
సాక్షి, పరకాల: పట్టణంలోని అంగడి బజార్ పార్కింగ్ స్థలాలను వ్యాపారస్తులతో పాటు చిరువ్యాపారస్తులు ఇష్టారాజ్యంగా ఆక్రమించడంతో వాహనదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. సివిల్ ఆస్ప్రతికి వెళ్లాల్సిన అత్యవసర వాహనాలు 104, 102లు సైతం ఆదివారం ట్రాఫిక్ వలయంలో చిక్కుకున్నాయి. దుకాణాల ముందు ఉన్న పార్కింగ్ స్థలాల్లో కూరగాయల, పండ్ల వ్యాపారస్తులు, చిరు దుకాణాలు ఏర్పడ్డాయి. మరోవైపు దుకాణాదారులు వారి వస్తు సామగ్రిని ఏర్పాటు చేయడంతో అంబులెన్స్‌లకు సైతం ట్రాఫిక్ సమస్యలు తప్పడం లేదు. ఒకవైపు వాహదారులు, మరోవైపు అత్యవసర వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment