Banjara Hills: ట్రాఫిక్‌ బూత్‌లో మృతదేహం | Dead body in traffic booth box In Banjara Hills | Sakshi
Sakshi News home page

Banjara Hills: ట్రాఫిక్‌ బూత్‌లో మృతదేహం

Mar 6 2024 11:02 AM | Updated on Mar 6 2024 12:34 PM

Dead body in traffic booth box In Banjara Hills - Sakshi

హైదరాబాద్: రోడ్డు నంబర్‌–1లోని తాజ్‌కృష్ణా హోటల్‌ చౌరస్తాలో ఉన్న ట్రాఫిక్‌ బూత్‌ అంబ్రిల్లాలో అనుమానాస్పద మృతదేహాన్ని బంజారాహిల్స్‌ పోలీసులు స్వాదీనం చేసుకుని ఉస్మానియాకు తరలించారు. తాజ్‌కృష్ణా చౌరస్తాలోని ట్రాఫిక్‌ బూత్‌లో గుర్తుతెలియని మృతదేహం(32) ఉన్నట్టు మంగళవారం ఉదయం విధుల్లోకి వచ్చిన ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ పోలీసులకు సమాచారం అందించాడు.

వెంటనే అక్కడికి చేరుకున్న బంజారాహిల్స్‌ పోలీసులు మృతదేహాన్ని స్వాదీనం చేసుకుని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని బంజారాహిల్స్‌ సీఐ రాఘవేందర్‌ తెలిపారు. ఆరా తీయగా ఫుట్‌పాత్‌లపై పడుకునే నిరాశ్రయుడిగా తేలిందని ఆయన చెప్పారు. తలకు వెనకాల గాయమైందని.. రోడ్డు దాటుతున్నప్పుడు ఏదైనా వాహనం ఢీకొట్టిందా? లేక ప్రమాదవశాత్తూ కిందపడ్డాడా? అనే విషయాలు తెలియాల్సి ఉందన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement