
సాక్షి, కరీంనగర్: పెద్దపల్లిలో కునారం రైల్వేగేటు వద్ద దున్నపోతు వీరంగాన్ని సృష్టించింది. దున్నపోతు రైల్వేగేటు సమీపంలో చేరుకొని గేటు దాటి అవతలివైపుకి వెళ్తుంది. ఈ క్రమంలో.. సిగ్నల్ పడటంతో రైల్వే కీపర్ గేటును కిందకుదించాడు. దీంతో ఆగ్రహించిన దున్నపోతు.. తన బలం మొత్తాన్ని రైల్వేగేటుపై చూపించింది. అంతటితో ఆగకుండా తన బలమైన కొమ్ములతో రైల్వేగేటును పైకి ఎత్తేసి, వంగిపోయేలా చేసింది. దీంతో కాల్ప శ్రీరాంపూర్, జమ్మికుంట వెళ్లే రహదారిని తాత్కాలికంగా నిలిపేశారు. దీంతో.. ఆమార్గం గుండా వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment