వనమహోత్సవంలో పాల్గొననున్న సీఎం జగన్‌ | CM YS Jaganmohan Reddy To Attend In Vanamahothsavam At Guntur | Sakshi
Sakshi News home page

వనమహోత్సవ వేడుకల్లో పాల్గొననున్న సీఎం జగన్‌

Published Fri, Aug 30 2019 8:37 PM | Last Updated on Fri, Aug 30 2019 8:49 PM

CM YS Jaganmohan Reddy To Attend In Vanamahothsavam At Guntur - Sakshi

సాక్షి, అమరావతి: 70వ వనమహోత్సవ వేడుకలకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి హాజరు కానున్నారు. శనివారం గుంటూరు జిల్లాలోని మేడి కొండూరు మండలంలోని డోకిపర్రు గ్రామంలో వనమహోత్సవం వేడుకలు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితోపాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు.

సీఎం వైఎస్ జగన్‌ శనివారం ఉదయం తాడేపల్లి నివాసం నుంచి నేరుగా గుంటూరులోని అమీనాబాద్‌కు చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో డోకిపర్రుకు వెళ్లి వనమహోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. డోకిపర్రు వద్ద ముందుగా మొక్కను నాటి అనంతరం అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనశాలను ప్రారంభిస్తారు. తర్వాత స్థానికంగా ఏర్పాటు చేసిన సభా ప్రాంగణానికి చేరుకుని సీఎం వైఎస్‌ జగన్‌ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. కార్యక్రమం పూర్తయ్యాక అక్కడ నుంచి నేరుగా తాడేపల్లికి చేరుకుంటారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement