IT caridar
-
ఐటీహబ్‌లో ఆందోళన.. వీడియోవైరల్
నిజామాబాద్‌రూరల్: జిల్లా కేంద్రంలోని ఐటీహబ్‌లో ఆందోళన నెలకొంది. ఇద్దరు మహిళా ఉద్యోగులు స్పృహ తప్పిపడిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జీతాల విషయంలో గొడవ జరగడంతోపాటు తోపులాటలో ఇద్దరు మహిళా ఉద్యోగులు స్పృహ తప్పిపడిపోయిన్నట్లు సమాచారం. బుధవారం జరిగిన ఈ ఘటన ఐటీహబ్‌లో జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి పరీశీలించారు. 45 రోజుల ట్రైనింగ్‌కు సంబంధించి జీతాలు ఇవ్వకపోవడంతో ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. యాజమాన్యాలు ఇష్టారాజ్యాంగా వ్యవహారించడంతోనే గొడవ తీవ్రతరమైంది. వీడియోవైరల్ ఐటీ హబ్‌లో గొడవ జరగడంతో ఇద్దరు మహిళా ఉద్యోగులు స్పృహ తప్పి పడిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ విషయమై రూరల్ పోలీసులను సంప్రదించగా గొడవ జరిగినట్లు తెలిపారు. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు. -
చిత్తూరు జిల్లాలో ఐటీ కంపెనీ
సాక్షి,చిత్తూరు అర్బన్: చిత్తూరు జిల్లా ఎస్ఆర్ పురం సమీపంలోని కొట్టార్లపల్లెలో ఐటీ హబ్ ఏర్పాటు కానుంది. బెంగళూరుకు చెందిన స్మార్ట్ డీవీ గ్రూప్ ఆఫ్ టెక్నాలజీస్ ఆధ్వర్యంలో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ కంపెనీ ఏర్పాటుతో వచ్చే మూడేళ్లలో 3 వేల మందికి ఉపాధి లభించనుంది. ఇందుకు సంబంధించిన వివరాలను ఆ కంపెనీ అధినేత దీపక్‌కుమార్ తాల శనివారం చిత్తూరులో మీడియాకు వెల్లడించారు. కొట్టార్లపల్లె వద్ద 1.60 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐటీ కంపెనీని 20 వేల కోర్లతో క్లౌడ్ సర్వీస్‌తో ఏర్పాటు చేయనున్నట్టు ఆయన చెప్పారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి ఈనెల 14న భూమి పూజ చేస్తున్నామని, జూన్‌లో పనులు ప్రారంభించి, ఏడాదిలోపు నిర్మాణాలు పూర్తి చేస్తామని వివరించారు. ఇప్పటికే తమ కంపెనీలో తయారవుతున్న సెమీ కండక్టర్లు ప్రపంచంలోనే పేరున్న అన్ని ఎలక్ట్రానిక్స్‌లో ఉపయోగిస్తున్నారన్నారు. యాపిల్, ఐ వాచెస్, తోషిబా, శామ్సంగ్ ఉత్పత్తుల్లోను, కొన్ని దేశాల రక్షణ రంగ సంస్థల్లోను తమ ప్రొడక్టస్ ఉపయోగిస్తున్నారని చెప్పారు. తమ సంస్థకు అమెరికాలో 2, చైనాలో 1, ఇండియాలో 2 చోట్ల బ్రాంచ్‌లు ఉన్నాయని, జపాన్, సింగపూర్, రష్యాతో పాటు యూరప్ మొత్తం మార్కెటింగ్ చేస్తున్నామని వివరించారు. ఆయన వెంట ఆర్టీసీ వైస్ చైర్మన్ ఎంసీ విజయానందరెడ్డి ఉన్నారు. (చదవండి: నవరత్నాలు.. సుస్థిర అభివృద్ధికి మార్గాలు) -
హైదరాబాద్‌లో ఐటీ జోష్
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ ఐటీ బ్రాండ్ ప్రతిష్టను మరింత పెంచే దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. నగరానికి పడమర వైపున ఉన్న ఐటీ కారిడార్‌ను ఆ ప్రాంతానికే పరిమితం చేయకుండా.. మిగిలిన తూర్పు, పడమర, దక్షిణ ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు వేగిరం చేసింది. మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, నానక్‌రామ్‌గూడలో ఉన్న ఐటీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ హబ్‌కు తూర్పు, ఉత్తరం, దక్షిణ ప్రాంతాల నుంచి లక్షలాది మంది వాహనాల్లో వస్తున్నారు. ఫలితంగా నగర రోడ్లపై వాహన రద్దీతో పాటు కాలుష్యం విపరీతంగా పెరుగుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘గ్రిడ్ (గ్రోత్ ఇన్ డిస్పర్షన్) పాలసీ’తో నగరం నలువైపులా ఐటీ రంగం అభివృద్ధి చెందనుంది. ఈ మేరకు పశ్చిమ ప్రాంత అవతల ఉన్న ఇండస్ట్రియల్ పార్కులను ఐటీ పార్కులుగా మార్చాలని నిర్ణయించారు. నగరానికి పశ్చిమ ప్రాంతానికి ఆవల ఉన్న ఇండ్రస్టియల్ పార్కులను ఐటీ పార్కులుగా మారిస్తే ఐటీ ఫైనాన్సియల్ డి్రస్టిక్ట్పై ఒత్తిడి తగ్గుతుంది. 2013 మార్చి ఒకటో తేదీన ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ డిపార్ట్మెంట్ ఇచ్చిన జీవో నంబర్ 20ను అనుసరించి ఓఆర్ఆర్ లోపల ఉన్న కాలుష్య కారక పరిశ్రమలను ఓఆర్ఆర్ అవతలకు తరలించాలని పేర్కొంది. దీంతో ఇప్పటికే ఉన్న కూకట్పల్లి, గాందీనగర్, బాలానగర్, మల్లాపూర్, మౌలాలి, సనత్‌నగర్‌లోని ఇండస్ట్రియల్ పార్కులు, ఉప్పల్, నాచారం, పటాన్చెరు, కాటేదాన్‌లోని పారిశ్రామిక అభివృద్ధి ప్రాంతాలు, రామచంద్రపురంలోని ఏఐఈ ప్రాంతాలను ఐటీ పార్కులుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. (చదవండి: దేశంలోనే మొట్టమొదటి ఏసీ బస్బే @Hyd) అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో... ♦ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా ఐటీ పార్కులను అభివృద్ధి చేయనున్నారు. ఇందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించారు. ♦ ఆధునిక వసతులు, పచ్చని ప్రాంతాలు, పాదచారులకు మార్గాలు, సైక్లింగ్ కోసం దారులు, పార్కింగ్ ప్రాంతాలు, ప్రజా రవాణా వ్యవస్థ, సామాజిక మౌలిక వసతులు అభివృద్ధి చేయనున్నారు. ♦ ఈ క్రమంలో ఎవరైనా భూమి కోల్పోతే ప్రభుత్వం నుంచి నష్టపరిహారం లేదంటే టీడీఆర్ ఇవ్వనున్నారు. ♦ హైటెక్‌సిటీలోని సైబర్ టవర్స్ మాదిరిగా ఉత్తర ప్రాంతమైన కొంపల్లిలో త్వరలోనే ఐటీ టవర్ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నారు. ♦ వాయువ్య ప్రాంతమైన కొల్లూరు లేదంటే ఉస్మాన్‌సాగర్‌లోనూ ఐటీ పార్కును ఏర్పాటుచేయనున్నారు. దశలవారీగా... • తొలి దశలో కొంపల్లిలో, ఉప్పల్, పోచారం, నాచారం, కొల్లూరు, ఉస్మాన్‌సాగర్‌లో, కాటేదాన్, శంషాబాద్‌లోని పారిశ్రామిక అభివృద్ధి ప్రాంతంలో ఐటీ పార్కులను అభివృద్ధి చేస్తారు. ఇవికాక మిగిలిన ప్రాంతాల్లో తదుపరి దశల్లో చర్యలు చేపడతారు. • పశ్చిమ ప్రాంతానికి మినహాయించుకుని హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) మొత్తం ప్రాంతానికి గ్రిడ్ మార్గదర్శకాలు వర్తిస్తాయి. • గచ్చిబౌలి, కోకాపేట, మాదాపూర్, రాయదుర్గం, పుప్పలగూడ, ఖాజాగూడ, నార్సింగి, నానక్‌రామ్‌గూడ, కొండాపూర్, ఖానామెట్, గుట్టల బేగంపేట, మణికొండ, నల్లగండ్ల, గోపన్నపల్లి, గౌలిదొడ్డికి వర్తించవు. • గ్రిడ్ ప్రోత్సహకాల నుంచి అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలను మినహాయించనున్నారు. అయితే రాయితీల్లో భాగంగా యూనిట్ ఇన్సెంటివ్‌లు, యాంకర్ ఇన్సెంటివ్‌లు, డెవలపర్ ఇన్సెంటివ్‌లు, మౌలిక వసతుల అభివృద్ధి, బ్రాండింగ్ అండ్ ప్రమోషనల్ కార్యకలాపాలు చేపడతారు. రాయితీలు ఇలా.. • యూనిట్ ఇన్సెంటివ్‌లు: ఏడాదికి రూ.పది లక్షల యూనిట్ మించని వాటికి ఐదేళ్ల సయమానికి 30 శాతం రెంటల్ సబ్సిడీ ఇస్తారు. రూ.ఐదు లక్షల యూనిట్ మించని వాటికి మూడేళ్ల సమయానికి 25 శాతం రెంటల్ సబ్సిడీ ఇస్తారు. • యాంకర్ ఇన్సెంటివ్‌లు: అంటే..500 మందికి మించి ఉద్యోగాలు ఇచ్చే సంస్థకు యాంకర్ యూనిట్ వర్తించనుంది. • డెవలపర్ రాయితీలు: టీఎస్ఐఐసీ, ఐలా కింద ఉండే పారిశ్రామిక భూములను ఐటీ, ఐటీఈఎస్ కింద 50 శాతం బిల్టప్ ఏరియాను ఐటీకి, మిగిలిన 50 శాతం నాన్ ఐటీకి ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా నిబంధనలు అతిక్రమించారని తెలిస్తే జరిమానాలు విధించడంతో పాటు మంజూరు చేసిన రాయితీలను వెనక్కి తీసుకుంటారు. నాలాచార్జీలు వర్తించవు. • ఆయా ప్రాంతాల్లో బడా కంపెనీలు ముందుకొస్తే మౌలిక వసతులను ప్రభుత్వమే అభివృద్ధి చేయనుంది. అలాగే ఆయా ప్రాంతానికి పేరు వచ్చేలా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా నిర్వహించనుంది. -
ట్రాఫిక్ వేళ..రాంగే రైటు!
అసలే సోమవారం.. సమయం ఉదయం 9.30 గంటలు.. ఐటీ కారిడార్ రద్దీగా ఉండేది కూడా అప్పుడే. కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగలతో కిటకిటలాడుతూ ఉంది. ఇదే సమయంలో బయోడైవర్సిటీ డబుల్ హైట్ ఫ్లైఓవర్ ప్రారంభానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. మంత్రులు, ఉన్నతాధికారుల వాహనాల రాకతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. దాంతో చాలామంది లీడర్లు తమ వాహనాలను రాంగ్ రూట్లోనే కొత్త వంతెన దగ్గరకు పోనిచ్చారు. 108 వాహనాలు కూడా ట్రాఫిక్‌లో చిక్కుకుపోయాయి. ఐటీ ఉద్యోగులైతే కార్యాలయాలకు సమయం మించి పోతుందని టెన్షన్ పడ్డారు. ఇటు మెహిదీపట్నం నుంచి గచ్చిబౌలి జంక్షన్.. మాదాపూర్ వరకు భారీగా ట్రాఫిక్ జామైంది. – ఫొటోలు: నోముల రాజేష్‌రెడ్డి -
ఐటీజోన్‌లో జెయింట్ ఫ్లైఓవర్ నేడే ప్రారంభం
గచ్చిబౌలి: నిత్యం ట్రాఫిక్‌తో రద్దీగా ఉండే ఐటీ కారిడార్‌లో మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. బయోడైవర్సిటీ డబుల్ హైట్ ఫ్లైఓవర్‌ను సోమవారం ప్రారంభించనున్నారు. దీంతో రాయదుర్గం నుంచి హైటెక్‌సిటీ, ఇనార్బిట్ మాల్ వైపు వెళ్లే ప్రయాణికులు ట్రాఫిక్ అంతరాయం లేకుండా ప్రయాణం చేయవచ్చు. రెండున్నర ఏళ్లకు ముందు ప్రారంభమైన నిర్మాణానికి స్థల సేకరణ అడ్డంకిగా మారడంతో పనుల్లో జాప్యం జరిగింది. ఎట్టకేలకు నిర్మాణ పనులు పూర్తి కావడంతో అతి ఎత్తయిన వంతెన అందుబాటులోకి వచ్చింది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేశారు. సోమవారం ఉదయం 9.30 గంటలకు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. బల్దియా పరిధిలో ఎస్ఆర్డీపీ పనుల కింద చేపట్టిన ఫ్లైఓవర్లలో ఈ డబుల్ ఫ్లైఓవర్ నగరంలోనే ఎత్తయినది. దాదాపు రూ.16.47 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ వంతెన జంక్షన్లో ఎత్తు 17.45 మీ. కాగా, పొడవు 990 మీ, వెడల్పు 11.5 మీటర్లు. మూడు లైన్ల వెడల్పులో వన్ వేలో వెళ్లాల్సి ఉంటుంది. -
ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ సమస్యపై సమన్వయ సమావేశం
-
ఐటీ కారిడార్‌లో ప్రత్యేక తనిఖీలు
గచ్చిబౌలి(హైదరాబాద్): ఐటీ కారిడార్‌లో మంగళవారం పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా దేశంలోని ప్రధాన పట్టణాలలో తీవ్రవాదుల నుంచి ప్రమాదం పొంచి ఉందని నిఘా సంస్థలు హెచ్చరికలు జారీ చేయడంతో ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. శిల్పారామంలో బాంబు స్క్వాడ్ బృందం తనిఖీలు నిర్వహించింది. ఇనార్బిట్ మాల్తో పాటు జనసంద్రం ఎక్కువ ఉండే ప్రాంతాల్లో నిరంతరం తనిఖీలు చేపట్టనున్నారు. మాదాపూర్ జోన్ పరిధిలో తనిఖీలు కొనసాగించేందుకు ప్రత్యేక బాంబుస్క్వాడ్‌ను ఏర్పాటు చేశారు. ముందు జాగ్రత్తగా స్థానిక పోలీసుల పర్యవేక్షణలో తనిఖీలు కొనసాగుతాయి.