
ఎన్‌డీసీసీబీ చరిత్రలో ఘన విజయం
సుభాష్‌నగర్: ఎన్‌డీసీసీబీ ఆధ్వర్యంలో 2024 – 25 ఆర్థిక సంవత్సరంలో ఎన్‌పీఏ రూ.63 కోట్లు రికవరీ చేయడంతోపాటు రూ.304 కోట్ల పంట రు ణాలు పంపిణీ చేసిందని, ఇది బ్యాంకు చరిత్రలోనే సాధించిన ఘన విజయమని చైర్మన్ కుంట రమేశ్‌రెడ్డి అన్నారు. ఎన్‌పీఏ రికవరీ ఊహించలేనిదని, మ రో 7.82శాతం మాత్రమే ఎన్‌పీఏ మిగిలి ఉందని పేర్కొన్నారు. సీఈవో నాగభూషణం వందే అధ్యక్షతన 2024–25 ఆర్థిక సంవత్సరం అచీవ్‌మెంట్ సెలబ్రేషన్స్‌ను డీసీసీబీ సమావేశ మందిరంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. చైర్మన్ రమేశ్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై కేక్ కట్ చేసి సీఈవోతోపాటు పాలకవర్గ సభ్యులకు, సిబ్బందికి తినిపించారు. అనంతరం సిబ్బంది పటాకులు కాల్చి సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రమేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. డీసీసీబీ చరిత్రలోనే ఘన వి జయం సాధించామని, బ్యాంకులో ప్రతిఏడాది ఏ ప్రిల్ 1న సంబురాల దినోత్సవంగా జరుపుకోవాల ని పిలుపునిచ్చారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా మిగతా ఎన్‌పీఏను రికవరీ చేసే వరకు పాలకవర్గం, ఉద్యోగులు విశ్రమించొద్దని సూచించారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో రూ.781.82 కోట్ల డి పాజిట్లు, స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలు రూ.1355.56 కోట్లు ఇచ్చామని గుర్తుచేశారు. బ్యాంకుకు పూర్వవైభవం తీసుకురావడానికి ప్రతి ఉద్యో గి కష్టపడాలన్నారు. ఉద్యోగులకు పీఆర్సీ ఇచ్చే ప్రయత్నం పాలకవర్గం చేస్తుందని హామీనిచ్చారు. మార్క్‌ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ నల్ల చంద్రశేఖర్‌రెడ్డి, డైరెక్టర్లు గిర్ధావర్ గంగారెడ్డి, లింగన్న, సాయిరెడ్డి, పటేల్ రమేశ్, చంద్రునాయక్, జీఎంలు అనుపమ, సుమమాల, గజానంద్, లింబాద్రి తదితరులు పాల్గొన్నారు.
రూ.63కోట్ల ఎన్‌పీఏ రికవరీ..
రూ.304 కోట్ల పంట రుణాల పంపిణీ
ప్రతియేటా ఏప్రిల్ 1న సంబురాల
దినోత్సవంగా జరుపుకోవాలి
చైర్మన్ కుంట రమేశ్‌రెడ్డి పిలుపు