Vanamahotsavam
-
22న విజయవాడలో ట్రాఫిక్ మళ్లింపు
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనమహోత్సవం కార్యక్రమాన్ని 22న జూపూడిలో నిర్వహించనున్నారు. కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరుకానున్న దృష్ట్యా విజయవాడ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ రవిచంద్ర తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. బుధవారం ఉదయం 8 గంటల నుంచి 11.30 వరకు ట్రాఫిక్‌ను దారిమళ్లిస్తున్నాం. విశాఖపట్నం నుంచి నగరంలోకి వచ్చే భారీ వాహనాలు, లారీలను హనుమాన్ జంక్షన్ వద్ద నిలిపివేస్తాం. హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలను నందిగామలో నిలిపివేస్తాం. చెన్నై నుంచి వచ్చే వాహనాలను గుంటూరులో నిలిపివేయనున్నట్లు ట్రాఫిక్ డీసీపీ రవిచంద్ర పేర్కొన్నారు. (అమూల్ కంపెనీతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం) -
అందరూ తోడుగా నిలవాలి : సీఎం జగన్
సాక్షి, గుంటూరు : పర్యావరణ రక్షణ కోసం ప్రభుత్వంతో పాటు అదరూ కలిసి రావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరారు. నీరు, నేల, నింగి, గాలి వీటంన్నిటిని కూడా కలుషితం కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిది అని పిలుపునిచ్చారు. విరివిగా మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకుందామని కోరారు. అడవుల సంఖ్య ఏటేటా తగ్గిపోతుందని, వీటిని పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం పేర్కొన్నారు. వన మహోత్సవం కార్యక్రమాన్ని సీఎం జగన్ శనివారం గుంటూరు జిల్లా డోకిపర్రు గ్రామంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులలతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం ఆక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. మొక్కలు నాటే కార్యక్రమంలో అందరూ పాలుపంచుకొని ప్రభుత్వానికి తోడుగా నిలవాలని కోరారు. సీఎం జగన్ ఇంకా ఎమన్నారంటే.. (చదవండి : వన మహోత్సవాన్ని ప్రారంభించిన సీఎం జగన్) అందుకే అశోకుడు గొప్ప చక్రవర్తి అయ్యాడు ‘మనం నాటే ప్రతి మొక్కభూమాతకు మేలు చేస్తుంది. మనం పెంచే ప్రతి చెట్టు తరువాతి తరానికి కూడా వీటి ఫలాలను ఇస్తుంది. మాములుగా మనిషి బతకాలంటే ఆక్సిజన్ కావాలి. అటువంటి ఆక్సిజన్ ఇచ్చే ఏకైక ప్రాణి ఒక్క చెట్టు మాత్రమే. ఈ సృష్టిలో బ్యాలెన్స్‌గా ఉండాలంటే చెట్లు బలంగా ఎదగాలి. రాష్ట్ర భూభాగంలో 37,258 చదరపు కిలోమీటర్లు ఉంటే ఇందులో 23 శాతం మాత్రమే అడువులు ఉన్నాయి. ఇందులో 13 శాంక్షరీలు, మూడు నేషనల్ పార్కులు, రెండు జులాజికల్ పార్కులు, ఒక టైగర్ రిజర్వ్, ఒక ఎనుగు రిజర్వ్ అడవులు మన రాష్ట్రంలో ఉన్నాయి. ఇవన్నీ మన రాష్ట్రంలో ఉన్నాయి కదా అని గొప్పగా ఫీల్ కావాలా? లేక మొత్తం భూభాగంలో మూడింతల్లో ఒక భాగం అడవులు ఉండాలని జాతీయ అడవుల విధానం చెబుతున్నప్పుడు 33 శాతం ఉండాల్సిన అడవుల్లో మన రాష్ట్రంలో కేవలం 23 శాతం మాత్రమే ఉన్నాయని భాధపడాలో ఆలోచించుకోవాలి.అశోకుడి గురించి మనం వింటుంటాం. ఆయన గొప్ప చక్రవర్తి అని విన్నాం. రోడ్డుకు ఇరువైపు చెట్లను నాటించాడు కాబట్టే అశోకుడు గొప్ప చక్రవర్తి అయ్యాడు. ఆయన నాటించిన చెట్లు వందల సంవత్సరాలు బతికాయి, తరువాత తరాలకు మేలు చేశాయి. 25 కోట్ల మొక్కలు నాటేందుకు శ్రీకారం చుట్టాం పర్యావరణం బాగుంటేనే మనమంతా కూడా బాగుంటాం. వీటిని రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన రాష్ట్రంలో 2351 వృక్షజాతులు, 1461 జంతు జాతులు ఉన్నాయి. రాష్ట్రంలో కొన్ని జంతువులు, మొక్కలు అంతరించి పోతున్నాయి. మనం డైనోసార్స్ గురించి వింటుంటాం. ఇవి ఇప్పుడు కనిపించడం లేదు. ప్రపంచంలో ఇవాళ పరిస్థితి ఎలా ఉందంటే..పులులు అంతరించిపోతున్నాయి. పులుల సంఖ్య రాష్ట్రంలో కేవలం 48 మాత్రమే ఉన్నాయి. ఈ ఏడాది ఆరు పెరిగాయని సంబరాలు చేసుకుంటున్నాం. ఒక్కసారి ఆలోచన చేయండి. వీటిని గురించి మనం పట్టించుకోవడం మానేస్తే పులులు, సింహాలు ఏవి కూడా ఉండవు. మన రాష్ట్రాన్ని కాపాడుకునే దిశగా అడుగులు వేస్తూ..రాష్ట్రంలో 25 కోట్ల మొక్కలు నాటే కార్యక్రమాన్ని శ్రీకారం చుడుతున్నాం. ఇప్పటిదాకా నాలుగు కోట్ల మొక్కలు నాటాం. ఈ ఒక్క రోజు కోటి మొక్కలు నాటబోతున్నాం. ప్రతి ఒక్కరు ఒక్క మొక్క నాటడం కాదు. ప్రతి ఒక్కరు మూడు, నాలుగు మొక్కలు నాటాలి. అప్పుడే మన రాష్ట్రాన్ని కాపాడుకోగలుతామని గుర్తు ఎరగాలి. రాష్ట్రంలో గ్రామ వాలంటీర్ల ద్వారా పంపిణీ కార్యక్రమం చేపడుతున్నాం. గ్రామ వాలంటీర్ల చేత మొక్కల పెంపకం నాటే కార్యక్రమం చేపట్టాలని కోరుతున్నాను. నీడనిచ్చే మొక్కలు, టేకు మొక్కలు, ఎర్రచందనం మొక్కలు 12 కోట్లు మొక్కలు నాటేందుకు అటవీ శాఖ సిద్దంగా ఉంది. దశల వారిగా 10వేల ఎలక్ట్రిక్ బస్సులు తెస్తాం ఇవాళ ఫార్మా పరిశ్రమల గురించి మాట్లాడుతున్నాం. పరిశ్రమలు వచ్చేసమయంలో పర్యావరణానికి మేలు చేస్తుందా? అన్నది ఆలోచన చేయాలి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డును ప్రక్షళన చేయబోతున్నామని చెబుతున్నాను. ఫార్మా రంగంలో లక్ష టన్నుల కాలుష్యం వస్తుందని నా దృష్టికి వచ్చింది. కేవలం 30 వేల టన్నులు మాత్రమే ఆడిట్ జరుగుతుందని, మిగతాది కాల్చివేయడం, లేదా సముద్రంలో వేయడం జరుగుతుంది. పరిశ్రమల్లో ఎంత కాలుష్యం వస్తుంది. ఏ రకంగా మనం డిస్పోజ్ చేయాలో ఆలోచన చేయాలి. ప్రభుత్వమే బాధ్యత తీసుకోబోతోంది. పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయబోతున్నాం. ఈ ఏడాది అక్షరాల ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో 100 ఎలక్ట్రసిటీ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాం. దశల వారిగా 10 వేల ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొస్తాం. నీరు, నేల, నింగి, గాలి వీటంన్నిటిని కూడా కాలుషితం కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉంది. వీటిని కాపాడుకుందాం’ అని సీఎం జగన్ ప్రజలకు పిలుపునిచ్చారు. -
వనమహోత్సవంలో పాల్గొననున్న సీఎం జగన్
సాక్షి, అమరావతి: 70వ వనమహోత్సవ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరు కానున్నారు. శనివారం గుంటూరు జిల్లాలోని మేడి కొండూరు మండలంలోని డోకిపర్రు గ్రామంలో వనమహోత్సవం వేడుకలు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితోపాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. సీఎం వైఎస్ జగన్ శనివారం ఉదయం తాడేపల్లి నివాసం నుంచి నేరుగా గుంటూరులోని అమీనాబాద్‌కు చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో డోకిపర్రుకు వెళ్లి వనమహోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. డోకిపర్రు వద్ద ముందుగా మొక్కను నాటి అనంతరం అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనశాలను ప్రారంభిస్తారు. తర్వాత స్థానికంగా ఏర్పాటు చేసిన సభా ప్రాంగణానికి చేరుకుని సీఎం వైఎస్ జగన్ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. కార్యక్రమం పూర్తయ్యాక అక్కడ నుంచి నేరుగా తాడేపల్లికి చేరుకుంటారు. -
మొక్కలు తీసుకోండి
అనంతపురం ఎడ్యుకేషన్ : వనమహోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఈనెల 28న జిల్లాలోని అన్ని పాఠశాలల ఆవరణల్లో నాటేందుకు అవసరమైన మొక్కల్ని ఆయా మండలాల విద్యాశాఖ అధికారులు స్థానిక అటవీశాఖ అధికారుల ద్వారా పొందాలని డీఈఓ అంజయ్య మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు. పాఠశాలలు, మండలాల వారీగా అవసరమైన మొక్కలకోసం ఇప్పటికే అటవీశాఖ అధికారులకు పంపామని, ఆ మేరకు వారు పంపిణీ చేసే మొక్కలు ఎమ్మార్సీ లేదా ఇతర అనుకూల ప్రదేశాల్లో ఉంచి హెచ్ఎంల సమన్వయంతో పాఠశాలలకు సరఫరా చేయాలని సూచించారు. మొక్కలు నాటేందుకు అవసరమైన గుంతలను తవ్వి సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. -
సీఎం సభలో సర్పంచ్‌కు అవమానం
మేడ్చల్, న్యూస్‌లైన్: సీఎం పాల్గొన్న వనమహోత్సరం కార్యక్రమంలో కండ్లకోయ గ్రామ సర్పంచ్ నరేందర్‌రెడ్డికి అవమానం ఎదురైంది. గ్రామ ప్రథమ పౌరుడైన సర్పంచిని వేదికపైకి ఆహ్వానించినా.. వేదికపై కూర్చోవడానికి కనీసం కుర్చీ కూడా వేయలేదు. దీంతో సమావేశం జరిగినంతసేపూ ఆయన మాజీ మంత్రి సబిత, జిల్లా కలెక్టర్ శ్రీధర్ వెనుక నిలబడ్డాడు. ప్రొటోకాల్ ప్రకారం గ్రామంలో ఏ అధికారిక కార్యక్రమం నిర్వహించినా స్థానిక సర్పంచికి వేదికపై చోటు కల్పిస్తారు. సోమవారం నిర్వహించిన సీఎం సభలో మాత్రం నిర్వాహకులు సర్పంచిని ఇలా అవమానించారు. వ్యాపారుల సంక్షేమానికి కృషి కాటేదాన్, న్యూస్‌లైన్: రాష్ర్టంలోని అన్ని పట్టణాల్లో గల వీధివ్యాపారుల సంక్షేమంకోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని మెఫ్మా రాష్ట్ర అసిస్టెంట్ డెరైక్టర్ రాజశేఖరరెడ్డి పేర్కొన్నారు. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ కాటేదాన్‌లో సోమవారం మెఫ్మా, జీహెచ్ఎంసీ సంయుక్తంగా వీధివ్యాపారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. స్థానిక కార్పొరేటర్ టి.ప్రేమ్‌దాస్‌గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వీధివ్యాపారులకు వారి అభ్యున్నతికోసం రాష్ట్రప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో రాజశేఖరరెడ్డి మాట్లాడుతూ.. పట్టణ పేదరిక నిర్మూలనకోసం రాష్ట్ర ప్రభుత్వం వీధివ్యాపారులకు బ్యాంకులద్వారా రుణాలను అందజేసి చేయూతనిచ్చేందుకు వీధి వ్యాపారుల నియంత్రణామండలిని ఏర్పాటు చేసిందని చెప్పారు. రాష్ట్రంలోనే తొలిసారి ఈ కార్యక్రమం కాటేదాన్‌లో నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. వీధివ్యాపారం చేసే అందరికీ 15 మంది చొప్పున గ్రూపులను ఏర్పాటుచేసి వారికి బ్యాంకుల ద్వారా రుణాలను అందజేస్తారని, దీని కారణంగా వీధి వ్యాపారుల పేదరిక నిర్మూలనకు దోహదపడుతుందన్నారు.కమిటీలో సర్కిల్ డిప్యూటీ కమిషనర్, టౌన్ ప్లానింగ్ ఏసీపీ , డీపీఓ , బ్యాంకు మేనేజర్లతోపాటు స్థానిక పోలీసు అధికారులు ఉంటారని తెలిపారు. గ్రూపులకోసం ఏ ర్పాటుచేసే కమిటీ సభ్యులైన వీధి వ్యాపారులు తమ చిరునామా, ఓట ర్ఐడీ, ఫొటో, ఆధార్‌కార్డు, తదితర పత్రాలను సంబంధిత అధికారులకు సమర్పించాల్సి ఉంటుం దని తెలిపారు. వీధివ్యాపారుల నియంత్రణ మండలి ద్వారా వారికి రక్షణ కల్పిస్తూ సర్కిల్ పరిధిలో ఒకేచోట వ్యాపారం చేసుకునేందుకు స్థలాలు సైతం ప్రభుత్వం కేటాయిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో సర్కిల్ పీఓ పత్యానాయక్, నాయకులు మాధవరెడ్డి, విజయ్‌కుమార్, అనంతయ్య, స్వామిగౌడ్, గట్టయ్య, రమేష్‌గుప్తా పాల్గొన్నారు. -
సఖ్యత ముఖ్యం
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: అభివృద్ధి పనులే ఎన్నికల్లో గెలిపిస్తాయనుకోవద్దు.. ప్రజలతో కలుపుగోలుగా వ్యవహరిస్తేనే రాజకీయాల్లో రాణిస్తామనే విషయాన్ని గుర్తుంచుకోవాలని మేడ్చల్ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హితబోధ చేశారు. ‘మీరు చాలా పనులు చేశారు. కానీ పనులు చేస్తేనే ఎలక్షన్లలో గెలవలేం. పనులతోపాటు అందరినీ కలుపుకుపోవాలి. ముఖ్యంగా పార్టీ కార్యకర్తలతో సమన్వయంతో ముందుకు సాగాలి. లేకపోతే ఇబ్బందులు తప్పవు.. అని చురకలంటించారు. సోమవారం మేడ్చల్ మండలంలోని కండ్లకోయలో నిర్వహించిన వనమహోత్సవం కార్యక్రమంలో ప్రసంగించిన సీఎం.. చివరలో ఎమ్మెల్యే తీరును తనదైనశైలిలో ప్రస్తావించారు. ‘పనులు, అభివృద్ధి ఒకవైపు.. ప్రజలను కలుపుకుపోవడం మరోవైపు. రెండింటినీ బ్యాలెన్స్ చేసుకొని ముందుకుసాగాలి. నేను ఐదుసార్లు ఎన్నికల్లో పోటీచేశాను. ఇదే నా సక్సెస్ సీక్రెట్’ అని అన్నారు. ఉత్సాహవంతంగా పనిచేసే కేఎల్లార్ కార్యకర్తలను కూడా అదే తరహాలో ప్రోత్సహించాలని సూచించారు. మంత్రి ప్రసాద్ గైర్హాజరు తెలంగాణ రాష్ట్ర ప్రకటన అనంతరం ముఖ్యమంత్రి కిర ణ్‌కుమార్‌రెడ్డి తొలిసారి జిల్లా పర్యటనకు మంత్రి ప్రసాద్‌కుమార్ డుమ్మా కొట్టారు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ వర్గీయుడిగా పేరున్న ప్రసాద్ ఇటీవల తెలంగాణ లాబీయింగ్‌లో కీలకంగా పనిచేశారు. దామోదరతో కలిసి పలుమార్లు ఢిల్లీకి వెళ్లి అధిష్టానం పెద్దలతో భేటీ అయ్యారు. ఈ క్రమంలోనే ప్రత్యేక రాష్ట్రాన్ని ఇస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ నిర్ణయం వె లువడినప్పటి నుంచి సీఎంతో ‘టీ’ మంత్రులు అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం సీఎం పర్యటనలో తెలంగాణ మంత్రులెవరూ కనిపించలేదు. ఆఖరికి కిరణ్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన ఎమ్మెల్సీ రంగారెడ్డి కూడా గైర్హాజరు కావడం చర్చానీయాంశంగా మారింది. కాగా, కేంద్ర మంత్రి ఆంటోనీతో భేటీ నేపథ్యంలో ఢిల్లీకి వెళ్లినందున సీఎం కార్యక్రమానికి ప్రసాద్ హాజరుకాలేకపోయారని సన్నిహితవర్గాలు తెలిపాయి. మరోవైపు గత మూడు నెలలు క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్న సబితా ఇంద్రారెడ్డి వనమహోత్సవంలో పాల్గొన్నారు. సీబీఐ కేసు నమోదుతో అన్యమనస్కంగా ఉన్న సబిత మంత్రి పదవీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా కస్టడీకి ఇవ్వాలని సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేయడంతో ఊరట పొందిన సబితారెడ్డి సీఎం పర్యటనతో మళ్లీ క్రియాశీలమవుతున్నట్లు అర్థమవుతోంది.