మేడ్చల్, న్యూస్‌లైన్: సీఎం పాల్గొన్న వనమహోత్సరం కార్యక్రమంలో కండ్లకోయ గ్రామ సర్పంచ్ నరేందర్‌రెడ్డికి అవమానం ఎదురైంది. గ్రామ ప్రథమ పౌరుడైన సర్పంచిని వేదికపైకి ఆహ్వానించినా.. వేదికపై కూర్చోవడానికి కనీసం కుర్చీ కూడా వేయలేదు. దీంతో సమావేశం జరిగినంతసేపూ ఆయన మాజీ మంత్రి సబిత, జిల్లా కలెక్టర్ శ్రీధర్ వెనుక నిలబడ్డాడు. ప్రొటోకాల్ ప్రకారం గ్రామంలో ఏ అధికారిక కార్యక్రమం నిర్వహించినా స్థానిక సర్పంచికి వేదికపై చోటు కల్పిస్తారు. సోమవారం నిర్వహించిన సీఎం సభలో మాత్రం నిర్వాహకులు సర్పంచిని ఇలా అవమానించారు.
వ్యాపారుల సంక్షేమానికి కృషి
కాటేదాన్, న్యూస్‌లైన్: రాష్ర్టంలోని అన్ని పట్టణాల్లో గల వీధివ్యాపారుల సంక్షేమంకోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని మెఫ్మా రాష్ట్ర అసిస్టెంట్ డెరైక్టర్ రాజశేఖరరెడ్డి పేర్కొన్నారు. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ కాటేదాన్‌లో సోమవారం మెఫ్మా, జీహెచ్‌ఎంసీ సంయుక్తంగా వీధివ్యాపారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. స్థానిక కార్పొరేటర్ టి.ప్రేమ్‌దాస్‌గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వీధివ్యాపారులకు వారి అభ్యున్నతికోసం రాష్ట్రప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో రాజశేఖరరెడ్డి మాట్లాడుతూ.. పట్టణ పేదరిక నిర్మూలనకోసం రాష్ట్ర ప్రభుత్వం వీధివ్యాపారులకు బ్యాంకులద్వారా రుణాలను అందజేసి చేయూతనిచ్చేందుకు వీధి వ్యాపారుల నియంత్రణామండలిని ఏర్పాటు చేసిందని చెప్పారు. రాష్ట్రంలోనే తొలిసారి ఈ కార్యక్రమం కాటేదాన్‌లో నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. వీధివ్యాపారం చేసే అందరికీ 15 మంది చొప్పున గ్రూపులను ఏర్పాటుచేసి వారికి బ్యాంకుల ద్వారా రుణాలను అందజేస్తారని, దీని కారణంగా వీధి వ్యాపారుల పేదరిక నిర్మూలనకు దోహదపడుతుందన్నారు.కమిటీలో సర్కిల్ డిప్యూటీ కమిషనర్, టౌన్ ప్లానింగ్ ఏసీపీ , డీపీఓ , బ్యాంకు మేనేజర్లతోపాటు స్థానిక పోలీసు అధికారులు ఉంటారని తెలిపారు.
గ్రూపులకోసం ఏ ర్పాటుచేసే కమిటీ సభ్యులైన వీధి వ్యాపారులు తమ చిరునామా, ఓట ర్‌ఐడీ, ఫొటో, ఆధార్‌కార్డు, తదితర పత్రాలను సంబంధిత అధికారులకు సమర్పించాల్సి ఉంటుం దని తెలిపారు. వీధివ్యాపారుల నియంత్రణ మండలి ద్వారా వారికి రక్షణ కల్పిస్తూ సర్కిల్ పరిధిలో ఒకేచోట వ్యాపారం చేసుకునేందుకు స్థలాలు సైతం ప్రభుత్వం కేటాయిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో సర్కిల్ పీఓ పత్యానాయక్, నాయకులు మాధవరెడ్డి, విజయ్‌కుమార్, అనంతయ్య, స్వామిగౌడ్, గట్టయ్య, రమేష్‌గుప్తా పాల్గొన్నారు.
సీఎం సభలో సర్పంచ్‌కు అవమానం
Published Tue, Aug 20 2013 6:14 AM | Last Updated on Wed, Aug 15 2018 5:57 PM
Advertisement
Advertisement