మొక్కలు తీసుకోండి | Take plants | Sakshi

మొక్కలు తీసుకోండి

Jul 20 2016 12:42 AM | Updated on Sep 4 2017 5:19 AM

వనమహోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఈనెల 28న జిల్లాలోని అన్ని పాఠశాలల ఆవరణల్లో నాటేందుకు అవసరమైన మొక్కల్ని ఆయా మండలాల విద్యాశాఖ అధికారులు స్థానిక అటవీశాఖ అధికారుల ద్వారా పొందాలని డీఈఓ అంజయ్య మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు.

అనంతపురం ఎడ్యుకేషన్‌ :  వనమహోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఈనెల 28న జిల్లాలోని అన్ని పాఠశాలల ఆవరణల్లో నాటేందుకు అవసరమైన మొక్కల్ని ఆయా మండలాల విద్యాశాఖ అధికారులు స్థానిక అటవీశాఖ అధికారుల ద్వారా పొందాలని డీఈఓ అంజయ్య మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు. పాఠశాలలు,  మండలాల వారీగా అవసరమైన మొక్కలకోసం ఇప్పటికే అటవీశాఖ అధికారులకు పంపామని, ఆ మేరకు వారు పంపిణీ చేసే మొక్కలు ఎమ్మార్సీ లేదా ఇతర అనుకూల ప్రదేశాల్లో ఉంచి హెచ్‌ఎంల సమన్వయంతో పాఠశాలలకు సరఫరా చేయాలని సూచించారు. మొక్కలు నాటేందుకు అవసరమైన గుంతలను తవ్వి సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement