
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనమహోత్సవం కార్యక్రమాన్ని 22న జూపూడిలో నిర్వహించనున్నారు. కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి హాజరుకానున్న దృష్ట్యా విజయవాడ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ రవిచంద్ర తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. బుధవారం ఉదయం 8 గంటల నుంచి 11.30 వరకు ట్రాఫిక్‌ను దారిమళ్లిస్తున్నాం. విశాఖపట్నం నుంచి నగరంలోకి వచ్చే భారీ వాహనాలు, లారీలను హనుమాన్ జంక్షన్ వద్ద నిలిపివేస్తాం. హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలను నందిగామలో నిలిపివేస్తాం. చెన్నై నుంచి వచ్చే వాహనాలను గుంటూరులో నిలిపివేయనున్నట్లు ట్రాఫిక్ డీసీపీ రవిచంద్ర పేర్కొన్నారు. (అమూల్ కంపెనీతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం)