బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ చౌరస్తా అభివృద్ధీకరణలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు నగర ట్రాఫిక్ అదనపు కమిషనర్ ఏవీ. రంగనాథ్ గురువారం చౌరస్తాలో పర్యటించారు. ఆయనతో పాటు ఇంజనీరింగ్ సెల్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ ఈఈ విజయ్‌కుమార్, ఏఈ వెంకటేష్, సీఆర్‌ఎంపీ మేనేజర్ శ్రీరాంమూర్తి తదితరులు ఇక్కడ ఆయనతో కలిసి పర్యటించారు. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు చౌరస్తాను ‘సిగ్నల్ ఫ్రీ’ కూడలిగా తీర్చిదిద్దే క్రమంలో ఏమేం చేయాలో చర్చించారు.
ఇక నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టులో నాలుగు వైపులా సిగ్నల్‌తో ప్రమేయం లేకుండానే వాహనాలు తేలికగా ఫ్లో అయ్యే విధంగా చర్యలు చేపట్టనున్నారు. ఇందుకు అనుగుణంగా రోడ్డును, ఫుట్‌పాత్‌లను విస్తరించే ప్రణాళికలను రూపొందించనున్నారు. ముఖ్యంగా చౌరస్తాకు నాలుగువైపులా ‘యూ’ టర్న్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. బంజారాహిల్స్ రోడ్ నెం. 2లోని జింఖానా క్లబ్ వద్ద ‘యూ’ టర్న్ కొత్తగా ఏర్పాటు చేసి జూబ్లీహిల్స్ రోడ్ నెం. 1 టీవీ 5 నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45, ఫిలింనగర్ వైపు వెళ్ళే వాహనాలకు అవకాశం కల్పిస్తారు.
చదవండి: (తెలుగు రాష్ట్రాల మధ్య మరో వారధి.. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే..)
చౌరస్తాలో ‘ఫ్రీ’ లెఫ్ట్‌లు బ్లాక్ కాకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ రోడ్ నెం. 36 కళాంజలి వద్ద వాహనాలు వన్‌వేలో చిరంజీవి బ్లడ్ బ్యాంకు వైపు వెళ్తున్నాయి. ఇక్కడ రూట్ చేంజ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ చౌరస్తాను ట్రాఫిక్ ఇక్కట్లు లేకుండా తీర్చిదిద్దే క్రమంలో జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్ పోలీసులు సమన్వయంతో ముందుకు సాగాలని తీర్మానించారు.
Comments
Please login to add a commentAdd a comment