జర సునో జీ... పెగ్గాలజీ! | Laughing fun special 17-03-2019 | Sakshi
Sakshi News home page

జర సునో జీ... పెగ్గాలజీ!

Published Sun, Mar 17 2019 12:06 AM | Last Updated on Sun, Mar 17 2019 12:06 AM

Laughing fun special 17-03-2019 - Sakshi

పొద్దున్నే శవాన్ని భుజాన  వేసుకొని మార్నింగ్‌వాక్‌కు బయలుదేరాడు విక్రమార్కుడు.రోడ్డు మీద ఒక తాగుబోతు సిన్సియర్‌గా  ఊగుతూ ట్రాఫిక్‌ను కంట్రోల్‌ చేస్తున్నాడు.‘‘తమ్ముడూ, ముందు నువ్వు కంట్రోల్‌లో ఉండు...’’ అని జాగ్రత్త చెప్పబోయాడు విక్రమార్కుడు.‘‘ఐ డోన్డ్‌ వాంట్‌ టు లిజన్‌ ఎనీ థింగ్‌ ఫ్రమ్‌ అదర్స్‌’’ అన్నాడు ఆ తాగుబోతు.‘‘ఎంత చక్కని ఇంగ్లీషో’’ ముచ్చటపడ్డాడు భుజం మీది బేతాళుడు.‘‘ఇంకాసేపైతే సంస్కృతం కూడా మాట్లాడతాడు. ఎందుకొచ్చిన లొల్లి...ఇక్కడి నుంచి వెళ్దాం’’ అన్నాడు విక్రమార్కుడు.‘‘రాజా! మనదేశంలో  నీటి కొరత ఉందిగానీ, మందు కొరతలేదు....మారుమూల కుగ్రామమునకు వెళ్లినా ముందు మందు ఎదురొస్తుంది..’’ నిట్టూర్చాడు భేతాళుడు.‘‘లెస్సపలికావు’’ అన్నాడు విక్రమార్కుడు.‘‘రాజా! నీకు పెగ్గాలజీ అనే గ్రంథం గురించి తెలుసునా? తెల్సినా  చెప్పకపోయావో...’’ వార్నింగ్‌ ఇచ్చాడు భేతాళుడు.‘‘నాకు తెలుసు’’ అంటూ చెప్పడం మొదలుపెట్టాడు భేతాళుడు.

లాంగ్‌....లాంగ్‌ ఎగో ఛీట.జీnజు (డా. ఇంక్‌) అనే శాస్త్రవేత్త ఉండేవాడు. ఎప్పుడూ ఏవో ప్రయోగాలు చేస్తూ ఉండేవాడు. ఒకసారి రకరకాల పండ్ల రసాలు, తొక్కలు, తోటకూరతో  ఏదో ద్రావకాన్ని తయారుచేశాడు.
డా.ఇంక్‌గారి మామ పేరు డా.బంక్‌.‘‘మామగారు....ఓసారి ఇది తాగి మీ ఓపీనియన్‌ చెప్పండి’’ అని ఒక గ్లాసులో ద్రావకాన్ని అతనికి  ఇచ్చాడు.ఇక్కడ మనం డా.బంక్‌ గురించి చెప్పుకోవాలి. ఈయన పెద్దగా మాట్లాడడు. పెద్దగా నవ్వడు. ‘మౌనమే నా భాష ఓ మనసా’ అన్నట్లుగా ఉంటాడు. గంభీరంగా ఉంటాడు. హుందాగా ఉంటాడు.ఇప్పుడు మళ్లీ సీన్‌లోకి వద్దాం.గ్లాసులోని ద్రావకాన్ని  గటగటా తాగిన డా.బంక్‌...‘‘అదిరింది అల్లుడు’’ అన్నాడు హుషారుగారు.మరోగ్లాస్‌ ఇచ్చాడు ఇంక్‌. సేమ్‌....గటగటా తాగేశాడు.‘‘అది...రింది....అల్లు....డూ...డూ....డూ’’ అన్నాడు.మామ వాయిస్‌లో మార్పును గ్రహించిన డా.ఇంకో ఇంకో గ్లాస్‌ ఇచ్చాడు.ఈసారి మరింత మార్పు కనబడింది మామ వాయిస్‌లో...‘ట్వింకిల్‌ ట్వింకిల్‌ లిటిల్‌స్టార్‌ నీ ఫేస్‌ చూస్తే  దెయ్యాలు పరార్‌’ అన్నాడు చిలిపిగా.మరో గ్లాస్‌ ఇచ్చాడు...ఈసారి చెట్టెక్కికోతిలా నటించడం మొదలుపెట్టాడు....‘సోదరిసోదరుల్లారా...సొప్పబెండల్లారామై నేమ్‌ ఈజ్‌ కోతి....నాకు ఉందోయ్‌ ఒక నీతి’మామగారి వింత చేష్టలు చూసి ‘యురేఖా’ అని ఆనందంగా అరిచాడు డా.ఇంక్‌.‘ఏది కొడితేమైండ్‌ బ్లాకయిద్దో...అదే మందు...అదే ఇది’ అన్నాడు.అనతికాలంలోనే ఛీట.జీnజు తయారుచేసిన కొత్త ద్రావకం దేశవిదేశాల్లో ప్రాచుర్యం పొందింది.‘‘మీరు తయారుచేసిన ద్రావకానికి ఏదో ఒక పేరు పెడితే బాగుంటుంది’’ అన్నాడు అసిస్టెంట్‌.‘‘ఏ పేరో  ఎందుకు నా పేరే పెట్టుకుంటాను. నన్ను అందరూ ఛీట.జీnజు అని పిలుస్తారు. మధ్యలో చుక్క తీసేస్తే ఛీటజీnజు అవుతుంది. ఇక  ఇప్పటి నుంచినేను తయారుచేసిన ద్రావకం పేరు డ్రింక్‌’’ అని ప్రకటించాడు.డ్రింక్‌ చేసేవారి గురించి రాసిందే ‘పెగ్గాలజీ’ గ్రంథం. దీనిలో కొన్ని విశేషాలు ఇప్పుడు చెబుతాను. సంవత్సరం సంవత్సరం చరిత్రమారినట్టు...పెగ్గు పెగ్గుకు మనిషి మారుతాడు. ఎలా అంటే...ఫస్ట్‌ పెగ్‌:చాలా మర్యాదగా ప్రవర్తిస్తారు.‘స్నేహానికన్న మిన్నా లోకాన లేదురా...’ పాట హైపిచ్‌లో  పాడుకుంటారు.రెండో పెగ్‌: ఇంగ్లిష్‌ మొదలవుతుంది...దేశాన్ని గురించి తెగ బాధపడుతుంటారు...‘కంట్రీ. కంట్రీ మీన్స్‌  నాట్‌ స్టోన్స్‌.

 కంట్రీ మీన్స్‌ హ్యుమన్‌ బీయింగ్స్‌. డెమోక్రసీ ఈజ్‌ ఏ సిస్టమ్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌. వేరే ది సిటిజన్స్‌ఎక్సర్‌సైజ్‌పవర్‌ బై డెమోక్రసీ!బట్‌ వేర్‌ ఈజ్‌ డెమోక్రసీ?నో....నో...ఇటీజ్‌ రాంగ్‌ డెసీషన్‌.వేర్‌ రైట్‌ ఈజ్‌ రైట్‌...బట్‌ నథింగ్‌ ఈజ్‌ రాంగ్‌...ఐ సే ఎవ్రీ టైమ్‌...’మూడో పెగ్‌:హిందీ పాట మొదలవుతుంది...‘మేరి మేరి మెహబూబాతేరి తేరి ఆంకో మే డూబా!న కర్‌ మేరే దిల్‌ కే టు తూ తుక్డే...తుక్టే...తుక్టే...నాలుగో  పెగ్‌:తగాదాకు వేళాయెరా!‘‘రేయ్‌ అప్పాల్రాజు...ఏది  ఏమైనా నిన్ను నేను ఆరోజు వెధవ అని తిట్టి ఉండాల్సింది కాదు’‘సరేలే...ఇప్పుడా విషయం ఎందుకు?’’‘ఎందుకంటావేంరా! ఉత్త వెధవ అని కూడా కాదు దొంగ వెధవ అని తిట్టాను. ఐయామ్‌ రియల్లీ సారీ రా’‘సరేలే జరిగిందేదో జరిగింది...’‘ఎలా జరుగుతుందిరా? నోరు అన్నాక అదుపులో పెట్టుకోవాలి. తింటున్నది గడ్డి కాదు అన్నమే కదా...’‘నీ వాలకం చూస్తుంటే నేనేదో తప్పు చేసినట్లు మాట్లాడుతావేం?’‘తప్పా తప్పున్నారా!’‘వెధవ అని తిట్టింది నువ్వు. నాది తప్పంటావేంటీ!?’‘వెధవా అని తిట్టినప్పుడు...అరే సుబ్బిగా అలా పరుషపదజాలం ఉపయోగించకూడదురా అని నువ్వు మాట్లాడి ఉంటే నేను మూసుకొని కూర్చునేవాడిని.కానీనువ్వేం చేశావు? వెధవ అని తిట్టినా, దొంగవెధవ అని తిట్టినా, బండ వెధవ అని తిట్టినా...సైలెన్స్‌గా ఉండిపోయావు.ఎదుటోడు నిన్ను ఒక్క తిట్టు తిడితే పదితిట్లు నాన్‌స్టాప్‌గాతిట్టమన్నారు పెద్దలు...కానీ...నువ్వేం చేశావు? మౌనంగా ఉండి...నాలోని చెడుని పెంచావు....అందుకే నువ్వు మామూలు వెధవవి కాదు... అక్కుపక్షి వెధవవు. ఎంగిలి విస్తరాకులు ఎత్తుకు పోయి ఇంట్లో భద్రంగా దాచుకునే నీచదరిద్ర నికృష్ట భ్రష్ట వెధవవు...’’‘ఒరేయ్‌ సుబ్బిగా మాటలు తిన్నగా రానియ్‌....తిట్లు ఆపకపోతే ఎదురుగా ఆ మురికిగుంట ఉంది చూశావా...అందులో పడేస్తాను. పీడ వదులుతుంది’‘నువ్వు నన్ను పడేసేదేమిట్రా గూట్లే....నేనే పడతాను చూడు....’వామ్మో....చచ్చాన్రో!
–అశుభం 
– యాకుబ్‌ పాషా 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement