ఐటీహబ్‌లో ఆందోళన.. వీడియోవైరల్‌ | Two Female Employees Lost Consciousness In IT-Hub Nizamabad - Sakshi
Sakshi News home page

ఐటీహబ్‌లో ఆందోళన.. వీడియోవైరల్‌

Published Thu, Oct 5 2023 1:16 AM | Last Updated on Thu, Oct 5 2023 12:45 PM

- - Sakshi

నిజామాబాద్‌రూరల్‌: జిల్లా కేంద్రంలోని ఐటీహబ్‌లో ఆందోళన నెలకొంది. ఇద్దరు మహిళా ఉద్యోగులు స్పృహ తప్పిపడిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జీతాల విషయంలో గొడవ జరగడంతోపాటు తోపులాటలో ఇద్దరు మహిళా ఉద్యోగులు స్పృహ తప్పిపడిపోయిన్నట్లు సమాచారం.

బుధవారం జరిగిన ఈ ఘటన ఐటీహబ్‌లో జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి పరీశీలించారు. 45 రోజుల ట్రైనింగ్‌కు సంబంధించి జీతాలు ఇవ్వకపోవడంతో ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. యాజమాన్యాలు ఇష్టారాజ్యాంగా వ్యవహారించడంతోనే గొడవ తీవ్రతరమైంది.

వీడియోవైరల్‌
ఐటీ హబ్‌లో గొడవ జరగడంతో ఇద్దరు మహిళా ఉద్యోగులు స్పృహ తప్పి పడిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఈ విషయమై రూరల్‌ పోలీసులను సంప్రదించగా గొడవ జరిగినట్లు తెలిపారు. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement