
భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్,రాంగ్‌రూట్‌లో వెళుతున్న నేతల వాహనాలు
అసలే సోమవారం.. సమయం ఉదయం 9.30 గంటలు.. ఐటీ కారిడార్ రద్దీగా ఉండేది కూడా అప్పుడే. కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగలతో కిటకిటలాడుతూ ఉంది. ఇదే సమయంలో బయోడైవర్సిటీ డబుల్ హైట్ ఫ్లైఓవర్ ప్రారంభానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. మంత్రులు, ఉన్నతాధికారుల వాహనాల రాకతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. దాంతో చాలామంది లీడర్లు తమ వాహనాలను రాంగ్ రూట్‌లోనే కొత్త వంతెన దగ్గరకు పోనిచ్చారు. 108 వాహనాలు కూడా ట్రాఫిక్‌లో చిక్కుకుపోయాయి. ఐటీ ఉద్యోగులైతే కార్యాలయాలకు సమయం మించి పోతుందని టెన్షన్ పడ్డారు. ఇటు మెహిదీపట్నం నుంచి గచ్చిబౌలి జంక్షన్.. మాదాపూర్ వరకు భారీగా ట్రాఫిక్ జామైంది. – ఫొటోలు: నోముల రాజేష్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment