెయ్యాలు పరార్’ అన్నాడు చిలిపిగా.మరో గ్లాస్ ఇచ్చాడు...ఈసారి చెట్టెక్కికోతిలా నటించడం మొదలుపెట్టాడు....‘సోదరిసోదరుల్లారా...సొప్పబెండల్లారామై నేమ్ ఈజ్ కోతి....నాకు ఉందోయ్ ఒక నీతి’మామగారి వింత చేష్టలు చూసి ‘యురేఖా’ అని ఆనందంగా అరిచాడు డా.ఇంక్.‘ఏది కొడితేమైండ్ బ్లాకయిద్దో...అదే మందు...అదే ఇది’ అన్నాడు.అనతికాలంలోనే ఛీట.జీnజు తయారుచేసిన కొత్త ద్రావకం దేశవిదేశాల్లో ప్రాచుర్యం పొందింది.‘‘మీరు తయారుచేసిన ద్రావకానికి ఏదో ఒక పేరు పెడితే బాగుంటుంది’’ అన్నాడు అసిస్టెంట్.‘‘ఏ పేరో ఎందుకు నా పేరే పెట్టుకుంటాను. నన్ను అందరూ ఛీట.జీnజు అని పిలుస్తారు. మధ్యలో చుక్క తీసేస్తే ఛీటజీnజు అవుతుంది. ఇక ఇప్పటి నుంచినేను తయారుచేసిన ద్రావకం పేరు డ్రింక్’’ అని ప్రకటించాడు.డ్రింక్ చేసేవారి గురించి రాసిందే ‘పెగ్గాలజీ’ గ్రంథం. దీనిలో కొన్ని విశేషాలు ఇప్పుడు చెబుతాను. సంవత్సరం సంవత్సరం చరిత్రమారినట్టు...పెగ్గు పెగ్గుకు మనిషి మారుతాడు. ఎలా అంటే...ఫస్ట్ పెగ్:చాలా మర్యాదగా ప్రవర్తిస్తారు.‘స్నేహానికన్న మిన్నా లోకాన లేదురా...’ పాట హైపిచ్‌లో పాడుకుంటారు.రెండో పెగ్: ఇంగ్లిష్ మొదలవుతుంది...దేశాన్ని గురించి తెగ బాధపడుతుంటారు...‘కంట్రీ. కంట్రీ మీన్స్ నాట్ స్టోన్స్. కంట్రీ మీన్స్ హ్యుమన్ బీయింగ్స్. డెమోక్రసీ ఈజ్ ఏ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్. వేరే ది సిటిజన్స్ఎక్సర్సైజ్పవర్ బై డెమోక్రసీ!బట్ వేర్ ఈజ్ డెమోక్రసీ?నో....నో...ఇటీజ్ రాంగ్ డెసీషన్.వేర్ రైట్ ఈజ్ రైట్...బట్ నథింగ్ ఈజ్ రాంగ్...ఐ సే ఎవ్రీ టైమ్...’మూడో పెగ్:హిందీ పాట మొదలవుతుంది...‘మేరి మేరి మెహబూబాతేరి తేరి ఆంకో మే డూబా!న కర్ మేరే దిల్ కే టు తూ తుక్డే...తుక్టే...తుక్టే...నాలుగో పెగ్:తగాదాకు వేళాయెరా!‘‘రేయ్ అప్పాల్రాజు...ఏది ఏమైనా నిన్ను నేను ఆరోజు వెధవ అని తిట్టి ఉండాల్సింది కాదు’‘సరేలే...ఇప్పుడా విషయం ఎందుకు?’’‘ఎందుకంటావేంరా! ఉత్త వెధవ అని కూడా కాదు దొంగ వెధవ అని తిట్టాను. ఐయామ్ రియల్లీ సారీ రా’‘సరేలే జరిగిందేదో జరిగింది...’‘ఎలా జరుగుతుందిరా? నోరు అన్నాక అదుపులో పెట్టుకోవాలి. తింటున్నది గడ్డి కాదు అన్నమే కదా...’‘నీ వాలకం చూస్తుంటే నేనేదో తప్పు చేసినట్లు మాట్లాడుతావేం?’‘తప్పా తప్పున్నారా!’‘వెధవ అని తిట్టింది నువ్వు. నాది తప్పంటావేంటీ!?’‘వెధవా అని తిట్టినప్పుడు...అరే సుబ్బిగా అలా పరుషపదజాలం ఉపయోగించకూడదురా అని నువ్వు మాట్లాడి ఉంటే నేను మూసుకొని కూర్చునేవాడిని.కానీనువ్వేం చేశావు? వెధవ అని తిట్టినా, దొంగవెధవ అని తిట్టినా, బండ వెధవ అని తిట్టినా...సైలెన్స్‌గా ఉండిపోయావు.ఎదుటోడు నిన్ను ఒక్క తిట్టు తిడితే పదితిట్లు నాన్స్టాప్గాతిట్టమన్నారు పెద్దలు...కానీ...నువ్వేం చేశావు? మౌనంగా ఉండి...నాలోని చెడుని పెంచావు....అందుకే నువ్వు మామూలు వెధవవి కాదు... అక్కుపక్షి వెధవవు. ఎంగిలి విస్తరాకులు ఎత్తుకు పోయి ఇంట్లో భద్రంగా దాచుకునే నీచదరిద్ర నికృష్ట భ్రష్ట వెధవవు...’’‘ఒరేయ్ సుబ్బిగా మాటలు తిన్నగా రానియ్....తిట్లు ఆపకపోతే ఎదురుగా ఆ మురికిగుంట ఉంది చూశావా...అందులో పడేస్తాను. పీడ వదులుతుంది’‘నువ్వు నన్ను పడేసేదేమిట్రా గూట్లే....నేనే పడతాను చూడు....’వామ్మో....చచ్చాన్రో! –అశుభం – యాకుబ్ పాషా -
బెంజిసర్కిల్‌లో బ్యాటరీ కారు పరుగులు..
సాక్షి, అమరావతి బ్యూరో: విజయవాడలోని బెంజి సర్కిల్.. మంగళవారం ఉదయం 9.30 గంటలు. భారీ వాహనాలు, కార్లు, ద్విచక్రవాహనాలు, ఆటోలతో ఆ సర్కిల్లోని నాలుగు రోడ్లు కిక్కిరిసిపోయాయి. ఈ సమయంలో ఎన్టీఆర్ సర్కిల్ నుంచి బందరురోడ్డు మీదుగా బెంజిసర్కిల్ వైపు ఓ బ్యాటరీ కారు పరుగులు పెడుతూ.. భారీ వాహనాలను దాటుకుంటూ దూసుకొచ్చింది. ఆ సమయంలో ట్రాఫిక్ ఆగిపోవడంతో ఆ కారు ‘ఎస్’ కట్లు కొడుతూ ఇతర వాహనాలను తప్పిస్తూ జాతీయ రహదారి పైకి చేరుకుంది. ఒక్కసారిగా ట్రాఫిక్‌కు అడ్డంగా కారు రావడంతో అక్కడే విధులు నిర్వహిçస్తున్న ట్రాఫిక్ పోలీసులు కారుని అడ్డుకున్నారు. కారు డ్రైవింగ్ చేస్తున్న నాలుగేళ్ల బుడ్డోడిని చూసి అవాక్కయ్యారు. విజయవాడలో మంగళవారం జరిగిన ఈ ఘటన నగరవ్యాప్తంగా సంచలనంగా మారింది. పీఅండ్‌టీ కాలనీకి చెందిన శ్రావణ్‌కుమార్ కుమారుడు శ్రీరామ్ (4) ఓ ప్రైవేట్ పాఠశాలలో ఎల్కేజీ చదువుతున్నాడు. కాలికి దెబ్బ తగలడంతో శ్రీరామ్ మంగళవారం పాఠశాలకు వెళ్లలేదు. తన ఎలక్ట్రిక్ కారుతో శ్రీరామ్ ఇంటి వద్ద ఆడుకుంటూ పీఅండ్‌టీ కాలనీ నుంచి పంటకాలువ రోడ్డుపైకి వచ్చి అక్కడి నుంచి ఎన్టీఆర్ సర్కిల్ మీదుగా బెంజిసర్కిల్ వద్దకు వచ్చేశాడు. ఎలాంటి భయం లేకుండా భారీ వాహనాలను దాటుకుంటూ కారుని జాతీయ రహదారిపైకి తీసుకు వచ్చేశాడు. దీన్ని గమనించిన ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమై ట్రాఫిక్‌ను నిలిపివేసి కారును పక్కకు తీసుకొచ్చారు. ఆ కుర్రాడు ఎక్కడి నుంచి వచ్చాడంటూ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఆ బుడ్డోడు వచ్చిన వైపునే కుర్రాడిని తీసుకుని పోలీసులు ఆటోలో బయలుదేరారు. అదే సమయంలో తన మనవడిని వెతుక్కుంటూ ఓ వృద్ధురాలు రావడం చూసిన పోలీసులు ఆమెకు చిన్నారిని చూపించగా..ఆమె తన మనవడే అని తెలిపింది. ఆ చిన్నారిని ఇంటి వద్ద తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. మరోసారి ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని సూచించారు. -
ఉల్లంఘనలపై ఉక్కుపాదం
సాక్షి, హైదరాబాద్: వాహన చోదకుడితో పాటు ఎదుటి వ్యక్తికీ ప్రమాదకరంగా మారే అవకాశమున్న ఉల్లంఘనలపై మరింత కఠినంగా వ్యవహరించాలని నగర ట్రాఫిక్ విభాగం అధికారులు నిర్ణయించారు. ప్రయోగాత్మకంగా అమల్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టం (ఐటీఎంఎస్) వ్యవస్థలో దీనికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భవిష్యత్తులో ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (ఐఐబీ) డేటాలతో ఆన్లైన్ అనుసంధానం ఏర్పాటు చేసుకోనున్నారు. దీంతో తీవ్రమైన ఉల్లంఘనలకు వచ్చే ఈ–చలాన్లు ‘భారీ’గా ఉండనున్నాయి. నగరంలో ప్రమాదాలు, మరణాలు తగ్గింపుతో పాటు వాహన చోదకుల్లో క్రమశిక్షణ పెంపొందించే లక్ష్యంతో ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు. ‘కంటి’కి చిక్కగానే అన్నీ తనిఖీ... ఇటీవల కాలంలో నగర ట్రాఫిక్ పోలీసులు ఉల్లంఘనుల గుర్తింపు కోసం కెమెరాలనే ఎక్కువగా వినియోగిస్తున్నారు. పాయింట్ డ్యూటీలో ఉండే వారి చేతిలోని కెమెరాలు, కంట్రోల్ రూమ్‌లోని సిబ్బంది సర్వైలెన్స్ కెమెరాలను వినియోగించి ఉల్లంఘనలకు పాల్పడిన వాహనాల ఫొటోలు తీస్తున్నారు. వీరికి ఈ–చలాన్లు జారీ చేస్తున్నారు. అయితే ఇకపై కంట్రోల్ రూమ్ సిబ్బంది పై ‘ఆరింటికి’సంబంధించిన ఉల్లంఘనల ఫొటోలు వచ్చిన వెంటనే... ఆ వాహనం నంబర్‌ను తీసుకుంటారు. ఫొటో ఆధారంగా ఎన్ని రకాలైన ఉల్లంఘనల్ని గుర్తించవచ్చో అన్నింటినీ గుర్తిస్తారు. ఆపై వాహన నంబర్ ఆధారంగా ఆర్టీఏ డేటాబేస్‌లో వివిధ సర్టిఫికెట్ల వివరాలూ తనిఖీ చేస్తారు. అవి సక్రమంగా లేకుంటే ఫొటోలో ఉన్న ఉల్లంఘనలకు తోడు వీటినీ కలుపుతారు. మరోపక్క ఫొటో ఆధారంగా చోదకుడు హెల్మెట్ పెట్టుకున్నాడా? లేదా?, నంబర్ ప్లేట్ సక్రమంగా ఉందా? లేదా? అనేవీ పరిశీలించి ఆ ఉల్లంఘనల జరిమానానూ కలుపుతూ ఈ–చలాన్ పంపిస్తారు. ఆరింటిపై ప్రధాన దృష్టి... ట్రాఫిక్ ఉల్లంఘనల్ని అధికారులు ముఖ్యంగా మూడు రకాలుగా విభజిస్తారు. వాహనం నడిపే వారికి ప్రమాదకరమైనవి, ఎదుటి వారికి ప్రమాదకరమైనవి, ఇద్దరికీ ప్రమాదకరమైనవి. నగర పోలీసులు ప్రాథమికంగా మూడో అంశంపై దృష్టి పెట్టారు. ఇందులోనూ ఆరు రకాల ఉల్లంఘనలు నిరోధించడంపై ప్రత్యేక దృష్టి పెడుతున్న ట్రాఫిక్ పోలీసులు వీటిని ‘జైలుకు తీసుకువెళ్లే’వాటి జాబితాలో చేర్చారు. సెల్‌ఫోన్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్, పరిమితికి మించి రవాణా, అతి వేగం, లైసెన్సు లేకుండా డ్రైవింగ్, నో ఎంట్రీ/రాంగ్ రూట్లో డ్రైవింగ్ ఈ జాబితాలో ఉన్నాయి. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడితే.. మేజిస్ట్రేట్ ముందు వాహనంతో సహా హాజరుపరుస్తారు. అలా కాకుండా కెమెరాకు చిక్కితే ‘భారీగా వడ్డించా’లని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఆ రెండింటితోనూ అనుసంధానం... అనేక మంది వాహనచోదకులు ఆర్సీపైనే శ్రద్ధ పెడుతున్నారు తప్ప.. ఇన్సూరెన్స్, పొల్యూషన్ టెస్ట్ వంటివి పట్టించుకోవట్లేదు. అధికారులు పట్టుకున్నప్పుడు ‘ఫైన్’గా వెళ్లిపోతున్నారు. దీన్ని పరిగణలోకి తీసుకున్న ట్రాఫిక్ విభాగం ఆర్టీఏ, ఐఐబీలతో అనుసంధానంగా ఆన్లైన్ కనెక్టివిటీ ఏర్పాటు చేసుకోవాలని యోచిస్తున్నారు. నగర వ్యాప్తంగా ఉన్న కాలుష్య తనిఖీ యంత్రాలను ఆర్టీఏతో ఆన్లైన్లో కనెక్టివిటీ ఏర్పాటు చేస్తే తనిఖీ చేయించుకున్న ప్రతి వాహనం వివరాలు ఆర్టీఏ డేటాబేస్‌లోకి చేరుతుంది. మరోపక్క రాష్ట్రంలో కార్యకలాపాలు సాగిస్తున్న ఇన్సూరెన్స్ కంపెనీలన్నీ తమ సమాచారాన్ని గచ్చిబౌలిలో ఉన్న ఐఐబీకి సమర్పిస్తాయి. ఈ డేటా ఆధారంగా వాహన బీమా వివరాలు తెలుసుకోవడం సాధ్యమవుతుంది. ఈ డేటాల అనుసంధానంతో భవిష్యత్తులో ఉల్లంఘనలకు పాల్పడే వారికి జరిమానాల వడ్డనకు ఆస్కారం ఏర్పడనుంది. క్రమశిక్షణ పెంపొందించేందుకే.. వాహనచోదకుల్లో క్రమశిక్షణ పెరిగితే ట్రాఫిక్ పోలీసులతో సంబంధం లేకుండా అంతా ఎవరికి వారే నిబంధనలు పాటిస్తారు. దీంతో ప్రమాదాలు, మరణాలే కాకుండా ట్రాఫిక్ అంతరాయాలూ తగ్గుతాయి. ఈ నేపథ్యంలోనే తీవ్రమైన ఉల్లంఘ నలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించాం. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రయోగాత్మక వినియోగం జరుగుతోంది. గరిష్టంగా మరో రెండు నెలల్లో పూర్తిస్థాయిలో అమల్లోకి తీసుకురావాలని భావిస్తున్నాం. – ట్రాఫిక్ అధికారులు -
రష్‌గా ఉన్నా.. రాజాలా పోవచ్చు!
సాక్షి, హైదరాబాద్ : సంక్రాంతి పండుగ సందడి అప్పుడే మొదలైంది. మరోవైపు నగరంలో సెటిలైన ఆంధ్ర, తెలంగాణ జిల్లాల ప్రజలు ఇప్పటికే ఊరుబాట పట్టారు. ఇలా నగరం నుంచి బయల్దేరే వాహనాలన్నీ నగరం సరిహద్దుల్లోని టోల్గేట్ల వద్దకు చేరుకుని విపరీతమైన రద్దీకి కారణమవుతున్నాయి. ఫలితంగా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయి. ఏటా సంక్రాంతి, దసరా సమయాల్లో ఇదే పునరావృతమవుతున్నా పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రావడంలేదు. ఫాస్టాగ్‌పై సరైన ప్రచారం నిర్వహించకపోవడంతో ఈసారి కూడా రద్దీ తప్పేలా లేదు. ఏంటి సమస్య? హైదరాబాద్‌లో తెలంగాణ, ఏపీకి చెందిన ప్రజలు లక్షల్లో ఉన్నారు. వీరంతా దసరా, సంక్రాంతి సమయంలో ఊళ్లకు వెళతారు. రోడ్డు మార్గం ద్వారా వెళ్లే వాహనాలన్నీ టోల్గేట్లు దాటే వెళ్లాలి. ఒక్కసారిగా వాహనాలు బారులు తీరుతుండటంతో ఏటా సంక్రాంతి, దసరా, దీపావళి సమయాల్లో టోల్గేట్ల వద్ద విపరీతమైన రద్దీ నెలకొంటోంది. శనివారం నుంచి సెలవులు మొదలవుతున్న దరిమిలా.. ఈ రద్దీ ఒక రోజు ముందుగా అంటే శుక్రవారం సాయంత్రం నుంచే ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. కారణమేంటి? తెలంగాణలో 18 టోల్గేట్లు ఉన్నాయి. వీటిలో 3 రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలో, మిగిలిన 15 నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) ఆధీనంలో ఉన్నాయి. సెలవుల నేపథ్యంలో నగరవాసులు ఊళ్ల నుంచి తిరిగి వచ్చేక్రమంలో ఒక్కసారిగా టోల్‌గేట్లపై విపరీత మైన భారం పడుతోంది. ప్రతివాహనం టోల్ చార్జీ చెల్లించి, చలానా తీసుకుని వెళ్లాలి. ఇందుకు కనీసం 5 నుంచి 10 నిమిషాల సమయం పడుతుంది. చిల్లర సమస్య, కార్డులు పనిచేయకపోవడం వల్ల మరిం త జాప్యం జరగవచ్చు. శనివారం నుంచి నగరం నుంచి వెళ్లే రద్దీ రెట్టింపవనున్న నేపథ్యంలో టోల్గేట్ల నిర్వాహకులు అదనపు సిబ్బంది ని ఏర్పాటు చేసుకుంటున్నారు. సమస్యకు కారణాన్ని విస్మరిస్తున్నారు. ఫాస్టాగ్‌పై ప్రచారం ఏది..? ప్రతిసారీ టోల్గేట్ వద్ద ఆగి రుసుము చెల్లించకుండా ఎన్హెచ్ఏఐ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టం (ఈటీసీఎస్)ను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ఫాస్టాగ్ డివైజ్‌లను వాహనాలకు ముందుభాగాల్లో అమరుస్తారు. ముందుగానే రీచార్జ్ చేసుకుంటే.. టోల్గేట్ల వద్ద సెన్సార్లు రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా వీటిని గుర్తిస్తాయి. రుసుము ఆటోమేటిక్‌గా కట్ అయిపోయి, గేటు సులువుగా తెరుచుకుంటుంది. దీనివల్ల ప్రతి వాహనానికి దాదాపు 5 నిమిషాల సమయం మిగులుతుంది. ఇది ఇటు వాహనదారుడికి, అటు టోల్ నిర్వాహకులకు అనుకూలంగా ఉంటుంది. పైగా ట్రాఫిక్ సమస్యలకు, చిల్లర సమస్యలకు శాశ్వత పరిష్కారంగా ఉంటుంది. ఇప్పుడు తీసుకునే ఫాస్టాగ్‌లపై 50 శాతం వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. కానీ, వీటిపై అవగాహన లేని వాహనదారులు డబ్బులు, కార్డుల ద్వారా చెల్లించేందుకే అధికశాతం మొగ్గుచూపుతున్నారు. రాష్ట్రంలో సొంత వాహనాలు పెరుగుతున్న దరిమిలా వీటిపై కావాల్సినంత ప్రచారం జరగడం లేదన్నది వాస్తవం. 2017 చివరినాటికి అన్ని వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి చేసినప్పటికీ ఇది పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. ఆర్టీసీ ఎందుకు బిగించు కోవడం లేదు.. ఆర్టీసీ బస్సులు కూడా టోల్గేట్ ట్రాఫిక్ జాముల్లో చిక్కుకుపోతున్నా సమస్యకు పరిష్కారం దిశగా చొరవ చూపడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఫాస్టాగ్ పరికరాలుబిగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ) స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రంలోని దాదాపుగా అన్ని టోల్గేట్లలోనూ ఫాస్టాగ్ డివైజ్‌లు అందుబాటులో ఉన్నాయని వెల్లడిస్తున్నారు. అయితే, ఆర్టీసీ అధికారుల వాదన మరో రకంగా ఉంది. ఒక్కసారి ఈ డివైజ్‌ను బిగిస్తే అందులో వాహనం వివరాలు పొందుపరచాల్సి ఉంటుంది. ఆర్టీసీ బస్సులు నిత్యం వేర్వేరు రూట్లలో తిరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో బస్సులకు ఫాస్టాగ్ పరికరాల బిగింపు కార్యరూపం దాల్చడం లేదు. టీఎస్ఆర్టీసీ నగరం నుంచి 5,252 బస్సులువేసింది, ఇందులో 1,500 ఏపీకి వెళ్తాయి. వీటన్నింటిలో ప్రయాణించే వారంతా టికెట్ రేటుతోపాటు టోల్ కూడా చెల్లించాల్సిందే. దీంతో ఈసారి కూడా ఆర్టీసీ బస్సులకు ట్రాఫిక్ కష్టాలు తప్పేలా లేవు. -
చైనాలో బస్సు ప్రమాదం
-
తిప్పలుండవ్!
సాక్షి, సిటీబ్యూరో: ఉప్పల్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ చిక్కుల పరిష్కారానికి జీహెచ్ఎంసీ నాలుగు ఫ్లై ఓవర్లు నిర్మించనుంది. వరంగల్‌వైపు నుంచి వచ్చేవారికి నారపల్లి నుంచి ఉప్పల్ జంక్షన్ వరకు ఆరు లేన్ల ఎలివేటెడ్ కారిడార్‌ను జాతీయ రహదారుల సంస్థ నిర్మించనుండగా, ఉప్పల్ జంక్షన్ వద్ల నలువైపులా మార్గాల్లో ప్రయాణించేవారి కోసం అనువుగా నాలుగు ఫ్లై ఓవర్లను జీహెచ్ఎంసీ నిర్మించనుంది. జాతీయ రహదారుల సంస్థ ఉప్పల్ శ్మశానవాటిక వరకు మాత్రమే ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మించనుండగా, దానిని రామంతాపూర్ వరకు పొడిగిస్తూ అదనపు నిర్మాణాన్ని జీహెచ్ఎంసీ చేపట్టనుంది. ఈ ఫ్లై ఓవర్ మెట్రోరైలు మార్గంపైన భూమికి 20 మీటర్ల ఎత్తున రానుంది. 1220 మీటర్ల పొడవుండే ఇది రామంతాపూర్‌లో ఉప్పల్ స్టేడియం రోడ్‌కు కాస్త ముందుగా చర్చివైపు దిగుతుంది. అక్కడి నుంచి స్టేడియం రోడ్వైపు వెళ్లే వారికోసం రోడ్డుకు ఈ వైపు నుంచి ఆవైపు మరో చిన్న ఫ్లై ఓవర్‌ను నిర్మిస్తారు. దీంతో ఉప్పల్ జంక్షన్ వద్ద ఉప్పల్ నుంచి రామంతాపూర్ మార్గాల మధ్య ప్రయాణించేవారికి సాఫీ ప్రయాణంసాధ్యమవుతుంది. దీంతో పాటు నాగోల్– తార్నాకల మధ్య ప్రయాణించే వారి కోసం ఉప్పల్ జంక్షన్ వద్ద మూడేసి లేన్లతో మరో రెండు ఫ్లై ఓవర్లు మెట్రోకు సమాంతరంగా రెండువైపులా నిర్మాణం చేయనున్నారు. వీటి పొడవు దాదాపు 900 మీటర్లు. ఈ నాలుగు ఫ్లై ఓవర్లతో ఉప్పల్ జంక్షన్లో ట్రాఫిక్ చిక్కుల సమస్య పరిష్కారం కానుందని భావిస్తున్నారు. వీటి అంచనా వ్యయం రూ. 310 కోట్లు. వీటికి ప్రభుత్వ అనుమతి కూడా లభించడంతో ఉన్నతస్థాయి సమీక్ష అనంతరం త్వరలో టెండర్లు పిలిచే యోచనలో జీహెచ్ఎంసీ అధికారులున్నారు. భూసేకరణ.. ఫ్లై ఓవర్ల నిర్హాణం కోసం సర్వే ఆఫ్ ఇండియా, ప్రభుత్వ భూములు 5.4 ఎకరాలతోపాటు 1.69 ఎకరాల ప్రైవేట్ భూములు సేకరించాల్సి ఉంది. మరో నాలుగు ప్రైవేట్ ఆస్తులు సేకరించాలి. సాఫీప్రయాణం.. ప్రస్తుతం వరంగల్ నుంచి ఉప్పల్ జంక్షన్‌కు రావడానికి దాదాపు రెండు గంటల సమయం పడితే అక్కడినుంచి నగరంలోకి రావడానికి గంట సమయం పడుతోంది. ఉప్పల్ జంక్షన్ వద్ద రద్దీసమయంలో గంటకు దాదాపు 20 వేల వాహనాలు ప్రయాణిస్తున్నాయి. ఇటీవలి కాలంలో పెరిగిపోయిన వివిధ అభివృద్ధి, వ్యాపార కార్యక్రమాలతో రద్దీ మరింత తీవ్రమవుతోంది. ఈ ప్రాజెక్టులు పూర్తయితే సిగ్నల్ ఫ్రీతో ఎంతో ప్రయాణ సమయం కలిసి వస్తుంది. ప్రస్తుతం ఘట్కేసర్ నుంచి ఉప్పల్ రావడానికి ట్రాఫిక్ రద్దీతో దాదాపు గంట సమయం పడుతుండగా, కారిడార్ పూర్తయితే పదినిమిషాలు చాలు. అలాగే అంబర్‌పేటకు 15 నిమిషాల్లో చేరుకోవచ్చు. తద్వారా వరంగల్, యాదగిరిగి గుట్ట వైపు నుంచి నగరంలోకి వచ్చేవారికి, వెళ్లే వారికి ఎంతో ప్రయోజనం కలుగుతుంది. చే నెంబర్ జంక్షన్లో... ఈ ఫ్లై ఓవర్లతో పాటు అంబర్‌పేట చేనెంబర్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ చిక్కుల పరిష్కారానికి మరో ఫ్లై ఓవర్ నిర్మించనున్నారు. అంబర్‌పేట ముకరం హోటల్ నుంచి గోల్నాక సలీమ్ బ్రిడ్జి చర్చి వరకు నిర్మించే దీని వల్ల గోల్నాక, అంబర్‌పేటల నుంచి ఘట్కేసర్ వరకు, అట్నుంచి ఇటు ఎలాంటి ట్రాఫి క్ జంజాటాల్లేకుండా ప్రయాణం సాగించవచ్చు. అంబర్‌పేట (చే నెంబర్ ఫ్లై ఓవర్) అంచనా వ్యయం: రూ.467.55 కోట్లు. ఇందులో కేంద్రం వాటా రూ.226.88 కోట్లు కాగా, మిగతా రూ.240.07 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. ♦ ఫ్లై ఓవర్ పొడవు 1.60 కి.మీ.లు, వెడల్పు18 మీటర్లు ♦ సేకరించాల్సిన ఆస్తులు 281 ♦ సేకరించాల్సిన భూమి 4.63 ఎకరాలు. ♦ ప్రాజెక్టులో భూసేకరణకే రూ. 317 కోట్లు ఖర్చవుతోంది. ఇందులో రూ.76.33 కోట్లు కేంద్రం అందిస్తుండగా, మిగతాది రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్ఎంసీ భరిస్తున్నాయి. ♦ ఫ్లై ఓవర్ నిర్మాణ వ్యయం: రూ.150.55 కోట్లు. -
హారన్.. టెర్రర్
సాక్షి,సిటీబ్యూరో: శరత్ దంపతులు తమ చిన్నారితో కలిసి వాహనంపై వెళ్తున్నారు. పాప తల్లి ఒడిలో నిద్రపోతోంది. ఇంతలో పక్కనే ఓ పెద్ద శబ్దం.. పాప ఉలిక్కిపడి లేచింది. ఏం జరిగిందో వారికి అర్థం కాలేదు. రఘువీర్ ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్నారు. ఆయనకు అసలే గుండె జబ్బు. తన పక్కనే టప్, టప్మని పెద్ద శబ్దాలు వినిపించాయి.. గుండె ఆగినంత పనైంది. ఏమైందోనని ఆందోళనగా చుట్టూ చూస్తే.. భారీ శబ్దాలు బుల్లెట్ వాహనాలవని తేలింది. ఈ రెండు సంఘటనలు నగరంలో ట్రాఫిక్ రద్దీలో ద్విచక్ర వాహనాలు, కార్ల హారన్ల మోతతో జనం పడుతున్న ఇబ్బందులకు ఉదాహరణలు. ప్రశాంతంగా వెళ్తున్న రహదారుల మీద తమ ద్విచక్రవాహనాలకు అమర్చిన మోడిఫైడ్ హారన్లతో ఒక్కసారిగా కుర్రకారుపెద్దపెద్ద శబ్దాలు చేస్తూ శబ్దకాలుష్యం సృష్టిస్తున్నారు. ఇటీవలి కాలంలో బుల్లెట్ సహా 200 సీసీ ఆపై ఇంజిన్ సామర్థ్యం గల భారీ బైక్‌లకు మోడిఫైడ్ హారన్లను, సైలెన్సర్లను అమర్చుకోవడం కుర్రకారుకు ఫ్యాషనైపోయింది. మరికొందరు పూర్తిగా సైలెన్సర్లనే తీసేసి రద్దీ రోడ్లపై వాహనాలను పరుగులు పెట్టిస్తున్నారు. దీంతో ఆయా వాహనాల నుంచి వచ్చే ఈ శబ్దాలకు చిన్నారులు, మహిళలు, వృద్ధులతో పాటు రోడ్డుపై వెళుతున్న ఇతర వాహనదారులు సైతం బెంబేలెత్తుతున్నారు. ఒక్కసారిగా ఏం జరిగిందోనని ఆందోళన చెందుతున్నారు. యువత సరదా కోసం చేస్తున్న ఈ పని ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నప్పటికీ రవాణాశాఖ, ట్రాఫిక్ విభాగాలు అలాంటి వాహనాలపై ఎలాంటి చర్యలు తీసుకున్నది లేదు. ముఖ్య కూడళ్ల మీద నుంచి ఇలాంటి శబ్దాలు చేస్తూ దూసుకుపోతున్న వాహనాల నుంచి వెలువడుతున్న శబ్దాలను కొలిచేందుకు చేతిలో ఇమిడే సౌండ్ రీడర్లు కూడా ఆయా విభాగాల సిబ్బంద్ది వద్ద అందుబాటులో లేకపోవడం గమనార్హం. ఎటు చూసినా విపరీత శబ్దాలే.. ప్రస్తుతం యువత ఎక్కువగా బుల్లెట్, అపాచీ, కేటీఎం వంటి బైక్స్‌ను అధికంగా ఇష్టపడుతున్నారు. ఆ వాహనాలు కొన్నాక వాటికి అదనపు హంగులు అమరస్తున్నారు. రంగు, హ్యాండిల్, హారన్ వంటి వాటి ఏర్పాట్ల కోసం కనీసం రూ.30 వేలు ఖర్చు చేస్తున్నారు. వాహనాలకు కొత్త రకం శబ్దాలను వెలువరించే హారన్లను పెట్టిస్తున్నారు. ఇంకొందరు అధిక శబ్దం వచ్చే సైలెన్సర్లను కూడా బిగిస్తున్నారు. పీసీబీ నిబంధనల ప్రకారం 55 డెసిబుల్స్‌ను మించి వెలువడే శబ్దాలు మానవ ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతాయి. కానీ మోడిఫైడ్ హారన్లతో 90 డెసిబుల్స్ కంటే అధికంగా విపరీత శబ్దాలు నగరంపై దండయాత్ర చేస్తున్నాయి. దీంతో ఇతర వాహనదారులు, ప్రయాణికులు, పాదచారులు, చిన్నారులు, వృద్దులు, రోగులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఆ వాహనాలను వేగంగా నడుపుతూ ఒక్కసారిగా ఆన్ఆఫ్ స్విచ్‌ను ఆఫ్ చేసి ఆన్ చేస్తే అతి పెద్ద శబ్దం వెలువడుతుంది. ఇలా ఎన్నిసార్లు ఆన్ఆఫ్ చేస్తే అన్నిసార్లు చప్పుళ్లు వస్తుండడంతో జనం ఆందోళన చెందుతున్నారు. చోద్యం చూస్తున్న యంత్రాంగం.. నగరంలోని ప్రతి రహదారిపైనా ఇలాంటి విపరీత శబ్దాలు నిత్యకృత్యయ్యాయి. ఈ శబ్దాలు విన్న సమయంలో ఏమరుపాటుగా ఉన్నవారు విపరీతమైన ఆందోళనకు గురవుతున్నారు. అయితే, ఇలాంటి విపరీత పోకడలకు కారణమవుతున్న వాహన చోదకులను నియంత్రించే విషయంలో ఇటు ఆర్టీఏ, అటు ట్రాఫిక్ విభాగాలు చోద్యం చూస్తున్నాయని నగరవాసుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విపరీత శబ్దాలతో ఇతర వాహనదారుల ఏకాగ్రత చెదిరి ఏం జరిగిందో అనే కంగారులో వాహనాన్ని ఆపినా, ఒక్కసారిగా వేగం తగ్గించినా, వెనుక పెద్ద వాహనం వస్తుందని ఒకేసారి పక్కకు జరిగినా ప్రమాదాలు జరుగుతున్నాయి. గ్రేటర్ గూబ గుయ్‌మంటోంది.. పరిమితికి మించి వెలువడుతోన్న ధ్వనులతో గ్రేటర్ గూబ గుయ్‌మంటోంది. మహానగరంలో ఆస్పత్రులు, విద్యా సంస్థలున్న సున్నిత ప్రాంతాల్లోనూ శబ్దకాలుష్యం మోతమోగుతోంది. నగరంలోని పలు సున్నిత ప్రాంతాలు, వాణిజ్య ప్రాంతాల్లో పీసీబీ నిర్దేశించిన ప్రమాణాలకంటే అధిక ధ్వని కాలుష్యం వెలువడుతోంది. నగరంలో అబిడ్స్, పంజగుట్ట(వాణిజ్య ప్రాంతాలు), జీడిమెట్ల(పారిశ్రామిక ప్రాంతం), జూపార్కు(నిశ్శబ్ద జోన్), గచ్చిబౌలి, జూబ్లీహిల్స్(నివాస ప్రాంతం)లో మాత్రమే పీసీబీ ధ్వని కాలుష్యాన్ని నమోదు చేస్తోంది. అయితే జీహెచ్ఎంసీ పరిధిలోని 150 డివిజన్లు.. మరో వంద ముఖ్య కూడళ్లు, ఆస్పత్రులు, విద్యాసంస్థలు అధికంగా ఉన్న మార్గాల్లో శబ్దకాలుష్య అవధిని నిర్ణయించడంలో పీసీబీ, మున్సిపల్, రవాణా, ట్రాఫిక్ విభాగాలు విఫలమవుతున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో రణగొణ ధ్వనులతో సిటీజన్లు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. గ్రేటర్లో శబ్ద కాలుష్యానికి కారణాలివే.. ♦ అధిక ఇంజిన్ సామర్థ్యం గల వాహనాలకు విపరీత శబ్దాలు వెలువడే మోడిఫైడ్ హారన్లు, సైలెన్సర్ల వినియోగం ♦ రవాణా వాహనాలు, పరిశ్రమలు, నిర్మాణ రంగ కార్యకలాపాలు, జనరేటర్ల వినియోగం, ఫైర్‌క్రాకర్స్ కాల్చడం, లౌడ్ స్పీకర్లు, డీజే హోరు తదితర కారణాలతో శబ్ద కాలుష్యం పెరుగుతోంది ♦ ప్రధానంగా భారీ ట్రక్కులు, వాహనాల డ్రైవర్లు నిరంతరాయంగా రేయింబవళ్లు హారన్ల మోత మోగిస్తుండడంతో సిటీజన్లు ఆందోళనకు గురవుతున్నారు. ♦ గ్రేటర్లో మొత్తం వాహనాల సంఖ్య 50 లక్షలు.. వీటిలో 15 ఏళ్లకు మించిన కాలం చెల్లిన వాహనాలు 15 లక్షలకు పైమాటే. వీటి ఇంజిన్ల నుంచి పెద్ద ఎత్తున శబ్దాలు వెలువడుతున్నాయి. ♦ గ్రేటర్ పరిధిలో ప్రధాన రహదారులపై సుమారు 100 ప్రధాన ట్రాఫిక్ జంక్షన్లు ఉన్నాయి. వీటి వద్ద అధిక సమయం వాహనాలు నిలపాల్సి రావడంతో హారన్ల మోత మానసిక ఆందోళనకు కారణమవుతోంది. ♦ నివాస ప్రాంతాలను ఆనుకొని ఫంక్షన్ హాళ్లు, క్లబ్బులు, పబ్బుల ఏర్పాటుతో వీటి వద్ద డీజేల హోరు చుట్టుపక్కల వారికి ఇబ్బందిగా మారింది శబ్ద గ్రాహకాల ఏర్పాటులో నిర్లక్ష్యం గ్రేటర్ పరిధిలో సుమారు వెయ్యి ప్రభుత్వ, ప్రైవే టు ఆస్పత్రులున్నాయి. ఇవన్నీ ప్రధాన రహదారులు, ముఖ్యమైన కాలనీల్లోనే ఉన్నాయి. వీటిలో సగం ఆస్పత్రులకు శబ్ద గ్రాహకాలు లేవు. దీంతో రోగులు అధిక ధ్వనులు విని గగుర్పాటుకు గురవుతున్నారు. మహానగరం పరిధిలోని సుమారు ఐదువేల ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోనూ శబ్ద గ్రాహకాలున్నవి అతితక్కువగా ఉన్నాయి. శబ్ద కాలుష్యంతో నష్టాలివే.. ♦ వినికిడి అవధిని దాటి వెలువడే శబ్దాలను ధ్వని కాలుష్యంగా పరిగణిస్తారు. శబ్దం అవధి మించి నమోదయితే అక్కడి నివాసితులకు వినికిడి శక్తి దెబ్బతింటుంది. నిద్రలేమి, అలసట, హృæదయ రక్తనాళాల సంబంధిత వ్యాధులు సంక్రమిస్తాయి. ♦ రక్తపోటు పెరుగుదల అధికంగా ఉంటుంది. చేసే పనిపై ఆసక్తి కోల్పోతారు. ♦ నవజాత శిశువులు 90 డెసిబుల్స్ దాటిన శబ్దాలు వింటే వినికిడి శక్తి కోల్పోతారని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వారి గుండె కొట్టుకునే వేగం పెరిగి ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ♦ 90 డెసిబుళ్లకు మించిన శబ్దాలు విన్నపుడు కొందరికి తాత్కాలిక చెవుడు, మరికొందరికి దీర్ఘకాలిక చెవుడు వచ్చే ప్రమాదముంది. చిన్నపిల్లల కర్ణభేరిలోని సూక్ష్మనాడులు దెబ్బతింటాయి. ♦ పెంపుడు జంతువులు 50 డెసిబుల్స్ దాటిన శబ్దాలను వింటే విపరీతంగా ప్రవర్తిస్తాయి. నగరంలో నమోదవుతోన్న శబ్ద కాలుష్యం (పగలు/రాత్రి) ఇలా ఉంది.. నివాసప్రాంతం 55 డెసిబుల్స్ దాటరాదు.. ప్రాంతం శబ్ద కాలుష్యం జూబ్లీహిల్స్ 61/57 తార్నాక 55/45 వాణిజ్యప్రాంతంలో పగలు 65, రాత్రి 55 డెసిబుల్స్ మించరాదు. జేఎన్టీయూ 70/67 ప్యారడైజ్ 68/68 సున్నితప్రాంతాల్లో పగలు 50, రాత్రి 45 డెసిబుల్స్ మించరాదు జూపార్కు 60/50 గచ్చిబౌలి 61/55 -
మరో ఏడు కారిడార్లలో ట్రాఫిక్ ఫ్రీ
సాక్షి, సిటీబ్యూరో: ఎస్సార్డీపీ (వ్యూహాత్మక రహదారుల పథకం)లో భాగంగా ఇప్పటికే వివిధ మార్గాల్లో ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు, జంక్షన్ల అభివృద్ధి తదితర పనులు చేపట్టిన జీహెచ్ఎంసీ..త్వరలో మరో ఏడు కారిడార్లలో ‘ట్రాఫిక్ ఫ్రీ’ చర్యలు చేపట్టనుంది. ఆయా మార్గాల్లో ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఎక్కడ ఏవి అవసరమైతే ఆ పనులు చేయనుంది. అందులో భాగంగా మరికొన్ని ఫ్లై ఓవర్లు, జంక్షన్ల అభివృద్ధి, రహదారుల విస్తరణ వంటి పనులు జరుగనున్నాయి. ఏయే మార్గాల్లో ట్రాఫిక్ పరిష్కారానికి ఏయే పనులు చేయాలో డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్)ల కోసం కన్సల్టెంట్లకు బాధ్యతలప్పగించారు. కన్సల్టెంట్ సంస్థలనుంచి డీపీఆర్‌లు అందాక టెండర్లు పిలిచి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఓవైపు ఇప్పటికే పనులు ప్రారంభమైన ఎల్బీనగర్ జంక్షన్, కూకట్పల్లి రాజీవ్‌గాంధీ జంక్షన్,బయోడైవర్సిటీపార్క్ జంక్షన్, షేక్‌పేట్ సెవెన్ టూంబ్స్, ఫిల్మ్‌నగర్ రోడ్ జంక్షన్, ఓయూకాలనీజంక్షన్, విస్పర్‌వ్యాలీ జంక్షన్, కొత్తగూడ, కొండాపూర్ జంక్షన్, దుర్గంచెరువుపై కేబుల్‌స్టే బ్రిడ్జి, తదితర పనుల్ని నిర్ణీత వ్యవధిలో పూర్తిచేయడంతోపాటు మరోవైపు ఈ కొత్త పనులకు శ్రీకారం చుట్టనున్నారు. చింతల్‌కుంట, అయ్యప్పసొసైటీ, కామినేని, మైండ్స్పేస్ల వద్ద ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన అండర్‌పాస్‌లు, ఫ్లై ఓవర్లతో ట్రాఫిక్ సమస్యలు తగ్గడంతో నగరంలోని అన్ని ప్రధాన మార్గాల్లోనూ వీలైనంత త్వరితంగా ట్రాఫిక్చిక్కుల్ని తొలగించాలని భావిస్తున్నారు. తాము చేపట్టిన ఫ్లై ఓవర్లు,తదితర పనులతోనే మరోమారు నగర ప్రజలు అధికారం కట్టబెట్టారని భావిస్తోన్న టీఆర్ఎస్ నేతలు సైతం ఎస్సార్డీపీ పనులపై ప్రత్యేక శ్రద్ధ చూపనున్నారు. ట్రాఫిక్ చిక్కులు తొలగనున్న కారిడార్లు ఇవే... ♦ సంగీత్ జంక్షన్–ఉప్పల్–ఎల్బీనగర్ క్రాస్‌రోడ్స్ (అంచనా వ్యయం దాదాపు రూ. 500 కోట్లు). ♦ సచివాలయం– ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం–లిబర్టీ– బషీర్‌బాగ్– జీపీఓ– అఫ్జల్‌గంజ్ (రూ. 500కోట్లు). ♦ పెద్ద అంబర్‌పేట ఓఆర్ఆర్–హయత్‌నగర్–ఎల్బీనగర్ క్రాస్‌రోడ్స్ (రూ.600 కోట్లు). ♦ ఎన్ఎఫ్సీఎల్ జంక్షన్–పంజగుట్ట–బేగంపేట–హరిహరకళాభవన్–సంగీత్ జంక్షన్( రూ.800 కోట్లు). ♦ తార్నాక–మౌలాలి–ఈసీఐఎల్క్రాస్రోడ్స్–దమ్మాయిగూడ (రూ.500 కోట్లు). ♦ ఈసీఐఎల్ క్రాస్‌రోడ్స్–నేరేడ్మెట్–తిరుమలగిరి క్రాస్‌రోడ్స్(రూ. 300 కోట్లు). ♦ జేబీఎస్–ఆర్పీరోడ్– నెక్లెస్‌రోడ్–సెక్రటేరియట్–లక్డికాపూల్–మాసాబ్‌ట్యాంక్ జంక్షన్(రూ. 1200 కోట్లు). -
కళాశాలల స్టాఫ్‌పై ట్రాఫిక్ నిఘా
ఒంగోలు: ట్రాఫిక్ నిబంధనల అమలు కఠినతరం చేయడం కళాశాలల నుంచే ప్రారంభించాలని పోలీస్ శాఖ భావిస్తోంది. మొదట సిబ్బంది, ఆ తర్వాత విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టేందుకు కార్యాలచరణ రూపొందించారు. దీనిలో భాగంగా సోమవారం స్థానిక ఒంగోలు ట్రాఫిక్ పోలీసుస్టేషన్లో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జూనియర్, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ కాలేజీల యాజమాన్యాలతో హెల్మెట్ ధరించడం తప్పనిసరి అనే కార్యక్రమంలో భాగంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ కె.వేణుగోపాల్ మాట్లాడుతూ వాహనంపై వెళ్లే ప్రతి వ్యక్తి తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, లేని పక్షంలో జరిమానాలు తప్పవని స్పష్టం చేశారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం వల్ల జరుగుతున్న నష్టాలను వివరించారు. ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకుగాను ముందుగా కాలేజీల స్థాయి నుంచి కార్యక్రమాలు ప్రారంభిస్తున్నామన్నారు. కాలేజీలో పనిచేసే సిబ్బంది అందరూ వారం రోజుల్లో హెల్మెట్‌తో మాత్రమే వాహనాలు నడపాలని, లేని పక్షంలో జరిమానాలు తప్పవన్నారు. కేవలం వాహనం నడిపే వ్యక్తేకాకుండా వెనుక వైపు కూర్చున్న వ్యక్తికి కూడా హెల్మెట్ తప్పనిసరి అన్నారు. ఏ ఒక్కరికీ హెల్మెట్ లేకపోయినా కేసులు నమోదుచేయడం జరుగుతుందన్నారు. ఇక డిగ్రీ కాలేజీలు, ఇంజినీరింగ్, పీజీ కాలేజీల విద్యార్థుల్లో వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా లైసెన్స్‌లు కలిగి ఉండాలన్నారు. హెల్మెట్ లేకుండా వాహనాలతో కాలేజీకి వచ్చేవారికి కాలేజీల్లోకి అనుమతించవద్దన్నారు. ఈ మేరకు కాలేజీల్లో హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపితే జరిగే ప్రమాదాలు ఎలా ఉంటాయి, హెల్మెట్ ఉన్న సమయంలో ప్రమాదాలు జరిగితే నష్టం ఎలా ఉంటుందనే వివరాలతో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకోవాలని యాజమాన్యాలకు సూచించారు. ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నట్లు గుర్తిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. జూనియర్ కాలేజీల్లో మైనర్లు ఉంటారని, వారికి లైసెన్స్‌లు ఉండే అవకాశం లేనందున అటువంటి వారు వాహనాలతో కాలేజీకి రానివ్వవద్దన్నారు. అటువంటి వారు ఎవరైనా కేసుల్లో నమోదైతే తల్లిదండ్రులపై కూడా కేసులు నమోదుచేయడం జరుగుతుందన్నారు. కాలేజీ బస్సుల డ్రైవర్లు కూడా క్రమం తప్పకుండా నిర్ణీత లైసెన్స్ కలిగి ఉండడంతో పాటు అన్ని బస్సుల ఫిట్నెస్ కలిగి ఉండేలా చూసుకోవాలని, రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పక్కాగా ఉండేలా చూసుకోవాలంటూ హెచ్చరికలు చేశారు. -
సెల్లార్లపై సమరం
అందాల నగరిగా.. ఆర్థిక రాజధానిగా.. స్మార్ట్ సిటీగా విస్తరిస్తున్న విశాఖ నగరంపైనే అందరి చూపు. నగరం విస్తరిస్తున్నట్లుగానే.. జనాభా, వారు వినియోగిస్తున్న వాహనాలూ పెరుగుతున్నాయి. ఫలితంగా ట్రాఫిక్ సమస్య జఠిలంగా మారింది. విశాలంగా ఉన్న విశాఖ రహదారుల్లో ట్రాఫిక్ సమస్య ఉండేది కాదు.. కానీ గడిచిన మూడేళ్లలో బహుళ అంతస్తుల వాణిజ్య సముదాయాలు ఇబ్బడిముబ్బడిగా పెరగడంతో ట్రాఫిక్ రద్దీ నెలకొంది. బహుళ అంతస్తుల్లో పార్కింగ్ సదుపాయం సరిగ్గా కల్పించక రోడ్డుపైనే వాహనాలను పార్క్ చేయాల్సిన దుస్థితి నెలకొంది. దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. విశాఖ సిటీ: మహా విశాఖ నగరంలో పార్కింగ్ సమస్య జఠిలమైపోతోంది. ఓ వైపు బహుళ అంతస్తుల వాణిజ్య సముదాయాలు పెరిగిపోతుండగా.. వాటి సెల్లార్లలో నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్ సౌకర్యానికి బదులు వ్యాపార లావాదేవీలకు ఉపయోగిస్తుండడంతో సమస్య రోజు రోజుకీ తీవ్రమవుతోంది. దీనిని అధిగమించడానికి జీవీఎంసీ, ట్రాఫిక్ పోలీసు విభాగం సంయుక్తంగా రంగంలోకి దిగాయి. సమస్య ఎక్కువగా ఉన్న వన్‌టౌన్ ఏరియాలో డ్రైవ్ చేపట్టి సెల్లార్లను పార్కింగ్ కోసం ఉపయోగించేలా చర్యలకు ఉపక్రమిస్తున్నారు. జీవీఎంసీ పరిధిలో దాదాపు 500కు పైగా బహుళ అంతస్తుల వాణిజ్య సముదాయాలుండగా వీటిలో 50 భవనాల వరకూ మాత్రమే సెల్లార్లను పూర్తిగా పార్కింగ్‌కు ఉపయోగిస్తున్నాయి. మరో 50 దుకాణాలు తూతూ మంత్రంగా పార్కింగ్ కోసం సెల్లార్లను వినియోగిస్తుండగా.. మిగిలిన 400కి పైగా సముదాయాలు మాత్రం వాటిని కమర్షియల్‌గా వినియోగించుకుంటున్నాయి. జీవీఎంసీలో ప్లాన్ తీసుకునేటప్పుడు మాత్రం సెల్లార్లను పార్కింగ్‌కు వినియోగిస్తామని పేర్కొంటారు. కానీ భవనం వినియోగంలోకి వచ్చాక దాన్ని వ్యాపార, వాణిజ్యానికి ఉపయోగించి, వాహనాలను రోడ్లపైనే పార్క్ చేస్తున్నారు. జీవీఎంసీతో కలిసి ‘ట్రాఫిక్’ నియంత్రణ కోసం.. నగరంలో వాణిజ్య ప్రాంతాలైన జగదాంబ, డాబాగార్డెన్స్, పూర్ణామార్కెట్, ద్వారకానగర్, అశీల్‌మెట్ట, మద్దిలపాలెం, జిల్లా పరిషత్, కేజీహెచ్, గాజువాక, అక్కయ్యపాలెం, ఎంవీపీ కాలనీ, కంచరపాలెం, ఎన్ఏడీ కొత్తరోడ్డు, మర్రిపాలెం, సూర్యాబాగ్, మాధవధార తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటోంది. ఇక్కడ ఉన్న వాణిజ్య సముదాయాల్లో 90 శాతం వరకూ సెల్లార్లను పార్కింగ్‌కు కాకుండా ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారు. ఈ కారణంగానే రద్దీ ఎక్కువైపోతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు జీవీఎంసీతో కలిసి ట్రాఫిక్ పోలీసులు నడుంబిగించారు. రెండు శాఖలు సంయుక్తంగా పార్కింగ్ సమస్యకు సరైన పరిష్కారం కోసం సమన్వయంగా పనిచేయాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగా డ్రైవ్ చేపట్టారు. తొలి విడతలో భాగంగా ప్రధాన రద్దీ ఉన్న వన్ టౌన్ ప్రాంతంలో వాణిజ్య సముదాయాలకు తాఖీదులివ్వడం ప్రారంభించారు. శుక్రవారం జీవీఎంసీ, ట్రాఫిక్ పోలీస్ అధికారులు వాల్తేర్ రోడ్డులో వాణిజ్య సముదాయాల్ని పరిశీలించారు. సెల్లార్లను పార్కింగ్‌కు ఉపయోగించకుండా ఇతర అవసరాలకు వినియోగిస్తున్న భవన యజమానులకు హెచ్చరికలతో కూడిన నోటీసులు జారీ చేశారు. సెల్లార్లను పార్కింగ్‌కు మాత్రమే వినియోగించకపోతే భవనాల్ని సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఫ్రీ పార్కింగ్ జోన్స్ ఎక్కడ? నగరాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తున్న జీవీఎంసీ.. పార్కింగ్ విషయంలో మాత్రం సరైన చర్యలు తీసుకోలేకపోతోందన్న విమర్శ ఉంది. చాలా నగరాల్లో ఫ్రీ పార్కింగ్ జోన్లు ఎక్కువగా ఉంటాయి. మహా విశాఖ నగరంలో మాత్రం అక్కడక్కడా ఇవి కనిపిస్తున్నాయి. రైతుబజార్లు, పూర్ణామార్కెట్, మల్టీప్లెక్స్‌లలో పార్కింగ్ ఫీజుల దందా కొనసాగుతోంది. అక్కడ ఐదు నిమిషాల పని ఉన్నా రూ.10 నుంచి రూ.40 వరకూ వసూలు చేస్తున్నారు. ఆ డబ్బులు చెల్లించేందుకు ఇష్టపడక వాహనదారులంతా ఎక్కడపడితే అక్కడ పార్క్ చేసేస్తున్నారు. ఈ కారణంగానే సమస్య పెరిగిపోతోంది. మరోవైపు నోపార్కింగ్ జోన్లలో వాహనాలు నిలపడం ట్రాఫిక్ పోలీసులకు తలనొప్పిగా మారింది. ఫ్రీ పార్కింగ్ విషయంలో జీవీఎంసీ కాస్తా ప్రణాళికలు రూపొందించి. ప్రతి అర కిలోమీటర్ లేదా కిలోమీటర్ దూరంలో ఒక ఫ్రీ పార్కింగ్ జోన్ ఏర్పాటు చేస్తే ఈ సమస్యకు కొంత పరిష్కారం దొరుకుతుందని సర్వత్రా అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్కింగ్ కష్టాలు తీర్చేందుకే ప్రత్యేక డ్రైవ్ నగరంలో వ్యక్తిగత వాహన వినియోగం పెరుగుతోంది. ఫలితంగా ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్కింగ్ చేసేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. స్మార్ట్ నగరంలో ప్రజలు పార్కింగ్ కోసం అవస్థలు పడకుండా ఉండేందుకు కమిషనర్, చీఫ్ సిటీ ప్లానర్ సూచనల మేరకు ట్రాఫిక్ పోలీసులతో కలిపి చర్యలకు ఉపక్రమిస్తున్నాం. అన్ని ప్రధాన రహదారుల్లోనూ డ్రైవ్ చేపడుతున్నాం. ప్రతి వాణిజ్య సముదాయంలోనూ సెల్లార్‌ను పార్కింగ్‌కు మాత్రమే వినియోగించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తున్నాం. –సురేష్, జీవీఎంసీ డిప్యూటీ సిటీ ప్లానర్ -
మూడు గంటల నరకం
ఎన్ఏడీ జంక్షన్(విశాఖ పశ్చిమ): ఎన్ఏడీ జంక్షన్లో వాహన చోదకులు నరకం చూశారు. సోమవారం ఉదయం 8 నుంచి 11 గంటల వరకు కూ డలిలో వాహనాలు ముందుకు కదలలేదు. ఏ వైపు చూసినా వాహనాలు కిక్కిరిసిపోయాయి. ఫలితంగా అటు ఉద్యోగులు ఇటు విద్యార్థులు నకరం చూడాల్సి వచ్చింది. గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో ట్రాఫిక్ నిలిచిపోలేదని వాహన చో దకులు ఆశ్చర్యపోయారు. బీఆర్టీఎస్ రహదా రిలో బాజీ జంక్షన్ దాటిపోయింది. 80అగుడుల రహదారిలో కూడా సీతారామరాజునగర్ శివాల యం వరకు వాహనాలు నిలిచి పోయాయి. జాతీయ రహదారిపై వాహనాల బారులు ఎన్ఏడీ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం ఇక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ బారికేడ్ల వల్ల రహదారి కుచించుకుపోయింది. దీంతో ఎక్కువ సంఖ్యలో వాహనాలు వెళ్లేందుకు అవకాశం లేక పోవడంతో రద్దీ మరింత ఎక్కువయింది. కూడలిలో రద్దీ ఉన్న వాహనాలను పంపే ప్రయత్నంలో గోపాలపట్నం నుంచి వచ్చే వాహనాలకు ఎక్కువ సమయం కేటాయిస్తుంటే మిగిలిన రహదారుల్లో రద్దీ ఎక్కువవుతుండడంతో ట్రాఫిక్ సిబ్బంది ఇబ్బందులు పడ్డారు. దీనికి తోడు కార్తీక సోమవారంతో పాటు ఏకాదశి కావడంతో భక్తులు ఆలయాలకు వెళ్లి రావడం వల్ల సాధారణంగా కాకుండా రద్దీ ఎక్కువగా ఉందని స్థానికులు చెబుతున్నారు. 11గంటల తర్వాత కాస్త ఉపశమనం కలిగింది. ఎన్ఎస్టీఎల్ గోడ తొలగింపే ప్రత్యామ్నాయం ఎన్ఎస్టీఎల్ గోడ తొలగింపే ట్రాఫిక్ ఇక్కట్లు తొలగించడానికి ప్రత్యామ్నాయమని వాహన చోదకులు వాపోతున్నారు. లోపల పనులు వేగవంతం చేసి గోడను తొలగించి రహదారి నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు. ప్రజాప్రతినిధులు ఫొటోల కోసం తాపత్రయ పడుతున్నారే తప్ప ప్రజల ఇక్కట్లను పట్టించుకోవడంలేదని మండిపడుతున్నారు. రద్దీ సమయంలో ఎన్ఎస్టీఎల్ అధికారులు లోపలి నుంచి వెళ్లేందుకు అవకాశం ఇవ్వాలని వాహన చోదకులు కోరుతున్నారు. అన్ని దారుల్లో రద్దీ గోపాలపట్నం నుంచి ఎన్ఏడీ జంక్షన్‌కు వచ్చే దారులన్నీ రద్దీ గా తయారయ్యాయి. గోపాలపట్నం నుంచి వచ్చే రోడ్డులో మాత్రం ట్రాఫిక్ భారీగా నిలిచి పోయింది. ఇటు ఏపీఏపీబీ కాలనీ 80అడుగుల రహదారిలో కూడా భారీగా వాహనాలు నిలిచి పోయాయి. ఎన్ఎస్టీఎల్ ఫ్యామిలీ గేటు(సింహాద్రి గేటు) వద్ద రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. ఇక్కడి సందులోనుంచి వెళ్లేందుకు ద్విచక్రవాహనాలు గేటుకు అడ్డంగా ఉండడంతో ఎన్ఎస్టీఎల్ ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు. గేటు లోపలికి వెళ్లేందుకు నానా అవస్థలు పడ్డారు. -
ట్రాఫిక్ బాస్ వాహనాలపై చలాన్లు..
సాక్షి, సిటీబ్యూరో: సిటీ ట్రాఫిక్ చీఫ్‌లకూ జరిమానాలు తప్పట్లేదు. 2011లో నాటి అదనపు సీపీ (ట్రాఫిక్) సీవీ ఆనంద్... తాజాగా గురువారం ట్రాఫిక్ విభాగం ప్రస్తుత బాస్ అనిల్‌కుమార్ ఇద్దరి వాహనాలపై చలాన్లు పడ్డాయి. ఈ రెండు ఉదంతాల్లోనూ అధికారిక డ్రైవర్ల కారణంగానే అధికారులు బుక్ కావడం, రాంగ్ పార్కింగ్‌కు సంబంధించిన చలాన్లు కావడం కొసమెరుపు. రికార్డుల ప్రకారం ఆయా డ్రైవర్లే జరిమానా కట్టినట్లు ఉన్నా... ఆనక ఆ డబ్బును ట్రాఫిక్ చీఫ్‌లు తమ జేబుల్లోంచి ఇచ్చారు. ఇద్దరూ అధికారిక వాహనాల్లో, అఫీషియల్ విధుల్లో ఉన్నప్పుడే ఇలా జరగడం యాదృచ్ఛికం. పంజగుట్టలో సీవీ ఆనంద్... సీనియర్ ఐపీఎస్ అధికారి, ప్రస్తుత సీఐఎస్ఎఫ్ ఐజీ సీవీ ఆనంద్ గతంలో నగర ట్రాఫిక్ చీఫ్‌గా పని చేశారు. అప్పట్లో ఆయన నిబంధనలు ఉల్లంఘిస్తున్న పోలీసు వాహనాలపై స్పెషల్‌డ్రైవ్ చేపట్టారు. ఇది ప్రారంభించిన రెండో రోజే ఆనంద్ వాహనానికి జరిమానా పడింది. పోలీసు వాహనాలపై స్పెషల్డ్రైవ్ను పర్యవేక్షించడానికి సీవీ ఆనంద్ 2011 ఆగస్టు 11 మధ్యాహ్నం 1.00 గంటల ప్రాంతంలో సోమాజిగూడలోని రాజీవ్‌గాంధీ చౌరస్తా వద్దకు వెళ్లారు. తన స్కార్పియో వాహనాన్ని (ఏపీ 9 పీఏ 0360) దిగి జంక్షన్లో ఉన్న ట్రాఫిక్ సిబ్బంది వద్దకు చేరుకున్నారు. దీంతో డ్రైవర్ వాహనాన్ని ఆ సమీపంలోని నో పార్కింగ్ ఏరియాలో ఆపారు. తన పని ముగించుకుని తిగిరి వచ్చిన ఆనంద్ ఈ విషయాన్ని గుర్తించారు. అక్కడే ఉన్న అప్పటి పంజగుట్ట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ చంద్రకుమార్‌ను పిలిచి తన డ్రైవర్‌కూ రాంగ్ పార్కింగ్ నేరం కింద రూ.200 జరిమానా విధించమని ఆదేశించారు. ఆ ప్రకారం రాసిన చలానా మొత్తాన్ని మాత్రం ఆనంద్ చెల్లించి డ్రైవర్‌ను హెచ్చరించారు. మహంకాళిలో అనిల్‌కుమార్... ఆనంద్ తర్వాత దాదాపు ఏడేళ్లకు నగర ట్రాఫిక్ చీఫ్‌గా వ్యవహరిస్తున్న అనిల్‌కుమార్ ‘వంతు’ వచ్చింది. ప్రస్తుతం ట్రాఫిక్ చీఫ్‌గా ఉన్న అనిల్‌కుమార్ గడిచిన కొన్ని రోజులుగా ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. వీటిలో భాగంగా వివిధ ట్రాఫిక్ ఠాణాలతో పాటు ఏసీపీ కార్యాలయాలకూ వెళ్తున్నారు. గురువారం నార్త్‌జోన్ పరిధిలో ఉన్న మహంకాళి ట్రాఫిక్ పోలీసుస్టేషన్‌కు అనిల్‌కుమార్ వెళ్ళారు. సికింద్రాబాద్‌లోని హరిహర కళాభవన్ సమీపంలోని భవనం మొదటి అంతస్తులో ఉన్న ఈ ఠాణాకు అనిల్‌కుమార్ తన వాహనం దిగి లోపలకు వెళ్లిపోయారు. వాహనాలను సక్రమంగా నిలపాల్సిన బాధ్యత ఆ వాహ నం డ్రైవర్‌దే. అనిల్‌కుమార్‌కు డ్రైవర్‌గా వ్యవహరించిన సిబ్బంది దాన్ని రోడ్డు పక్కగా ఆపారు. అదే ప్రాంతంలో ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేసి న నో–పార్కింగ్ బోర్డు ఉంది. ఇలా రాంగ్ పా ర్కింగ్‌లో ఉన్న వాహనం, దానికి పోలీసుల అధికారులకు చెందినది అని చెప్పే ఆనవాళ్లు ఉండ టం గమనించిన ఓ నెట్‌జనుడు ఫొటో తీశాడు. దీన్ని మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో నగర ట్రాఫిక్ పోలీసు అధికారిక ట్విటర్ ఖాతాకు ట్వీట్ చేశాడు. తక్షణం స్పందించిన అధికారులు అదనపు సీపీ వాహనంపై రూ.235 జరిమానా విధి స్తూ ఈ–చలాన్ జారీ చేశారు. విషయం తెలుసుకు న్న అనిల్‌కుమార్ ఆరా తీయగా డ్రైవర్ చూపిన నిర్లక్ష్యం బయటపడింది. దీంతో తొలుత అతడితో రూ.235 జరిమానా కట్టించి ఈ–చలాన్ క్లోజ్ చే యించారు. ఆపై కొద్దిసేపటికి ట్రాఫిక్ చీఫ్ సదరు డ్రైవర్‌కు తన జేబు నుంచి ఆ మొత్తం ఇచ్చారు. -
బండెక్కితే బాదుడే..!
ఖమ్మంక్రైం: సిగ్నల్స్ వద్ద మార్కింగ్ లేకపోవడం.. దుకాణాల ఎదుట వాహనాలు నిలిపేందుకు స్థలం లేకపోవడం.. వాహనదారులు, ప్రయాణికులు ఎవరు ఎటు వెళ్తున్నారో తెలియని గందరగోళం. నిత్యం వేలాది వాహనాలు నగరంలోకి వచ్చిపోతుండడంతో ట్రాఫిక్ వ్యవస్థ పద్మవ్యూహాన్ని తలపిస్తోంది. ప్రధాన కూడళ్లలో మరీ దారుణంగా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనికితోడు ట్రాఫిక్ పోలీసులు కొత్తగా ప్రవేశపెట్టిన ఈ–చలానా విధానంతో వాహనదారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వారి తీరుతో జేబులు గుల్ల చేసుకుంటున్నారు. నగరంలో అస్తవ్యస్తంగా మారిన ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు పోలీసులు ఐదు సెక్టార్లుగా విభజించారు. ఒకటో సెక్టార్ గాంధీ చౌక్ నుంచి త్రీటౌన్ ప్రాంతం, రెండో సెక్టార్ వన్‌టౌన్ పరిధిలోని స్టేషన్ రోడ్ నుంచి, మూడో సెక్టార్ వైరారోడ్ నుంచి జెడ్పీసెంటర్ వరకు, నాలుగో సెక్టార్ జెడ్పీసెంటర్ నుంచి శ్రీశ్రీ విగ్రహం వరకు, ఐదో సెక్టార్ ఎన్టీఆర్ విగ్రహం నుంచి బైపాస్ రోడ్డు వరకు విభజించారు. వీటిలో ప్రధాన కూడళ్లు అయిన గాంధీచౌక్, కాల్వొడ్డు, వైరా రోడ్, కిన్నెర పాయింట్, మయూరి సెంటర్ ప్రాంతాల్లో నిత్యం వాహనదారులు, పాదచారులు నరకం చూడాల్సిందే. ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న కూరగాయల మార్కెట్ వద్ద ట్రాఫిక్ సమస్య ఉన్నా పట్టించుకునేవారు కరువయ్యారు. కస్బాబజార్‌లో పలు వస్త్ర దుకాణాల వద్ద, అజీజ్ గల్లీ ప్రాంతంలో సైతం ఇదే సమస్య. ముఖ్యంగా అత్యంత రద్దీ ప్రాంతమైన కిన్నెర పాయింట్, కమల మెడికల్ ప్రాంతంలో సాయంత్రం 5 గంటల తర్వాత అక్కడి పాయింట్లో విధులు నిర్వర్తించాల్సిన కానిస్టేబుళ్లు ఉండడం లేదని, దీంతో ట్రాఫిక్ సమస్య ఆ ప్రాంతంలో మరింత తీవ్రంగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి పాయింట్ల వద్ద ఉదయం 8 నుంచి రాత్రి 9 గంటల వరకు సిబ్బంది విధులు నిర్వర్తించాలి. కానీ.. ప్రధాన పాయింట్ల వద్ద సిబ్బంది సరిగా విధులు నిర్వర్తించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం 60 మంది ట్రాఫిక్ సిబ్బంది ఉండగా.. అందులో 20 మంది వరకు ఇతర విధులు నిర్వర్తిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ సైతం కొరవడిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భయభ్రాంతులకు గురిచేస్తున్న సిబ్బంది ఇటీవల కాలంలో ఈ–చలానా, క్యాష్‌లెస్ లావాదేవీల పేరుతో హైదరాబాద్ స్థాయిలో ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధానాన్ని ప్రవేశపెట్టారు. వారు చేపట్టిన కార్యక్రమం మంచిదే అయినప్పటికీ ఖమ్మం వంటి నగరంలో దీనిపై 90 శాతం మంది వాహనదారులకు అవగాహన లేదు. ఈ విధానాన్ని ఇక్కడ ప్రారంభించిన మొదటి రోజు పత్రికల్లో వార్తలు వచ్చాయి తప్ప దీనిపై వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు ఎటువంటి అవగాహన కల్పించిన దాఖలాలు లేవు. కొందరు సిబ్బందికి డిజిటల్ కెమెరాలు ఇచ్చి విధి నిర్వహణకు పంపిస్తుండడం.. వారు ఒక్కసారిగా రోడ్లపై వెళ్తున్న ద్విచక్ర వాహనదారుల ఫొటోలు తీయడంతో ఏమీ అర్థంకాక వాహనదారులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ముఖ్యంగా అసలు ఫొటోలు తీస్తున్న సిబ్బందికి కూడా ఈ ఫొటోలు ఎందుకు తీయాలి.. ఈ–చలానా అంటే ఏమిటో కూడా సరిగా తెలియదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా.. ట్రాఫిక్ సిగ్నల్స్‌ను అతిక్రమించడం, హెల్మెట్ ధరించకపోవడం, సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడం వంటి వాటిని ట్రాఫిక్ పోలీసులు ఫొటోలు తీసి.. నేరుగా వాహనదారుడి సెల్‌కు జరిమానా ఎంత కట్టాలి అనే దానిపై మెసేజ్ పంపిస్తారు. పార్కింగ్ ఏర్పాటు గాలికి.. హైదరాబాద్ స్థాయిలో ఈ–చలానా ప్రవేశపెట్టిన పోలీసులు.. హైదరాబాద్ స్థాయిలో కాకుండా కనీసం ఖమ్మం కమిషనరేట్ స్థాయిలో వాహనాల పార్కింగ్ కోసం ఏళ్లు గడిచినా సరైన స్థలం చూపించలేదు. నిత్యం నగరానికి సుమారు 1.50 లక్షల వాహనాలు వచ్చి పోతుంటాయి. వీటిలో 20వేలకు పైగా ఆటోలు ఉండగా.. మిగతావి ఇతర వాహనాలు ఉన్నాయి. ఆటోలకు అడ్డాలు లేకపోవడంతో నిత్యం రోడ్లపైనే వాటిని నిలుపుతుండడంతో ట్రాఫిక్ సమస్య ఎదురవుతోంది. ఆస్పత్రికి.. వ్యాపార సముదాయాలకు వెళ్లాలనుకున్నా.. తమ వాహనాలను ఎక్కడ పార్కింగ్ చేయాలో తెలియక సతమతమవు తున్నారు. ఇంత జరుగుతున్నా పార్కింగ్ స్థలాల గురిం చి ట్రాఫిక్ పోలీసులు పట్టించుకోకపోవడం గమనార్హం. వాహనదారులకు వివరించాలి.. అలాగే ఈ–చలానాపై వాహనదారులకు అవగాహన కల్పించడం ఎంతోముఖ్యం. ఈ–చలానా అంటే ఏమి టి? ఎందుకు ఈ–చలానా ద్వారా జరిమానాలు విధిస్తారు? అనే దానిపై తమకు కూడా అవగాహన కల్పించాలని పలువురు వాహనదారులు కోరుతున్నారు. ఆ తర్వాతే దీనిని పూర్తిస్థాయిలో అమలుచేస్తే బాగుం టుందని వాహనదారులు, ప్రజలు చెబుతున్నారు. -
ఎటెళ్లాలో..చెప్పేస్తుంది..!
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ఏర్పాటవుతున్న అత్యాధునిక వ్యవస్థ ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టంలో (ఐటీఎంఎస్) ఉల్లంఘనుల్లో క్రమశిక్షణ పెంచడం, స్వైర‘విహారం’ చేసే నేరగాళ్లకు చెక్ చెప్పడంతో పాటు వాహనచోదకులు గమ్యం చేరుకునే సమయాన్ని గణనీయంగా తగ్గించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇందులో భాగంగానే మొబైల్ వీఎంఎస్ బోర్డులు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ట్రాఫిక్ కమిషనరేట్ ఎదురుగా ఉన్న పోలీసు కంట్రోల్ రూమ్ (పీసీఆర్) జంక్షన్లో ప్రయోగాత్మకంగా దీనిని ఏర్పాటు చేశారు. పనితీరు అధ్యయనం, మార్పు చేర్పుల తర్వాత దాదాపు 10 సమీకరించుకోవాలని భావిస్తున్నారు. ఐటీఎంఎస్ వ్యవస్థ అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ నిర్వహణ, పరిశీలన మొత్తం కమిషనరేట్ కేంద్రంగా పని చేసే కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (సీసీసీ) నుంచే జరుగుతుంది. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో అందుబాటులోకి వస్తున్న ఐటీఎంఎస్ మరో రెండు నెలల్లో పని చేయడం ప్రారంభించనుంది. సిటీలో అనేక సందర్భాల్లో హఠాత్తుగా భారీ ట్రాఫిక్ జామ్స్ ఏర్పడుతుంటాయి. దీనికి ప్రధాన కారణం ఓ వాహనం ప్రయాణిస్తున్న మార్గంలో ముందు ట్రాఫిక్ జామ్ లేదా అడ్డంకి ఏర్పడిందనే విషయం ముందుగా తెలియకపోవడమే. ప్రస్తుతం నగరంలోని కొన్ని జంక్షన్లతో సహా మొత్తం 17 ప్రాంతాల్లో వేరియబుల్ మెసేజ్ సైన్ బోర్డులుగా (వీఎంఎస్) పిలిచే డిజిటల్ బోర్డులు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం వీటిలో కేవలం రహదారి భద్రత నిబంధనలు, కొన్ని స్లోగన్స్, అధికారిక సూచనలు మాత్రమే ప్రత్యక్షం అవుతున్నాయి. ఐటీఎంఎస్ ద్వారా ప్రతి జంక్షన్‌లోనూ ఏర్పాటయ్యే వీఎంఎస్‌లు ట్రాఫిక్ స్థితిగతులపై నిరంతర సందేశాలు ఇవ్వనున్నారు. ఓ మార్గంలో ప్రయాణిస్తున్న వాహనచోదకుడికి ముందు రానున్న చౌరస్తా, రహదారిలో ట్రాఫిక్ స్థితిగతులను ఎప్పటికప్పుడు వీఎంఎస్‌ల్లో ప్రదర్శితమవుతాయి. ట్రాఫిక్ జామ్‌లో చిక్కకుండా ఉండేందుకు అవసరమైన ప్రత్యామ్నాయ మార్గాలూ వీటిద్వారా ప్రదర్శితమవుతాయి. అయితే ఈ బోర్డులు 17 ప్రాంతాల్లోనూ స్థిరంగా ఉంటాయి. అయితే సిటీలో నిత్యం ఏదో ఒక భారీ ఉత్సవం, ఊరేగింపు, సభ, సమావేశం, ర్యాలీలు సర్వసాధారణం. గణేష్ ఉత్సవాలు తదితరాలు జరిగినప్పుడు ట్రాఫిక్ పోలీసులు అనేక చోట్ల ట్రాఫిక్ మళ్లింపులు చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో అనుకోకుండా హఠాత్తుగా తలెత్తే ధర్నాలు, నిరసనల నేపథ్యంలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్స్ ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు ట్రాఫిక్ పోలీసులే ఆయా చౌరస్తాలో, రహదారులపైనో ఉండి వాహనాలను దారి మళ్లిస్తుంటారు. అలా కాకుండా ఆయా ప్రాంతాలకు తరలించి, సూచనలు ప్రదర్శించడానికి అనువుగా మొబైల్ వీఎంఎస్ బోర్డులు సమీకరించుకుంటున్నారు. చక్రాలతో ఉండి, బ్యాటరీ ఆధారంగా పని చేసే ఈ బోర్డులను అవసరమైన చోటికి తీసుకువెళ్లవచ్చు. ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత తీసుకువచ్చి భద్రపరిచే ఆస్కారం ఉంది. ప్రయోగాత్మకంగా ఓ బోర్డును రెండు రోజులుగా పీసీఆర్ చౌరస్తాలో ఉంచి అధ్యయనం చేస్తున్నారు. మరోపక్క కాలం చెల్లిన ఆర్టీసీ బస్సులతో పాటు అనేక వాహనాలు నిత్యం నగర రహదారులపై బ్రేక్‌డౌన్ అవుతుంటాయి. కీలక, ఇరుకైన ప్రాంతాల్లో జరిగే ఈ బ్రేక్‌డౌన్స్, విషయం సంబంధిత అధికారులకు చేరడంలో జాప్యం కారణంగా ఒక్కోసారి కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్స్ ఏర్పడుతున్నాయి. ఇలా రహదారులపై సాంకేతిక లోపాలతో ఆగిపోయే వాహనాల గుర్తింపునకు ఐటీఎంఎస్‌లో ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ సిస్టం (ఐఎంఎస్) ఏర్పాటు చేస్తున్నారు. ఇది బ్రేక్‌డౌన్ వాహనాలను తక్షణం గుర్తించడంతో పాటు ఏ మార్గాల్లో ట్రాఫిక్ని నియంత్రించాలి, ఎక్కడ ఆపేయాలి అనేది విశ్లేషిస్తుంది. ఆ సమాచారాన్ని క్షేత్రస్థాయిలో ఉండే పోలీసులతో పాటు ట్రాఫిక్ పోలీసు క్రేన్ సిబ్బందికీ సమాచారం ఇస్తుంది. అ లాంటి పరిస్థితుల్లో మొబైల్ వీఎంఎస్ బోర్డుల్ని ఆ ప్రాంతానికి తరలించి మళ్ళింపులు, ప్రత్యామ్నా య మార్గాలను వీటి ద్వారా వివరిస్తుంటారు. -
ట్రాఫిక్ వలయంలో అంబులెన్స్‌లు
సాక్షి, పరకాల: పట్టణంలోని అంగడి బజార్ పార్కింగ్ స్థలాలను వ్యాపారస్తులతో పాటు చిరువ్యాపారస్తులు ఇష్టారాజ్యంగా ఆక్రమించడంతో వాహనదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. సివిల్ ఆస్ప్రతికి వెళ్లాల్సిన అత్యవసర వాహనాలు 104, 102లు సైతం ఆదివారం ట్రాఫిక్ వలయంలో చిక్కుకున్నాయి. దుకాణాల ముందు ఉన్న పార్కింగ్ స్థలాల్లో కూరగాయల, పండ్ల వ్యాపారస్తులు, చిరు దుకాణాలు ఏర్పడ్డాయి. మరోవైపు దుకాణాదారులు వారి వస్తు సామగ్రిని ఏర్పాటు చేయడంతో అంబులెన్స్‌లకు సైతం ట్రాఫిక్ సమస్యలు తప్పడం లేదు. ఒకవైపు వాహదారులు, మరోవైపు అత్యవసర వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు. -
హ్యాపీ జర్నీ
గచ్చిబౌలి: ఎప్పటినుంచో కలగా ఉన్న మైండ్‌స్పేస్ ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. ఈ వంతెన ప్రారంభంతో ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి.. మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిశోర్‌తో కలిసి శుక్రవారం వంతెనను ప్రారంభించారు. ఈ సందర్భంగా జోషి మాట్లాడుతూ.. విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్‌లో ఎస్సార్డీపీ (వ్యూహాత్మక రహదారుల పథకం)లో భాగంగా నిర్మిస్తున్న ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ చిక్కులు తీరనున్నాయన్నారు. మైండ్‌స్పేస్ ఫ్లైఓవర్ ప్రారంభంతో ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. నిర్ణీత సమయానికి ముందే ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి చేసిన చీఫ్ ఇంజినీర్ శ్రీధర్‌ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. చీఫ్ ఇంజినీర్ శ్రీధర్ మాట్లాడుతూ.. రూ.25 వేల కోట్లతో ఎస్ఆర్డీపీలో భాగంగా జీహెచ్ఎంసీ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు శ్రీకారం చుట్టామన్నారు. 111 కి.మీ స్కైవేలు, 366 కి.మీ మేజర్ కారిడార్లు, 166 కి.మీ. మేజర్ రోడ్లు,348 కి.మీ. జంక్షన్లు, 2500 కి.మీ. మైనర్ రోడ్లు ఐదు విడతల్లో అభివృద్ధి చేస్తామన్నారు. త్వరలో రూ.5 వేల కోట్లతో ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం చేపట్టనున్నట్టు చెప్పారు. వచ్చే జనవరిలో జేఎన్టీయూ, ఎల్బీనగర్ ఫ్లైఓవర్లు అందుబాటులోకి వస్తాయన్నారు. వంతెన ప్రారంభోత్సవంలో వెస్ట్ జోన్ కమిషనర్ హరిచందన, సైబరాబాద్ కమిషనర్ వి.సి.సజ్జనార్, ట్రాఫిక్ డీసీపీ ఎస్.ఎం.విజయ్ కుమార్, మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్రావు, అడిషనల్ డీసీపీలు అమర్ కాంత్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, ఏసీపీ శ్యామ్ ప్రసాద్‌రావు, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు. ఇక సాపీగా రాకపోకలు.. అత్యంత కీలకమైన మైండ్‌స్పేస్ జంక్షన్లో ట్రాఫిక్ సమస్య అత్యంత తీవ్రంగా ఉన్నట్టు జీహెచ్ఎంసీ 2015లో చేపట్టిన అధ్యయనంలో తేలింది. ఇక్కడ గంటకు 14,393 వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయని, 2035 నాటికి వాటి సంఖ్య 31,536కు పెరగనుందని అంచనా వేశారు. అందుకు అనుగుణంగా ఇక్కడ ఫ్లైఓవర్‌ను నిర్మించారు. దీంతో ఇనార్బిట్ మాల్ నుంచి రాడిసన్ హోటల్, బయోడైవర్సిటీ జంక్షన్‌కు ఐదు నిమిషాల్లోనే చేరుకోవచ్చు. ఉదయం సమయంలో జూబ్లీహిల్స్ నుంచి వచ్చే వాహనాలు బయోడైవర్సిటీ, రాడిసన్ హోటల్ వైపు, లెమన్ ట్రీ హోటల్ వైపు వెళ్లవచ్చు. గచ్చిబౌలి వైపు నుంచి వచ్చే వాహనాలు ఇనార్బిట్ మాల్, సైబర్ టవర్, రాడిసన్ హోటల్ వైపు రాకపోకలు చేయవచ్చు. సాయంత్రం ç5 నుంచి రాత్రి 9 గంటల వరకు రాడిసన్ హోటల్, బయోడైవర్సిటీ వైపు నుంచి వాహనాలు ఇనార్బిట్ మాల్, సైబర్ టవర్ వైపు ఎలాంటి అటంకం లేకుండా రాకపోకలు సాగేందుకు మార్గం సులువైంది. అయితే, రాడిసన్ హోటల్ వద్ద జంక్షన్ విస్తరణ జరగకుంటే ట్రాఫిక్ కష్టాలు తప్పవు. డీఎల్ఎఫ్ వైపు వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం కలిగే అవకాశం ఉంది. ఈ జంక్షన్ వద్ద ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన ఆరులేన్ల అండర్‌పాస్ వ్యయం రూ.25.78 కోట్లు. సర్వీస్ రోడ్లు, యుటిలిటీ డక్ట్, డ్రెయిన్ల వ్యయం రూ.28.83 కోట్లు, యుటిలిటీ షిఫ్టింగ్ వ్యయం రూ.5.92 కోట్లు. వెరసి మొత్తం ఖర్చు రూ.108.59 కోట్లు. ఎస్సార్డీపీ పనుల్లో ఇప్పటికే రూ.200 కోట్ల మేర పనులు పూర్తయ్యాయి. మరో రూ.3 వేల కోట్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. మరో రూ.25 వేల కోట్ల పనులు టెండర్ల ప్రక్రియలో ఉన్నాయి. -
పదిలంగా.. ఆ గుండె ప్రయాణం!
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రి, నాంపల్లిలోని కేర్ ఆస్పత్రి మధ్య మార్గం అది. నిత్యం రద్దీగా ఉండే ఈ మార్గంలో వాహనాల సరాసరి వేగం 25 కిలోమీటర్లకు మించదు. గురువారం కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ మహిళ గుండె మార్పిడి శస్త్రచికిత్స కోసం డోనర్ గుండె(లైవ్ హార్ట్)ను ఆ మార్గంలో తీసుకెళ్లేందుకు నగర ట్రాఫిక్ పోలీసులు ‘గ్రీన్ చానల్’ఇచ్చారు. ఫలితంగా ఈ 8 కి.మీల మార్గాన్ని అంబులెన్స్ కేవలం 7 నిమిషాల్లో అధిగమించింది. మధ్యాహ్నం 12.46కు యశోద ఆస్పత్రి నుంచి అంబులెన్స్ బయలుదేరగా.. కేర్ ఆస్పత్రికి 12.53కు చేరుకుంది. అనంతరం ప్రారంభమైన ఆపరేషన్ సాయంత్రం వరకు సాగింది. ఆపరేషన్ విజయవంతమైనట్లు వైద్యులు 6 గంటలకు ప్రకటించారు. మధ్యాహ్నం మొదలైన ‘ఆపరేషన్’.. నగర ట్రాఫిక్ విభాగంలో మధ్య, పశ్చిమ మండలాలకు చెందిన అధికారులు, సిబ్బంది చేతుల్లోని వైర్లెస్ సెట్స్ అన్నీ గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా మోగాయి. ‘నాంపల్లి కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మేక ఆదిలక్ష్మీ అనే మహిళకు గుండె మార్పిడి చేయాల్సి ఉంది. ఆమెకు శస్త్రచికిత్స మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది. డోనర్ ఇస్తున్న గుండె మధ్యాహ్నం 12.45 గంటలకు సికింద్రాబాద్ యశోద ఆస్పత్రి నుంచి బయలుదేరుతుంది’అన్నది వాటిలో వినిపించిన సందేశం సారాంశం. దీంతో అన్ని స్థాయిల అధికారులు అప్రమత్తమై రంగంలోకి దిగారు. 12.10 గంటల నుంచే ఈ రూట్లో ట్రాఫిక్ నియంత్రణ, సమన్వయానికి అవసరమైన చర్యలు మొదలుపెట్టారు. నిరంతర పర్యవేక్షణ.. డోనర్ ఇచ్చిన గుండె ఉన్న బాక్స్‌ను తీసుకెళ్తున్న అంబులెన్స్ ఈ రెండు ఆస్పత్రులకు మధ్య ఉన్న 8 కి.మీల దూరాన్ని సాధ్యమైనంత త్వరగా అధిగమించాలనే లక్ష్యంతో ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు. మహంకాళి ఇన్స్పెక్టర్ నేతృత్వంలోని బృందం ఓ వాహనంలో అంబులెన్స్‌కు ఎస్కార్ట్‌గా వెళ్లడానికి సిద్ధమైంది. అలాగే ఈ మధ్యలో ఉన్న ప్రతి కూడలిలో అధికారులు సంసిద్ధులయ్యారు. బషీర్‌బాగ్ కమిషనరేట్‌లో ఉన్న ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (టీసీసీసీ) సిబ్బంది ఈ ప్రయాణం ఆద్యంతం పర్యవేక్షించడానికి, క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా సిబ్బందికి సలహాలు, సూచనలు ఇవ్వడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. పోలీసుల సహకారం మరువలేం మా అమ్మకి మధ్యాహ్నం 12 గంటలకు ఆపరేషన్ మొదలైంది. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో డోనర్ ఇచ్చిన లైవ్ హార్ట్ ఆపరేషన్ థియేటర్లోకి చేరినట్లు సమాచారం వచ్చింది. సాయంత్రం 5.20 వరకు సర్జరీ సాగగా.. సక్సెస్ అయినట్లు వైద్యులు 6 గంటలకు ప్రకటించారు. ఇందులో భాగస్వామ్యులైన పోలీసులు, ఆస్పత్రి వైద్యులకూ ప్రత్యేక ధన్యవాదాలు. మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంతటి సహాయం చేసిన వారి సహకారం మరువలేనిది. –సునంద, ఆదిలక్ష్మీ కుమార్తె ఇదీ గుండె ప్రయాణం.. మధ్యాహ్నం 12.46 గంటలకు ‘లైవ్ హార్ట్ బాక్స్’తో ఉన్న అంబులెన్స్ సికింద్రాబాద్ యశోద నుంచి బయలుదేరింది. అక్కడ నుంచి ప్యాట్నీ, బైబిల్ హౌస్, కార్బలా మైదాన్, ట్యాంక్‌బండ్, అంబేడ్కర్ విగ్రహం, లిబర్టీ, బషీర్‌బాగ్ ఫ్లైఓవర్, ఖాన్ లతీఫ్ ఖాన్ ఎస్టేట్, ఉదయ్ ఆస్పత్రి, నాంపల్లి స్టేషన్ రోడ్, తాజ్ ఐలాండ్, గాంధీభవన్ మీదుగా ప్రయాణించి సరిగ్గా మధ్యాహ్నం 12.53కు నాంపల్లి కేర్‌కు చేరింది. ఈ మార్గంలోని అన్ని జంక్షన్లనూ ఆపేసిన ట్రాఫిక్ పోలీసులు ఈ అంబులెన్స్, పైలెట్ వాహనాలకు గ్రీన్ చానల్ ఇవ్వడంతో 7 నిమిషాల్లో గమ్యం చేరుకున్నాయి. -
ఇక సాఫీగా ట్రాఫిక్!
క్షణాల్లో నిర్ణయం.. చకచకా ట్రాఫిక్ నియంత్రణ.. రద్దీని ముందే పసిగట్టి ఏ వైపు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వాలో.. ఎటువైపు మళ్లించాలో ఆదేశిస్తుంది. ట్రాఫిక్ నిర్వహణకు మానవ సిబ్బంది అవసరం లేదనే రోజు మరెంతో దూరంలో లేదు. చిత్రాలు, గణాంకాల విశ్లేషణతో ఆధునిక కంప్యూటర్ వ్యవస్థలే వాహన రద్దీని నియంత్రిస్తాయి. అమెరికా, యూరప్ దేశాల్లో వాడుకలో ఉన్న ‘ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఐటీఎంఎస్)’ విజయవాడ వాహన చోదకులకు అతి త్వరలో అందుబాటులోకి రానుంది. ఆధునిక పరిజ్ఞానంతో నగర ట్రాఫిక్ వ్యవస్థను నిర్వహించే ఐటీఎంఎస్ వల్ల నగరంలో ఇక ట్రాఫిక్ జామ్‌లకు చెక్ పడనుంది. ఈ నేపథ్యంలో ఐటీఎంఎస్ పనితీరుపై ‘సాక్షి’ అందిస్తోన్న ప్రత్యేక కథనం.. సాక్షి, అమరావతిబ్యూరో: విజయవాడలో ట్రాఫిక్ నిర్వహణ మొత్తం పోలీసు సిబ్బంది మీదే ఆధారపడింది. సుమారు 63కు పైగా జంక్షన్లలో సిగ్నల్ లైట్లున్నా పనిచేస్తున్నవి కొన్నే. ట్రాఫిక్ అధికారులు, సిబ్బంది ఎంత శ్రమిస్తున్నా నిత్యం అనేక కూడళ్లలో ట్రాఫిక్ జామ్‌తో వాహనదారులు నలిగిపోతున్నారు. ఫలితంగా రోజూ పనిగంటలు, పెద్ద ఎత్తున ఇంధనం వృథా అవుతోంది. రాజధానిలో విజయవాడ ప్రాంతం భాగంగా మారిన తరుణంలో దేశ విదేశాల నుంచి ప్రముఖుల రాకపోకలు అనూహ్యంగా పెరిగాయి. అమరావతికి సింహ ద్వారమైన గన్నవరం విమానాశ్రయం నుంచి విజయవాడ, గుంటూరు, తుళ్లూరు తదితర ప్రాంతాలకు రాకపోకలు నిత్యం పెరుగుతూనే ఉన్నాయి. ఇక విమానాశ్రయం నుంచి విజయవాడకు అధికార, అనధికార ప్రముఖులు, వారి కాన్వాయ్‌ల సంచారం, ఇతరత్రా రద్దీ గతంలో కంటే నాలుగు రెట్లు పెరిగినట్లు ట్రాఫిక్ వర్గాల అంచనా. ప్రస్తుతం అన్ని రకాలు కలిపి నగరంలో 11 లక్షలకుపైగా వాహనాలున్నాయి. పనిచేస్తుంది ఇలా.. సాంకేతికతతో ట్రాఫిక్‌ను అత్యంత సమర్థతతో నిర్వహించడమే ఐటీఎంఎస్ లక్ష్యం. సంక్షిష్టమైన టెక్నాలజీ సాయంతో ఇది పనిచేసే విధానాన్ని సులభంగానే అర్ధం చేసుకోవచ్చు. నగర కూడళ్ల మొత్తాన్ని క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాలు, ఆధునిక తరం సిగ్నల్ దీపాలు, బ్యారికేడ్లు, సూచన, హెచ్చరిక బోర్డులు, ధ్వని వ్యవస్థ తదితరాలు ఇమిడి ఉంటాయి. ఒక కేంద్రీకృత వ్యవస్థ అనుక్షణం నగర ట్రాఫిక్‌ను పర్యవేక్షిస్తుంటుంది. ఎక్కడైనా జంక్షన్లో ఒకవైపు ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉంటే.. ఆ దారిలో గ్రీన్ లైట్లు ఎక్కువ సేపు వెలుగుతాయి. రద్దీ ఉన్న రోడ్ల నుంచి లేని రహదార్ల వైపు మళ్లిస్తాయి. ఏ రహదారిలో రద్దీ ఎలా ఉందో, ఎలా వెళ్తే సులభంగా గమ్యం చేరుకోవచ్చో పౌరుల సెల్ఫోన్లకు ఎస్ఎంఎస్లు పంపే వ్యవస్థ ఐటీఎంఎస్ సొంతం. నగరంలో ప్రవేశించే ట్రాఫిక్ వల్ల ఎటువైపు ఒత్తిడి ఏర్పడుతుందో ముందే ఊహించి అందుకు అనుగుణంగా ట్రాఫిక్‌ను నిర్వహిస్తుంది. ఇప్పటిదాకా ట్రాఫిక్ కూడళ్లలో నిలబడి గంటలసేపు విధులు నిర్వహించే పోలీసులు ఈ వ్యవస్థ ఏర్పాటయ్యాక ఇక కూడళ్లలో నిలబడితే చాలు. ఐటీఎంఎస్ ఉపయోగాలు.. ఇంటెలిజెంట్ ట్రాఫిక్ వ్యవస్థ వల్ల నగరంలోని రహదారులను మెరుగ్గా వినియోగించుకోవచ్చు. అలాగే ప్రయాణ సమయం కూడా ఆదా అవుతుంది. రోడ్డు ప్రమాదాల శాతం కూడా తగ్గుతుంది. ట్రాఫిక్ కూడళ్ల వద్ద నిరీక్షణ 45 శాతం తగ్గే అవకాశం ఉంది. సాఫీ ట్రాఫిక్ వల్ల పర్యావరణానికీ మంచిది. ఇంధన వినియోగం 20 శాతం పొదుపు అవుతుంది. అయితే ఈ పథకానికి భారీ కసరత్తే అవసరం. నగరంలో రోడ్లు, వాటి విస్తీర్ణం, వాటి వాహన సామర్థ్యం, లింక్‌రోడ్లు, మలుపులు, ప్రస్తుత వాహనాలు.. ఇలా అనేక అంశాలను క్రోడీకరించి సాంకేతిక సంస్థలు సాఫ్ట్వేర్, హార్డ్వేర్లను రూపొందిస్తాయి. రాబోయే పది, ఇరవై ఏళ్ల అవసరాలనూ ఇక్కడ దృష్టిలో ఉంచుకుంటారు. న్యూయార్క్, టోక్యో, సింగపూర్ వంటి అంతర్జాతీయ నగరాల్లో ఇది విజయవంతంగా నడుస్తోంది. -
ఉబర్, ఓలాలతో అంతా ఉల్టా పల్టా
సాక్షి, న్యూఢిల్లీ : భారత దేశంలోని నగరాలు గంటల గంటల ట్రాఫిక్ జామ్‌లకు, కాలుష్య కషాయానికి పెట్టింది పేరు. భారత సిలికాన్ వ్యాలీగా ప్రసిద్ధి చెందిన బెంగుళూరు నగరంలో 52,07,693 ద్విచక్ర వాహనాలు, 14,49,334 ప్రైవేటు కార్లు ఉన్నాయంటే అక్కడ రోడ్లపై ట్రాఫిక్ ఎలా ఉంటుందో ఊహించవచ్చు. రోజుకు ఓ రెండు, మూడు గంటలపాటైనా ఈ వాహనాలన్నీ రోడ్లపైనే ఉంటాయంటే ట్రాఫిక్ జామ్‌లు ఇంకా ఎలా ఉంటాయో ఊహించడమే కాదు, ప్రత్యక్షంగా చూస్తునే ఉంటాం. ఇలాంటి సమయాల్లోనే పాశ్చాత్య దేశాల్లో ‘కారు పూలింగ్’ ఐడియా ప్రాణం పోసుకుంది. ఒక అపార్ట్మెంట్ లేదా ఓ కాలనీలో ఉండేవాళ్లు, మిత్రులు లేదా పరిచయస్థులు ఒక్కొక్కరు ఒక్కో కారుతీయకుండా, ఒకే కారులో నలుగురైదుగురు కలిసి ఆఫీసులకు వెళ్లడం, ఆఫీసుల నుంచి తిరిగి రావడం కోసం ఈ ‘కారు పూలింగ్’ ఐడియా కొంత మేరకు బాగానే పనిచేసింది. ఒక్కొక్కరిని ఆఫీసుల వద్ద దించుకుంటూ పోవాలి, మళ్లీ ఎక్కించుకుంటు రావాలి కనుక ‘కారు పూలింగ్’లో ఆఫీసుకు ముందుకు బయల్దేరాల్సి వచ్చేది. వచ్చేటప్పుడు ఇంటికి లేటుగా రావాల్సి వచ్చేది. ఇదే సమయంలో ఉబర్, ఓలా, లిఫ్ట్ లాంటి క్యాబ్ సర్వీసులు అందుబాటులోకి రావడం వల్ల ‘కారు పూలింగ్’ కష్టాలు తప్పాయి. ‘ఇలాంటి క్యాబ్ సర్వీసుల వల్ల రోడ్లపై ప్రైవేటు వాహనాలు తగ్గి ట్రాఫిక్ జామ్‌లు తగ్గుతాయి. ప్రైవేటు కార్లతో పోలిస్తే క్యాబ్‌ల సంఖ్య తక్కువగా ఉంటుంది కనుక వాతావరణంలో కలిసే కాలుష్యం కూడా తక్కువే’ అని ఉబర్ క్యాబ్‌ల వ్యవస్థాపకుడు ట్రావిస్ కలానిక్ 2015లో వ్యాఖ్యానించారు. పలు పాశ్యాత్య దేశాలతోపాటు భారత్‌లోని అన్ని నగరాలకు ఈ క్యాబ్ సర్వీసులు విస్తరించిన నేపథ్యంలో ట్రావిస్ కలానిక్ వ్యాఖ్యలు నిజమయ్యాయా? ట్రాఫిక్ రద్దీ తగ్గిందా, పెరిగిందా? కాలుష్యం తగ్గిందా, పెరిగిందా? ఈ క్యాబ్ సర్వీసులు విస్తరించాక పాశ్చాత్య నగరాలతోపాటు పలు భారతీయ నగరాల్లో కూడా ట్రాఫిక్ రద్దీ పెరిగి జామ్‌లు పెరగడమే కాకుండా కాలుష్యం కూడా పెరిగిందని పలు సర్వేలు వెల్లడించడం ఆశ్చర్యకర పరిణామాలు. బాస్టన్, న్యూయార్క్, లండన్ నగరాల్లో ట్రాఫిక్ రద్దీలు బాగా పెరిగాయి. ఇక భారత్‌లోని నగరాల్లో క్యాబ్ సర్వీసుల విస్తరణ వల్ల వాహనాల సంఖ్య పెరిగి, ట్రాఫిక్ రద్దీ, జాములు కూడా పెరిగాయి. బెంగళూరులో 2015, మే నెల నాటికి 84,92 టాక్సీలు ఉండగా, 2018 సంవత్సరం నాటికి అవి ఏకంగా 89 శాతం పెరిగి, 1,59,519కి చేరుకున్నాయి. ఇక ఈ కాలంలో ప్రైవేటు, ప్రభుత్వ బస్సులు 24 శాతం పెరగ్గా, కార్ల సంఖ్య 31 శాతం పెరిగింది. ప్రైవేటు ట్రాన్స్పోర్ట్కు ఎంత ప్రాధాన్యత పెరిగిందో తెలుస్తోంది. ఈ మూడేళ్ల కాలంలో ముంబై నగరంలో నలుపు–పసుపు కార్ల సంఖ్య 70 శాతం తగ్గి, క్యాబల సంఖ్య అంతకన్నా పెరిగిందట. దేశంలోని నగరాల్లో రోడ్లు ఎంత విశాలంగా ఉన్నా వాటికీ పరిమితులు ఉంటాయి. పీక్ అవర్స్ (అత్యవసర వేళల్లో)లో క్యాబ్‌లు ఎక్కువగా రోడ్డపైనే తిరుగుతున్నాయి. సాధారణ వేళల్లో మాల్స్, ఆఫీసులు, విద్యాసంస్థల వద్ద రోడ్లపైనే నిలిచి ఉంటున్నాయి. పర్యవసానంగా వాహనాల రాకపోకలకు రోడ్డు ఇరుకవుతోంది. పీక్ అవర్స్‌లో ఈ కార్లన్నీ ఆఫీసులు, మాల్స్, రెస్టారెంట్లు, విద్యా సంస్థలు, మెట్రో స్టేషక్లకే ఎక్కువగా పరుగులు తీయడం వల్ల ఆ ప్రాంతాలన్నీ రద్దీ అవుతున్నాయి. క్యాబ్ సర్వీసులు ఎక్కువగా విస్తరించిన అమెరికాలోని ఏడు నగరాల్లో చేసిన సర్వేలో మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. రైడ్ షేరింగ్ వల్ల ఈ నగరాల్లో 49 శాతం నుంచి 61 శాతం వరకు కొత్త ప్రయాణికుల శాతం పెరిగి వాహనాల కాలుష్యం పెరిగింది. రైడ్ షేరింగ్ కారణంగా క్యాబుల్లో ప్రయాణిస్తున్న ఈ 49 శాతం నుంచి 61 శాతం మంది ప్రయాణికులు ఇంతకుముందు కాలి నడకనో, సైకిల్‌పైనో, ప్రభుత్వ బస్సులోనే వెళ్లే వారు. ఇప్పుడు భారత్ నగరాల్లో కూడా ఒకటి నుంచి మూడు కిలోమీటర్ల దూరం వరకు కాలి నడక, సైకిల్ లేదా బస్సుల్లో వెళ్లే ప్రయాణికులు ఇప్పుడు క్యాబుల్లో షేరింగ్ రైడ్లను ఆశ్రయిస్తున్నారు. అమెరికా సర్వేలో మరో ఆశ్చర్యకరమైన విషయం కూడా వెలుగులోకి వచ్చింది. ప్రైవేటు కార్లు తమ గమ్యం దిశలో ఒక మైలు వెల్లాల్సి వస్తే క్యాబ్‌లు అలా ప్రతి మైలుకు 2.8 మైళ్లు అదనంగా ప్రయాణించాల్సి వస్తున్నాయట. షేరింగ్ రైడ్‌లో ఒకరి ఒక చోట, మరొకరి మరోచోట ఎక్కించుకొని వారిని గమ్యస్థానాలకు చేర్చడం వల్ల ఈ అదనపు తిరుగుడు అవుతుందట. దేశంలోని నగరాల్లో ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు ‘షేరింగ్ రైడ్లే’ ఉత్తమ మార్గమని కేంద్ర ప్రభుత్వ మేధో మండలి ‘నీతి ఆయోగ్’ ఇదే సమయంలో అభిప్రాయ పడడం గమనార్హం. ప్రభుత్వ బస్సు, మెట్రో రైలు సర్వీసులను విస్తరించడం, సర్వీసుల సంఖ్యను పెంచడం, వాకింగ్, సైక్లింగ్‌లను ప్రోత్సహించడం ట్రాఫిక్ రద్దీ నివారణకు, కాలుష్యాన్ని తగ్గించడానికి ఉత్తమ మార్గాలని నిపుణులు సూచిస్తున్నారు. -
ఓఆర్ఆర్పై టోల్ వసూలు ఉండదు
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కొంగర కలాన్‌లో సెప్టెంబర్ 2న టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరగనున్న ‘ప్రగతి నివేదన సభ’కు పోటెత్తనున్న వాహనాలకు టోల్ వసూళ్ల ప్రక్రియతో ఔటర్ రింగ్ రోడ్డులో ట్రాఫిక్ గండం పొంచి ఉందని ‘టోల్’ఫికర్ శీర్షికతో బుధవారం ప్రచురిత కథనంపై కదలిక వచ్చింది. సెప్టెంబర్ 2న ఉదయం 9 నుంచి అర్ధరాత్రి 12 వరకు ఓఆర్ఆర్పై టోల్ వసూలు చేయమని హెచ్ఎండీఏ కమిషనర్ జనార్దన్‌రెడ్డి స్పష్టం చేశారు. అయితే ఆ రోజు టోల్ వసూలు చేయకపోవడం వల్ల జరిగే ఆర్థిక నష్టాన్ని టీఆర్ఎస్ చెల్లించాలని పేర్కొన్నారు. లక్షలాది వాహనాలు వస్తుండటంతో సెప్టెంబర్ 2న టోల్ వసూలు చేయవద్దని టీఆర్ఎస్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి చేసిన దరఖాస్తును పరిశీలించిన కమిషనర్ షరతులతో కూడిన అనుమతులిచ్చారు. కొంగర కలాన్, రావిర్యాల, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం గ్రామాలకు వెళ్లేందుకు ఓఆర్ఆర్పై మార్గాల మధ్య మరిన్ని ఎగ్జిట్లు ఏర్పాటు చేయాలని దరఖాస్తులో పేర్కొన్న అంశంపై సమాధానమిస్తూ తాత్కాలిక ఎగ్జిట్ ప్రాంతాలను ముందుగా హెచ్ఎండీఏ అధికారులు పరిశీలించి నియమిత సంఖ్యలోనే అనుమతించాలని ఆదేశించారు. ట్రాక్టర్లు, ట్రాలీలు, నెమ్మదిగా వెళ్లే ఇతర వాహనాలను ఓఆర్ఆర్పై అనుమతించబోమని, అవి సర్వీసు రోడ్డు మీదుగానే వెళ్లాలని నిబంధన విధించారు. -
గ్రేటర్‌ను వీడని వాన.. జనం హైరానా!
సాక్షి, హైదరాబాద్: వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గ్రేటర్ నగరంలో సోమవారం ఎడతెరిపి లేకుండా మోస్తరు వర్షం కురిసింది. గత రెండు రోజులుగా కురుస్తోన్న వర్షాలతో పలు లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. రాత్రి 7 గంటల వరకు నగరంలో సరాసరిన 1.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. మరో రెండు రోజులపాటు నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశాలున్నట్లు పేర్కొంది. కాగా ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలతో సాధారణ జనజీవనం స్తంభించింది. వీధి వ్యాపారాలు గిరాకీ లేక బోసిపోయాయి. పలు ప్రధాన రహదారులు, ఫ్లైఓవర్లపై ట్రాఫిక్ ఎక్కడికక్కడే నిలిచిపోయింది. దీంతో విద్యార్థులు, ఉద్యోగులు వారి గమ్యస్థానాలకు ఆలస్యంగా చేరుకున్నారు. -
సీపీ సీరియస్?
విశాఖసిటీ: ఓ పార్టీ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసిన ట్రాఫిక్ ఏసీపీ కింజరాపు ప్రభాకర్‌పై నగర పోలీస్ కమిషనర్ మహేష్ చంద్ర లడ్డా సీరియస్ అయినట్లు తెలిసింది. ‘సాక్షి’లో శనివారం ప్రచురితమైన ‘పచ్చ సేనలో ఖాకీ చొక్కా’ అనే శీర్షికపై ప్రచురితమైన కథనం పోలీస్ వర్గాల్లో కలకలం రేపింది. దీనిపై స్పందించిన నగర పోలీస్ కమిషనర్ మహేస్ చంద్ర లడ్డా.. ఏసీపీ ప్రభాకర్‌ను కార్యాలయానికి పిలిపించినట్లు సమాచారం. రాజకీయ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని క్లాస్ ఇచ్చినట్లు తెలిసింది. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన మనం ఇలా చేస్తే ఎలా అని ప్రశ్నించారు. ఇకపై ఇలాంటి వ్యవహారాలకు దూరంగా ఉండాలని సూచించినట్లు సమాచారం. బాధ్యతాయుతంగా వ్యవహరించి.. అన్ని వర్గాల పట్ల ఒకే వైఖరితో మెలగాలని గట్టిగా చెప్పినట్లు తెలిసింది. -
చుట్టూ పచ్చచొక్కాలు.. మధ్యలో ఓ ఖాకీ చొక్కా!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఒక్కసారి ఈ ఫొటో పరికించి చూడండి. చుట్టూ పచ్చ చొక్కాలు.. నడిమధ్యలో ఓ ఖాకీ చొక్కా కనిపిస్తోంది కదూ.. సదరు ఖాకీ దొర విశాఖ నగర ట్రాఫిక్ ఏసీపీ కింజరాపు ప్రభాకర్.. అంతే కాదండోయ్.. ఈయనగారు కేంద్ర మాజీ మంత్రి దివంగత కింజరాపు ఎర్రన్నాయుడు, ప్రస్తుత రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడులకు స్వయానా సోదరుడు. అయితే ఏంటి.. మంత్రులు, రాజకీయ నేతల కుటుంబీకులు ఉద్యోగాలు చేయకూడదా? అని అంటారేమో!.. ఎందుకు చేయకూడదూ.. మహా దర్జాగా చేసుకోవచ్చు.. కానీ తన ఉద్యోగ ధర్మానికి, రాజకీయాలను కలగలిపేయకూడదన్నదే ఇక్కడ ప్రస్తావనాంశం.. ఫొటోలో కనిపిస్తున్న దృశ్యం.. అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యక్రమంలో పాల్గొని పోస్టర్ ఆవిష్కరించడం ఉద్యోగుల సర్వీస్ రూల్స్‌కు పూర్తి విరుద్ధమన్నదే ఇక్కడ చర్చనీయాంశం. విమర్శలకు తావిస్తున్న అంశం కూడా.. ఈ నెల 20న తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో సీబీఎన్ ఆర్మీ పేరిట జరిగే కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో పాల్గొనకూడదన్న నిబంధనలు ఉన్నా.. బాధ్యత గల పోలీసు అధికారినన్న ఆలోచన కూడా లేకుండా ఫక్తు రాజకీయ కార్యక్రమంలో పాల్గొనడం వివాదంగా మారుతోంది. ఏళ్ల తరబడి ఇక్కడే తిష్ట టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నాలుగేళ్లుగా విశాఖ నగరంలోనే ఏసీపీ ప్రభాకర్ తిష్ట వేశారు. అంతేకాదు.. మధ్యలో ఒకట్రెండేళ్లు తప్ప గత పాతికేళ్లుగా పెద్దగా బదిలీలు లేకుండా ఈ ప్రాంతంలోనే పాతుకుపోయారు. సర్వీస్‌లో ఎలాంటి ఘనకార్యాలు లేకుండానే ఈయనకు ఇండియన్ పోలీస్ మెడల్ ఇచ్చిన సందర్భంలోనూ అనేక విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా ప్రభుత్వాధికారి అయి ఉండీ.. పచ్చచొక్కా కార్యక్రమాలకు చెందిన పోస్టర్లను ఆవిష్కరించడమేంటని సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాలుగేళ్లుగా ఇక్కడే పాతుకుపోయిన సదరు పోలీస్ అధికారి.. అ«ధికార టీడీపీకి ఎంతటి వీరవిధేయత చూపుతున్నారో ఈ ఫొటోతోనే స్పష్టమవుతోంది. నిబంధనలకు విరుద్ధంగా.. ఇలా చెయ్యడమేంటని విమర్శలు జోరందుకుంటున్నాయి. -
విద్యార్థుల ఆగ్రహ జ్వాల.. పోలీసులు షాక్..
-
విద్యార్థుల ఆగ్రహ జ్వాల.. పోలీసులు షాక్..
ఢాకా, బంగ్లాదేశ్ : ఒక్క ఘటన బంగ్లాదేశ్ రాజధాని ఢాకాను కుదిపేసింది. ఒక్కచోట ఏకమైన వేలాది మంది విద్యార్థులు శాంతి భద్రతలను ఎలా కాపాడాలో పోలీసులకు నేర్పించి ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. గత నెల 30న ఢాకా నడిబొడ్డున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. ఈ ఘటనతో ఢాకాలోని విద్యార్థుల్లో ఆగ్రహం పెల్లుబికింది. ఈ నెల 2వ తేదీన(గురువారం) వేలాదిగా ఏకమై శాంతిభద్రతలను తమ చేతిలోకి తీసుకున్నారు. ప్రధాన రహదారుల్లో బారికేడ్లను ఉంచి, వాహనాల పేపర్లను తనిఖీ చేస్తూ, ప్రభుత్వ అధికారులు విధుల నిర్వహణ అలసత్వం వహిస్తున్నారని మండిపడ్డారు. చట్టం అందరికీ వర్తిస్తుంది.. ఢాకాలోని ఓ వీధిలో బైక్‌పై వస్తున్న ట్రాఫిక్ పోలీసు బైక్‌ను పలువురు విద్యార్థులు అడ్డగించారు. అనంతరం అతన్ని బైక్ పేపర్స్, లైసెన్స్ చూపించాలని కోరారు. సదరు పోలీసు నీళ్లునమలడంతో చట్టం అందరికీ వర్తిస్తుందని గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. తాను పేపర్లు తీసుకురాలేదని, దయచేసి క్షమించాలని ఆయన విద్యార్థులను కోరారు. మరో సంఘటనలో పోలీసు వ్యాన్‌ను అడ్డగించిన ఓ విద్యార్థి బృందం వెనక్కు వెళ్లిపోవాలని నినాదాలు చేసింది. రాంగ్ రూట్లో వస్తున్న ఓ మంత్రిని సైతం విద్యార్థులు అడ్డగించారు. పోలీసులకు లంచాలు ఇచ్చి, నాయకులు ఎలా పబ్బం గడుపుకుంటున్నారన్న విషయంపై విద్యార్థులు మంత్రికి క్లాస్ తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. చట్టం అందరికీ సమానమే అన్న సంగతి గుర్తుంచుకోండంటూ మంత్రికి విద్యార్థులు హితవుపలికారు. ఫేస్బుక్లో వైరల్.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగిన విద్యార్థులపై పోలీసులు దౌర్జన్యానికి దిగారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఫేస్బుక్లో వైరల్‌గా మారాయి. అయితే, దురదృష్టవశాత్తు ఈ ఘటనతో సంబంధం లేని ఫొటోలు(నకిలీవి) కూడా ఎక్కువ షేర్ అయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో బంగ్లాదేశ్‌లో ‘కోటా సంస్కరణలు’కోసం పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగిన సంగతి తెలిసిందే. 1971లో స్వతంత్రం అనంతరం దేశం కోసం నిలబడిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం కోటాను ప్రకటించింది. 47 ఏళ్లుగా కోటా వ్యవస్థ వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని విద్యార్థులు రోడ్లెక్కారు. దీంతో దిగొచ్చిన హసీనా సర్కారు కోటాను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. -
నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్‌ను ఆపవద్దు..!
సాక్షి, అమరావతి : తన కాన్వాయ్ కోసం ట్రాఫిక్‌ను నిలిపేసిన పోలీసులపై ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ అసహనం వ్యక్తం చేశారు. తన కాన్వాయ్ కోసం ప్రజలకు ఇబ్బంది కలిగించవద్దని ఆయన స్పష్టం చేశారు. ఇకనుంచి తాను ఎక్కడికి వెళ్లినా.. తనకోసం ట్రాఫిక్ నిలిపేసి.. వాహనదారులను ఇబ్బందిపెట్టకూడదని పోలీసులకు ఆదేశాలు జారీచేశారు. గురువారం ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి విజయవాడకు డీజీపీ కాన్వాయ్ వస్తున్న సమయంలో పోలీసులు ట్రాఫిక్ నిలిపివేశారు. ఉదయం ఆయన గన్నవరం విమానాశ్రయానికి వచ్చారు. విమానాశ్రయం నుంచి విజయవాడ తిరిగి వెళుతున్న సమయంలో తన కాన్వాయ్ కోసం ట్రాఫిక్‌ను నిలిపేసిన విషయాన్ని డీజీపీ గమనించారు. దీంతో ఇకపై తన కాన్వాయ్ కోసం ట్రాఫిక్‌ను నిమిషం కూడా ఆపవద్దని డీజీపీ ఠాకూర్ అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లకు సూచించారు. ఈ మేరకు ఆదేశాలు కూడా జారీచేశారు. వీఐపీలు ప్రయాణిస్తున్న వేళ కూడా సాధ్యమైనంత తక్కువగా ట్రాఫిక్ ను ఆపాలని ఆయన సూచించారు. -
భారీ వర్షంతో హైదరాబాద్ అతలాకుతలం
-
రాజధానిలో నయా ట్రాఫిక్
భువనేశ్వర్ : నగరంలో అత్యాధునిక ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థను త్వరలో ప్రవేశ పెట్టేందుకు సన్నాహాలు చురుగ్గా సాగుతున్నాయి. నగరవ్యాప్తంగా ట్రాఫిక్ నియంత్రణను కేంద్రీకృతం చేయడం కొత్త వ్యవస్థ ధ్యేయం. ఈ వ్యవస్థలో భాగంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటవుతుంది. జాతీయ స్థాయి స్మార్టసిటీల్లో తొలిసారిగా భువనేశ్వర్‌లో ట్రాఫిక్ నియంత్రణ కోసం కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు కావడం విశేషం. ట్రాఫిక్ నియంత్రణతో రహదారి దుర్ఘటనల నివారణకు ఈ వ్యవస్థ దోహదపడుతుంది. భువనేశ్వర్ అభివృద్ధి సంస్థ (బీడీఏ) ఆధ్వర్యంలో ఈ వ్యవస్థ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నట్లు ఆ సంస్థ ఇటీవల ట్విటర్లో ప్రాథమిక సమాచారం జారీ చేసింది. నగరంలో మారు మూల ప్రాంతాల్లో ట్రాఫిక్ రవాణాపట్ల ఈ వ్యవస్థ దృష్టి సారిస్తుంది. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ట్రాఫిక్ వ్యవస్థతో పాటు అత్యవసర సేవల్ని కూడా ఈ కేంద్రం నుంచి నిర్వహిస్తారు. పలు ప్రపంచ దేశాల్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ నియంత్రణ జరుగుతోంది. కమాండ్ కేంద్రంలో భారీ తెరతో సీసీటీవీ కెమెరాతో అనుసంధానపరిచిన వ్యవస్థ పనిచేస్తుంది. నగరంలోని మారుమూల ప్రాంతాల్లో ట్రాఫిక్ కదలిక ఈ తెరపై ప్రదర్శితమవుతుంది. నగరవ్యాప్తంగా జన సందోహిత ప్రాంతాల్లో ఎక్కడికక్కడ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. వీటితో కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానపరుస్తారు. స్మార్ట్‌సిటీగా గుర్తింపు సాధించిన నగరంలో జనాభాతో పాటు వాహనాల రద్దీ కూడా నిత్యం పుంజుకుంటోంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ ప్రతిష్టంభనతో తరచూ రహదారి దుర్ఘటనలు సంభవిస్తున్నాయి. మృతుల సంఖ్య పెరుగుతోంది. ఈ పరిస్థితుల దృష్ట్యా కొనసాగుతున్న సౌర శక్తి ట్రాఫిక్ వ్యవస్థను విస్తరించి కమాండ్ కంట్రోల్ సెంటర్‌గా మలిచేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు భువనేశ్వర్ నగర అభివృద్ధి సంస్థ పేర్కొంది. -
మెట్రోకే ప్రజల ఓటు
బొమ్మనహళ్లి: నగరంలో ట్రాఫిక్ పద్మవ్యూహాల్లో నలిగిపోతున్న వాహనదారులను, ప్రజలను మెట్రో రైళ్లు జోరుగా ఆకర్షిస్తున్నాయి. ట్రాఫిక్ సిగ్నళ్ల బెడద లేకుండా, గంటలకొద్దీ స్తంభించిపోతున్న ట్రాఫిక్‌కు నివారణగా వచ్చిన మెట్రో రైలు నగరవాసులకు వరదాయిని అనడంలో ఎలాంటి సందేహం లేదు. పది నిమిషాలకో రైలు, నిముషాల్లోనే గమ్యస్థానం చేరుకోవడం లాంటి వెసులుబాట్లు రా రమ్మంటుండడంతో నగరవాసులు మెట్రో రైళ్ల వైపు పరుగులు తీస్తున్నారు. ఇటీవలి కాలంలో కార్లలో ఆఫీసులకు వెళ్లే టాప్ ఎగ్జిక్యూటివ్‌లు సైతం మెట్రో రైళ్లలోనే ప్రయాణానికి మక్కువ చూపుతున్నారు. దీనికి తోడు నైరుతి రుతుపవనాలకు ముందస్తుగా గత రెండు, మూడు వారాలుగా సాయంత్రం పూట పడుతున్న వానల వల్ల కూడా మెట్రో రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. ఇటీవలి వరకు రోజూ మూడు లక్షలా 60 వేల మంది మెట్రో రైళ్లలో ప్రయాణిస్తుంటే, ఇప్పుడా సంఖ్య నాలుగు లక్షలను దాటుతోంది. రద్దీతో తప్పని అవస్థలు ఈ అనూహ్య రద్దీతో, ముఖ్యంగా సాయంత్రం పూట అమ్మాయిలు, మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వృద్ధుల సంగతి సరేసరి. రైల్లోకి ఎక్కడం కూడా కష్టమే. ఇక సీట్లు దొరకవు, కనీసం నిలబడడానికి కూడా స్థలం కరువే. వీరంతా రద్దీ తగ్గేంతవరకు ఎదురుచూడాల్సి వస్తోంది. కెంపేగౌడ స్టేషన్లో అయితే వచ్చే, పోయే రైళ్లన్నీ ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. కెంపేగౌడ స్టేషన్ వచ్చినప్పుడు, మెట్రో రైళ్ల నుంచి దిగే ప్రయాణికులను చూస్తే చీమల దండు గుర్తుకు వస్తుంది. దీని వల్ల టాప్టాప్లు, బ్యాక్‌ప్యాక్‌లతో వచ్చే ప్రయాణికులు నిలబడడానికి చోటు లేక అవస్థలు పడుతుంటారు. తమ కాళ్ల సందుల్లో వాటిని భద్రంగా ఉంచుకుని, తోసుకొచ్చే ప్రయాణికుల నుంచి వాటిని కాపాడుకోవడానికి తంటాలు పడాలి. అదనపు బోగీలు ఎక్కడ? పెరుగుతున్న రద్దీని తట్టుకోవడానికి వీలుగా మార్చి నుంచి రైళ్లకు అదనపు బోగీలను సమకూర్చుతామని బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ జనవరిలో హామీ ఇచ్చింది. అయితే ఆ హామీ అమలును జూన్ వరకు వాయిదా వేయడంతో ప్రయాణికులు మరికొన్ని రోజుల పాటు మెట్రో రైళ్లలో కుస్తీలు పడక తప్పేట్లు లేదు. -
‘కెమెరా’పురం..
అమలాపురం టౌన్: అమలాపురం పట్టణంపై ఇక నుంచి నిఘా నేత్రాలు పనిచేయనున్నాయి. అటు ఇరుకు రోడ్లతో ట్రాఫిక్ పద్మవ్యూహం...ఇటు 122 మంది రౌడీ షీటర్లు, 178 సస్పెక్ట్ షీటర్లతో ఉండే పట్టణంలో క్రైమ్ రేటు కూడా అధికంగానే ఉంటుంది. ఈ క్రమంలో నేరాలు, ప్రమాదాల అదుపునకు పట్టణమంతా సీసీ కెమెరాలతో నిఘా అత్యవసరం. అందుకే ఏపీ ఫైబర్ నెట్ వర్కింగ్ లిమిటెడ్ పట్టణాన్ని సీసీ కెమెరాల నిఘా కిందకు తెస్తోంది. పట్టణంలో ఎంపిక చేసిన 19 ప్రధాన కూడళ్లలో 50 సీసీ కెమెరాల ఏర్పాటు పనులు చకచకా జరుగుతున్నాయి. ఇప్పటికే గడియారం స్తంభం సెంటర్, హైస్కూలు సెంటర్, ఎర్రవంతెన, నల్ల వంతెన, ఈదరపల్లి వంతెన, ముమ్మిడివరం గేటు సెంటర్, పేరూరు వై జంక్షన్ తదితర రద్దీ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు పనులు పూర్తయయ్యాయి. అంతా ఆన్లైన్లోనే.. ఏపీ ఫైబర్ నెట్ వర్కింగ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో పట్టణంలో సీసీ కెమెరాలు అమరిక పనులు జరుగుతున్నాయి. పట్టణంలో నెలకొల్పుతున్న 50 సీసీ కెమెరాలు పూర్తిగా ఆన్లైన్ విధానంతో ఆ సంస్థ పర్యవేక్షణలో పనిచేయనున్నాయి. వీటి నియంత్రణ అంతా విజయవాడలోని ఆ సంస్థకు చెందిన కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి జరుగుతుంది. అక్కడి నుంచే అమలాపురం పోలీసు స్టేషన్‌కు అనుసంధానం అవుతుంది. పట్టణంలో ఎక్కడైనా చోరీలు, రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ సమస్యలు తలెత్తినా... కమాండ్ కంట్రోల్ రూమ్ పర్యవేక్షణలో గమనించి తక్షణమే అమలాపురం పోలీసు అధికారులను అప్రమత్తం చేస్తుంది. వారి సెల్ఫోన్లకు ఈ సర్వర్ అనుసంధానమై ఉండడం వల్ల వారు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండే వీలుంటుంది. కొద్ది రోజుల్లోనే అమలాపురంలో సీసీ కెమెరాల వ్యవస్థ పనిచేయనుందని ఏపీ ఫైబర్ నెట్ వర్కింగ్ ప్రతినిధి ఒకరు తెలిపారు. వీటితో పాటు స్థానిక మున్సిపాలిటీ కూడా పట్టణ ముఖ్య వ్యాపార కూడళ్లలో పలు వ్యాపార సంస్థల సహకారంతో ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఈ సీసీ కెమెరాలు కూడా అందుబాటులోకి వస్తే పట్టణమంతా పూర్తిగా నిఘా నీడలోకి రానుంది. సీసీ కెమెరాలు ఏర్పాటు కానున్న 19 ముఖ్య కూడళ్లు పేరూరు వై జంక్షన్, గడియారం స్తంభం సెంటరు, హైస్కూలు సెంటరు, ముమ్మిడివరం గేటు సెంటరు, నల్ల వంతెన, ఎర్ర వంతెన ఈదరపల్లి వంతెన, సుబ్బారాయుడు చెరువు జంక్షన్, ఆర్టీసీ బస్ స్టేషన్ అవుట్ గేట్, ఆర్టీసీ బస్ స్టేషన్ ఇన్‌గేట్, రాష్ట్ర హోం మంత్రి హౌస్ ఇన్ గేట్, ఎస్కేబీఆర్ కళాశాల, శ్రీదేవి అమ్మవారి ఆలయం, శ్రీదేవి మార్కెట్, గోల్డ్ మార్కెట్, సాకుర్రు టి.జంక్షన్, అమలాపురం రూరల్ మండలం, కిమ్స్ ఆస్పత్రి, వైద్య కళాశాల గేట్–1, కిమ్స్ ఆస్పత్రి, వైద్య కళాశాల గేట్–2, కనకదుర్గ ఆలయం, భటవిల్లి, అమలాపురం రూరల్ మండలం, సమనస, అమలాపురం రూరల్ మండలం.