హైదరాబాద్‌లో ఉన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణను రాజకీయ నాయకులు, ఇతర రంగాల ప్రముఖులు మర్యాదపూర్వకంగా కలుస్తున్నారు. లాక్‌డౌన్ హీరో సోనూ సూద్ ఇంటికి రోజురోజుకు జనం తాకిడి పెరుగుతోంది. తనకు తోచిన సాయం చేస్తూ సోనూ సూద్ సేవలు కొనసాగిస్తున్నారు. హైదరాబాద్‌లో లాక్‌డౌన్ కష్టాలు కొనసాగుతున్నాయి.
1/10
కరోనా విలయతాండవం కారణంగా విద్యాసంస్థలు తెరుచుకోపోవడంతో పిల్లలు వ్యవసాయ పనుల్లో చేదోడువాదోడుగా నిలుస్తున్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని లోహర గ్రామ పంచాయతీ సాలెగూడలో గురువారం ఓ పెద్దాయన సారెలు వేస్తుండగా, ఆ ఊరికి చెందిన చిన్నారులు ఇలా విత్తనాలు వేస్తూ సాక్షి కెమెరాకు కనిపించారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్
2/10
వ్యవసాయాన్నే నమ్ముకున్న కుటుంబం అది.. సాగులో సాయంగా మూడు పశువులు ఉన్నాయి. వర్షాలు కురుస్తుండడంతో దుక్కి దున్ని వ్యవసాయానికి సిద్ధమవుతున్న ఆ రైతు కుటుంబానికి కరెంట్ రూపంలో ఆపద వచ్చింది. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని జయపురంలో గురువారం గాలిదుమారం రాగా జామాయిల్ తోటలో కరెంట్ తీగ తెగి పడింది. ఈ విషయం తెలియక రామచంద్రు మధ్యాహ్నం వరకు నాగలి దున్ని పశువులను మేతకు వదిలాడు. ఇంతలోనే పశువులు విద్యుత్ తీగను తాకి మృతి చెందాయి. రూ.1.50 లక్షల విలువైన ఒక కాడెద్దు, ఆవు, కోడె లేగ చనిపోవడంతో ఆ రైతు కుటుంబం వాటిపై పడి రోదించిన తీరు అందరినీ కన్నీరు పెట్టించింది.
3/10
వానాకాలం పంటల కోసం రాష్ట్రానికి ఎరువులు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ నుంచి 1,300 టన్నుల డీఏపీ ఎరువులు సుమారు 20 బోగీల గూడ్స్‌రైలులో ఆదిలాబాద్ రైల్వేస్టేషన్‌కు గురువారం చేరుకున్నాయి. బోగీల్లో నుంచి ఎరువులను హమాలీలతో లారీల్లో లోడ్ చేయించి గోదాములకు తరలించారు. – సాక్షి, ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్
4/10
సాయంత్రం 5 గంటలు దాటితే చాలు హైదరాబాద్‌లో ట్రాఫిక్ బెంబేలెత్తిస్తోంది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు లాక్‌డౌన్ ఆంక్షలను ప్రభుత్వం సడలించింది. ఇళ్లకు వెళ్లేందుకు మరో గంట పాటు వెసులుబాటు ఇచ్చింది. దీంతో 5 గంటల తర్వాత వ్యాపారులు, ఉద్యోగులు, పనులు పూర్తి చేసుకున్న ఇతరులు ఇళ్లకు బయలుదేరుతున్నారు. అంతా ఒకేసారి రోడ్లపైకి రావడంతో ట్రాఫిక్‌జాం ఏర్పడుతోంది. గురువారం సాయంత్రం సీఎం క్యాంపు కార్యాలయం దారిలో వందలాది వాహనాలు ఇలా స్తంభించిపోయాయి.
5/10
హైదరాబాద్: గురువారం రాజ్‌భవన్‌లో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణను మర్యాదపూర్వకంగా కలిసిన హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ
6/10
నాలా ఆక్రమణపై ట్విటర్‌లో వచ్చిన ఓ ఫిర్యాదుతో హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి గురువారం కుత్బుల్లాపూర్‌లో పర్యటించారు. నాలా పూడికతీత పనుల్లో జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
7/10
ముంబై: గురువారం అంధేరీలో అక్కడి స్థానికులను కలిసి వారి సమస్యలు వింటున్న బాలీవుడ్ నటుడు సోనూసూద్
8/10
హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రం ధర్మశాలలోని షీలా ప్రాంతంలో గురువారం ఓ భవనంపైకి ఎక్కిన ఎద్దును జేసీబీ సాయంతో కిందికి దించేందుకు ప్రయత్నిస్తున్న అగ్ని మాపక సిబ్బంది
9/10
మహారాష్ట్ర తీరంలో అరేబియా సముద్ర జలాల్లో గురువారం మునిగిపోతున్న ఎంవీ మంగళం అనే బార్జి నుంచి చేతక్ హెలికాప్టర్ల సాయంతో సిబ్బందిని రక్షించిన తీర రక్షక దళం
10/10
ముగ్గురు కూతుళ్లను చంపిన నేరానికి గాను ఓ వ్యక్తికి యెమెన్ కోర్టు మరణ శిక్ష విధించింది. దీంతో దేశ రాజధాని సనాలోని తాహ్రిర్ స్క్వేర్ గురువారం భద్రతాబలగాలు ఆ వ్యక్తిని కాల్చి చంపాయి.
Comments
Please login to add a commentAdd a comment