
విద్యార్థిపై దాడి చేస్తున్న వ్యక్తి..
కుత్బుల్లాపూర్: మా నాన్న కారుకే సైడ్ ఇవ్వవా.. అంటూ ఓ యువకుడు విద్యార్థిపై దాడికి పాల్పడిన సంఘటన సోమవారం చింతల్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..గాజులరామారం ప్రాంతానికి చెందిన అశు హిమాయత్‌నగర్‌లోని హైందవి కళాశాలలో బీకాం మొదటి సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం అతను బైక్‌పై ఇంటికి వస్తుండగా ఐడీపీయల్ చౌరస్తా సమీపంలో వెనుక నుంచి వచ్చిన కారు అతడిని ఢీకొట్టింది. దీంతో అతను చూసి నడపండి అంటూ కారు డ్రైవర్‌కు సూచించాడు. దీంతో కారు వెనకే వస్తున్న మరో ముగ్గురు యువకులు ‘మా నాన్న కారుకే సైడ్ ఇవ్వవా’ అంటూ అతడిపై దాడికి పాల్పడ్డారు. బాధితుడు జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.